ముఖ్యమైన భారత జాతీయ పురస్కారాలు (పార్ట్‌ - 3)

ముఖ్యమైన భారత జాతీయ పురస్కారాలు (పార్ట్‌ - 3)

సంస్కృతి, సమాజం, దేశానికి గణనీయంగా దోహదపడే విశిష్ట సమూహాలు, వ్యక్తులు, సంస్థలను గుర్తించి, సత్కరించేందుకు మన దేశంలో జాతీయ పురస్కారాలను నెలకొల్పారు.  ఇవి దేశానికి సంబంధించిన గొప్ప సాంస్కృతిక, చారిత్రక వారసత్వాన్ని ప్రతిబింబిస్తాయి. పార్ట్‌-1, 2లలో పౌర పురస్కారాలు, శౌర్య పురస్కారాలు, క్రీడా పురస్కారాల ముఖ్య సమాచారం ఉంది. ఈ ఆర్టికల్‌లో సాహిత్య పురస్కారాల గురించి సమగ్రంగా తెలుసుకుందాం.

సాహిత్య పురస్కారాలు

  • భారతీయ సాహిత్యం ప్రపంచంలోనే అతిపురాతనమైందిగా పేరుగాంచింది. అంతేకాకుండా భాషాపరంగా అత్యంత వైవిధ్యభరితమైన సంప్రదాయాల్లో ఒకటిగా ఉంది. పలు రకాల భాషలు, ప్రాచీన కథన సంప్రదాయాలు, శక్తిమంతమైన ఆధునిక సాహిత్య ఉద్యమం ద్వారా రూపుదిద్దుకున్న గొప్ప సాహిత్య సంస్కృతి భారతావని సొంతం.
  • సాహిత్య రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరచిన కవులు, రచయితలు, ప్రముఖుల విశేష కృషిని గుర్తించి, గౌరవించడానికి అనేక ప్రతిష్ఠాత్మక పురస్కారాలు ఉన్నాయి. ఇవి ఆయా భారతీయ భాషల్లో సాహిత్య అభివృద్ధికి పాటుపడిన వారికి ప్రకటిస్తారు. 

మన దేశంలో ముఖ్యమైన సాహిత్య పురస్కారాలు: 

1. జ్ఞానపీఠ్‌ పురస్కారం: ఇది మన దేశంలో అత్యున్నత సాహిత్య పురస్కారం. ఆయా భారతీయ భాషల్లో సాహిత్య రంగంలో విశేష ప్రతిభ కనబరచిన రచయితలకు దీన్ని ప్రదానం చేస్తారు. ఈ పురస్కారాన్ని 1961లో స్థాపించారు. అవార్డు కింద రూ.11 లక్షల నగదు, సరస్వతీ దేవి కాంస్య విగ్రహం, ప్రశంసాపత్రం ఇస్తారు.

2. సాహిత్య అకాడమీ పురస్కారం: మన దేశంలో జ్ఞానపీఠ్‌ తర్వాత రెండో అత్యున్నత అవార్డు. దీన్ని 1954లో స్థాపించారు. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని స్వయంప్రతిపత్తి సంస్థ అయిన ‘సాహిత్య అకాడమీ’ ఏటా దీన్ని ప్రదానం చేస్తుంది. 

3. సరస్వతి సమ్మాన్‌ పురస్కారం: భారతీయ సాహిత్య రంగంలో ఇచ్చే అత్యున్నత గుర్తింపుల్లో ఇది ఒకటి. దీన్ని 1991లో కె.కె.బిర్లా ఫౌండేషన్‌ స్థాపించింది. దీన్ని ఏటా ప్రదానం చేస్తారు. గత పదేళ్లలో భారత రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్‌లో ఉన్న 22 అధికార భాషల్లో ఏదైనా ఒకదానిలో వెలువడిన అత్యుత్తమ సాహిత్య రచనకు దీన్ని అందిస్తారు.

ఆయా అవార్డుల గ్రహీతలు, వ్యాస్‌ సమ్మాన్‌ అవార్డు, మూర్తిదేవి పురస్కారం, సాహిత్య అకాడమీ యువ పురస్కార్, సాహిత్య అకాడమీ బాల పురస్కార్‌ తదితర పూర్తి సమాచారంతోపాటు ఈ అంశంపై యూపీఎస్సీ, ఎస్‌ఎస్‌సీ, ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ పరీక్షల్లో అడిగిన 200కి పైగా ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్‌..ఇంకా పోటీపరీక్షల్లో వచ్చే కీలక జీకే అంశాలు, మంత్లీ కరెంట్‌ అఫైర్స్‌ ఈబుక్స్, ప్రాక్టీస్‌ టెస్ట్స్‌ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్‌ నాలెడ్జ్‌ ఖ& కరెంట్‌ అఫైర్స్‌ కోర్సు’కి సబ్‌స్క్రైబ్‌ చేసుకోండి. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. కింది ఏ రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరచినవారికి జ్ఞానపీఠ్‌ పురస్కారం అందిస్తారు?

(ఎస్‌ఎస్‌సీ జీడీ, 2019)

1) వైద్యం    2) సామాజిక సేవ

3) సాహిత్యం  4) సినిమా

సమాధానం: 3

2. భారతదేశ అత్యుత్తమ సాహిత్య పురస్కారం ఏది?

(ఆర్‌ఆర్‌బీ జేఈ, 2019)

1) వ్యాస్‌ సమ్మాన్‌                 2) జ్ఞానపీఠ్‌ అవార్డు

3) సాహిత్య అకాడమీ పురస్కారం         4) కబీర్‌ పురస్కారం

సమాధానం: 2

3. Jnanpith Award was instituted in 1961. The newspaper group behind the award is 
(MPSC 2015)
1) The Indian Express        2) The Times of India        
3) Hindustan Times            4) The Hindu 
Ans: 2
4. Which of the following awards is the highest literary award given to Indian writers who have contributed to and enriched Indian literature in any of the official Indian languages?
(NVS MTS Official Paper 2022)
1) Sahitya Akademi Award            2) Rabindra Award
3) Kalidas Samman                4) Jnanpith Award
Ans: 4
5. The Sahitya Akademi Award was instituted in the year ______.
(SSC CPO Previous Paper 2020)
1) 1960        2) 1954        3) 1989        4) 1992
Ans: 2
6. Which of the following awards is given for excellence in literature?
(DSSSB Assistant Superintendent 2014)
1) Dhanwantri Award            2) Arjun Award
3) Jnanpith Award                4) Borlaug Award
Ans: 3

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram