అసాధారణ పరిస్థితులు తలెత్తి, పాలనా యంత్రాంగంతో వాటిని పరిష్కరించలేనప్పుడు రాజ్యాంగం అత్యయిక పరిస్థితి (ఎమర్జెన్సీ) విధించే వెసులుబాటు కల్పించింది. దీన్నే జాతీయ అత్యవసర పరిస్థితి అని కూడా అంటారు. ఆ సమయంలో కొన్ని పౌర హక్కులను నిలిపేస్తారు. ప్రత్యేక చట్టాలు రూపొందిస్తారు. మన దేశంలో మొత్తం మూడుసార్లు ఎమర్జెన్సీ విధించినా 1975, జూన్ 25న ఇందిరా గాంధీ ప్రభుత్వ హయాంలో విధించిన అత్యయిక పరిస్థితి గురించే ఎక్కువగా పేర్కొంటారు. 2026 నాటికి ఆనాటి ఎమర్జెన్సీకి 51 ఏళ్లు.
జాతీయ అత్యవసర పరిస్థితి
దేశం మొత్తానికి లేదా కొంత భాగానికి ఏదైనా అసాధారణ పరిస్థితి వల్ల ముప్పు వాటిల్లినప్పుడు భారత రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితిని విధించవచ్చు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 352 ప్రకారం, దీన్ని రెండు రకాల కారణాలతో విధిస్తారు. అవి:
1. బాహ్య కారణాలు 2. ఆంతరంగిక కారణాలు. భారత ప్రభుత్వ చట్టం-1935 నుంచి స్ఫూర్తి పొందిన రాజ్యాంగ నిర్మాతలు అత్యవసర అధికారాలను రాజ్యాంగంలో చేర్చారు. వీటిని వినియోగించినప్పుడు అనుసరించాల్సిన పద్ధతులను జర్మనీ రాజ్యాంగం నుంచి గ్రహించారు.
భారత రాజ్యాంగంలోని 18వ భాగంలో ఆర్టికల్స్ 352 నుంచి 360 మధ్య మూడు రకాల అత్యవసర అధికారాలు పేర్కొన్నారు. అవి:
ఎ. జాతీయ అత్యవసర పరిస్థితి - ఆర్టికల్ 352
బి. రాజ్యాంగ అత్యవసర పరిస్థితి - ఆర్టికల్ 356
సి. ఆర్థిక అత్యవసర పరిస్థితి - ఆర్టికల్ 360
మెజారిటీ
సభలోని సభ్యులు 2/3వ వంతు ప్రత్యేక మెజార్టీతో ఆమోదిస్తే 6 నెలలు అమల్లో ఉంటుంది. పార్లమెంట్ ఆమోదంతో జాతీయ అత్యవసర పరిస్థితిని ఆర్నెలకు ఒకసారి చొప్పున పొడిగిస్తూ, ఎంతకాలమైనా కొనసాగించవచ్చు. దీనికి గరిష్ఠ కాలపరిమితి లేదు.
జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటనను ఆమోదించే విషయంలో రాజ్యసభ, లోక్‌సభల మధ్య భిన్నాభిప్రాయాలు తలెత్తితే అది రద్దవుతుంది. ఈ విషయంలో ఉభయ సభల సంయుక్త సమావేశానికి అవకాశం లేదు.
| ఎమర్జెన్సీ ఆమోద ప్రక్రియ, రద్దు, ప్రభావాలు, 44వ రాజ్యాంగ సవరణ చట్టం - 1978, భారత్‌లో జాతీయ అత్యవసర పరిస్థితి విధించిన సందర్భాలు తదితర సమాచారంతోపాటు గతంలో ఏపీపీఎస్సీ గ్రూప్ 2, ఏపీపీఎస్సీ పంచాయతీ సెక్రెటరీ, యూపీఎస్సీ ప్రిలిమ్స్, ఎస్‌ఎస్‌సీ, ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ, గ్రూప్-డి తదితర పోటీ పరీక్షల్లో అడిగిన 120కి పైగా ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్.. ఇంకా పోటీపరీక్షల్లో వచ్చే కీలక జీకే అంశాలు, మంత్లీ కరెంట్ అఫైర్స్ ఈబుక్స్, ప్రాక్టీస్ టెస్ట్స్ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్ నాలెడ్జ్ & కరెంట్ అఫైర్స్ కోర్సు’కి సబ్‌స్క్రైబ్ చేసుకోండి. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978 |
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
1. భారతదేశంలో జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించే అధికారం ఎవరికి ఉంది?
(ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్, 2019)
1) సుప్రీంకోర్టు 2) కేంద్ర మంత్రివర్గం
3) ప్రధానమంత్రి 4) రాష్ట్రపతి
సమాధానం: 4
2. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి భారత్‌లో అత్యయిక స్థితిని ఎన్నిసార్లు ప్రకటించారు?
(యూపీ పోలీస్ ఎస్‌ఐ, 2017)
1) మూడుసార్లు 2) ఒకసారి
3) రెండుసార్లు 4) నాలుగుసార్లు
సమాధానం: 1
3. భారతదేశంలో కింది ఏ సంవత్సరంలో నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించారు?
(అలహాబాద్ హైకోర్టు ఆర్‌ఓ, 2021)
1) 1972 2) 1973 3) 1974 4) 1975
సమాధానం: 4
4. జాతీయ అత్యవసర పరిస్థితి సమయంలో లోక్‌సభ పదవీకాలాన్ని ఒకేసారి ఎంతకాలం వరకు పొడిగించవచ్చు?
(ఎంపీ పోలీస్ ఏఎస్‌ఐ, సుబేదార్ స్టెనో, 2025)
1) రెండేళ్లు 2) ఆరు నెలలు 3) ఏడాది 4) మూడేళ్లు
సమాధానం: 3
3. In India, during a National Emergency, who may extend the term of Legislative Assemblies for a period not exceeding one year at a time?
(SSC GD Constable 2025)
1) Parliament 2) Prime Minister 3) Governor 4) Chief Minister
Ans: 1
4. Under whose reign was National Emergency imposed in India?
(RRC Group D, 2018)
1) I.K. Gujral 2) A.B. Vajpayee 3) P.V. Narasimha Rao 4) Indira Gandhi
Ans: 4
5. Financial emergency provisions of the Indian Constitution have been borrowed from ___________.
(SSC MTS, 2019)
1) Canadian Constitution 2) Constitution of Germany
3) Irish Constitution 4) American Constitution
Ans: 2
6. Arrange the following provisions in the order in which they appear in the Constitution of India.
I. Provision as to Financial emergency
II. Suspension of provisions of Article 19 during emergencies
III. Provision in case of failure of constitutional machinery in States
IV. Effect of Proclamation of Emergency
Choose the correct answer from the options given below:
(UGC NET Paper 2, 2025)
1) I, II, III, IV 2) I, II, IV, IV 3) IV, II, I, III 4) IV, III, II, I
Ans: 4
Link copied to clipboard!
ఎన్ఈఈపీసీఓలో ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు
ఐసీఎంఆర్ దిల్లీలో సైంటిస్ట్ పోస్టులు
ఎన్ఐఈఎల్ఐటీలో ప్రోగ్రామర్ ఉద్యోగాలు
ముంబయి పోర్ట్ అథారిటీలో ఉద్యోగాలు
బీఈఎంఎల్లో ఆపరేటర్ పోస్టులు
ఎయిమ్స్ దిల్లీలో సైంటిస్ట్ ఉద్యోగాలు
పవన్‌హాన్స్‌లో జూనియర్ ఇంజినీర్ ఉద్యోగాలు
సీఎస్ఐఆర్-సీఈఈఆర్‌ఐలో టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాలు
ఉడుపి కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో వర్క్‌మెన్ విభాగాల్లో ఉద్యోగాలు
తెలంగాణ డీఐఈటీలో లెక్చరల్ పోస్టులు
ఎస్పీఎంవీవీలో డిప్లొమా, పీజీ డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సులు
పి.వి.నరసింహారావు తెలంగాణ పశుసంవర్థక వర్సిటీలో డిప్లొమా ప్రవేశాలు
జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ వర్సిటీలో డిప్లొమా ప్రవేశాలు
శ్రీకొండా లక్ష్మణ్ వర్సిటీలో హార్టికల్చర్ డిప్లొమా
ఎన్ఐఈపీఏలో ఎంఏఏఈ ప్రోగ్రాం ప్రవేశాలు
నేషనల్ స్పోర్ట్స్ యూనివర్శిటీలో యూజీ, పీజీ ప్రవేశాలు
ఏపీలో ఐటీఐ కోర్సుల్లో అడ్మిషన్లు-2026
సీఐటీడీ, హైదరాబాద్‌లో పోస్ట్ డిప్లొమా కోర్సులు
కొచ్చిన్ షిప్‌యార్డులో గ్రాడ్యుయేట్ మెరైన్ ఇంజినీరింగ్ ప్రోగ్రామ్
ఐసీఎమ్ఆర్-ఎన్‌ఐటీవీఏఆర్ పుణెలో కన్సల్టెంట్ పోస్టులు
ఆర్ఐఈలో నాన్ టీచింగ్ ఉద్యోగాలు
ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డులో పోస్టులు
కేఆర్‌సీఎల్‌లో ఉద్యోగాలు
ఐఐఎంఆర్‌లో పోస్టులు
ఎయిమ్స్ భువనేశ్వర్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు
ఎయిమ్స్ బిలాస్‌పుర్‌లో జూనియర్ రెసిడెంట్ పోస్టులు
డీఆర్డీఓ-ఐఎన్ఎంఏఎస్లో రిసెర్చ్ ఫెలో పోస్టులు
డీఆర్డీఓ-సీఏఐఆర్ బెంగళూరులో జేఆర్ఎఫ్ పోస్టులు
యూనికార్న్‌గా స్క్వేర్ యార్డ్స్
భారత్‌కు రూ.14,250 కోట్ల రుణాలు
జీఆర్ఎస్ఈకు నవరత్న హోదా
ఆదాయపు పన్ను వసూళ్లు
ఐస్‌ఐతో ధ్రువ స్పేస్ భాగస్వామ్యం
భారత్-బ్రిటన్ వాణిజ్య ఒప్పందం
జియో ప్లాట్‌ఫామ్స్ అంతర్జాతీయ రికార్డు
ఎంఎఫ్ఐ రుణ హామీ పథకం పొడిగింపు
దేశంలో 14 మహారత్న సంస్థలు
2025-26లో జీడీపీ వృద్ధి 7.7%
అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం
ప్రపంచ వర్షారణ్య దినోత్సవం
అంతర్జాతీయ యోగా దినోత్సవం
ప్రపంచ శరణార్థుల దినోత్సవం
వరల్డ్ సికిల్ సెల్ డే
ప్రపంచ ఎడారీకరణ - కరవు కట్టడి దినోత్సవం
ప్రపంచ రక్త దాతల దినోత్సవం
అంతర్జాతీయ ఆల్బినిజం అవగాహన దినోత్సవం
ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం
వరల్డ్ అక్రిడిటేషన్ డే
వాట్సప్ సీఈఓ కునాల్ షా
బీడీఎల్ సీఎండీగా శైలేష్ వాగెర్వాల్
ఎఫ్ఏటీఎఫ్ ఉపాధ్యక్షుడిగా వివేక్ అగర్వాల్
నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ ఛైర్మన్‌గా సైబల్ ఛటోపాధ్యాయ
జీఐసీ సీఎండీగా హితేశ్ రమేశ్ చంద్ర జోషి
నూతన సైన్యాధిపతిగా ధీరజ్ సేథ్
షార్ కొత్త డైరెక్టర్‌గా ముత్తుచళియన్
ఐరాస సర్వప్రతినిధి సభాధ్యక్షులు
కెనరా బ్యాంక్ ఎండీగా బ్రజేశ్‌కుమార్ సింగ్
సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ ఛైర్‌పర్సన్‌గా జస్టిస్ బీవీ నాగరత్న