భారత పారిశ్రామిక విధానాలు - తీర్మానాలు

భారత పారిశ్రామిక విధానాలు - తీర్మానాలు

తయారీ రంగ పురోగతిని అంచనా వేసేందుకు ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలు, చర్యల సముదాయమే పారిశ్రామిక విధానాలు - తీర్మానాలు. వీటి ద్వారా ఆయా సంస్థల మధ్య పోటీతత్వాన్ని పెంపొందించి, సామర్థ్యాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది. భారతదేశంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాలు కలిసి ఉండటం వల్ల మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా పేర్కొంటారు. ఈ రెండు రంగాల పరిధిని తెలిపేందుకు ప్రభుత్వం పారిశ్రామిక విధానాలను ప్రకటిస్తుంది. వీటి అంతిమ లక్ష్యం దేశం ఆర్థికాభివృద్ధి సాధించడమే. 

పారిశ్రామిక విధానం అంటే?

  • ఆర్థిక వ్యవస్థలోని ఒక నిర్దిష్ట పరిశ్రమ లేదా రంగాన్ని ప్రోత్సహించడం, సులభతరం చేయడం లేదా పునర్‌నిర్మించడాన్ని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వ జోక్యాలు, వ్యూహాత్మక చర్యల శ్రేణిని పారిశ్రామిక విధానంగా పేర్కొంటారు. ఇది ప్రధానంగా మార్కెట్‌ వైఫల్యాలను మెరుగుపరచడం, నిర్మాణాత్మక మార్పును వేగవంతం చేయడం, పోటీతత్వాన్ని పెంచడం, ఆవిష్కరణలను ప్రోత్సహించడం, ఉపాధిని పెంచడం, ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేయడం ద్వారా పారిశ్రామిక వృద్ధిని ప్రోత్సహిస్తుంది.
  • 1944లో ప్రభుత్వం ప్రణాళికా అభివృద్ధి విభాగాన్ని ఏర్పాటు చేసింది.
  • దీనికి అనుబంధంగా 1945, ఏప్రిల్‌ 21న ఒక పారిశ్రామిక ప్రకటన చేసింది. స్వాతంత్య్రానంతరం భారత ప్రభుత్వం అమలు చేసిన పారిశ్రామిక తీర్మానాల మౌలిక స్వభావానికి 1945 ప్రకటన పునాదిగా నిలిచింది. పరిశ్రమల యాజమాన్యం, నిర్మాణం, పనితీరును ప్రభావితం చేయడానికి ప్రభుత్వం చేపట్టే చర్యలే పారిశ్రమిక విధానాలు - తీర్మానాలు. 

1948 పారిశ్రామిక విధాన తీర్మానం 

  • ఇది భారతదేశంలో తొలి పారిశ్రామిక విధాన తీర్మానం. దీన్ని 1948, ఏప్రిల్‌ 6న అప్పటి పరిశ్రమల మంత్రి శ్యామ్‌ప్రసాద్‌ ముఖర్జీ ప్రకటించారు. ఈ తీర్మానం దేశంలో మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు పునాది వేసింది. పారిశ్రామిక రంగం వేగంగా అభివృద్ధి చెందడానికి ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాలు రెండూ పరస్పర సహకారంతో పనిచేయాలని సూచించింది. పారిశ్రామికాభివృద్ధిలో చిన్నతరహా, కుటీర పరిశ్రమలకు ప్రాధాన్యం ఇచ్చింది.

1956 పారిశ్రామిక విధాన తీర్మానం 

  • తొలి పారిశ్రామిక విధానం (1948) ప్రకటించిన ఎనిమిదేళ్ల తర్వాత దేశంలో వచ్చిన రాజకీయ, ఆర్థిక పరిస్థితుల మార్పులకు అనుగుణంగా 1956, ఏప్రిల్‌ 30న భారత ప్రభుత్వం మరో పారిశ్రామిక తీర్మాన విధానాన్ని ప్రకటించింది. ‘సామ్యవాద రీతి సమాజ స్థాపనే లక్ష్యం (objective of establishing a socialistic pattern of society)’ అనే భావనతో దీన్ని ఆమోదించారు. రెండో పంచవర్ష ప్రణాళికలో ప్రధాన వ్యూహమైన భారీ, మౌలిక పరిశ్రమలను ప్రోత్సహించే విధంగా ఈ తీర్మానం రూపొందింది. 
1970 నుంచి 1991 వరకు రూపొందించిన పారిశ్రామిక విధాన తీర్మానాలు, 2011 జాతీయ ఉత్పాదక విధానం, మేక్‌ ఇన్‌ ఇండియా తదితర సమాచారంతోపాటు ఆయా పారిశ్రామిక విధానాలు, ప్రారంభమైన తేదీలు, లక్ష్యాలు, గతంలో పలు పోటీపరీక్షల్లో ఈ అంశంపై అడిగిన 100కి పైగా ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్‌.. ఇంకా పోటీపరీక్షల్లో వచ్చే కీలక జీకే అంశాలు, మంత్లీ కరెంట్‌ అఫైర్స్‌ ఈబుక్స్, ప్రాక్టీస్‌ టెస్ట్స్‌ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్‌ నాలెడ్జ్‌ & కరెంట్‌ అఫైర్స్‌ కోర్సు’కి సబ్‌స్క్రైబ్‌ చేసుకోండి. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. భారతదేశంలో మొదటి పారిశ్రామిక తీర్మాన విధానాన్ని ఎప్పుడు ప్రకటించారు?
(ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ, 2022)

1) 1952    2) 1955     3) 1948     4) 1960

సమాధానం: 3

2. 1991 పారిశ్రామిక విధానం ప్రారంభమైనప్పుడు భారతదేశ ప్రధాని ఎవరు?
(ఎస్‌ఎస్‌సీ స్టెనో, 2022)

1) రాజీవ్‌ గాంధీ    2) పి.వి.నరసింహారావు

3) చంద్రశేఖర్‌      4) వి.పి.సింగ్‌

సమాధానం: 2

3. మేక్‌ ఇన్‌ ఇండియా కార్యక్రమం ఎప్పుడు ప్రారంభమైంది?
(ఎంపీపీఎస్సీ జనరల్‌ స్టడీస్, 2019)

1) 2012, నవంబరు            2) 2014, సెప్టెంబరు

3) 2014, జనవరి             4) 2016, సెప్టెంబరు

సమాధానం: 2

4. When was the National Manufacturing Policy (NMP) released by Government of India?
(CGPSC Prelims General Studies, 2016)

1) 25 December 2012            2) 25 December 2011

3) 25 December 2013            4) 4 November 2011

5) 25 November 2011

Ans: 4

5. The Government policy Make in India' aims at:
(BPSC 64TH CCE (Preliminary) Exam, 2018)

1) removal of bureaucratic sloth

2) elimination of red-tapism

3) reduction in the cost of manufacturing

4) making the competitive product

5) None of the above/More than one of the above

Ans: 5

6. Which major policy implemented in 2011 aims to increase the growth of the industrial sector in India?
(DSSSB ASO, 2025)

1) National Agricultural Policy

2) Industrial Licensing Policy

3) Special Economic Zone Act

4) National Manufacturing Policy

Ans: 4

7. National Manufacturing Policy was introduced by the Government of India in
(Jharkhand Civil Service 2016)

1) 2010           2) 2011           3) 2012           4) 2013

Ans: 2 

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram