భారత మిలటరీ ఆపరేషన్స్‌ (పార్ట్‌ -2)

భారత మిలటరీ ఆపరేషన్స్‌ (పార్ట్‌ -2)

ప్రపంచంలోనే అత్యుత్తమ సాయుధ బలగాల్లో భారత మిలటరీ ఒకటి. ఇది ప్రధానంగా సరిహద్దు భద్రత, తిరుగుబాటు నిరోధం, ఉగ్రవాద నిర్మూలన, మానవతా సహాయం/ విపత్తు సాయం లాంటి అంశాలపై దృష్టి సారిస్తుంది. ఉగ్రవాద నిరోధం,  శాంతి - భద్రతల నిర్వహణకు నిత్యం కృషి చేస్తూ ఉంటుంది. వీటిలో జమ్మూ - కశ్మీర్‌లో ఆపరేషన్‌ రక్షక్‌ లాంటి దీర్ఘకాలిక కార్యకలాపాలు; ఆపరేషన్‌ విజయ్‌ (గోవా) - ఆపరేషన్‌ పోలో (హైదరాబాద్‌) లాంటి ప్రాంతీయ చర్యలు; ప్రకృతి వైపరీత్యాల సమయంలో పౌరులకు సాయం చేయడం లాంటివి ఉన్నాయి. సాధారణంగా ఆయా రాష్ట్రాల్లోని పోలీస్‌ వ్యవస్థ లా అండ్‌ ఆర్డర్‌ను పర్యవేక్షిస్తుంది. ఉగ్రమూక దాడులు, ప్రాంతాల మధ్య వైషమ్యాలు లాంటివి సంభవించినప్పుడు వాటిని ఎదుర్కోవడానికి మిలటరీ రంగంలోకి దిగుతుంది. పోటీ పరీక్షల కోణంలో మన మిలటరీ స్వదేశంలో నిర్వహించిన ముఖ్యమైన ఆపరేషన్స్‌ గురించి తెలుసుకుందాం..!

ఆపరేషన్‌ పోలో, 1948

భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించాక కూడా హైదరాబాద్‌ సంస్థానం 13 నెలల పాటు నిజాం పాలనలోనే ఉంది. ఆ సమయంలో రజాకార్ల అకృత్యాలు, నిజాం నిరంకుశ పాలన, కమ్యూనిస్టుల తిరుగుబాటు చర్యల కారణంగా రాజ్యంలోని ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో శాంతి భద్రతలను నెలకొల్పడానికి భారత ప్రభుత్వం ఆపరేషన్‌ పోలో పేరుతో పోలీస్‌ చర్యకు సిద్ధమైంది. ఈ ఆపరేషన్‌ 1948 సెప్టెంబరు 13న ప్రారంభమై 17న ముగిసింది. 

ఆపరేషన్‌ విజయ్, 1961

  • పోర్చుగీస్‌ వారు 1510లో గోవాను స్వాధీనం చేసుకున్నారు. సుమారు 450 ఏళ్లకు పైగా ఇది వారి అధీనంలోనే ఉంది.
  • 1947లో భారత్‌కు స్వాతంత్య్రం వచ్చినప్పటికీ పోర్చుగీస్‌ వారు గోవా నుంచి వైదొలగడానికి నిరాకరించారు. భారత ప్రభుత్వం దౌత్య, శాంతి మార్గాల ద్వారా గోవాను దేశంలో విలీనం చేయాలని ప్రయత్నించింది. వలసవాద నిర్మూలన కోసం ఐక్యరాజ్యసమితి చేసిన తీర్మానాలను పోర్చుగీస్‌ తిరస్కరించింది. దీంతో గోవాలో వలస పాలనను అంతం చేసేందుకు భారత్‌ 1961, డిసెంబరు 18న ఆపరేషన్‌ విజయ్‌ ప్రారంభించింది.

ఆపరేషన్‌ మేఘదూత్, 1984

1980 దశకంలో సియాచిన్‌పై తన హక్కును చట్టబద్ధం చేసుకోవడంతోపాటు ఆ ప్రాంతాన్ని పూర్తిగా ఆక్రమించేందుకు పాకిస్థాన్‌ ప్రయత్నాలు ప్రారంభించింది. దీన్ని అడ్డుకునే క్రమంలో భారత్‌ ఆపరేషన్‌ మేఘదూత్‌ చేపట్టింది.

ఆపరేషన్‌ బ్లూస్టార్, 1984

దీన్ని భారత సైన్యం 1984, జూన్‌లో చేపట్టింది. పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఉన్న స్వర్ణ దేవాలయాన్ని ఆక్రమించుకున్న సిక్కు వేర్పాటువాద సమూహాన్ని నియంత్రించేందుకు దీన్ని నిర్వహించారు. అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ సూచనల మేరకు ప్రాణ నష్టాన్ని కనిష్ఠ స్థాయికి తగ్గించి, దేవాలయాన్ని తిరిగి స్వాధీనం చేసుకునే లక్ష్యంతో ఈ సైనిక చర్యకు ప్రణాళిక రూపొందించారు.

ఆపరేషన్‌ రక్షక్, ఆపరేషన్‌ విజయ్, ఆపరేషన్‌ పరాక్రమ్, ఆపరేషన్‌ సిందూర్‌ గురించి కీలకాంశాలతోపాటు వీటి గురించి వివిధ పోటీపరీక్షల్లో అడిగిన ప్రశ్నల తీరు ఎలా ఉంది? జవాబులతో సహా రూపొందించిన ఈబుక్‌తో పాటు జనరల్‌ నాలెడ్జ్‌కి సంబంధించిన టాపిక్స్‌పై ఈబుక్స్, మంత్లీ కరెంట్‌ అఫైర్స్, ప్రాక్టీస్‌ టెస్ట్స్‌ ‘ఈనాడు ఈప్రతిభ జనరల్‌ నాలెడ్జ్‌ & కరెంట్‌ అఫైర్స్‌ కోర్సు’లో అందుబాటులో ఉన్నాయి. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి.https://hov.to/69b00978

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. ఆపరేషన్‌ మేఘదూత్‌ కింది దేనికి సంబంధించింది?

(టెరిటోరియల్‌ ఆర్మీ, 2016)

1) సియాచిన్‌ హిమనీనదం        2) ఆక్సాయ్‌చిన్‌

3) కచ్‌                    4) ఏదీకాదు

సమాధానం: 1

2. ఆపరేషన్‌ బ్లూస్టార్‌ దేనికి సంబంధించింది?

(సీఐఎస్‌ఎఫ్‌ ఏఎస్‌ఐ, 2018)

1) అక్షరధామ్‌ ఆలయం            2) స్వర్ణ దేవాలయం

3) బాబ్రీ మసీదు             4) ఏదీకాదు

సమాధానం: 2

3. What was the name of the operation that led to the annexation of the Hyderabad State into India?
(SSC MTS 2021)
1) Operation Sunrise        2) Operation Unity    
3) Operation Polo            4) Operation Gateway
Ans: 3
4. Which military operation was launched to integrate Hyderabad into India in 1948?
(RRB NTPC (UG) CBT-I 2025)
1) Operation Shield            2) Operation Peace        
3) Operation Polo                4) Operation Lotus
Ans: 3
5. The State of Hyderabad was merged in Indian Union in the month and year 
(Rajasthan Police SI Paper-II 2021)
1) Sept, 1948        2) Nov, 1947        3) Feb, 1948        4) Feb, 1949
Ans: 1

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram