పట్టణ జనాభాను కలిగి ఉన్న తొలి నాగరికతల్లో సింధు లోయ నాగరికత ఒకటి. పురావస్తు పరిశోధకుల తవ్వకాల్లో సింధు నది ఒడ్డున ఉన్న మొహెంజొదారో, దానికి ఎగువన హరప్పా బయటపడటం వల్ల ఈ రెండు పురాతన నగరాల నాగరికతను సింధు నాగరికతగా వ్యవహరించారు. ఈ రెండు నగరాల్లోనే కాకుండా సింధు నదీ లోయలోని మరికొన్ని స్థలాల్లోనూ ఇలాంటి నాగరికతే బయటపడటం వల్ల సింధునది నాగరికత అన్నారు. దీన్నే హరప్పా నాగరికతగానూ వ్యవహరిస్తున్నారు. పార్ట్ - 1లో సింధు లోయ నాగరికతకు చెందిన కొన్ని నగరాల వివరాలు ఉన్నాయి. ఈ భాగంలో మరికొన్నింటిని తెలుసుకుందాం..!
బనవాలి (Banawali)
హరియాణాలోని ఫతేహాబాద్ జిల్లాలో ఉంది. 1974లో ఆర్.ఎస్.బిష్ట్ (R.S. Bisht) ఇక్కడ తవ్వకాలు జరిపారు. ఇది కాళీబంగన్‌కు ఈశాన్యంగా సుమారు 120 కి.మీ. దూరంలో, రంగోయ్ నదీ తీరంలో ఉంది. దీన్ని సరస్వతీ నది పురాతన ప్రవాహ మార్గంగా పేర్కొంటారు. ఇక్కడి తవ్వకాల్లో ఒక దుర్గం, దిగువ పట్టణంతో కూడిన కోట లాంటి నివాస ప్రాంతం బయటపడ్డాయి. ఇక్కడి ఇళ్లను అచ్చుపోసిన, కాల్చిన ఇటుకలతో నిర్మించారు.
చన్హుదారో (Chanhudaro)
పాకిస్థాన్‌లోని సింధ్ రాష్ట్రంలో, నవాబ్‌షా జిల్లాలో, మొహెంజోదారోకు దక్షిణంగా సుమారు 130 కి.మీ. దూరంలో సింధు నది ఒడ్డున ఉంది. 1931లో ఎన్.జి.మజుందార్ ఈ ప్రదేశంలో తవ్వకాలు జరిపారు. దీన్ని ప్రాచీన భారతదేశ లాంకషైర్ (Lancashire)గా పిలుస్తారు. ఇక్కడి ప్రాంతంలో గ్రిడ్ వ్యవస్థ, అధునాతన మురుగునీటి పారుదల వ్యవస్థ, పటిష్ఠంగా నిర్మించిన మట్టి ఇటుకల ఇళ్లు గుర్తించారు. ఇవి ఆధునిక పట్టణ ప్రణాళికకు నిదర్శనం.
సుత్కాజెండర్ (Sutkagendor)
ఇది పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌లో గ్వాదర్ సమీపాన మక్రాన్ తీరంలో ఉంది. 1875లో మేజర్ ఎడ్వర్డ్ మోక్లర్ దీన్ని కనుక్కున్నారు. ఇక్కడ స్థిరమైన నివాస ప్రాంతం ఉండేదని సూచించే అనేక రాతి గోడలు, ద్వారాలు ఉన్నాయి. ఈ ప్రదేశం లోథాల్, మెసొపొటేమియా మధ్య ఉన్న పురాతన వాణిజ్య మార్గంలో ఒక భాగంగా ఉండేదని చరిత్రకారుల అభిప్రాయం. ఇది సముద్ర తీరం వెంట ఉండటంతో సముద్ర వాణిజ్యాన్ని సులభతరం చేసిందని వారు పేర్కొన్నారు.
రూపర్ (Rupar)/ రోపార్ (Ropar)
మన దేశంలో పంజాబ్‌లోని రూప్‌నగర్ జిల్లాలో ఉంది. ఇది సట్లెజ్ నది ఎడమ ఒడ్డున, శివాలిక్ పర్వత పాదాల సమీపంలో విలసిల్లింది. 1952-53 యాగ్యాదత్ శర్మ ఇక్కడ తవ్వకాలు జరిపారు. దేశ విభజన తర్వాత భారత్‌లో హరప్పా నాగరికతకు సంబంధించిన ఆనవాళ్లు మొదట వెలికితీసిన ప్రదేశంగా రూపర్ గుర్తింపు పొందింది. ఇక్కడ మట్టి పాత్రలు, స్టియటైట్ ముద్రికలు, ఇటుకలు, దీర్ఘచతురస్రాకారంలోని సమాధులు మొదలైనవి లభించాయి.
రంగపూర్ (Rangpur)
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఉంది. 1953లో ఎం.ఎస్.వాట్స్ ఈ ప్రాంతంలో తవ్వకాలు జరిపారు. హరప్పా తర్వాతి కాలానికి చెందిన ఆవాసాలు కూడా వెలుగు చూశాయి. ఇక్కడి నిర్మాణ కార్యకలాపాల్లో తుమ్మ చెక్క వాడిన ఆనవాళ్లు ఉన్నాయి. వ్యవసాయం వీరి జీవనాధారం. నలుపు, ఎరుపు రంగు కుండలు; ఎత్తు మెడ కలిగిన జాడీలు; మట్టి పాత్రలు; సజ్జ, వరి, జొన్న మొక్కల అవశేషాలు లభ్యమయ్యాయి.
|
సింధు లోయ నాగరికత లక్షణాలు, తమిళనాడులో లభించిన ఆధారాలు, సింధులోయ నాగరికత పతనం తదితర సమాచారంతోపాటు గతంలో తెలంగాణ పోలీస్ ఎస్‌ఐ మెయిన్స్, ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్, ఏపీ పోలీస్ ఎస్‌ఐ, ఎస్‌ఎస్‌సీ, ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ, యూపీఎస్సీ సివిల్స్, యూజీసీ నెట్ తదితర పోటీపరీక్షల్లో ఈ టాపిక్ నుంచి అడిగిన 100కి పైగా ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్.. ఇంకా పోటీపరీక్షల్లో వచ్చే కీలక జీకే అంశాలు, మంత్లీ కరెంట్ అఫైర్స్ ఈబుక్స్, ప్రాక్టీస్ టెస్ట్స్ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్ నాలెడ్జ్ & కరెంట్ అఫైర్స్ కోర్సు’కి సబ్‌స్క్రైబ్ చేసుకోండి. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978 |
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
1. చన్హుదారో కింది దేనికి ప్రసిద్ధి?
(ఏడబ్ల్యూఈఎస్ పీజీటీ, 2012)
1) ఓడల నిర్మాణం 2) వస్త్ర పరిశ్రమ
3) హస్తకళలు 4) ఇనుప ఖనిజం
సమాధానం: 3
2. హరప్పా నగరమైన రంగపూర్ ప్రస్తుతం భారత్‌లోని ఏ రాష్ట్రంలో ఉంది?
(దిల్లీ పోలీస్ కానిస్టేబుల్, 2020)
1) హిమాచల్ ప్రదేశ్ 2) పంజాబ్
3) గుజరాత్ 4) హరియాణా
సమాధానం: 3
3. హరప్పా ప్రాంతమైన బనవాలి ఏ నది తీరాన ఉంది?
(యూపీఎస్సీ జీఐసీ లెక్చరర్ ఎకనామిక్స్, 2021)
1) చౌటంగ్ 2) ఘగ్గర్ 3) సట్లెజ్ 4) రంగోయ్
సమాధానం: 4
4. సింధు లోయ నాగరికత కేంద్రమైన బనవాలిని ఎవరు కనుక్కున్నారు?
(హెచ్‌ఎస్‌ఎస్‌సీ జేఈ సివిల్, 2018)
1) జగపతి జోషి 2) రంగనాథ్ రావు
3) ఆర్.ఎస్.బిష్ట్ 4) ఎవరూ కాదు
సమాధానం: 3
5. Which one of the following Harappan sites has yielded evidence of a wash basin in the toilet of a house?
(UPSC CAPF AC, 2025)
1) Banawali 2) Rakhigarhi 3) Dholavira 4) Lothal
Ans: 1
6. Which of the following sites would be suitable for observing the architecture of the Harappan civilisation?
(SSC Stenographer, 2024)
1) Banawali 2) Sanchi 3) Sunabeda 4) Valparai
Ans: 1
7. Terracotta models of the plough have been found at sites in which of the following locations?
(Delhi Police Constable (Executive), 2025)
1) Lothal and Dholavira 2) Mohenjo-Daro and Harappa
3) Cholistan and Banawali 4) Kalibangan and Rakhigarhi
Ans: 3
8. In ancient India, Chanhudaro was primarily a centre for:
(SSC CGL 2025)
1) Agriculture 2) Metalworking 3) Bead-making 4) Textile weaving
Ans: 3
Link copied to clipboard!
ఇస్రో- ఎస్‌ఏసీలో రిసెర్చ్ ఫెలో/అసోసియేట్ పోస్టులు
హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్‌లో జనరల్ మేనేజర్ ఉద్యోగాలు
సీఐపీఈటీలో ఉద్యోగాలు
ఎన్జీఆర్ఐ, హైదరాబాద్‌లో టెక్నీషియన్ పోస్టులు
సీడ్యాక్‌లో ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో సీనియర్ ఇంజినీర్ పోస్టులు
బీఈసీఐఎల్‌లో కాంట్రాక్ట్ ఉద్యోగాలు
నంద్యాల జిల్లా అంగన్వాడీల్లో ఉద్యోగాలు
ఎయిమ్స్ దిల్లీలో ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ పోస్టులు
కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ ఎగ్జామినేషన్ 2026
నాలుగేళ్ల బీఎస్సీ నర్సింగ్ ప్రవేశాలు
ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీలో యూజీ ఆయూష్ 2026 అడ్మిషన్లు
డా. ఎన్.టి.ఆర్. ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయంలో పోస్ట్ బేసిక్ బి.ఎస్.సి.నర్సింగ్ ప్రవేశాలు
రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ (ఆర్ఐఎంసీ)లో 8వ తరగతి ప్రవేశాలు
జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్ (జామ్-2027)
ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (ఏపీ టెట్-ఇన్-సర్వీస్ టీచర్స్-2026)
ఐపీఈ, హైదరాబాద్‌లో స్పాట్ అడ్మిషన్లు
ఏపీ డా.బి.ఆర్.అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో యూజీ ప్రవేశాలు
గేట్ 2027 నోటిఫికేషన్
కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్)-2027
ఈఎస్ఐసీ ఇందౌర్‌లో ఫ్యాకల్టీ పోస్టులు
ఈఎస్ఐసీలో టీచింగ్ ఉద్యోగాలు
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు
డీఆర్డీఓ - ఎన్‌పీఓఎల్ కొచ్చిలో జేఆర్ఎఫ్ పోస్టులు
ఈఎస్ఐసీ హైదరాబాద్‌లో ఫ్యాకల్టీ/ సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, మహబూబ్‌నగర్‌లో పోస్టులు
కుమరం భీమ్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసిఫాబాద్‌లో టీచింగ్ ఉద్యోగాలు
ఈఎస్ఐసీలో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
ఎన్బీఆర్ఐలో ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగాలు
ఐసీఏఆర్ - ఎన్ఆర్సీబీలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులు
ఆర్ఆర్సీ- సదరన్ రైల్వేలో అప్రెంటిస్ పోస్టులు
ఎంటీపీఎఫ్, అంబర్‌నాథ్‌లో ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు
హైదరాబాద్ ఎన్ఎఫ్సీలో అప్రెంటిస్ ఉద్యోగాలు
ఈస్ట్ కోస్ట్ రైల్వేలో అప్రెంటిస్ పోస్టులు
ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఉద్యోగాలు
4 ఆధ్యాత్మిక సంస్థలతో కేంద్రం ఒప్పందం
స్వచ్ఛ వాయు సర్వేక్షణ్-2026
8 హైకోర్టులకు సీజేల నియామకం
77% పాఠశాలల్లో బాలికలకు విడిగా శౌచాలయాలు
ఖరీఫ్‌లో 19% తగ్గిన సాగు విస్తీర్ణం
మోదీ విదేశీ పర్యటన
భారతీయ ప్రామాణిక సమయం నోటిఫై
మధ్యవర్తిత్వ మండలి ఏర్పాటు
లద్దాఖ్‌లో జమ్మూకశ్మీర్ హైకోర్టు ధర్మాసనం
యుద్ధ ట్యాంకుల పునరుద్ధరణ కేంద్రం
ఆగస్టు అత్యధిక ఉష్ణోగ్రత నెల
ఏఎస్కే ప్రైవేట్ వెల్త్ హురున్ ఇండియా జాబితా
అంటార్కిటికాలో పెరిగిన మంచు
ఫైనాన్షియల్ టైమ్స్ ర్యాంకులు
అల్ట్రాటా నివేదిక
‘ఏటీఆర్’ అధ్యయనం
మైక్రోసాఫ్ట్ వర్క్ ట్రెండ్ ఇండెక్స్ 2026
బట్ట మేక పక్షులను రక్షించుకోవాలి
ఐసీఐఎంఓడీ పరిశోధన నివేదిక
మిషిగన్ విశ్వవిద్యాలయ అధ్యయనం
‘అన్ ఇన్కార్పొరేటెడ్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్’
పురావస్తు రక్షిత స్థలాలుగా కొండారెడ్డి బురుజు, లింగాలకొండ
కొత్త జిల్లా పరిషత్తులు
ఆర్టీసీ ఎండీగా కోన శశిధర్
తెలుగు భాషా పురస్కారాలు
‘సంజీవని’ ప్రాజెక్టు
లోకాయుక్తగా జస్టిస్ మల్లికార్జునరావు ప్రమాణం
పెరిగిన ఎస్సీ, ఎస్టీల జనాభా
పంచాయతీరాజ్ సంస్థల్లోనూ 34% రిజర్వేషన్
పురపాలక శాసనాల నాలుగో సవరణ బిల్లు