సౌర కుటుంబం - విశేషాలు

సౌర కుటుంబం - విశేషాలు

ఆకాశంలో అసంఖ్యాకంగా ఉన్న నక్షత్ర మండలాలు - అందులోని నక్షత్రాలు - వాటి చుట్టూ తిరిగే గ్రహాలు, తోకచుక్కలు లాంటి ఖగోళ వస్తువులు, శూన్య ప్రదేశాల సముదాయమే విశ్వం. ఈ అనంత విశ్వం అనేక గ్రహ వ్యవస్థలను కలిగి ఉంది. వీటిలో ప్రతిదానిలో గ్రహాలు ఒక కేంద్రక నక్షత్రం చుట్టూ తిరుగుతూ ఉంటాయి. మన సౌర వ్యవస్థ బిలియన్ల నక్షత్రాలు కలిగిన సర్పిలాకార గెలాక్సీ అయిన పాలపుంతలో ఉంది. భూమిపై జీవుల మనుగడకు సూర్యుడే మూలం. ఇది కూడా ఒక నక్షత్రమే. 

పాలపుంత

విశ్వంలోని కొన్ని వేల మిలియన్‌ల నక్షత్రాల సమూహాన్ని గెలాక్సీ అంటారు. ప్రతి గెలాక్సీలో 100 బిలియన్‌ నక్షత్రాల వరకు ఉంటాయి. సూర్యుడు భాగంగా ఉన్న గెలాక్సీని పాలపుంత (Milky way) లేదా ఆకాశ గంగ అంటారు. ఇది సర్పిలాకారంలో ఉంటుంది. పాలపుంత విశాలమైన పళ్లెం ఆకారంలో ఉంటుంది. ఇందులో వందల కోట్ల నక్షత్రాలు, గ్రహాలు, గ్రహశకలాలు, తోకచుక్కలు, ఇతర ఖగోళ వస్తువులు ఉంటాయి. 

సౌర వ్యవస్థ

సూర్యుడి పేరు సోల్‌ (Sol) కాబట్టి మన గ్రహ వ్యవస్థను సౌర వ్యవస్థ (Solar System) లేదా సౌర కుటుంబం (Solar family) అంటారు. ఇందులో 8 గ్రహాలు ఉన్నాయి. అవి: బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు (కుజుడు), బృహస్పతి (గురుడు), శని (శాటర్న్‌), వరుణుడు (యురేనస్‌), ఇంద్రుడు (నెప్ట్యూన్‌).

సూర్యుడు

సూర్యుడు మధ్యస్థ స్థాయి నక్షత్రం. సూర్య కాంతి భూమిని చేరడానికి పట్టే కాలం 8 నిమిషాలు. సూర్యుడు తన చుట్టూ తాను తిరగడానికి పట్టే కాలం 25 రోజులు.  సూర్యుడి కనిపించే ఉపరితలాన్ని ఫొటోస్పియర్‌ అంటారు. దీని చుట్టూ క్రోమోస్పియర్, కరోనా (గ్రహణాల సమయంలో కనిపిస్తుంది) ఉంటాయి. సూర్యుడి ఉపరితలంపై 6వేల డిగ్రీల సెల్సియస్, కేంద్రంలో లక్ష డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత ఉంటుంది. 

బుధుడు 

సూర్యుడికి అత్యంత దగ్గరగా ఉన్న గ్రహం. దీన్ని రోమన్లు నైపుణ్య, వాణిజ్య దేవుడిగా (గాడ్‌ ఆఫ్‌ కామర్స్, స్కిల్‌) వ్యవహరిస్తారు. ఇది సౌర కుటుంబంలో అత్యంత చిన్న గ్రహం. అందుకే దీన్ని ‘శాటిలైట్‌ ప్లానెట్‌’ (ఉపగ్రహ గ్రహం) అని పిలుస్తారు. దీనికే ‘అపోలో’ అనే పేరు కూడా ఉంది. బుధుడి ఉపరితలంపై వాతావరణం చాలా తక్కువగా ఉంటుంది. 56.8 రోజులు పగలు, 56.8 రోజులు రాత్రులుగా ఉంటుంది. 

శుక్రుడు

ఇది సౌర కుటుంబంలో అత్యంత  ప్రకాశవంతమైన, వేడి గ్రహం. ఉష్ణోగ్రత 600 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉంటుంది. దీన్ని ‘గాడ్‌ ఆఫ్‌ స్ప్రింగ్‌ లవ్‌’ అనే రోమన్‌ దేవత పేరుతో పిలుస్తారు. ఈ గ్రహం చుట్టూ దట్టమైన మేఘావరణం ఉంటుంది. 95% కార్బన్‌ డై ఆక్సైడ్, సల్ఫ్యూరిక్‌ ఆసిడ్‌తో కూడిన మబ్బుల్లాంటి వాతావరణం ఉంది. ఈ గ్రహాన్ని గ్రీకులు అందమైన దేవతగా భావిస్తారు. 

సూర్యుడి చుట్టూ తిరిగే గ్రహాలు, పరిభ్రమణ - భ్రమణ సమయాలు, భూమి, అంగారకుడు, గురుడు, శని, వరుణుడు, ఇంద్రుడు, చంద్రుడికి సంబంధించిన విశేషాలతోపాటు ఈ టాపిక్‌ నుంచి యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్, ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ, ఎస్‌ఎస్‌సీ తదితర పోటీపరీక్షల్లో అడిగిన 250కి పైగా ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్‌.. ఇంకా పోటీపరీక్షల్లో వచ్చే కీలక జీకే అంశాలు, మంత్లీ కరెంట్‌ అఫైర్స్‌ ఈబుక్స్, ప్రాక్టీస్‌ టెస్ట్స్‌ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్‌ నాలెడ్జ్‌ & కరెంట్‌ అఫైర్స్‌ కోర్సు’కి సబ్‌స్క్రైబ్‌ చేసుకోండి. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. పాలపుంత అనేది ఒక?

(ఓఎస్‌ఎస్‌ఎస్‌సీ ఎల్‌ఎస్‌ఐ, ఫారెస్ట్‌ అండ్‌ ఫారెస్ట్‌ గార్డ్, 2024)

1) నక్షత్రం    2) చిన్న గ్రహం     3) గెలాక్సీ    4) గ్రహం

సమాధానం: 3

2. పాలపుంత ఆకారం...

(ఎన్‌టీపీసీ టైర్‌ 1, 2016)

1) క్రమబద్ధమైన   2) క్రమరహిత  3) సర్పిలాకార     4) దీర్ఘవృత్తాకార

సమాధానం: 3 

3. సౌర కుటుంబం మధ్యలో ఉండేది?

(డీఎస్‌ఎస్‌ఎస్‌బీ టీజీటీ (నేచురల్‌ సైన్స్‌), 2025)

1) సూర్యుడు    2) చంద్రుడు      3) భూమి      4) నక్షత్రాలు

సమాధానం: 1

4. మన సౌర కుటుంబంలో ఎన్ని గ్రహాలు ఉన్నాయి?

(రాజస్థాన్‌ పోలీస్‌ కానిస్టేబుల్, 2020)

1) అయిదు   2) ఆరు    3) ఏడు    4) ఎనిమిది

సమాధానం: 4

5. The nearest Spiral galaxy to Milky way is:
(NTPC CBT-I 2021)
1) Pinwheel galaxy        2) Andromeda galaxy
3) Dwarf galaxy        4) Sun flower galaxy
Ans: 2
6. Select the correct option that indicates the arrangement of the following words in a logical and meaningful order.
i. Solar System       ii. Earth       iii. India      iv. Asia      v. Milky way
(SSC CHSL 2022)
1) v, i, ii, iv, iii            2) i, ii, iii, iv, v        3) v, iv, iii, ii, i            4) ii, i, iii, iv, v
Ans: 1
7. Select the option that indicates the correct arrangement of the given words in a logical and meaningful order.
i. Universe         ii. Country       iii. Sun        iv. Earth        v. MilkyWay
(SSC CPO 2022)
1) i, iv, ii, v, iii                2) i, v, iii, iv, ii            
3) i, ii, iii, iv, v            4) v, iv, iii, ii, i
Ans: 2

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram