భారత మిలటరీ ఆపరేషన్స్‌

భారత మిలటరీ ఆపరేషన్స్‌

(పార్ట్‌ -1)

ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ సాయుధ దళాల్లో ఇండియన్‌ మిలటరీ ఒకటి. భారత సైనిక కార్యకలాపాలు ఎల్లప్పుడూ ప్రాంతీయ భద్రత, ప్రపంచ శాంతికి దోహదం చేస్తాయి. అశాంతిని, ఉగ్రవాదాన్ని నిర్మూలించడంలో మన రక్షణ దళాలు ముందుంటాయి. మన మిలటరీ ప్రధాన ఉద్దేశం దేశ సరిహద్దులతోపాటు అంతర్గత రక్షణకు బాధ్యత వహించడం. మన సైన్యం అవసరమైతే దేశ సరిహద్దులు దాటి ప్రపంచ భద్రత, స్థిరత్వానికి దోహదపడే వివిధ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇతర దేశాల్లో అలజడులు, అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు అక్కడి భారతీయులను క్షేమంగా స్వదేశానికి తీసుకురావడంతోపాటు ఆయా దేశాలకు సాయం చేయడంలోనూ తన వంతు కృషి చేస్తోంది. పోటీ పరీక్షల కోణంలో మన మిలటరీ ఇతర దేశాల్లో నిర్వహించిన ముఖ్యమైన ఆపరేషన్స్‌ గురించి తెలుసుకుందాం..!

ఆపరేషన్‌ పవన్‌

  • శ్రీలంకలోని అంతర్యుద్ధాన్ని ముగించడానికి 1987లో జరిగిన ఇండో-శ్రీలంక ఒప్పందం కింద ఆపరేషన్‌ పవన్‌ జరిగింది. స్వాతంత్య్రం తర్వాత భారతదేశం చేపట్టిన మొదటి ప్రధాన విదేశీ సైనిక చర్య ఇదే.

ఆపరేషన్‌ కాక్టస్‌

  • 1988లో మాల్దీవుల్లో రాజకీయ సంక్షోభం తలెత్తింది. అధ్యక్షుడిగా ఉన్న మౌమూన్‌ అబ్దుల్‌ గయూమ్‌ ప్రభుత్వాన్ని పడగొట్టే లక్ష్యంతో అసమ్మతివాదులు తిరుగుబాటు చేశారు.  ఆ దేశం సైనిక సాయం కోరడంతో భారత ప్రభుత్వం ఆపరేషన్‌ కాక్టస్‌ పేరుతో రంగంలోకి దిగి పరిస్థితిని చక్కబెట్టింది.

ఆపరేషన్‌ ట్రైడెంట్‌

  • ఇండో-పాకిస్థాన్‌ యుద్ధ సమయంలో 1971, డిసెంబరులో పాకిస్థాన్‌లోని కరాచీ నౌకాశ్రయంపై భారత నావికా దళం జరిపిన విధ్వంసకర దాడే ‘ఆపరేషన్‌ ట్రైడెంట్‌’. బంగ్లాదేశ్‌ ఏర్పాటులో ఇది కీలక పరిణామంగా మారింది. 

ఆపరేషన్‌ మైత్రి

  • 2015, ఏప్రిల్‌లో నేపాల్‌లో సంభవించిన భూకంపం కారణంగా దాదాపు 9వేలమందికి పైగా ప్రజలు మరణించారు. ఎందరో నిరాశ్రయులయ్యారు. మౌలిక వసతులు దెబ్బతిన్నాయి
  • ఈ విపత్తుకు స్పందించిన భారత్‌ ‘ఆపరేషన్‌ మైత్రి’ని చేపట్టింది. ఆ దేశ ప్రజలను రక్షించడంతోపాటు అక్కడ చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చే లక్ష్యంతో దీన్ని నిర్వహించారు. 

ఆపరేషన్‌ రాహత్‌

  • 2015 ప్రారంభంలో హౌతీ తిరుగుబాటుదారులు అప్పటి ప్రభుత్వాన్ని కూలదోయడంతో యెమెన్‌ వ్యాప్తంగా అస్థిరత నెలకొంది. అంతర్యుద్ధం కారణంగా చిక్కుకున్న భారతీయులను రక్షించే లక్ష్యంతో 2015, ఏప్రిల్‌లో భారత ప్రభుత్వం చేపట్టిన ఒక సంక్లిష్ట పౌర తరలింపు కార్యక్రమమే ఆపరేషన్‌ రాహత్‌.
ఆపరేషన్‌ సముద్ర సేతు, ఆపరేషన్‌ దేవి శక్తి, ఆపరేషన్‌ గంగ, ఆపరేషన్‌ కావేరి, ఆపరేషన్‌ అజయ్, ఆపరేషన్‌ ఇంద్రావతి, ఆపరేషన్‌ బ్రహ్మ, ఆపరేషన్‌ సింధుతోపాటు స్టాఫ్‌ సెలక్షన్, ఆర్‌ఆర్‌బీ, యూపీఎస్సీ తదితర పోటీ పరీక్షల్లో వీటి గురించి అడిగిన పలు ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్‌తో పాటు జనరల్‌ నాలెడ్జ్‌కి సంబంధించి కీలక అంశాలు, నెలవారీ కరెంట్‌ అఫైర్స్, ప్రాక్టీస్‌ టెస్ట్స్‌ ‘ఈనాడు ఈప్రతిభ జనరల్‌ నాలెడ్జ్‌ & కరెంట్‌ అఫైర్స్‌ కోర్సు’లో అందుబాటులో ఉన్నాయి. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి.https://hov.to/69b00978

 

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram