ముగిసిన పత్తి సీజన్‌

ముగిసిన పత్తి సీజన్‌
  • తెలంగాణలో 2025-26 పత్తి సీజన్‌ ముగిసింది. 2024-25 సీజన్‌తో పోలిస్తే 4.17 లక్షల టన్నులు తక్కువగా వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 2025 అక్టోబరులో పత్తి సీజన్‌ ప్రారంభం కాగా.. 2026 ఫిబ్రవరి 28తో ముగిసింది. 336 కేంద్రాల్లో 8,91,420 మంది రైతులు 16,34,219.80 టన్నుల పత్తిని సీసీఐకి విక్రయించారు. 
  • 2024-25తో పోలిస్తే ఈసారి పత్తి విస్తీర్ణం 1.31 లక్షల ఎకరాలకు పెరిగిందని వ్యవసాయశాఖ వెల్లడించింది. దీనికి అనుగుణంగా ఉత్పత్తిని సైతం నిరుటి కంటే 2.84 లక్షల టన్నులు ఎక్కువగా ఉంటుందని అంచనా వేశారు. దీనికి అనుగుణంగా కొనుగోలు కేంద్రాలను మరో 34కు పెంచారు. తీరా కొనుగోళ్ల వరకు వచ్చే సరికి నిరుటి కంటే 4,17,187 టన్నులు తక్కువగా వచ్చింది. పత్తిని సీసీఐకి విక్రయించిన రైతుల సంఖ్య సైతం 29,796 తగ్గింది. కొనుగోళ్ల విలువ సైతం 2,238.76 కోట్ల మేరకు తగ్గింది. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram