ముఖ్యమైన సుప్రీంకోర్టు తీర్పులు (పార్ట్‌ - 3)

ముఖ్యమైన సుప్రీంకోర్టు తీర్పులు (పార్ట్‌ - 3)

మన దేశంలో సుప్రీంకోర్టు సర్వోన్నత న్యాయస్థానం. దాని తీర్పే అంతిమం. కింది కోర్టులేవీ ప్రశ్నించడానికి వీల్లేదు. ఇది రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించడంలో, ప్రాథమిక హక్కులను పరిరక్షించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. దాని చరిత్రాత్మక తీర్పులు దేశం, పౌరుల మధ్య అధికారిక సమతౌల్యాన్ని తీర్చిదిద్దాయి, రాజ్యాంగపరమైన అస్పష్టతలను స్పష్టం చేశాయి, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేశాయి. పార్ట్‌ - 1, 2లలో 1950 నుంచి 1992 వరకు సుప్రీంకోర్టు వెలువరించిన ముఖ్యమైన తీర్పుల గురించి ఉంది. ఈ భాగంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం..!

ఎస్‌.ఆర్‌.బొమ్మై వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు 

ఈ కేసు సందర్భంగా సుప్రీంకోర్టు రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించడానికి అనుమతించే ఆర్టికల్‌ 356 దుర్వినియోగంపై కఠిన పరిమితులు విధించింది. ఈ తీర్పు వెలువడటానికి ముందు, ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను రాజకీయ కారణాలతో తొలగించడానికి ఈ ఆర్టికల్‌ను విరివిగా ఉపయోగించేవారు. ఇది న్యాయ సమీక్షను బలోపేతం చేసింది, మెజారిటీ కోసం అసెంబ్లీ ఫ్లోర్‌ టెస్టులను నిర్ధారించింది, కేంద్ర - రాష్ట్ర సంబంధాలను గణనీయంగా పునరుద్ధరించింది. 

విశాఖ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ రాజస్థాన్‌ కేసు 

ఈ కేసు సందర్భంగా పని ప్రదేశాల్లో ఉద్యోగినుల పట్ల అనుచిత ప్రవర్తన, లైంగిక వేధింపులను నివారించడానికి అవసరమైన మార్గదర్శక సూత్రాలను సుప్రీంకోర్టు జారీ చేసింది. లైంగిక వేధింపులనేవి రాజ్యాంగంలోని ఆర్టికల్స్‌ 14, 19, 21 కింద హామీ ఇచ్చిన సమానత్వం, గౌరవం, ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందికి వస్తాయని ఇది పేర్కొంది. పని ప్రదేశంలో మహిళల భద్రతను నిర్ధారించడానికి దేశంలో చట్టబద్ధంగా అమలు చేయగల మార్గదర్శకాల జారీకి కారణమైంది. 

సమత వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ 

ఈ తీర్పు షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లో గిరిజన భూ హక్కులను వాణిజ్య దోపిడీ నుంచి రక్షించింది. సుప్రీంకోర్టు గిరిజనేతరులకు మైనింగ్‌ లీజులను పరిమితం చేసింది. ఆదివాసీ సమాజాలను రక్షించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదని నొక్కి చెప్పింది. భారత రాజ్యాంగంలోని అయిదో షెడ్యూల్‌ నిబంధనలకు అనుగుణంగా షెడ్యూల్డ్‌ గిరిజన ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనుల ప్రయోజనాలు, వారి జీవన పరిస్థితులు, భూమి హక్కుల ప్రాధాన్యతలను సుప్రీంకోర్టు సమర్థించింది.

ఐఆర్‌ కొయెల్హో వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ తమిళనాడు, అరుణా షాన్‌బాగ్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా (2011) కేసుల నేపథ్యాలు, తుది తీర్పులతోపాటు గతంలో ఈ అంశంపై వివిధ పోటీపరీక్షల్లో అడిగిన ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్‌.. ఇంకా పోటీపరీక్షల్లో వచ్చే కీలక జీకే అంశాలు, మంత్లీ కరెంట్‌ అఫైర్స్‌ ఈబుక్స్, ప్రాక్టీస్‌ టెస్ట్స్‌ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్‌ నాలెడ్జ్‌ & కరెంట్‌ అఫైర్స్‌ కోర్సు’కి సబ్‌స్క్రైబ్‌ చేసుకోండి. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. ఎస్‌.ఆర్‌.బొమ్మై వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా తీర్పు కింది ఏ ఆర్టికల్‌కు సంబంధించింది?

(కేఎస్‌పీ పోలీస్‌ (ఆర్‌ఎస్‌ఐ), 2023)

1) ఆర్టికల్‌ 345               2) ఆర్టికల్‌ 356

3) ఆర్టికల్‌ 363               4) ఆర్టికల్‌ 364

సమాధానం: 2

2. పని ప్రదేశంలో లైంగిక వేధింపులకు సంబంధించి మార్గదర్శకాలను ఏ సుప్రీంకోర్టు కేసు నిర్దేశించింది?

(సీఎస్‌ఐఆర్‌ సీఈఆర్‌ఐ జేఎస్‌ఏ, 2022)

1) పూజా వర్సెస్‌ మధ్యప్రదేశ్‌ రాష్ట్రం

2) నాజ్‌ ఫౌండేషన్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు

3) విశాఖ వర్సెస్‌ రాజస్థాన్‌ రాష్ట్రం

4) సుబ్రమణ్య స్వామి వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా

సమాధానం: 3

3. సుప్రీంకోర్టుకు చెందిన ఐఆర్‌ కొయెల్హో వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ తమిళనాడు తీర్పు (2007) కింది దేనికి సంబంధించింది?

(హెచ్‌పీఎస్సీ హెచ్‌సీఎస్, 2022)

1) స్వయంప్రతిపత్తి సంస్థలు            2) రాజ్యాంగ మౌలిక స్వరూపం

3) షెడ్యూల్డ్‌ ప్రాంతాలు                4) ఏదీకాదు

సమాధానం: 2

4. ప్రవేశిక రాజ్యాంగంలోని ఒక భాగం అని సుప్రీంకోర్టు కింది ఏ కేసు సందర్భంగా పేర్కొంది?

(యూపీపీఎస్సీ ప్రిలిమ్స్, 2012)

1) యూనియన్‌ ఆఫ్‌ ఇండియా వర్సెస్‌ డాక్టర్‌ కోహ్లీ

2) బనార్సిదాస్‌ వర్సెస్‌ ఉత్తర్‌ ప్రదేశ్‌ రాష్ట్రం

3) ఎస్‌.ఆర్‌.బొమ్మై వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా 

4) మలక్‌సింగ్‌ వర్సెస్‌ పంజాబ్‌ రాష్ట్రం

సమాధానం: 3

5. Vishakha guideline issued by Supreme Court of India in case of Vishaka v/s Rajasthan Govt. relates to
(Rajasthan Police SI, Paper II, 2021)
1) Crime against Children
2) To check woman domestic atrocities
3) To check sexual harassment
4) Woman's forced labour
Ans: 3
6. The case of Vishakha and others Vs. State of Rajasthan and others is related to -
(RPSC RAS Prelims, 2021)
1) Transfer policy for women 
2) Maternity leaves in respect of working women 
3) Prevention of the practice of dowry prevalent in the society 
4) Prevention of sexual harassment of women at work place
Ans: 4
7. In the Supreme Court case Vishaka v/s the State of Rajasthan (1997), the critical factor used to define sexual harassment was identified as: 
(RPF Constable Official Paper 2025)
1) The perpetrator’s intention 
2) The unwelcomeness of the behavior 
3) The location (only at work or school) 
4) Whether physical injury occurred
Ans: 2 
8. In the case of _______ the Supreme Court had issued guidelines for Preventing Sexual Harassment at Workplace. 
(UP Police SI, 2021)
1) Sunil Batra v. Delhi Administration
2) Hussainara Khatoon v. State of Bihar
3) D. K. Basu v. State of West Bengal
4) Vishakha and others v. State of Rajasthan
Ans: 4

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram