ముఖ్యమైన భారత జాతీయ పురస్కారాలు (పార్ట్‌ - 2)

ముఖ్యమైన భారత జాతీయ పురస్కారాలు (పార్ట్‌ - 2)

వివిధ రంగాల్లో అసాధారణ ప్రతిభ, అంకితభావం, సేవలను గుర్తించడంలో పురస్కారాలు ముఖ్య భూమిక పోషిస్తాయి. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి కళలు, విజ్ఞానశాస్త్రం, సాహిత్యం, ప్రజాసేవ, క్రీడలు మొదలైన రంగాల్లో విశేష విజయాలు సాధించిన వ్యక్తులను సత్కరించడంలో ఇవి కీలకం. భారత జాతీయ అవార్డుల్లో పౌర పురస్కారాలు, శౌర్య పురస్కారాలు, క్రీడా పురస్కారాలు, సాహిత్య పురస్కారాలు, శాస్త్రీయ పురస్కారాలు అని అయిదు ముఖ్య విభాగాలు ఉన్నాయి. పార్ట్‌ - 1లో పౌర పురస్కారాలు, శౌర్య పురస్కారాల గురించి ఉంది. ఇప్పుడు క్రీడా అవార్డుల గురించి తెలుసుకుందాం!

క్రీడా పురస్కారాలు

  • క్రీడా రంగంలో అత్యుత్తమ విజయాలు సాధించిన వారి కృషిని గౌరవించేందుకు క్రీడా పురస్కారాలు అందిస్తారు. వీటిని ప్రభుత్వం ఏటా ప్రకటిస్తుంది. వీటి ద్వారా అథ్లెట్లు, క్రీడాకారులు, కోచ్‌లకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుంది.
  • యువత క్రీడలవైపు మళ్లేలా ప్రోత్సహించడం, వారిలో స్ఫూర్తి కలిగించడం కూడా ఈ అవార్డుల ముఖ్య ఉద్దేశం.

మన దేశంలో ముఖ్యమైన జాతీయ క్రీడా పురస్కారాలు: 

1. మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న పురస్కారం

  • ఇది భారతదేశంలో క్రీడా రంగంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం.
  • గత నాలుగేళ్ల కాలంలో క్రీడా రంగంలో ఒక క్రీడాకారుడు ప్రదర్శించిన అత్యుత్తమ ప్రతిభకు గుర్తింపుగా దీన్ని అందిస్తారు.
  • విజేతలకు ప్రశంసా పత్రం, రూ.25 లక్షల నగదు బహుమతి ఇస్తారు.

2. అర్జున అవార్డు

  • మన దేశంలో క్రీడా రంగంలో ఇచ్చే రెండో అత్యున్నత పురస్కారం ఇది. భారతీయ ఇతిహాసమైన మహాభారతంలోని అర్జునుడి పేరుమీదుగా దీన్ని తీసుకొచ్చారు.
  • దీన్ని భారత ప్రభుత్వం 1961లో ఏర్పాటు చేసింది. దీన్ని ప్రతి సంవత్సరం కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ప్రదానం చేస్తుంది.
  • గత నాలుగేళ్ల కాలంలో క్రీడా రంగంలో నిలకడగా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన క్రీడాకారులకు దీన్ని అందిస్తారు.

3. ద్రోణాచార్య అవార్డు

  • క్రీడాకారులు అత్యున్నత స్థాయి ప్రదర్శన సాధించేలా విజయవంతమైన శిక్షణ ఇచ్చిన కోచ్‌లకు ఈ పురస్కారం ప్రదానం చేస్తారు.
  • 1985లో దీన్ని ఏర్పాటు చేశారు. వివిధ క్రీడల్లో కోచ్‌ల కృషి, అంకితభావాన్ని గుర్తించడం దీని ముఖ్య ఉద్దేశం.
  • మహాభారతంలోని పాండవులు, కౌరవులకు గురువైన ద్రోణాచార్యుడి పేరుమీదుగా దీనికి నామకరణం చేశారు.

రాష్ట్రీయ ఖేల్‌ ప్రోత్సాహన్‌ పురస్కార్‌ (ఆర్‌కేపీపీ), మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ ట్రోఫీతోపాటు ఆయా అవార్డుల గురించి ఎస్‌ఎస్‌సీ, యూజీసీ నెట్, యూపీఎస్సీ సివిల్స్‌ తదితర పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్‌... ఇంకా పోటీపరీక్షల్లో వచ్చే కీలక జీకే అంశాలు, మంత్లీ కరెంట్‌ అఫైర్స్‌ ఈబుక్స్, ప్రాక్టీస్‌ టెస్ట్స్‌ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్‌ నాలెడ్జ్‌ & కరెంట్‌ అఫైర్స్‌ కోర్సు’కి సబ్‌స్క్రైబ్‌ చేసుకోండి. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. అర్జున అవార్డు ఏ రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరచిన వారికి ప్రదానం చేస్తారు?

(ఎస్‌ఎస్‌సీ హయ్యర్‌ సెకండరీ లెవల్, 2025)

1) సాహిత్యం    2) విజ్ఞానశాస్త్రం   3) క్రీడలు      4) సంగీతం

సమాధానం: 3

2. భారత ప్రభుత్వం రాజీవ్‌ గాంధీ ఖేల్‌ రత్న అవార్డు పేరును ఏమని మార్చింది?

(ఎస్‌ఎస్‌సీ జీడీ కానిస్టేబుల్, 2024)

1) మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌ రత్న అవార్డు

2) ఇందిరా గాంధీ ఖేల్‌ రత్న అవార్డు

3) మేరీకోమ్‌ ఖేల్‌ రత్న అవార్డు

4) గవాస్కర్‌ ఖేల్‌ రత్న అవార్డు

సమాధానం: 1

3. Consider the following pairs with regard to sports awards:
i. Major Dhyan Chand Khel Ratna Award For the most spectacular and outstanding performance by a sportsperson over period of last four years 
ii. Arjuna Award For the lifetime achievement by a sportsperson
iii. Dronacharya Award To honour eminent coaches who have successfully trained sportspersons or teams
iv. Rashtriya Khel Protsahan Puraskar To recognize the contribution made by sportspersons even after their retirement
How many of the above pairs are correctly matched?
(UPSC Civil Services Prelims 2023)
1) Only one        2) Only two        3) Only three        4) All four
Ans: 2
4. Who was awarded the Major Dhyan Chand Khel Ratna Award in 2025 for his leadership in Indian hockey? 
(RRB NTPC (UG) CBT-I 2025)
1) Rupinder Pal Singh        2) PR Sreejesh
3) Manpreet Singh            4) Harmanpreet Singh
Ans: 4
5. Who among the following received the Major Dhyan Chand Khel Ratna Award in 2025?
(RRB Group D 2025)
1) Virat Kohli        2) Manu Bhaker        3) Saina Nehwal        4) Neeraj Chopra
Ans: 2

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram