రాజ్యాంగ నిర్మాణంలో మహిళలు

రాజ్యాంగ నిర్మాణంలో మహిళలు

దేశాన్ని నడిపే శక్తిమంతమైన సాధనం రాజ్యాంగం. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తూ, మానవ హక్కులను కాపాడుతూ, రాజ్యాంగ - చట్టబద్ధమైన వ్యవస్థల మనుగడకు తోడ్పాటు అందించడంలో రాజ్యాంగం పాత్ర ఎనలేనిది. దీని రూపకల్పనలో మహిళలూ ప్రధాన పాత్ర పోషించారు. పోటీ పరీక్షల కోణంలో రాజ్యాంగ సభలో ముఖ్యమైన పాత్ర పోషించిన 15 మంది మహిళల గురించి తెలుసుకుందాం..!

రాజ్యాంగ రూపకర్తలు..

  • 1946 డిసెంబరు 6న రాజ్యాంగ పరిషత్‌ ఆవిర్భావం జరిగింది. ఎన్నికైన ప్రముఖుల్లో జవహర్‌లాల్‌ నెహ్రూ (భారత జాతీయ కాంగ్రెస్‌), బాబూ జగ్జీవన్‌రామ్‌ (కార్మిక వర్గం), మహమ్మద్‌ అలీ జిన్నా (ముస్లింలీగ్‌), డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ (షెడ్యూల్డ్‌ కులాలు), శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ, ఎం.ఆర్‌.జయకర్‌ (హిందూ మహాసభ), సర్వేపల్లి రాధాకృష్ణన్, సరోజిని నాయుడు తదితరులున్నారు. తెలుగు నేతల్లో టంగుటూరి ప్రకాశం పంతులు, నీలం సంజీవరెడ్డి, పట్టాభి సీతారామయ్య, దుర్గాబాయ్‌ దేశ్‌ముఖ్, కళా వెంకట్రావు, కల్లూరు సుబ్బారావు, మోటూరు సత్యనారాయణ, ఎన్.జి.రంగా, రామకృష్ణ రంగారావు ఎన్నికయ్యారు.
  • 15 మంది మహిళలు రాజ్యాంగ సభలో తమ వాదన వినిపించారు. అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్పి, మహిళల హక్కుల కోసం పాటుపడ్డారు. వారెవరంటే... 

1. హంస జీవరాజ్‌ మెహతా

  • 1945-46 మధ్య ఆల్‌ ఇండియా ఉమెన్‌ కాన్ఫరెన్స్‌కు అధ్యక్షురాలిగా పనిచేశారు.
  • రాజ్యాంగ పరిషత్‌ సభ్యురాలిగా లింగ సమానత్వం తదితర విషయాల్లో కీలక పాత్ర పోషించారు. 

2. దాక్షాయణి వేెలాయుధన్‌

  • 1946లో రాజ్యాంగ పరిషత్‌కు ఎన్నికైన మొదటి, ఏకైక దళిత మహిళ.  
  • అంటరానితనాన్ని నిర్మూలించే రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 17కు మద్దతు ఇచ్చారు.
  • కేవలం స్వతంత్ర సామ్యవాద గణతంత్ర రాజ్యం మాత్రమే దళితులను ఉన్నత స్థితికి తీసుకురాగలదని ఆమె విశ్వసించారు. 

3. అమృత్‌ కౌర్‌

  • 1930లో మహాత్మా గాంధీతో కలిసి శాసనోల్లంఘన ఉద్యమంలో చేరారు. రాజకీయాల్లో మహిళా భాగస్వామ్యం కోసం కృషి చేశారు.
  • ముసాయిదా రాజ్యాంగంలో మత స్వేచ్ఛ స్థానంలో మతారాధన స్వేచ్ఛను చేర్చాలని కోరుకున్నారు. 

4. అమ్ము స్వామినాథన్‌

  • మహిళా కార్యకర్తలు ఎదుర్కొంటున్న సామాజిక, ఆర్థిక సమస్యలు పరిష్కరించడానికి అనిబిసెంట్‌తో కలిసి 1917లో ‘ఉమెన్‌ ఇండియా అసోసియేషన్‌’ సంఘాన్ని స్థాపించారు.
  • వయోజన ఓటు హక్కుకు, అంటరానితనం నిర్మూలనకు మద్దతిచ్చారు.

5. దుర్గాభాయ్‌

  • ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులుతో కలిసి 1930లో మద్రాస్‌లో చేపట్టిన ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు.
  • మంత్రిమండలిలో స్థానం పొందేందుకు 35ఏళ్లుగా ఉన్న కనీస వయసును 30కి తగ్గించాలని ప్రతిపాదించారు. 

6. బేగం ఐజాజ్‌ రసుల్‌

  • రాజ్యాంగ పరిషత్‌లోని ఏకైక ముస్లిం సభ్యురాలు.
  • మతం ఆధారంగా రిజర్వేషన్లను గట్టిగా వ్యతిరేకించారు. ఇలాంటి చర్యలు మెజారిటీ నుంచి మైనారిటీలను శాశ్వతంగా విభజించగలవని వాదించారు.

7. విజయలక్ష్మి పండిట్‌

  • రాజ్యాంగాన్ని రూపొందించడానికి భారత రాజ్యాంగ సభకు పిలుపునిచ్చిన మొదటి నాయకురాలు.
  • పౌరుల పట్ల, అంతర్జాతీయ సమాజం పట్ల భారతదేశానికి ఉన్న బాధ్యతల ప్రాముఖ్యతను వివరించారు. 

8.కమలా చౌదరి

  • ఆల్‌ ఇండియా కాంగ్రెస్‌ కమిటీ 54వ సెషన్‌కు ఉపాధ్యక్షురాలిగా పనిచేశారు.
  • మహాత్మా గాంధీ అహింసా పిలుపుతో ప్రభావితమైన ఈమె.. మహిళలను ఏకం చేయడానికి చరఖా కమిటీలను ఏర్పాటు చేశారు.

9.లీలా రాయ్‌

  • రాజకీయాల్లో చేరడానికి మహిళలను ప్రేరేపించారు. భారతదేశ విభజనకు నిరసనగా రాజ్యాంగ సభ నుంచి వైదొలిగారు.
  • 1926లో ఛత్రి సంఘాన్ని స్థాపించారు. ఢాకా, కోల్‌కతాలో మహిళల విద్యకు పాటుపడ్డారు.

10.సుచేతా కృపలానీ

  • 1940లో తొలిసారిగా కాంగ్రెస్‌ పార్టీ మహిళా విభాగాన్ని స్థాపించారు.
  • 1942లో ‘క్విట్‌ ఇండియా ఉద్యమం’లో కీలక పాత్ర పోషించారు.
  • దేశంలోనే తొలి మహిళా ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. 

11.పూర్ణిమా బెనర్జీ

  • 1930-40 మధ్య స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారు.
  • రాజ్యాంగ రూపకల్పనలో ముఖ్యమైన పాత్ర పోషించారు. దేశ సమైక్యత కోసం విద్యార్థులకు అన్ని మతాల పట్ల సరైన అభిప్రాయాలు ఉండేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

12.రేణుకా రాయ్‌

  • 1934లో ఆల్‌ ఇండియా ఉమెన్‌ కాన్ఫరెన్స్‌ (ఏఐడబ్యూసీ) కార్యదర్శిగా పనిచేశారు.
  • తల్లిదండ్రుల ఆస్తిలో మహిళల హక్కులు, వారసత్వ హక్కులను సమర్థించారు. 

13. అన్నీ మస్కరీన్‌

  • క్విట్‌ ఇండియా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు.
  • ప్రజాస్వామ్య మూలాధార సూత్రాలను సమీప భవిష్యత్తుకు మాత్రమే కాకుండా, రాబోయే తరాలకు అందించడమే రాజ్యాంగ సభ కర్తవ్యమని వాదించారు. 

14.మాలతీ చౌదరి

  • దౌర్జన్యం, అసమానతలకు వ్యతిరేకంగా మాలతి తన అసమ్మతిని తెలిపారు.
  • ఒడిశాలో ‘బాజీరౌత్‌ ఛత్రవాస్‌’ అనే సంస్థను స్థాపించారు. బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పోరాడటం దీని ఉద్దేశం. 

15. సరోజినీ నాయుడు 

  • స్వాతంత్య్ర పోరాటంలో సుదీర్ఘకాలం పాల్గొన్న మహిళా నేతగా పేరొందారు.
  • 1931లో లండన్‌లో జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశం రెండో సెషన్‌కు గాంధీజీతో కలిసి హాజరయ్యారు.  

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు..

1. భారత రాజ్యాంగాన్ని రూపొందించిన రాజ్యాంగ పరిషత్తులో ఎంతమంది మహిళా సభ్యులు ఉన్నారు?

(ఎస్‌ఎస్‌సీ సీజీఎల్‌ టైర్‌ 1, 2021)(రాజస్థాన్‌ గ్రేడ్‌ 3, 2013)

1) 12      2) 13          3) 15      4) 14

సమాధానం: 3

2. 1946లో మద్రాసు నియోజక వర్గం నుంచి రాజ్యాంగ సభలో కింది ఎవరు భాగంగా ఉన్నారు?

(ఎస్‌ఎస్‌సీ సీజీఎల్‌ టైర్‌ 1, 2021)

1) అమ్ము స్వామినాథన్‌                2) కమలా చౌదరి

3) హంసా జీవరాజ్‌ మెహతా            4) బేగం ఐజాజ్‌ రసూల్‌

సమాధానం: 1

3. Identify the women member who was both part of Universal Declaration of Human Rights (UDHR) and Constituent Assembly of India.
(Kerala PSC Common Preliminary Exam (GRADUATE LEVEL), 2023)

1) Vijaya lakshmi Pandit        2) Sarojini Naidu

3) durgabhai deshmukh        4) Hansa Jivaraj mehta

Ans: 4

4. Who among the following Indian freedom fighters was fondly called Gandhi Buri (Old Lady Gandhi) for her dedication towards Gandhian principles?
SSC CGL 2021

1) Dakshayani Velayudhan        2) Kamla Chaudhary

3) Leela Roy                4) Matangini Hazra

Ans: 4

5. Hansa Mehta Committee was appointed by the National Council for Women's Education in 1962 with the purpose to: 
UGC NET, 2022

1) carry out inspection of schools in rural areas.

2)  examine the differentiation of curriculum for boys and girls at all stages of education.

3)  establish science laboratories in universities.

4)  formulate policy for use of educational satellites for rural areas.

Ans: 2  

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram