Daily Roundup

అంతర్జాతీయ మహిళా దినోత్సవం

Published: March 8, 2026

మహిళలు అన్ని రంగాల్లో భాగస్వాములైనప్పుడే దేశం అభివృద్ధి పథంలో సాగుతుంది. పూర్వంతో పోలిస్తే స్త్రీలకు అనేక అవకాశాలు లభిస్తున్నా.. పురుషులతో సమానంగా హక్కులు పొందడంలో ఇంకా వెనుకంజలోనే ఉన్నారు...

దేశంలో ఇంధన నిల్వలు

Published: March 8, 2026

ప్రస్తుతం మన దేశంలో ముడిచమురు, రిఫైన్డ్‌ పెట్రోలియం ఉత్పత్తుల రూపంలో 250 మిలియన్‌ బ్యారెళ్ల (దాదాపు 4000 కోట్ల లీటర్లు) ఇంధన నిల్వలున్నాయని ప్రభుత్వం 2026, మార్చి 8న వెల్లడించింది....

టీ20 ప్రపంచకప్‌ విజేత భారత్‌

Published: March 8, 2026

టీ20 క్రికెట్లో టీమ్‌ఇండియా విజేతగా నిలిచింది. 2026, మార్చి 8న అహ్మదాబాద్‌లో జరిగిన ఫైనల్లో 96 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌పై ఘనవిజయం సాధించింది. మొదట భారత్‌ 5 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోరు సాధించింది....

నేపాల్‌లో ఆర్‌ఎస్‌పీ విజయం

Published: March 8, 2026

హిమాలయ దేశం నేపాల్‌లో జరిగిన తాజా సార్వత్రిక ఎన్నికల్లో ‘రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్‌ఎస్‌పీ)’ అఖండ విజయం సాధించింది. నేపాల్‌ పార్లమెంటులో మొత్తం 275 స్థానాలు ఉన్నాయి. వాటిలో 165 సీట్లకు సభ్యులను ప్రత్యక్ష ఓటింగ్‌ విధానంలో ఎన్నుకుంటారు....

గద్దర్‌ సినీ అవార్డులు-2025

Published: March 7, 2026

2025 ఏడాదికి సంబంధించిన గద్దర్‌ సినీ అవార్డులను తెలంగాణ ప్రభుత్వం 2026, మార్చి 7న ప్రకటించింది. ‘ఈటీవీ విన్‌ ఒరిజినల్‌ ప్రొడక్షన్స్‌’ నుంచి వచ్చిన ‘రాజు వెడ్స్‌ రాంబాయి’ ఉత్తమ చిత్రం సహా మొత్తం నాలుగు అవార్డుల్ని సొంతం చేసుకుంది. ...

ఉన్నత విద్యలో ఎన్‌ఈపీ-2020 అమలు

Published: March 7, 2026

తెలంగాణలో అండర్‌ గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ)-2020 అమలు చేయాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ...

ఎల్‌ఎక్స్‌ఎంఈ, ఈవై సంయుక్త నివేదిక

Published: March 7, 2026

దీర్ఘకాలిక ఆర్థిక పెట్టుబడుల్లో మహిళా ప్రాతినిధ్యం పెరిగితే.. రాబోయే 10 ఏళ్ల కాలంలో వీళ్ల పెట్టుబడులు దేశ జీడీపీకి సుమారు రూ.40 లక్షల కోట్లను జతచేస్తాయని ఎల్‌ఎక్స్‌ఎంఈ, ఈవై సంయుక్త నివేదిక పేర్కొంది. ...

ట్రాక్సన్‌ నివేదిక

Published: March 7, 2026

2025లో మన దేశంలో మహిళా సహ వ్యవస్థాపకులు ఉన్న టెక్‌ అంకురాలు 407 విడతల్లో 1.1 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.10,000 కోట్లు) సమీకరించాయని డేటా ఇంటెలిజెన్స్‌ సంస్థ ట్రాక్సన్‌ నివేదికలో పేర్కొంది. ...

జాతీయ ఫార్మసీ విద్యా దినోత్సవం

Published: March 6, 2026

వ్యాధిని కట్టడి చేసి, రోగికి ఉపశమనం కలిగించడంలో ఔషధాలు ముఖ్య భూమిక పోషిస్తాయి....

హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ లిసా గిల్‌

Published: March 6, 2026

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు జస్టిస్‌ లిసా గిల్‌ బదిలీపై రానున్నారు. ప్రస్తుతం పంజాబ్‌-హరియాణా హైకోర్టులో సీనియారిటీలో మూడో స్థానంలో కొనసాగుతున్న ఆమెను ఏపీ హైకోర్టుకు బదిలీచేసే నిర్ణయానికి రాష్ట్రపతి ముర్ము ఆమోదముద్ర వేశారు. ...

హురున్‌ గ్లోబల్‌ రిచ్‌ లిస్ట్‌-2026

Published: March 6, 2026

హురున్‌ ఇండియా గ్లోబల్‌ రిచ్‌ లిస్ట్‌-2026 ప్రకారం, టెస్లా అధినేత ఎలాన్‌మస్క్‌ ప్రపంచ అగ్రగామి కుబేరుడిగా అయిదోసారీ కొనసాగారు. మస్క్‌ సంపద 89% పెరిగి, 792 బి.డాలర్లకు (రూ.72 లక్షల కోట్లకు పైగా) చేరింది. ...

పిల్లలకు సోషల్‌ మీడియా నిషేధం

Published: March 6, 2026

ఇండోనేసియా ప్రభుత్వం 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్‌ మీడియా ఉపయోగించకుండా కొత్త నిబంధనలు తీసుకొచ్చినట్లు తెలిపింది. ఈ విషయాన్ని ఆ దేశ కమ్యూనికేషన్, డిజిటల్‌ వ్యవహారాల మంత్రి ముత్య హఫీద్‌ వెల్లడించారు. ...

జాతీయ ప్రాధాన్య స్మారకంగా పాలంపేట్‌ గొల్లలగుడి

Published: March 6, 2026

ములుగు జిల్లా పాలంపేట్‌లో ఉన్న గొల్లలగుడిని జాతీయ ప్రాధాన్యం ఉన్న పురావస్తు కేంద్రంగా గుర్తించాలని నిర్ణయించినట్లు కేంద్ర సాంస్కృతికశాఖ తెలిపింది....

అలెగ్జాండర్‌ స్టబ్‌తో మోదీ భేటీ

Published: March 5, 2026

భారత పర్యటనకు వచ్చిన ఫిన్లాండ్‌ అధ్యక్షుడు అలెగ్జాండర్‌ స్టబ్‌తో ప్రధాని నరేంద్ర మోదీ దిల్లీలో 2026, మార్చి 5న భేటీ అయ్యారు. ద్వైపాక్షిక అంశాలతో పాటు పశ్చిమాసియాలో ప్రస్తుత ఉద్రిక్తతలు, ఉక్రెయిన్‌ యుద్ధం తదితర అంశాలపై వారిద్దరూ చర్చించారు. ...

ప్రగతి, వికాస్‌

Published: March 5, 2026

కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న 2027 జనాభా లెక్కల సేకరణ ప్రక్రియలో భాగంగా హోంమంత్రి అమిత్‌ షా 2026, మార్చి 5న ప్రగతి, వికాస్‌ పేరుతో రెండు జనగణన చిహ్నాలను ఆవిష్కరించారు....

కొత్త గవర్నర్లు

Published: March 5, 2026

కేంద్ర ప్రభుత్వం 2026, మార్చి 5న 9 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించింది. ఇప్పుడు నియమించిన 9 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల గవర్నర్లు/ లెఫ్టినెంట్‌ గవర్నర్లలో అయిదుగురిని ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేసింది. ...

జనాభా నిర్వహణ విధానం

Published: March 5, 2026

దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో జనాభా నిర్వహణ విధానం తెస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 2026, మార్చి 5న అసెంబ్లీలో తెలిపారు. ‘జనాభా నిర్వహణ విధానం’పై ముసాయిదా ప్రకటన విడుదల చేశారు....

తెలంగాణ గవర్నర్‌గా శివ్‌ప్రతాప్‌ శుక్లా

Published: March 5, 2026

తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మను మహారాష్ట్రకు బదిలీచేసి ఆ స్థానంలో హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ శివ్‌ప్రతాప్‌ శుక్లాను కేంద్రం నియమించింది. జిష్ణుదేవ్‌వర్మ దాదాపు 20 నెలలు గవర్నర్‌గా తెలంగాణకు సేవలు అందించారు. ...

కరీంనగర్‌ డీసీసీబీకి ప్రథమ స్థానం

Published: March 5, 2026

దేశంలోని సహకార బ్యాంకుల్లో ఉత్తమ సేవలు అందించినందుకు కరీంనగర్‌ డీసీసీబీ ప్రథమ స్థానం సాధించింది. జాతీయ సహకార బ్యాంకుల సమాఖ్య కమిటీ 2024-25 సంవత్సరానికి గాను ఉత్తమ సేవలు అందించిన బ్యాంకులను పరిశీలించి కరీంనగర్‌ బ్యాంకును మొదటి స్థానానికి ఎంపిక చేసింది....

జాతీయ భద్రతా దినోత్సవం

Published: March 4, 2026

దేశంలోని ప్రజలకు రక్షణ (Security), భద్రత (Safety) కల్పించే సామర్థ్యాన్ని జాతీయ భద్రత అంటారు....

బాలల్లో ఊబకాయం నివారణ కొత్త లక్ష్యం 2030

Published: March 4, 2026

బాలల్లో ఊబకాయాన్ని నిరోధించాలనే లక్ష్యాన్ని అందుకోవడంలో భారత్‌తో సహా పలు దేశాలు విఫలమవుతున్నాయని ప్రపంచ దేహస్థౌల్య నిరోధ సమాఖ్య ఆందోళన వ్యక్తం చేసింది. ...

ఇక్రా నివేదిక

Published: March 4, 2026

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లో దేశీయ ఆతిథ్య రంగం 9-12% ఆదాయ వృద్ధిని నమోదు చేయవచ్చని రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా తాజా నివేదికలో పేర్కొంది. ...

సహకార క్లబ్‌లు

Published: March 4, 2026

తెలంగాణలోని విశ్వవిద్యాలయాలు, డిగ్రీ కళాశాలల్లో సహకార క్లబ్‌లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలోనే తొలిసారిగా విద్యావ్యవస్థకు సహకార సంఘాలను పరిచయం చేయనుంది....

ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం

Published: March 3, 2026

జీవావరణంలో మనుషులతోపాటు వన్యప్రాణులకు సమాన ప్రాధాన్యం ఉంది. వృక్ష, జంతు జాతులు సహజ పర్యావరణ వ్యవస్థలో భాగంగా ఉండి, ఆహార చక్రం సక్రమంగా కొనసాగడంలో ముఖ్య భూమిక పోషిస్తాయి. ...

‘హనుమాన్‌’

Published: March 3, 2026

ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని ఏపీఎస్పీ బెటాలియన్‌ మైదానంలో 2026, మార్చి 3న ‘హనుమాన్‌ ప్రాజెక్టు’ను ఆంధ్రప్రదేశ్‌ ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ ప్రారంభించారు. ...

‘ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌’ రికార్డు

Published: March 3, 2026

భారత నౌకాదళంలో అతిపెద్ద విమాన వాహక నౌక ‘ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌’ మీద ల్యాండ్‌ అయిన విమానాల సంఖ్య వెయ్యికి చేరడంతో సరికొత్త రికార్డు సాధించింది. ఈ విషయాన్ని 2026, మార్చి 3న నేవీ వర్గాలు తెలిపాయి. ...

రక్షణ మంత్రిత్వశాఖ ఒప్పందం

Published: March 3, 2026

భారత తీరగస్తీ అవసరాల నిమిత్తం ఆరు అడ్వాన్స్‌డ్‌ లైట్ హెలికాప్టర్లు (ఏఎల్‌హెచ్‌), వర్టికల్‌ లాంచ్‌ మిసైల్స్‌ (వీఎల్‌ఎం) తయారీకి రెండు సంస్థలతో రక్షణ మంత్రిత్వశాఖ రూ.5,083 కోట్ల విలువగల ఒప్పందాలను చేసుకుంది. ...

ప్రమాదకరస్థాయిలో ఎరువుల వాడకం

Published: March 3, 2026

తెలంగాణలో రసాయన పురుగుమందులు, ఎరువుల వాడకం ప్రమాదకరస్థాయికి చేరుకున్నట్లు దిల్లీలోని జాతీయ వ్యవసాయ శాస్త్రాల సంస్థ (నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ సైన్సెస్‌) అధ్యయంన వెల్లడించింది....

మోదీతో మార్క్‌ కార్నీ భేటీ

Published: March 2, 2026

భారత పర్యటనలో ఉన్న కెనడా ప్రధాని మార్క్‌ కార్నీ 2026, మార్చి 2న ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఇద్దరు నేతల ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలపై చర్చలు జరిపారు....

ముగిసిన పత్తి సీజన్‌

Published: March 2, 2026

తెలంగాణలో 2025-26 పత్తి సీజన్‌ ముగిసింది. 2024-25 సీజన్‌తో పోలిస్తే 4.17 లక్షల టన్నులు తక్కువగా వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 2025 అక్టోబరులో పత్తి సీజన్‌ ప్రారంభం కాగా.. 2026 ఫిబ్రవరి 28తో ముగిసింది....

జీరో డిస్‌క్రిమినేషన్‌ డే

Published: March 1, 2026

ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛగా జీవించే హక్కు ఉంది. అలా కాకుండా పేదరికం, కులం, తెగ, లింగం, ప్రాంతీయ భేదాలు, ఆరోగ్యం లాంటి కారణాలతో సమాజంలో ప్రజలు, వర్గాల మధ్య భేదభావాన్ని చూపడాన్ని వివక్ష అంటారు...

గెయిల్‌ ఛైర్మన్‌గా దీపక్‌ గుప్తా 

Published: March 1, 2026

దేశీయ అతిపెద్ద గ్యాస్‌ సరఫరా సంస్థ గెయిల్‌ ఇండియా, ఛైర్మన్‌-మేనేజింగ్‌ డైరెక్టరుగా దీపక్‌ గుప్తా 2026, మార్చి 1న బాధ్యతలు స్వీకరించారు....

ఎయిర్‌టెల్, గూగుల్‌ భాగస్వామ్యం 

Published: March 1, 2026

సంక్షిప్త సందేశాల (ఎస్‌ఎంఎస్‌)లో స్పామ్‌ను అరికట్టేందుకు ఏఐ (కృత్రిమమేధ) ఆధారిత స్పామ్‌ ప్రొటెక్షన్‌ టూల్‌ను భారతీ ఎయిర్‌టెల్‌ వినియోగించనుంది. ...

భారత్‌లో చమురు నిల్వలు

Published: March 1, 2026

పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో.. మన దేశానికి సరఫరా అయ్యే చమురులో దాదాపు సగం మేర అంతరాయం కలిగే ప్రమాదం ఉందనే విశ్లేషనలు వినిపిస్తున్నాయి....

ఇరాన్‌ సుప్రీం లీడర్‌ మరణం

Published: March 1, 2026

అమెరికా, ఇజ్రాయెల్‌ సంయుక్తంగా జరిపిన దాడుల్లో ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఆయతుల్లా అలీ ఖమేనీ మరణించారు. ...

జాతీయ సైన్స్‌ దినోత్సవం

Published: February 28, 2026

శాస్త్రీయ విజ్ఞానం మానవుడి జీవితంలో ఎన్నో మార్పులు తెచ్చింది. రాతి పనిముట్ల నుంచి కృత్రిమ మేధ వినియోగం వరకు సైన్స్‌ అనేక అద్భుతాలకు కారణమైంది...

రంజీ ట్రోఫీ

Published: February 28, 2026

భారత దేశవాళీ అత్యున్నత టోర్నీ రంజీ ట్రోఫీ విజేతగా జమ్మూకశ్మీర్‌ నిలిచింది....

93వ గ్రాండ్‌మాస్టర్‌గా ఆరవ్‌ 

Published: February 28, 2026

ముంబయికి చెందిన ఆరవ్‌ (17 ఏళ్లు) గ్రాండ్‌మాస్టర్‌ హోదా దక్కించుకున్నాడు....

హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌ 

Published: February 28, 2026

దేశవ్యాప్తంగా హెచ్‌పీవీ టీకా కార్యక్రమాన్ని 2026, ఫిబ్రవరి 28న రాజస్థాన్‌లోని అజ్‌మేర్‌లో ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు....

సీఎస్‌గా సాయిప్రసాద్‌

Published: February 28, 2026

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా జి.సాయిప్రసాద్‌ 2026, ఫిబ్రవరి 28న బాధ్యతలు చేపట్టారు. ...

అంతర్జాతీయ ధ్రువపు ఎలుగుబంటి దినోత్సవం

Published: February 27, 2026

పర్యావరణ కాలుష్యం వల్ల మానవాళితోపాటు అనేక ఇతర జంతువులు ప్రభావితమవుతున్నాయి. అలా నష్టపోతోన్న జాతుల్లో ధ్రువపు ఎలుగుబంటి ఒకటి...

‘ఐఎన్‌ఎస్‌ అంజదిప్‌’ యుద్ధనౌక ప్రారంభం

Published: February 27, 2026

భారత నౌకాదళం అవసరాల నిమిత్తం డాల్ఫిన్‌ హంటర్‌ ఇంజినీరింగ్‌ సాంకేతికతతో రూపొందించిన యుద్ధనౌక ‘ఐఎన్‌ఎస్‌ అంజదిప్‌’ను 2026, ఫిబ్రవరి 27న చెన్నైలో ప్రారంభించారు. ...

గగనతల రక్షణ క్షిపణి పరీక్షలు విజయవంతం

Published: February 27, 2026

అత్యంత స్వల్పశ్రేణి గగనతల రక్షణ క్షిపణి వ్యవస్థను (వీఎస్‌హెచ్‌ఓఆర్‌ఏడీఎస్‌) భారత్‌ విజయవంతంగా పరీక్షించినట్లు రక్షణ శాఖ 2026, ఫిబ్రవరి 27న ప్రకటించింది. ...

‘వాయుశక్తి’

Published: February 27, 2026

భారత్‌-పాకిస్థాన్‌ సరిహద్దుకు చేరువలోని పోఖ్రాన్‌ రేంజ్‌లో 2026, ఫిబ్రవరి 27న భారత వైమానిక దళం ‘వాయుశక్తి’ విన్యాసాలను నిర్వహించింది. ...

ఏపీ హైకోర్టు తదుపరి సీజేగా జస్టిస్‌ లిసా గిల్‌

Published: February 27, 2026

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి(సీజే)గా జస్టిస్‌ లిసా గిల్‌ రానున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలో సమావేశమైన కొలీజియం ఆమె పేరును కేంద్రానికి సిఫార్సు చేసింది. ...

ప్రచండ్‌

Published: February 27, 2026

స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తేలికపాటి పోరాట హెలికాప్టర్‌ ‘ప్రచండ్‌’లో భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 2026, ఫిబ్రవరి 27న గగనవిహారం చేశారు. ఫ్లయింగ్‌ సూట్‌ ధరించిన ఆమె.. 25 నిమిషాలపాటు కో పైలట్‌గా వ్యవహరించారు....

స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)

Published: February 27, 2026

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2026-27) స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి అంచనాను అంతక్రితం అంచనా అయిన 7.4% నుంచి 7.6 శాతానికి సవరించినట్లు ముఖ్య ఆర్థిక సలహాదారు (సీఈఏ) వి.అనంత నాగేశ్వరన్‌ పేర్కొన్నారు....

నెతన్యాహుతో మోదీ భేటీ

Published: February 26, 2026

ఇజ్రాయెల్‌ పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహుతో భారత ప్రధాని మోదీ 2026, ఫిబ్రవరి 26న భేటీ అయ్యారు. ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా చర్చలు జరిపారు....

‘ఆపరేషన్‌ చిన్నారి-తల్లి’

Published: February 26, 2026

చిన్నారులపై లైంగిక దాడుల నివారణకు మహిళ, శిశు భద్రత విభాగం ఆధ్వర్యంలో ‘ఆపరేషన్‌ చిన్నారి-తల్లి’ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా తెలిపారు. ...

ఐఐటీహెచ్‌తో ఎన్‌ఎండీసీ ఒప్పందం

Published: February 26, 2026

ఖనిజాల పరిశోధనల కోసం హైదరాబాద్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటీ)తో జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ(ఎన్‌ఎండీసీ) పరిశోధన, అభివృద్ధి కేంద్రం ఒప్పందం చేసుకుంది. ...

మోదీకి కనెసెట్‌ అత్యున్నత పురస్కారం

Published: February 25, 2026

రెండురోజుల పర్యటన నిమిత్తం 2026, ఫిబ్రవరి 25న ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్‌ చేరుకున్నారు....

‘ఫెలో ఫార్మర్‌’ పురస్కారాలు

Published: February 25, 2026

గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలంలోని కొర్నెపాడు రైతునేస్తం ఫౌండేషన్‌ ఛైర్మన్‌ యడ్లపల్లి వెంకటేశ్వరరావు, ఇదే మండలం అనంతవరప్పాడుకు చెందిన సేంద్రియ వ్యవసాయ రైతు బండారు శ్రీనివాసరావు ‘ఫెలో ఫార్మర్‌’ పురస్కారాలను అందుకున్నారు....

ఏప్రిల్‌ 1 నుంచి పెట్రోలులో 20% ఇథనాల్‌ తప్పనిసరి 

Published: February 25, 2026

అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 2026 ఏప్రిల్‌ 1 నుంచి తప్పనిసరిగా పెట్రోలులో 20% వరకు ఇథనాల్‌ కలిపి విక్రయించాలని కేంద్రం తెలిపింది....

స్మార్ట్‌ఫోన్‌ ఎగుమతులు

Published: February 25, 2026

2025లో మనదేశం నుంచి 30 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.2.7 లక్షల కోట్ల) విలువైన  స్మార్ట్‌ఫోన్లు ఎగుమతి అయ్యాయని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ 2026, ఫిబ్రవరి 25న పేర్కొన్నారు....

బ్రిటన్‌ ప్రయాణాలకు ఇ-వీసా తప్పనిసరి

Published: February 25, 2026

బ్రిటన్‌లో పర్యాటకులు ఎలక్ట్రానిక్‌ వీసా (ఇ-వీసా)లను కలిగి ఉండటాన్ని అక్కడి ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ...

సెంట్రల్‌ ఎక్సైజ్‌ డే

Published: February 24, 2026

దేశంలో వస్తు ఉత్పత్తుల తయారీ, పంపిణీ, అమ్మకం కోసం విధించే పన్నును ఎక్సైజ్‌ సుంకం అంటారు....

నీతి ఆయోగ్‌ సీఈవోగా నిధి ఛిబ్బర్‌

Published: February 24, 2026

నీతి ఆయోగ్‌ ప్రధాన కార్యనిర్వాహక అధికారి(సీఈవో)గా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిణి నిధి ఛిబ్బర్‌ నియమితులయ్యారు....

‘అగ్ని వర్ష’ విన్యాసాలు 

Published: February 24, 2026

యుద్ధ సామర్థ్యాలను, సన్నద్ధతను చాటిచెప్పేలా రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌ ఎడారుల్లో భారత సైన్యం 2026, ఫిబ్రవరి 24న ‘అగ్ని వర్ష’ పేరుతో భారీ విన్యాసాలు నిర్వహించింది....

సూర్యునిపై నిరంతర నిఘాకు త్రీడీ నమూనా

Published: February 24, 2026

సూర్యగోళంలో సంభవిస్తున్న పరిణామాల పరిశీలనకు ఐఐటీ- కాన్పుర్‌కు చెందిన పరిశోధకులు ప్రపంచంలో మొట్టమొదటిసారిగా డేటా ఆధారిత త్రీడీ నమూనాను రూపొందించారు. ...

కేరళ పేరు ‘కేరళం’

Published: February 24, 2026

కేరళ పేరును ‘కేరళం’గా మార్చే ప్రతిపాదనకు 2026, ఫిబ్రవరి 24న కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది....

రాష్ట్రపతి భవన్‌లో రాజగోపాలాచారి విగ్రహం

Published: February 23, 2026

స్వతంత్ర భారతదేశపు తొలి, ఏకైక భారతీయ గవర్నర్‌ జనరల్‌ చక్రవర్తి రాజగోపాలాచారి విగ్రహాన్ని దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 2026, ఫిబ్రవరి 23న ఆవిష్కరించారు. ...

ప్రహార్‌

Published: February 23, 2026

కేంద్ర ప్రభుత్వం 2026, ఫిబ్రవరి 23న ‘‘ప్రహార్‌’’ పేరుతో దేశంలో తొలి ఉగ్రవాద నిర్మూలన విధానాన్ని ప్రారంభించింది. బహుముఖ వ్యూహాన్ని అవలంబిస్తూ ఉగ్రవాదం పట్ల ఏమాత్రం సహనం వహించరాదన్నది ఈ విధానంలోని ప్రధాన అంశం. ...

ప్రతిభా ‘పురస్కారం’

Published: February 23, 2026

తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం కొయ్యలగూడేనికి చెందిన చేనేత మహిళ వర్కాల విజయలక్ష్మికి అత్యున్నత ప్రతిభా పురస్కారం దక్కింది. కేంద్ర టెక్స్‌టైల్‌ మంత్రి గిరిరాజ్‌సింగ్‌ చేతులమీదుగా ఆమె 2026, ఫిబ్రవరి 23న దిల్లీలో అందుకున్నారు....

అత్యంత వేగమైన మెట్రో రైలు

Published: February 22, 2026

దేశంలోనే అత్యంత వేగంగా గంటకు 120 కి.మీ. వెళ్లే మెట్రోరైలును ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌లో 2026, ఫిబ్రవరి 22న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ...

షడ్భుజి కూటమి

Published: February 22, 2026

భారత్, పశ్చిమాసియా, దాని చుట్టూ ఉన్న దేశాలతో కలిసి త్వరలో షడ్భుజి కూటమి ఏర్పాటు చేయనున్నట్లు ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు తెలిపారు. ...

‘ఏఐ4 ఏపీ పోలీస్‌’

Published: February 22, 2026

పోలీసింగ్‌లో కృత్రిమ మేధ (ఏఐ) వినియోగాన్ని పెంచేందుకు ఏపీ పోలీసు శాఖ ‘ఏఐ 4 ఏపీ పోలీస్‌’ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టింది. ...

ఒడిశాలో ఆర్‌బీఐ సురక్షిత డేటా కేంద్రం

Published: February 22, 2026

కీలకమైన ఆర్థిక డేటాను కాపాడటానికి, ప్రధాన వ్యవస్థల కొనసాగింపును బలోపేతం చేసే ప్రయత్నాల్లో భాగంగా.. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఒడిశాలో అత్యంత సురక్షిత (హై-సెక్యూరిటీ) డేటా కేంద్రాన్ని నిర్మించింది....

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం

Published: February 21, 2026

ఒక వ్యక్తి తన చిన్నతనంలో కుటుంబ సభ్యుల ద్వారా నేర్చుకునే భాషను మాతృభాష అంటారు. ఇది మనిషికి వ్యక్తిత్వంతోపాటు గుర్తింపును ఇస్తుంది. సంప్రదాయాలు, వారసత్వంలో లోతైన బంధాన్ని ఏర్పర్చడంలో సాయం చేస్తుంది...

కృత్రిమ మేధ(ఏఐ) ట్యూటర్‌

Published: February 21, 2026

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కృత్రిమ మేధ(ఏఐ) ట్యూటర్‌ విధానాన్ని తీసుకొస్తోంది. ...

మోదీతో లులా డసిల్వా భేటీ

Published: February 21, 2026

ప్రధాని నరేంద్ర మోదీతో బ్రెజిల్‌ అధ్యక్షుడు లులా డసిల్వా 2026, ఫిబ్రవరి 21న దిల్లీలో భేటీ అయ్యారు. ...

భారత్‌ - అమెరికా వాణిజ్యం

Published: February 21, 2026

2021-25 మధ్య భారత్‌కు అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ...

ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం

Published: February 20, 2026

ఏ దేశ సమాజంలోనైనా వ్యక్తులు, అన్ని వర్గాల మధ్య సమానత్వం కనిపించదు. పేదరికం, కులం, తెగ, లింగం, ప్రాంతీయ భేదాలు లాంటి అనేక అంశాలు దీనికి ప్రధాన కారణాలుగా ఉన్నాయి...

ప్యాక్స్‌ సిలికా కూటమిలో భారత్‌

Published: February 20, 2026

అమెరికా నేతృత్వంలో ఏర్పడిన వ్యూహాత్మక కూటమి ‘ప్యాక్స్‌ సిలికా’లో భాగస్వామిగా భారత్‌ 2026, ఫిబ్రవరి 20న చేరింది. దిల్లీలో జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్‌ సమిట్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో సంబంధిత ఒప్పందంపై సంతకాలు చేసింది....

సహ్‌యోగ్‌

Published: February 20, 2026

ఆన్‌లైన్‌లో చట్టవ్యతిరేక కార్యకలాపాలను, తప్పుడు సమాచార ప్రసారాన్ని నియంత్రించేందుకు కేంద్ర హోంశాఖ అందుబాటులోకి తెచ్చిన సహ్‌యోగ్‌ అస్త్రం మంచి ఫలితాలు ఇస్తున్నట్లు కేంద్రం తెలిపింది. ...

ఐవోఎన్‌ఎస్‌ సమావేశం

Published: February 20, 2026

సముద్ర భద్రత, సమాచార మార్పిడి, విపత్తుల్లో ఉపశమన చర్యలు, పరస్పర సహకారంపై ఉమ్మడి కార్యాచరణ బృందాలను ఏర్పాటు చేయాలని హిందూ మహాసముద్ర నావల్‌ సింపోజియం (ఐవోఎన్‌ఎస్‌) సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ...

ఇండియా ఇంపాక్ట్‌ సమిట్‌

Published: February 19, 2026

ఇండియా ఇంపాక్ట్‌ సమిట్‌ను 2026, ఫిబ్రవరి 19న దిల్లీలోని భారత మండపంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏఐ సక్రమ వినియోగానికి ‘మానవ్‌’ (ఎంఏఎన్‌ఏవీ) విజన్‌ను ఆవిష్కరించారు. ...

మిలన్‌-2026

Published: February 19, 2026

రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ విశాఖ తూర్పు నౌకాదళ ప్రధాన కార్యాలయంలోని సముద్రిక ఆడిటోరియంలో 2026, ఫిబ్రవరి 19న ‘మిలన్‌-2026’ను ప్రారంభించారు. ...

ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌

Published: February 19, 2026

అంతర్జాతీయ యుద్ధనౌకల సమీక్ష (ఇంటర్నేషనల్‌ ఫ్లీట్‌ రివ్యూ)కు భారత బాహుబలిగా పేరుగాంచిన విమానవాహక నౌక ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ విశాఖ తీరానికి వచ్చింది. మూడేళ్ల క్రితం నౌకాదళంలో చేరిన ఈ నౌకను సాగర జలాల్లో వ్యూహాత్మక ప్రాంతాల్లో మోహరిస్తారు....

రాజీవ్‌ రంజన్‌ మిశ్రా కమిషన్‌

Published: February 19, 2026

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారుకు డెడికేటెడ్‌ కమిషన్‌ నియమిస్తూ కూటమి ప్రభుత్వం 2026, ఫిబ్రవరి 19న ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి విశ్రాంత ఐఏఎస్‌ అధికారి రాజీవ్‌ రంజన్‌ మిశ్రా(ఏకసభ్య కమిషన్‌) ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. ...

పెరూ అధ్యక్షుడిగా జోస్‌ మారియా బల్కజార్‌

Published: February 19, 2026

పెరూ దేశ అధ్యక్షుడిగా 2026, ఫిబ్రవరి 19 మాజీ న్యాయమూర్తి జోస్‌ మారియా బల్కజార్‌(83) ఎన్నికయ్యారు. 10 ఏళ్లలో ఈయన 8వ అధ్యక్షుడు. అవినీతి ఆరోపణల కారణంగా తాత్కాలిక అధ్యక్షుడు జోస్‌ జెరీని తొలగించిన మరుసటి రోజే ఈ ఎన్నిక జరిగింది....

డ్రోగ్‌ పారాచూట్‌ విజయవంతం

Published: February 19, 2026

మానవసహిత అంతరిక్ష యాత్ర- గగన్‌యాన్‌ కోసం ‘రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ’ (డీఆర్‌డీవో) అత్యంత బలీయమైన రిబ్బన్‌ పారాచూట్‌లను తయారు చేసింది....

మోదీతో దేశాధినేతల భేటీ

Published: February 18, 2026

ఏఐ ఇంపాక్ట్‌ సమిట్‌లో పాల్గొనేందుకు భారత్‌కు వచ్చిన దేశాధినేతల్లో ఏడుగురితో 2026, ఫిబ్రవరి 18న దిల్లీలో  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమావేశమయ్యారు....

ఎన్‌ఐఓటీ

Published: February 18, 2026

తుపానును కచ్చితంగా అంచనా వేసే ఆధునిక పరికరం ‘వేవ్‌ ప్రొపెల్డ్‌ వర్టికల్‌ ప్రొఫైలర్‌(డబ్ల్యూవీపీ)’ను చెన్నైలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషన్‌ టెక్నాలజీ(ఎన్‌ఐఓటీ) రూపొందించింది....

జపాన్‌ ప్రధానిగా తకాయిచి

Published: February 18, 2026

పార్లమెంటు ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలిచిన జపాన్‌ ప్రధాన మంత్రి సానే తకాయిచి 2026, ఫిబ్రవరి 18న రెండోసారి అధికార పగ్గాలు చేపట్టారు....

మోదీతో మెక్రాన్‌ భేటీ

Published: February 17, 2026

ప్రధాని నరేద్ర మోదీతో ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌ ముంబయిలోని లోక్‌భవన్‌లో  ద్వైపాక్షిక చర్చలు జరిపారు. వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేయడం, సరికొత్త రంగాలకు వాటిని విస్తరించడం, భాగస్వామ్యంలో పురోగతిపై సమాలోచనలు జరిపారు....

‘బయో ఆసియా 2026’ సదస్సు

Published: February 17, 2026

‘బయో ఆసియా 2026’.. 23వ అంతర్జాతీయ సదస్సును హైదరాబాద్‌లోని మాదాపూర్‌ హైటెక్స్‌లో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో కలిసి సీఎం రేవంత్‌ రెడ్డి 2026, ఫిబ్రవరి 17న ప్రారంభించారు.  ...

కర్ణాటకలో హెలికాప్టర్‌ అసెంబ్లింగ్‌ యూనిట్‌

Published: February 17, 2026

కర్ణాటకలోని కోలారు జిల్లా వేమగల్‌లో భారత తొలి ప్రైవేటురంగ హెలికాప్టర్‌ అసెంబ్లింగ్‌ యూనిట్‌ ‘ఫైనల్‌ అసెంబ్లీ లైన్‌’ (ఎఫ్‌ఏఎల్‌)ను 2026, ఫిబ్రవరి 17న ప్రధాని నరేంద్ర మోదీ, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌తో కలిసి ముంబయి నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. ...

ఐఎన్‌ఎస్‌ కృష్ణ జలప్రవేశం

Published: February 17, 2026

తొలి స్వదేశీ కేడెట్‌ శిక్షణ నౌక (సీటీఎస్‌) ఐఎన్‌ఎస్‌ కృష్ణ జలప్రవేశం చేసినట్టు నేవీ వర్గాలు 2026, ఫిబ్రవరి 17న తెలిపాయి. చెన్నైలోని కట్టుపల్లి వద్ద లార్సన్‌ అండ్‌ టుబ్రో యార్డులో ఈ కార్యక్రమం జరిగినట్లు వెల్లడించాయి. ...

ఇంటర్నేషనల్‌ ఫ్లీట్‌ రివ్యూ (ఐఎఫ్‌ఆర్‌)

Published: February 17, 2026

అంతర్జాతీయ ఉత్సవం ‘ఇంటర్నేషనల్‌ ఫ్లీట్‌ రివ్యూ (ఐఎఫ్‌ఆర్‌)’ను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 2026, ఫిబ్రవరి 17న లాంఛనంగా ప్రారంభించారు. విశాఖ ఈఎన్‌సీ ఆఫీసర్స్‌ మెస్‌లో విందు (ప్రెసిడెన్షియల్‌ బాంక్వెట్‌) ఇవ్వడం ద్వారా ఇది మొదలైంది. ...

బంగ్లా ప్రధానిగా రహమాన్‌ ప్రమాణం

Published: February 17, 2026

బంగ్లాదేశ్‌ ప్రధానమంత్రిగా బీఎన్‌పీ నేత తారిఖ్‌ రహమాన్‌ (60) 2026, ఫిబ్రవరి 17న పదవీ ప్రమాణం చేశారు. సంప్రదాయానికి భిన్నంగా బంగ భవన్‌ను కాదని జతియా సంసద్‌వద్ద ఉన్న దక్షిణ ప్లాజా బహిరంగ ఆవరణలో ఆయన ప్రమాణం చేశారు. ...

ప్రపంచ పర్యాటక స్థితిస్థాపక దినోత్సవం

Published: February 16, 2026

దేశాభివృద్ధిలో పర్యాటక రంగం కీలక భూమిక పోషిస్తుంది. ప్రపంచ అవగాహనను పెంపొందించడంలో, ఉద్యోగ - ఉపాధి కల్పనలో, సమ్మిళిత వృద్ధిని సాధించడంలో ఇది చాలా ముఖ్యం...

గ్రీన్‌హౌస్‌ ఉద్గారాలు

Published: February 16, 2026

వ్యవసాయ రంగ గ్రీన్‌హౌస్‌ ఉద్గారాల్లో 61 శాతానికి కారణమవుతున్న ఆరు దేశాల్లో భారత్‌ కూడా ఉందని తాజా అధ్యయనం పేర్కొంది. ఈ జాబితాలో చైనా, ఇండోనేసియా, అమెరికా, థాయ్‌లాండ్, బ్రెజిల్‌ కూడా ఉన్నాయి. ...

చలామణిలో రూ.40 లక్షల కోట్ల నగదు

Published: February 16, 2026

2026 జనవరి చివరికి దేశంలో చలామణిలో ఉన్న నగదు పరిమాణం జీవనకాల గరిష్ఠమైన రూ.40 లక్షల కోట్లకు చేరినట్లు ఎస్‌బీఐ రిసెర్చ్‌ తాజా నివేదిక వెల్లడించింది....

బ్రిటన్, కెనడా పౌరులకు చైనాలో వీసారహిత ప్రవేశం

Published: February 16, 2026

బ్రిటన్, కెనడా దేశాల ప్రజలకు చైనా వీసా లేకుండా పర్యటించే అవకాశం కల్పించింది. దీంతో ఇలాంటి సదుపాయం ఉన్న దేశాల సంఖ్య 79కి పెరిగింది. తమ దేశంలో పర్యాటకాన్ని, వాణిజ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో చైనా ఈ సదుపాయం కల్పించింది. ...

‘ఇండియా ఏఐ ఇంపాక్ట్‌ ఎక్స్‌పో-2026, సమిట్‌’

Published: February 16, 2026

కృత్రిమ మేధ (ఏఐ) రంగంపై విస్తృతంగా చర్చించేందుకు, అత్యాధునిక ఆవిష్కరణలపై అవగాహన కల్పించేందుకు భారత్‌ ఆతిథ్యమిస్తున్న ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్‌ ఎక్స్‌పో-2026, సమిట్‌’ 2026, ఫిబ్రవరి 16న దిల్లీలో ప్రారంభమయ్యాయి. ...

ఏపీ వెల్త్‌ఫండ్‌

Published: February 15, 2026

దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని రూ.100 కోట్లతో ఏపీ వెల్త్‌ఫండ్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ...

దేశంలో విద్యుదుత్పత్తి 

Published: February 15, 2026

దేశవ్యాప్తంగా 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి పదినెలల్లో 50వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం అదనంగా అందుబాటులోకి వచ్చినట్లు కేంద్ర విద్యుత్తుశాఖ తెలిపింది....

యూజీసీ

Published: February 15, 2026

వివిధ రంగాల పరిశ్రమల నిపుణులను ఉన్నత విద్యాసంస్థల్లో ప్రొఫెసర్లుగా నియమించుకోవడంలో తమిళనాడు ముందుందని విశ్వవిద్యాలయాల నిధుల సంఘం (యూజీసీ) వెల్లడించింది....

ఏపీ బడ్జెట్‌ 2026-27  

Published: February 14, 2026

ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ శాసనసభలో 2026, ఫిబ్రవరి 14న వరుసగా మూడో ఏడాది రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ.3,32,205.34 కోట్ల అంచనా వ్యయంతో పద్దును సమర్పించారు...

‘ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ ఫెసిలిటీ’ 

Published: February 14, 2026

ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలోని దిబ్రూగఢ్‌ జిల్లాలో ఉన్న జాతీయ రహదారి-37పై ఏర్పాటు చేసిన తొలి ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ ఫెసిలిటీ(ఈఎల్‌ఎఫ్‌)ని ప్రధాని మోదీ 2026, ఫిబ్రవరి 14న ప్రారంభించారు...

పీఎం రాహత్‌ పథకం 

Published: February 14, 2026

రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ వైద్య సహాయం అందించే లక్ష్యంతో తీసుకువచ్చిన ప్రధానమంత్రి రోడ్డు ప్రమాద బాధితుల ఆసుపత్రి, చికిత్స భరోసా(పీఎం రాహత్‌) పథకాన్ని  కేంద్రం 2026, ఫిబ్రవరి 14న అధికారికంగా ప్రారంభించింది...

విశ్వసనీయ సాంకేతిక కూటమి (టీటీఏ)

Published: February 14, 2026

జియో ప్లాట్‌ఫామ్స్, ఆంథ్రోపిక్, ఎరిక్‌సన్‌తో పాటు సెమీ కండక్టర్లకు క్లౌడ్‌ మౌలిక సదుపాయాలు, అనుసంధానత అందించే రంగంలో సారూప్యత కలిగిన అంతర్జాతీయ సంస్థలు విశ్వసనీయ సాంకేతిక కూటమి (టీటీఏ)ని ఏర్పాటు చేయడానికి చేతులు కలిపాయి...

ప్రపంచ పారా బ్యాడ్మింటన్‌

Published: February 14, 2026

ప్రపంచ పారా బ్యాడ్మింటన్‌లో ఆరుసార్లు సింగిల్స్‌ విజేతగా నిలిచిన తొలి ఆటగాడిగా భారత పారా షట్లర్‌ ప్రమోద్‌ భగత్‌ రికార్డు సృష్టించాడు...

జాతీయ మహిళా దినోత్సవం

Published: February 13, 2026

ప్రపంచవ్యాప్తంగా మార్చి 8న జరుపుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవం కాకుండా మన దేశంలోనూ ప్రత్యేకంగా మహిళల కోసం ఒక రోజును కేటాయించారు...

ప్రధాని కొత్త కార్యాలయం

Published: February 13, 2026

కొత్తగా నిర్మించిన ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ) - సేవా తీర్థ్‌ను ప్రధాని నరేంద్ర మోదీ 2026, ఫిబ్రవరి 13న ప్రారంభించారు. సేవా తీర్థ్‌లో ప్రధాని కార్యాలయంతోపాటు జాతీయ భద్రత మండలి సెక్రటేరియట్, క్యాబినెట్‌ సెక్రటేరియట్‌ ఉంటాయి....

బంగ్లాదేశ్‌ ప్రధానిగా తారిఖ్‌

Published: February 13, 2026

బంగ్లాదేశ్‌ 13వ సార్వత్రిక ఎన్నికల్లో బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ(బీఎన్‌పీ) ఘన విజయం సాధించింది. మూడింట రెండు వంతుల స్థానాల్లో నెగ్గి.. రెండు దశాబ్దాల తర్వాత బంగ్లా అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. ...

లీడ్‌ బ్యాంక్‌ పథకం

Published: February 13, 2026

జిల్లా స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలను సమన్వయం చేసేందుకు 1969లో ప్రవేశపెట్టిన లీడ్‌ బ్యాంక్‌ పథకం (ఎల్‌బీఎస్‌)లో మార్పులు చేయాలని ఆర్‌బీఐ ప్రతిపాదించింది. ఇందుకోసం కొన్ని నిబంధనలను సవరిస్తూ 2026, ఫిబ్రవరి 13న ముసాయిదాను విడుదల చేసింది. ...

స్టార్టప్‌ ఇండియా 2.0

Published: February 13, 2026

స్టార్టప్‌ ఇండియా ఫండ్‌ ఆఫ్‌ ఫండ్స్‌ పథకం రెండో దశ (2.0)కు రూ.10,000 కోట్ల మూలనిధితో ప్రభుత్వం 2026, ఫిబ్రవరి 13న ఆమోదం తెలిపింది. ప్రారంభ దశల్లో, డీప్‌-టెక్‌ పరిశోధనల్లో ఉన్న అంకుర సంస్థలకు ఇది ప్రోత్సాహం ఇస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు....

ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీగా బాలసుబ్రమణ్యం

Published: February 13, 2026

ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ, ప్రజా రవాణాశాఖ (పీటీడీ) కమిషనర్‌గా ఎన్‌.బాలసుబ్రమణ్యం నియమితులయ్యారు. ప్రస్తుతం ఈయన ఆర్గనైజేషన్స్‌ విభాగం డీజీపీగా ఉన్నారు. ఇప్పటి వరకు ఆర్టీసీ ఎండీగా ఉన్న ద్వారకాతిరుమలరావు పదవీకాలం ఫిబ్రవరితో ముగిసింది. ...

రక్షణ రంగం

Published: February 12, 2026

భారత రక్షణ రంగం బలోపేతమే లక్ష్యంగా దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న ప్రతిపాదనకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నేతృత్వంలోని రక్షణ కొనుగోళ్ల మండలి (డీఏసీ) 2026, ఫిబ్రవరి 12న ఆమోదముద్ర వేసింది. ...

ఎస్‌బీఐ రిసెర్చ్‌ నివేదిక

Published: February 12, 2026

అమెరికాతో వాణిజ్య ఒప్పందం వల్ల మన ఎగుమతులు భారీగా పెరుగుతాయని.. దిగుమతులు రాణించినా కూడా, ఏడాది వ్యవధిలోనే మనకు వాణిజ్య మిగులు 90 బిలియన్‌ డాలర్లు (రూ.8.19 లక్షల కోట్లు)గా ఉండొచ్చని ఎస్‌బీఐ రిసెర్చ్‌ తాజా నివేదికలో పేర్కొంది....

ఆసియా షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌

Published: February 12, 2026

ఆసియా షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో ఐశ్వరీ ప్రతాప్‌ సింగ్‌ స్వర్ణం నెగ్గాడు. 2026, ఫిబ్రవరి 12న దిల్లీలో జరిగిన పురుషుల 50 మీటర్ల రైఫిల్‌ 3 పొజిషన్స్‌లో అతడు 362 పాయింట్లతో ప్రపంచ రికార్డు సృష్టిస్తూ అగ్రస్థానంలో నిలిచాడు. ...

ఆర్‌ఏఎఫ్‌ పైలట్లకు శిక్షణ ఇవ్వనున్న ఐఏఎఫ్‌

Published: February 12, 2026

బ్రిటన్‌కు చెందిన రాయల్‌ ఎయిర్‌ఫోర్స్‌ (ఆర్‌ఏఎఫ్‌) పైలట్లకు శిక్షణ ఇచ్చేందుకు భారత వాయుసేన (ఐఏఎఫ్‌) తొలిసారి సిద్ధమైంది. దిల్లీ వేదికగా 2026, ఫిబ్రవరి 12న జరిగిన 19వ బ్రిటన్‌-భారత్‌ వైమానిక సిబ్బంది చర్చల్లో ఈ మేరకు అంగీకారం కుదిరింది....

ఇంటర్నేషనల్‌ డే ఆఫ్‌ ఉమెన్‌ అండ్‌ గర్ల్స్‌ ఇన్‌ సైన్స్‌

Published: February 11, 2026

ప్రపంచవ్యాప్తంగా సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, గణితం (ఎస్‌టీఈఎం) విభాగాల్లోని అన్ని స్థాయుల్లో నేటికీ గణనీయమైన లింగ అంతరం కొనసాగుతోంది. ...

ప్రసన్నకుమార్‌

Published: February 11, 2026

‘ది ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఛార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఏఐ) అధ్యక్షుడిగా విశాఖకు చెందిన ఛార్టర్డ్‌ అకౌంటెంట్‌ డి.ప్రసన్న కుమార్‌ ఎన్నికయ్యారు. ఆయన ఇప్పటి వరకు ఐసీఏఐ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. ...

ఉదయ్‌ నాగరాజు

Published: February 11, 2026

శతాబ్దాల చరిత్ర ఉన్న బ్రిటిష్‌ పార్లమెంట్‌ ఎగువసభ ‘హౌస్‌ ఆఫ్‌ లార్డ్స్‌’లో తెలంగాణకు చెందిన ఉదయ్‌ నాగరాజు 2026, ఫిబ్రవరి 11న జీవితకాల సభ్యుడి (లైఫ్‌ పీర్‌)గా ప్రమాణం చేశారు....

‘అరణ్యరామం’

Published: February 11, 2026

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో ‘అరణ్యరామం’ పేరిట అటవీ, వన్యప్రాణుల సంరక్షణ, నిర్వహణకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో ప్రతిష్ఠాత్మక కేంద్రాన్ని (ప్రీమియర్‌ సెంటర్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌ ఫర్‌ ఫారెస్ట్రీ అండ్‌ వైల్డ్‌లైఫ్‌ మేనేజ్‌మెంట్‌) ఏర్పాటు చేయనుంది. ...

నీటి అడుగున పనిచేసే డ్రోన్‌

Published: February 11, 2026

గుజరాత్‌లోని భావనగర్‌కు చెందిన జ్ఞానమంజరి ఇన్నోవేటివ్‌ యూనివర్సిటీ కెమికల్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థులు నీటి అడుగున పనిచేసే డ్రోన్‌కు రూపకల్పన చేశారు. జాతీయ రక్షణ అవసరాలకు, పరిశ్రమల్లోనూ దీనిని ఉపయోగించవచ్చన్నారు....

ప్రత్యక్ష పన్ను వసూళ్లు

Published: February 11, 2026

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) ఫిబ్రవరి 10 నాటికి ప్రత్యక్ష పన్ను నికర వసూళ్లు రూ.19.44 లక్షల కోట్లకు చేరుకున్నాయి. 2024-25 ఇదే సమయంలోని పన్ను వసూళ్లతో పోలిస్తే ఇవి 9.4% అధికం. కార్పొరేట్‌ పన్ను వసూళ్లు అధికంగా నమోదవడం ఇందుకు దోహదం చేసింది....

ముంబయి

Published: February 11, 2026

భారత్‌లో తొలి మ్యూజికల్‌ రోడ్డును ప్రారంభించి ముంబయి తీరప్రాంత రహదారుల అధికారులు రికార్డు సృష్టించారు. హంగేరియన్‌ టెక్నాలజీ సాయంతో నారిమన్‌ ప్రాంతం నుంచి వర్లి వైపు వెళ్లే రహదారిపై పలు సంగీత స్ట్రిప్‌లను ఏర్పాటు చేశారు....

జీహెచ్‌ఎంసీ పరిధిని మూడు కార్పొరేషన్లుగా

Published: February 11, 2026

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ మహా నగరంలో కొత్త పరిపాలన వ్యవస్థ ఆరంభమైంది. జీహెచ్‌ఎంసీ పరిధిని మూడు కార్పొరేషన్లుగా ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2026, ఫిబ్రవరి 11న ఉత్తర్వులు జారీ చేసింది. ...

సింగరేణి సీఎండీగా జ్యోతి బుద్ధప్రకాశ్‌

Published: February 11, 2026

డాక్టర్‌ జ్యోతి బుద్ధప్రకాశ్‌ సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ ఛైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌(సీఎండీ)గా ప్రభుత్వం నియమించింది. ఆ పదవిలో పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న డి.కృష్ణ భాస్కర్‌ను రిలీవ్‌ చేసింది....

ప్రపంచ పప్పుధాన్యాల దినోత్సవం

Published: February 10, 2026

పప్పుధాన్యాలు ఆహారంలో అంతర్భాగం. ఇవి ముఖ్యమైన ప్రోటీన్‌ వనరు. పప్పుధాన్యాలు లెగ్యుమినేసి మొక్కలు కావడంతో అవి భూసారాన్ని పెంపొందించడానికి తోడ్పడతాయి. ...

ప్రపంచ అవినీతి సూచీ 2025

Published: February 10, 2026

ప్రపంచ అవినీతి సూచీ-2025ను ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌ సంస్థ 2026, ఫిబ్రవరి 10న విడుదల చేసింది. భారత్‌లో అవినీతి తగ్గుముఖం పట్టిందని సంస్థ వెల్లడించింది....

ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా బాలాజి మెడమల్లి

Published: February 10, 2026

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా న్యాయవాది బాలాజి మెడమల్లి నియమితులయ్యారు. ఈ నియామకానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదముద్ర వేయడంతో కేంద్ర న్యాయశాఖ 2026, ఫిబ్రవరి 10న నోటిఫికేషన్‌ జారీ చేసింది. ...

జీనోమ్‌ వ్యాలీ ఎక్స్‌లెన్స్‌ పురస్కారం

Published: February 10, 2026

ప్రతిష్ఠాత్మక ‘జీనోమ్‌ వ్యాలీ ఎక్స్‌లెన్స్‌-2026’ పురస్కారం, ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్‌ బ్రూస్‌ లెవిన్‌కు దక్కింది. 2026, ఫిబ్రవరి 17, 18 తేదీల్లో హైదరాబాద్‌ వేదికగా ‘టెక్‌ బయో అన్‌షీల్డ్‌: ఏఐ ఆటోమేషన్‌-బయాలజీ రివల్యూషన్‌’ అనే థీమ్‌తో ‘బయో ఆసియా సదస్సు-2026’ నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది....

అమెరికాతో బంగ్లాదేశ్‌ వాణిజ్య ఒప్పందం

Published: February 10, 2026

అమెరికా, బంగ్లాదేశ్‌ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసుకున్నాయి. దీంతో బంగ్లాపై సుంకాలు ప్రస్తుతమున్న 20 శాతం నుంచి.. 19 శాతానికి తగ్గనున్నాయి. ...

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram