గోపాలకృష్ణ గోఖలే 

గోపాలకృష్ణ గోఖలే 

భారత స్వాతంత్య్రోద్యమంలో కీలకపాత్ర పోషించిన ప్రముఖ మితవాద నాయకుల్లో గోపాలకృష్ణ గోఖలే ఒకరు. ఈయన గొప్ప సంఘసంస్కర్త కూడా. దేశ ప్రజలకు విద్యావకాశాలు కల్పించడం, పేదరికాన్ని తగ్గించడం, అసమానతలు లేని సమాజాన్ని నిర్మించడం కోసం ఈయన నిరంతరం కృషి చేశారు. అహింస, శాంతి చర్చల ద్వారానే దేశానికి స్వేచ్ఛ లభిస్తుందని ఆయన విశ్వసించారు. ఈయన మహాత్మా గాంధీకి రాజకీయ గురువు. మహమ్మద్‌ అలీ జిన్నా కూడా గోఖలే సిద్ధాంతాలను ఆదర్శంగా తీసుకున్నారు. మహారాష్ట్ర సోక్రటీస్‌గా పేరొందిన గోఖలే జయంతి నేడు (మే 9). ఈ సందర్భంగా పోటీపరీక్షల కోణంలో ఆయన జీవితంలోని ముఖ్య విషయాలు తెలుసుకుందాం..!

బాల్యం - తొలి జీవితం..

  • గోపాలకృష్ణ గోఖలే 1866, మే 9న మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా కోట్లూక్‌లో జన్మించారు. కొల్హాపూర్‌లోని రాజారామ్‌ ఉన్నత పాఠశాలలో చదువుకున్నారు.
  • ప్రముఖ తత్వవేత్త చ్రప్పన్‌ మార్గదర్శకత్వంలో 1884లో బొంబాయిలోని ఎల్ఫిన్‌స్టోన్‌ కాలేజీ నుంచి పట్టభద్రుడయ్యారు. ఇక్కడ చదివే సమయంలోనే ఆయన ఆలోచనలు పాశ్చాత్య ప్రజాస్వామ్యం, ఉదారవాద తత్వశాస్త్రం, రాజ్యాంగం వైపు మళ్లాయి.
  • తర్వాత పుణెలోని ఫెర్గూసన్‌ కళాశాలలో ప్రొఫెసర్‌గా చేరి అర్థశాస్త్రం, చరిత్ర బోధించారు. 1902లో అదే కశాశాలకు ప్రిన్సిపాల్‌ అయ్యారు. అయితే రాజకీయాలపై మరింత దృష్టి సారించే ఉద్దేశంతో ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేశారు.

రాజకీయ ప్రస్థానం

  • విద్యార్థిగా ఉన్నప్పటి నుంచే ప్రముఖ సంఘసంస్కర్త జస్టిస్‌ మహదేవ్‌ గోవింద్‌ రనడే (ఎం.జి.రనడే) ప్రభావం గోఖలేపై ఎక్కువగా ఉండేది. అందరికీ విద్య, సామాజిక అసమానతలు తొలగించడం, దేశాభివృద్ధి లాంటివి ఆయన రనడే నుంచే మార్గదర్శక సూత్రాలుగా స్వీకరించారు.
  • రనడే ప్రేరణతో గోఖలే 1889లో ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ (ఐఎన్‌సీ)లో చేరారు. మితవాద విధానానికి ప్రసిద్ధి చెందిన గోఖలే బ్రిటిష్‌ వారితో సంప్రదింపులు జరపడం ద్వారా భారతీయ హక్కులు, సంస్కరణలను సాధించవచ్చని భావించారు. ఇందుకోసం శాంతియుత పోరాటాలు చేశారు.
గోఖలే - గాంధీజీ అనుబంధం, గోఖలే చేపట్టిన కార్యక్రమాలు, పొందిన గౌరవాలు, స్థాపించిన పత్రికలు లాంటి కీలక అంశాలు, స్టాఫ్‌ సెలక్షన్, ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ తదితర పోటీ పరీక్షల్లో వీటి గురించి అడిగిన ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్‌తో పాటు జనరల్‌ నాలెడ్జ్‌కి సంబంధించి పోటీపరీక్షల్లో వచ్చే టాపిక్స్, మంత్లీ కరెంట్‌ అఫైర్స్‌ ఈబుక్స్, ప్రాక్టీస్‌ టెస్ట్స్‌ ఈనాడు ఈప్రతిభ వెబ్‌సైట్‌లో ‘జనరల్‌ నాలెడ్జ్‌ & కరెంట్‌ అఫైర్స్‌ కోర్సు’లో ఉన్నాయి. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి.https://hov.to/69b00978

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. గోపాలకృష్ణ గోఖలే కింది ఏ వార్తా పత్రికను స్థాపించారు?

(ఓఎస్‌ఎస్‌ఎస్‌సీ సీఆర్‌ఈ (ఆర్‌ఐ, ఏఆర్‌ఐ, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌) ప్రిలిమ్స్, 2025)

1) దైనిక్‌ ఆశా           2) బాంబే సమాచార్‌

3) ది హితవాద            4) సల్‌

సమాధానం: 3

2. గాంధీజీ తన రాజకీయ గురువుగా కింది ఎవరిని పేర్కొన్నారు?

(ఏపీ పోలీస్‌ కానిస్టేబుల్‌ మెయిన్స్, 2019)

1) బాలగంగాధర్‌ తిలక్‌            2) దాదాభాయ్‌ నౌరోజీ

3) ఎంజీ రనడే                4) గోపాలకృష్ణ గోఖలే

సమాధానం: 4

3. Who among the following advocated a moderate, gradual and persuasive approach to colonial rule through the Swadeshi movement?
(NTPC CBT-I 2021)
1. Bipin Chandra Pal            2. Bal Gangadhar Tilak
3. Lala Lajpat Rai                4. Gopal Krishna Gokhale
Ans: 4
4. Which Indian nationalist leader emerged as a prominent figure of the extremist phase of the freedom movement, emphasizing direct action and mass mobilisation?
(RRB NTPC (Graduate) CBT-I 2026)
1. Gopal Krishna Gokhale            2. Surendranath Banerjee
3. Bal Gangadhar Tilak            4. Dadabhai Naoroji
Ans: 3
5. Who among the following rejected the title of Knighthood and refused to accept a position in the Council of the Secretary of State for India? 
(UPSC Civil Services Examination, 2008)
1. Motilal Nehru        2. M.G. Ranade        3. G.K. Gokhale        4. B.G. Tilak
Ans: 3

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram