వ్యాపారం కోసం భారతదేశంలో అడుగుపెట్టిన ఈస్టిండియా కంపెనీ తక్కువ సమయంలోనే పూర్తి దేశాన్ని తన అధీనంలోకి తెచ్చుకుంది. ఇందుకోసం గవర్నర్ జనరల్స్ - వైస్రాయ్‌లు ఎంతగానో కృషి చేశారు. బెంగాల్ గవర్నర్ జనరల్, భారతదేశ గవర్నర్ జనరల్, వైస్రాయ్ అనే మూడు పదవులతో వారు పూర్తి భారతదేశాన్ని నియంత్రించారు. పార్ట్ 1లో బెంగాల్ గవర్నర్ జనరల్స్‌పై సమాచారం ఉంది. ఇందులో భారతదేశ గవర్నర్-జనరల్స్ గురించి తెలుసుకుందాం..!
లార్డ్ విలియం బెంటింక్
1803లో మద్రాస్ గవర్నర్‌గా నియమితులయ్యారు. 1828లో బెంగాల్ గవర్నర్ జనరల్ అయ్యారు. 1833 చార్టర్ చట్టం ప్రకారం, మొదటి భారతదేశ గవర్నర్ జనరల్‌గా మారారు. 1835 వరకు ఆ పదవిలో ఉన్నారు. బెంటింక్ 1829లో ‘ది రెగ్యులేషన్ XVII ఆఫ్ 1829’ రూపొందించారు. ఇది సతీసహగమనాన్ని నిషేధించింది. దీన్ని శిక్షార్హమైన నేరంగా పరిగణించింది. 1830లో ఈ రెగ్యులేషన్‌ను మద్రాస్, బొంబాయి ప్రెసిడెన్సీలకు కూడా వర్తింపజేశారు.
సర్ ఛార్లెస్ మెట్‌కాఫ్
1801లో ఢిల్లీ రెసిడెంట్‌కు సహాయకుడిగా (Assistant to the Resident at Delhi) ఆయన భారతదేశానికి వచ్చారు. 1811-19 వరకు ఢిల్లీ రెసిడెంట్‌గా పనిచేశారు. 1827లో భారత సుప్రీం కౌన్సిల్ సభ్యుడిగా నియమితులయ్యారు. లార్డ్ విలియం బెంటింక్ తర్వాత భారతదేశ గవర్నల్ జనరల్‌గా నియమితులయ్యారు. భారతదేశంలో పత్రికలపై ఉన్న నియంత్రణలను ఎత్తివేసి, ‘పత్రికా స్వాతంత్య్ర ప్రదాత (Liberator of Indian Press)’గా పేరొందారు.
లార్డ్ అక్‌లాండ్
ఈయన 1836 నుంచి 1842 వరకు భారతదేశ గవర్నర్ జనరల్‌గా పనిచేశారు. పాఠశాలల్లో మాతృభాష బోధనను ప్రోత్సహించారు. ఈయన కాలంలోనే మొదటి ఆఫ్గన్ యుద్ధం (1838-42) జరిగింది. లార్డ్ అక్‌లాండ్ 1838లో ఆఫ్గన్ పాలకుడైన దోస్త్ మహ్మద్‌ను ఆ పదవి నుంచి తొలగించి షాషుజాను రాజుగా నియమించారు. దీంతో యుద్ధం ప్రారంభమైంది. ఈ యుద్ధం వల్ల ఆంగ్లేయులు ఆర్థికంగా, సైనికపరంగా బాగా నష్టపోయారు. ఈ కారణంగానే లార్డ్ అక్‌లాండ్ తన పదవిని కోల్పోయారు.
లార్డ్ ఎలిన్‌బరో
మొదటి ఆఫ్గన్ యుద్ధంలో లార్డ్ అక్‌లాండ్ వైఫల్యం తర్వాత 1842లో లార్డ్ ఎలిన్‌బరో (Lord Ellenborough) భారతదేశ గవర్నర్ జనరల్‌గా నియమితులయ్యారు. 1842 నుంచి 1844 వరకు ఆ పదవిలో ఉన్నారు. ఈయన 1842లో మొదటి ఆఫ్గన్ యుద్ధాన్ని ముగించి దోస్త్ మహ్మద్‌ను తిరిగి ఆఫ్గన్ పాలకుడిగా నియమించారు. చార్లెస్ నేపియర్ అనే ఆంగ్ల సైనికాధికారి ద్వారా సింధు ప్రాంతాన్ని ఆక్రమించారు.
|
లార్డ్ హార్డింజ్-1, లార్డ్ డల్హౌసీ, లార్డ్ కానింగ్‌ల పరిపాలన తీరుతెన్నులు, ప్రభావాలు తదితర ముఖ్యాంశాలతోపాటు గతంలో ఈ అంశంపై ఏపీపీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్, ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్, తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్, ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ గ్రాడ్యుయేట్ లెవల్, ఎస్‌ఎస్‌సీ, యూజీసీ నెట్ తదితర పోటీపరీక్షల్లో అడిగిన 165కి పైగా ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్.. ఇంకా పోటీపరీక్షల్లో వచ్చే కీలక జీకే అంశాలు, మంత్లీ కరెంట్ అఫైర్స్ ఈబుక్స్, ప్రాక్టీస్ టెస్ట్స్ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్ నాలెడ్జ్ & కరెంట్ అఫైర్స్ కోర్సు’కి సబ్‌స్క్రైబ్ చేసుకోండి. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978 |
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
1. భారతదేశ మొదటి గవర్నర్ జనరల్ ఎవరు?
(గుజరాత్ పోలీస్ కానిస్టేబుల్ (లోక్‌రక్షక్), 2016)
1) విలియం బెంటింక్ 2) లార్డ్ విల్లింగ్టన్
3) లార్డ్ మైఖేల్ 4) లార్డ్ హేస్టింగ్స్
సమాధానం: 1
2. థగ్గీ ఆచారాన్ని నిషేధించిన భారత గవర్నర్ జనరల్?
(బిహార్ పోలీస్ ఎస్‌ఐ, 2019)
1) లార్డ్ రిప్పన్ 2) లార్ట్ లిట్టన్
3) విలియం బెంటింక్ 4) లార్డ్ డల్హౌసీ
సమాధానం: 3
3. భారతదేశంలో కింది ఎవరి కాలంలో ఆంగ్ల విద్యను అమలు చేశారు?
(ఏడబ్ల్యూఈఎస్ పీజీటీ - చరిత్ర, 2012)
1) లార్డ్ కర్జన్ 2) లార్డ్ మెకాలే
3) లార్డ్ బెంటింక్ 4) లార్డ్ హేస్టింగ్స్
సమాధానం: 3
4. భారత పత్రికా స్వాతంత్య్ర ప్రదాత అని కింది ఎవర్ని పేర్కొంటారు?
(ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్, 2019)
1) లార్డ్ రిప్పన్ 2) లార్డ్ లిట్టన్
3) చార్లెస్ మెట్‌కాఫ్ 4) చార్లెస్ ఉడ్
సమాధానం: 3
5. Who among the following Governor Generals of India wrote about the predicament of Indian weavers, “The bones of the cotton weavers are scattered on the plains of India”?
(SSC MTS, 2024)
1) Sir John Shore 2) Lord Amherst
3) Lord William Bentinck 4) Lord Minto
Ans: 3
6. Who was the last Governor General of Bengal?
(MP Police SI, 2016)
1) Auckland 2) Hastings 3) William Bentinck 4) Cornwallis
Ans: 3
7. Who among the following was the Governor-General from 1773 to 1785?
(SSC MTS, 2023)
1) Warren Hastings 2) Lord Dalhousie
3) William Bentinck 4) Lord Mountbatten
Ans: 1
8. Which of the following Governor Generals of British India abolished the Doctrine of Lapse?
(RPF Constable, 2025)
1) Lord William Bentinck 2) Lord Canning
3) Lord Hardinge 4) Lord Ellenborough
Ans: 2
Link copied to clipboard!
పంజాబ్ నేషనల్ బ్యాంకులో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులు
నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీలో టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాలు
ఇండియన్ ఆర్మీలో 125వ కోర్సు ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్
యూనియన్ బ్యాంక్‌లో మేనేజిరియర్ ఉద్యోగాలు
ఐఐటీ దిల్లీలో సీనియర్ ప్రాజెక్ట్ సైంటిస్ట్ ఉద్యోగాలు
బ్యాంక్ ఆఫ్ బరోడాలో అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ II ఉద్యోగాలు
వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌లో స్టాట్యూటరీ సూపర్వైజరీ స్టాఫ్ పోస్టులు
ఎన్ఐసీఎల్లో అసిస్టెంట్ ఉద్యోగాలు
సీఎంఈటీ-ఎంఏఎన్ఐటీ భోపాల్‌లో ఉద్యోగాలు
ఎన్ఐడీ ఆంధ్రప్రదేశ్‌లో టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాలు
ఆంగ్రూలో బీఎస్సీ (ఆనర్స్) కమ్యూనిటీ సైన్స్ అడ్మిషన్లు 2026-27
ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం- బీఎస్సీ అగ్రికల్చర్ ప్రవేశాలు
ఏఎన్జీఆర్ఏయూలో బీటెక్ అగ్రికల్చరల్ ఫుడ్ టెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాలు
బిట్స్ పిలానీ, ఐఐఎస్ఈఆర్ తిరుపతిలో పీహెచ్డీ ప్రవేశాలు
ఆల్ ఇండియా ఆయుష్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్
జేవియర్ ఆప్టిట్యూడ్ టెస్ట్-2027
డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో బీఎడ్ ప్రవేశాలు
జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతి ప్రవేశాలు
సీఎస్ఐఆర్ - ఐహెచ్‌బీటీలో ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగాలు
ఔనియాటి యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు
ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఉద్యోగాలు
ఈఎస్ఐసీలో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
సీఎంటీఐ బెంగళూరులో ప్రాజెక్టు అసోసియేట్ ఉద్యోగాలు
ఎన్‌ఏబీఎఫ్‌ఐడీలో బిజినెస్ అనలిస్ట్ పోస్టులు
డీఆర్డీఓ ఎస్ఏజీ దిల్లీలో జేఆర్ఎఫ్ పోస్టులు
ఈఎస్ఐసీలో సీనియర్ రెసిడెంట్ పోస్టులు
డీఆర్డీఓలో రిసెర్చ్ అసోసియేట్ పోస్టులు
డీఆర్డీవో- సీఎఫ్‌ఈఈఎస్‌లో జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టులు
రూర్కెలా స్టీల్ ప్లాంట్‌లో 1,110 అప్రెంటిస్ ఉడ్యోగాలు
విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రంలో అప్రెంటిస్ పోస్టులు
ఇందిరా గాంధీ అటామిక్ రిసెర్చ్ సెంటర్లో ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగాలు
నార్త్ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వేలో యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు
హెచ్పీసీఎల్లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులు
డీఆర్డీఓ - ఏసీఈఎంలో అప్రెంటిస్ పోస్టులు
ఐవోసీఎల్ రిఫైనరీస్‌లో ట్రేడ్, టెక్నీషియన్ అప్రెంటిస్ ఉద్యోగాలు
డీఆర్డీఓ-ఏసీఈఎంలో అప్రెంటిస్ పోస్టులు
ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్‌లో అప్రెంటిస్ పోస్టులు
జాతీయ జెండా ఆమోద దినోత్సవం
అంతర్జాతీయ చెస్ దినోత్సవం
నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవం
వాణిజ్య బ్యాంకులను జాతీయీకరణ చేసిన రోజు
అంతర్జాతీయ క్రిమినల్ జస్టిస్ దినోత్సవం
ఐసీఏఆర్ వ్యవస్థాపక దినోత్సవం
వరల్డ్ యూత్ స్కిల్స్ డే
నాబార్డ్ వ్యవస్థాపక దినోత్సవం
ప్రపంచ జనాభా దినోత్సవం
ప్రపంచ గ్రామీణాభివృద్ధి దినోత్సవం