శాస్త్రీయ పురస్కారాలు
దేశంతోపాటు మానవ నాగరికత అభివృద్ధి ప్రధానంగా సాంకేతిక పురోగతిపై ఆధారపడి ఉంటుంది. ప్రాచీన కాలం నుంచే మన దేశ శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలు శాస్త్ర, సాంకేతిక రంగాల వృద్ధికి పనిచేశారు. ఆ కృషి నేటికీ నిరంతరం కొనసాగుతూనే ఉంది. స్వాతంత్య్రానంతరం భారతదేశం నూతన శాస్త్రీయ ఆవిష్కరణలతో ప్రపంచ దేశాలతో పోటీపడే స్థాయికి ఎదిగింది. ఈ ప్రయాణంలో ఎందరో మేధావుల అపార కృషి ఉంది. వారందరినీ గౌరవించుకునే ఉద్దేశంతో భారత ప్రభుత్వం శాస్త్రీయ అవార్డులు అందిస్తోంది. పోటీపరీక్షల నేపథ్యంలో వాటి గురించి తెలుసుకుందాం..!
రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్
ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆవిష్కరణల రంగాల్లో విశేష కృషి చేసినవారిని గుర్తించి ఇచ్చే ఒక ప్రతిష్ఠాత్మక జాతీయ పురస్కారం. భారత ప్రభుత్వం 2024, జనవరిలో వీటిని ప్రారంభించింది. ప్రతి సంవత్సరం అంతరిక్ష దినోత్సవం సందర్భంగా ఆగస్టు 23న భారత రాష్ట్రపతి వీటిని ప్రదానం చేస్తారు.భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, జీవశాస్త్రం, గణితశాస్త్రం, భూమి-వాతావరణశాస్త్రం, ఇంజినీరింగ్ లాంటి వివిధ విభాగాల్లో అవార్డులు ప్రదానం చేస్తారు.
జాతీయ చలనచత్ర పురస్కారాలు
చలనచిత్ర రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరచినవారికి జాతీయ చలనచిత్ర పురస్కారాలను ఏటా ప్రదానం చేస్తారు. వీటిని 1954లో స్థాపించారు. ఈ పురస్కారాలను ఫీచర్ ఫిల్మ్స్, నాన్-ఫీచర్ ఫిల్మ్స్ అనే రెండు ప్రధాన విభాగాల్లో ప్రకటిస్తారు. ఇండియన్ డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆధ్వర్యంలోని ఒక స్వతంత్ర జ్యూరీ విజేతలను నిర్ణయిస్తుంది.
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
భారత చలనచిత్ర రంగానికి చేసిన జీవితకాల కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం ఈ అవార్డును ప్రదానం చేస్తుంది. దీన్ని సినిమా రంగంలో అత్యున్నత పురస్కారంగా భావిస్తారు. దాదాసాహెబ్ ఫాల్కే పేరిట 1969లో దీన్ని నెలకొల్పారు. ఈయన్ని భారత చలనచిత్ర రంగానికి పితామహుడిగా పేర్కొంటారు. అవార్డు కింద స్వర్ణ కమలం పతకం, రూ.10లక్షల నగదు బహుమతి లభిస్తాయి.
| గాంధీ శాంతి బహుమతి, సంగీత నాటక అకాడమీ అవార్డులు, ఇతర అవార్డుల ప్రత్యేకతలు, గ్రహీతలు లాంటి వివరాలతోపాటు ఆర్‌ఆర్‌బీ, ఎస్‌ఎస్‌సీ, యూపీఎస్సీ లాంటి పోటీపరీక్షల్లో అడిగిన 130కి పైగా ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్.. ఇంకా పోటీపరీక్షల్లో వచ్చే కీలక జీకే అంశాలు, మంత్లీ కరెంట్ అఫైర్స్ ఈబుక్స్, ప్రాక్టీస్ టెస్ట్స్ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్ నాలెడ్జ్ & కరెంట్ అఫైర్స్ కోర్సు’కి సబ్‌స్క్రైబ్ చేసుకోండి. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978 |
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
1. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో చేసిన కృషికి కింది ఏ అవార్డు అందిస్తారు?
(ఎస్‌ఎస్‌సీ సీజీఎల్, 2021)
1) శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డు 2) దీనానాథ్ మంగేష్కర్ అవార్డు
3) జ్ఞానపీఠ్ అవార్డు 4) ద్రోణాచార్య అవార్డు
సమాధానం: 1
2. 2025లో ప్రకటించిన 71వ చలనచిత్ర అవార్డుల్లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఎవరు అందుకున్నారు?
(ఆర్‌ఆర్‌బీ గ్రూప్ డి, 2026)
1) కమల్‌హాసన్ 2) పృథ్వీరాజ్
3) మోహన్‌లాల్ 4) రాజ్‌కుమార్
సమాధానం: 3
3. కిందివాటిలో రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ అవార్డుల్లో అత్యున్నత పురస్కారం ఏది?
(ఆర్‌ఆర్‌బీ ఏఎల్‌పీ 2024)
1) విజ్ఞాన్ వజ్ర 2) విజ్ఞాన్ మహాన్
3) విజ్ఞాన్ శ్రీ 4) విజ్ఞాన్ రత్న
సమాధానం: 4
4. 1969లో మొదటి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ఎవరు గెలుచుకున్నారు?
(ఎంపీ సబ్ ఇంజినీరింగ్, 2017)
1) పృథ్వీరాజ్ కపూర్ 2) బీఎన్ సిర్కార్
3) దేవికా రాణి 4) సత్యజిత్ రే
సమాధానం: 3
5. Who among the following was posthumously awarded the Rashtriya Vigyan Puraskar 2025 in 'Vigyan Ratna' category?
(RRB Group D, 2026)
1) Jayant Vishnu Narlikar 2) Prakash Kumar
3) Pavannan 4) Vidya Subramanian
Ans: 1
6. Dr. C Anandharamakrishnan received the Rashtriya Vigyan Puraskar 2024 in the Vigyan Shri category for his contribution to the field of ______.
(RRB Group D, 2025)
1) Biological Science 2) Agricultural Science
3) Atomic Energy 4) Medicine
Ans: 2
7. Read the below statements marked as Assertion (A) and Reason (R). Mark the correct option:
Assertion (A): The Rashtriya Vigyan Puraskar is a national award given for contributions to science.
Reason (R): The award is administered by the Ministry of Culture.
(SSC CGL, 2025)
1) Both A and R are true, and R is the correct explanation of A.
2) Both A and R are true, but R is not the correct explanation of A.
3) A is true, but R is false.
4) A is false, but R is true.
Ans: 3
Link copied to clipboard!
యూఆర్ఎస్సీలో జేఆర్ఎఫ్ పోస్టులు
ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ప్రొఫెషనల్ ట్రైనీ ఉద్యోగాలు
ఏపీఎంఎస్ఆర్బీలో స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్ పోస్టులు
ఎయిమ్స్ భోపాల్‌లో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్‌లో ఉద్యోగాలు
సెంట్రల్ సంస్కృత యూనివర్సిటీలో ఉద్యోగాలు
ఎయిమ్స్ బిలాస్‌పుర్‌లో ఉద్యోగాలు
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో టెక్నీషియన్ ఉద్యోగాలు
ఎయిమ్స్ జోధ్‌పుర్‌లో జూనియర్ రెసిడెంట్ పోస్టులు
ఏపీ అంగన్వాడీ సత్యసాయి జిల్లాలో ఉద్యోగాలు
పి.వి.నరసింహారావు తెలంగాణ పశుసంవర్థక వర్సిటీలో డిప్లొమా ప్రవేశాలు
జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ వర్సిటీలో డిప్లొమా ప్రవేశాలు
శ్రీకొండా లక్ష్మణ్ వర్సిటీలో హార్టికల్చర్ డిప్లొమా
ఎన్ఐఈపీఏలో ఎంఏఏఈ ప్రోగ్రాం ప్రవేశాలు
నేషనల్ స్పోర్ట్స్ యూనివర్శిటీలో యూజీ, పీజీ ప్రవేశాలు
జాయింట్ సీఎస్ఐఆర్- యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ జూన్-2026
తిరుపతిలో పశుసంవర్ధక డిప్లొమా ప్రవేశాల నోటిఫికేషన్ (2026-27)
దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీలో ప్రవేశాలు 2026
ఏపీలో ఐటీఐ కోర్సుల్లో అడ్మిషన్లు-2026
సీఐటీడీ, హైదరాబాద్‌లో పోస్ట్ డిప్లొమా కోర్సులు
పెయిడ్ ఇంటర్న్‌షిప్ ఉద్యోగాలు
డీఆర్డీఓ - ఏఆర్‌డీఈలో ఇంటర్న్‌షిప్ పోస్టులు
డీఆర్డీఓ - ఐఎస్ఎస్ఏలో పెయిడ్ ఇంటర్న్‌షిప్
డీఆర్డీఓ - ఎస్‌ఏజీలో పెయిడ్ ఇంటర్న్‌షిప్ పోస్టులు
హైదరాబాద్ రిసెర్చ్ సెంటర్ ఇమరాట్లో ఇంటర్న్‌షిప్ ఉద్యోగాలు
డీఆర్డీఓ ఎన్‌పీఓఎల్‌లో ఇంటర్న్‌షిప్ పోస్టులు
డీఆర్డీఓ- ఐటీఆర్‌లో పెయిడ్ ఇంటర్న్‌షిప్ ఉద్యోగాలు
డీఆర్డీఓ డీఈఏఎల్లో ఇంటర్న్‌షిప్ పోస్టులు
డీఆర్డీఓ కాన్పూర్‌లో పెయిడ్ ఇంటర్న్‌షిప్ పోస్టులు
ఎన్ఎఫ్సీ హైదరాబాద్‌లో మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలు
ఏపీ సెకండరీ హెల్త్ హాస్పిటల్స్‌లో సివిల్ అసిస్టెంట్ ఉద్యోగాలు
సీఎఫ్టీఆర్ఐలో ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగాలు
ఈసీఐఎల్‌లో హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ ఇంజినీర్ ఉద్యోగాలు
డీఆర్డీఓ-ఐఎన్ఎంఏఎస్లో రిసెర్చ్ ఫెలో పోస్టులు
కొంకణ్ రైల్వేలో ఉద్యోగాలు
డీఆర్డీఓ-సీఏఐఆర్ బెంగళూరులో జేఆర్ఎఫ్ పోస్టులు
ఈఎస్ఐసీ కలబురగిలో ఫ్యాకల్టీ ఉద్యోగాలు