అత్యున్నత న్యాయస్థానం హోదాలో సుప్రీంకోర్టు వివిధ వివాదాల పరిష్కారంలో భాగంగా వెలువరించిన అభిప్రాయాలు, వ్యాఖ్యానాలు, తీర్పులు, ఇతర న్యాయ సమాచార అంశాలన్నింటినీ రికార్డు రూపంలో భద్రపరుస్తారు. దీన్ని కోర్ట్ ఆఫ్ రికార్డ్‌గా పరిగణిస్తారు. ఇది దేశంలో అన్ని న్యాయస్థానాలకు దిక్సూచిగా, మార్గదర్శకంగా, నమూనాగా ఉంటుంది. భారత రాజ్యాంగంపై స్పష్టమైన అవగాహన పొందడంలో సుప్రీంకోర్టు తీర్పులు ఎంతో ఉపయోగపడతాయి. గత మూడు భాగాల్లో 1950 నుంచి 2011 వరకు సుప్రీంకోర్టు వెలువరించిన ముఖ్యమైన తీర్పుల గురించి ఉంది. పార్ట్-4లో మరికొన్ని తెలుసుకుందాం..!
లిల్లీ థామస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా
ఈ కేసు పార్లమెంట్ లేదా శాసనసభ్యుల అనర్హతకు సంబంధించింది. శిక్ష పడిన చట్టసభ సభ్యుడు పదవిలో కొనసాగవచ్చా? అనే విషయాన్ని ఇది నేరుగా ప్రస్తావించింది. ఎన్నికల సంస్కరణల నేపథ్యంలో చాలా ముఖ్యమైన కేసుగా గుర్తింపు పొందింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రజాస్వామ్య జవాబుదారీతనాన్ని బలోపేతం చేసింది. ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని నిబంధనలకు స్పష్టత ఇచ్చింది.
నల్సా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా
సుప్రీంకోర్టు ఈ కేసులో ఇచ్చిన తీర్పు దేశంలో ట్రాన్స్‌జెండర్ల రాజ్యాంగ హక్కులను ప్రస్తావించింది. కోర్టు వారిని థర్డ్ జెండర్‌గా గుర్తించి, సమగ్ర రక్షణలు కల్పించింది. వారి సమానత్వం, గౌరవం, స్వీయ గుర్తింపు హక్కులను ధ్రువీకరించింది. బయోలాజికల్ సెక్స్ ఆధారంగా లింగ గుర్తింపును తిరస్కరించిన న్యాయస్థానం మానసిక లింగం ఆధారంగా గుర్తింపునకు ప్రాధాన్యం ఇచ్చింది.
కె.ఎస్.పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా
ఈ కేసు సందర్భంగా సుప్రీంకోర్టు గోప్యతా హక్కును (right to privacy) ప్రాథమిక హక్కుగా ప్రకటించింది. ఇది గోప్యతను వ్యక్తిగత స్వేచ్ఛ, గౌరవం, స్వయంప్రతిపత్తితో ముడిపెట్టింది. ఆర్టికల్స్ 14, 19, 21 ప్రకారం గోప్యత అనేది జీవితం, వ్యక్తిగత స్వేచ్ఛలో అంతర్భాగమని కోర్టు ఏకగ్రీవంగా తీర్పు ఇచ్చింది. అలాగే ఆధార్ రాజ్యాంగబద్ధమని స్పష్టం చేసింది.
షయారా బానో వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా
దీన్నే ‘ట్రిపుల్ తలాక్ కేసు’ అంటారు. ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ప్రకటించింది. దేశంలోని మహిళల హక్కులు, మత స్వేచ్ఛపై చర్చల్లో ఒక మలుపుగా నిలిచింది. ఇది ముస్లిం వర్గంలో తక్షణ విడాకులకు అవకాశం ఇచ్చే ట్రిపుల్ తలాక్‌ను నిషేధించే శాసన సంస్కరణకు పునాది వేసింది. కోర్టు తీర్పును అమలు చేయడానికి ప్రభుత్వం ‘తలాక్ చట్టం (ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ చట్టం) 2019’ని రూపొందించింది.
జోసఫ్ షైనీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా
ఇది వివాహబంధంలోని లింగ సమానత్వంపై గణనీయమైన ప్రభావాన్ని చూపింది. ఈ కేసు వ్యభిచారం, వ్యక్తిగత హక్కులపై చట్టపరమైన దృక్పథాల గురించి ఆలోచించేలా చేసింది. ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ)లోని సెక్షన్ 497 రాజ్యాంగ విరుద్ధమని కోర్టు పేర్కొనేలా చేసింది. ఇది స్త్రీ, పురుషులను సమానంగా చూడటంలో విఫలమైందని, భర్తకు భార్య వ్యక్తిగత ఆస్తి కాదని వెల్లడించింది.
| ఆయా కేసుల పూర్తి వివరాలు, సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులతోపాటు ఏపీ హైకోర్ట్ స్టెనోగ్రాఫర్/ జూ.అసిస్టెంట్/ టైపిస్ట్/ ఫీల్డ్ అసిస్టెంట్, టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్, టీఎస్‌పీఎస్సీ ఏఈఈ మెకానికల్, ఐబీపీఎస్ క్లర్క్ మెయిన్స్, ఆర్‌ఆర్‌బీ గ్రూప్-డి, యూజీసీ నెట్ తదితర పోటీపరీక్షల్లో ఈ టాపిక్‌పై అడిగిన 60కి పైగా ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్.. ఇంకా పోటీపరీక్షల్లో వచ్చే కీలక జీకే అంశాలు, మంత్లీ కరెంట్ అఫైర్స్ ఈబుక్స్, ప్రాక్టీస్ టెస్ట్స్ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్ నాలెడ్జ్ & కరెంట్ అఫైర్స్ కోర్సు’కి సబ్‌స్క్రైబ్ చేసుకోండి. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978 |
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
1. కింది ఏ సంవత్సరంలో సుప్రీంకోర్టు ట్రాన్స్‌జెండర్ వ్యక్తులను ‘థర్డ్‌జెండర్’గా ప్రకటించింది?
(యూపీ పోలీస్ ఎస్‌ఐ, 2021)
1) 2006 2) 2008 3) 2010 4) 2014
సమాధానం: 4
2. ట్రిపుల్ తలాక్ అనేది కింది దేనికి సంబంధించింది?
(ఆర్‌ఆర్‌బీ గ్రూప్ డి, 2018)
1) విడాకులు 2) విద్య
3) వివాహం 4) వరకట్నం
సమాధానం: 1
3. జస్టిస్ కె.ఎస్. పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు దేనికి సంబంధించింది?
(యూపీ పోలీస్ ఎస్‌ఐ, 2021)
1) నిరుపేదల జీవనోపాధి హక్కు 2) ఓటు హక్కు
3) ఫుట్‌పాత్ నివాసితుల ఆశ్రయ హక్కు 4) వ్యక్తుల గోప్యతా హక్కు
సమాధానం: 4
4. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ చట్టం ముందు సమానత్వం, చట్టాల సమాన రక్షణకు హామీ ఇస్తుంది?
(ఎస్‌ఎస్‌సీ హయ్యర్ సెకండరీ లెవల్, 2025)
1) ఆర్టికల్ 14 2) ఆర్టికల్ 19
3) ఆర్టికల్ 21 4) ఆర్టికల్ 32
సమాధానం: 1
5. In India, _______ is/are governed by the provisions of Section 29A of the Representation of the People Act, 1951.
(RRB Group D 2022)
1) withdrawal of candidature
2) appointment of dates for nominations, etc.
3) general duties of chief electoral officers
4) registration of political parties
Ans: 4
6. Under Section 8(1) of Religious Institutions (Prevention Of Misuse) Act, 1988, what is the period of disqualification for appointment in any religious institution if convicted?
(UP Police Assistant Operator, 2024)
1) Five years 2) Two years 3) Six years 4) Ten years
Ans: 3
7. The Constitutional Amendment Bill introduced in August 2025 prevents individuals in jail from holding which of the following positions?
(RRB Group D, 2025)
1) Directors of private corporations
2) Constitutional roles like Prime Minister and Chief Ministers
3) Heads of universities and colleges
4) Senior bank executive roles
Ans: 2
Link copied to clipboard!
ఇస్రో- ఎస్‌ఏసీలో రిసెర్చ్ ఫెలో/అసోసియేట్ పోస్టులు
హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్‌లో జనరల్ మేనేజర్ ఉద్యోగాలు
సీఐపీఈటీలో ఉద్యోగాలు
ఎన్జీఆర్ఐ, హైదరాబాద్‌లో టెక్నీషియన్ పోస్టులు
సీడ్యాక్‌లో ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో సీనియర్ ఇంజినీర్ పోస్టులు
బీఈసీఐఎల్‌లో కాంట్రాక్ట్ ఉద్యోగాలు
నంద్యాల జిల్లా అంగన్వాడీల్లో ఉద్యోగాలు
ఎయిమ్స్ దిల్లీలో ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ పోస్టులు
కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ ఎగ్జామినేషన్ 2026
నాలుగేళ్ల బీఎస్సీ నర్సింగ్ ప్రవేశాలు
ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీలో యూజీ ఆయూష్ 2026 అడ్మిషన్లు
డా. ఎన్.టి.ఆర్. ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయంలో పోస్ట్ బేసిక్ బి.ఎస్.సి.నర్సింగ్ ప్రవేశాలు
రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ (ఆర్ఐఎంసీ)లో 8వ తరగతి ప్రవేశాలు
జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్ (జామ్-2027)
ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (ఏపీ టెట్-ఇన్-సర్వీస్ టీచర్స్-2026)
ఐపీఈ, హైదరాబాద్‌లో స్పాట్ అడ్మిషన్లు
ఏపీ డా.బి.ఆర్.అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో యూజీ ప్రవేశాలు
గేట్ 2027 నోటిఫికేషన్
కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్)-2027
ఈఎస్ఐసీ ఇందౌర్‌లో ఫ్యాకల్టీ పోస్టులు
ఈఎస్ఐసీలో టీచింగ్ ఉద్యోగాలు
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు
డీఆర్డీఓ - ఎన్‌పీఓఎల్ కొచ్చిలో జేఆర్ఎఫ్ పోస్టులు
ఈఎస్ఐసీ హైదరాబాద్‌లో ఫ్యాకల్టీ/ సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, మహబూబ్‌నగర్‌లో పోస్టులు
కుమరం భీమ్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసిఫాబాద్‌లో టీచింగ్ ఉద్యోగాలు
ఈఎస్ఐసీలో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
ఎన్బీఆర్ఐలో ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగాలు
ఐసీఏఆర్ - ఎన్ఆర్సీబీలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులు
ఆర్ఆర్సీ- సదరన్ రైల్వేలో అప్రెంటిస్ పోస్టులు
ఎంటీపీఎఫ్, అంబర్‌నాథ్‌లో ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు
హైదరాబాద్ ఎన్ఎఫ్సీలో అప్రెంటిస్ ఉద్యోగాలు
ఈస్ట్ కోస్ట్ రైల్వేలో అప్రెంటిస్ పోస్టులు
ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఉద్యోగాలు
4 ఆధ్యాత్మిక సంస్థలతో కేంద్రం ఒప్పందం
స్వచ్ఛ వాయు సర్వేక్షణ్-2026
8 హైకోర్టులకు సీజేల నియామకం
77% పాఠశాలల్లో బాలికలకు విడిగా శౌచాలయాలు
ఖరీఫ్‌లో 19% తగ్గిన సాగు విస్తీర్ణం
మోదీ విదేశీ పర్యటన
భారతీయ ప్రామాణిక సమయం నోటిఫై
మధ్యవర్తిత్వ మండలి ఏర్పాటు
లద్దాఖ్‌లో జమ్మూకశ్మీర్ హైకోర్టు ధర్మాసనం
యుద్ధ ట్యాంకుల పునరుద్ధరణ కేంద్రం
ఆగస్టు అత్యధిక ఉష్ణోగ్రత నెల
ఏఎస్కే ప్రైవేట్ వెల్త్ హురున్ ఇండియా జాబితా
అంటార్కిటికాలో పెరిగిన మంచు
ఫైనాన్షియల్ టైమ్స్ ర్యాంకులు
అల్ట్రాటా నివేదిక
‘ఏటీఆర్’ అధ్యయనం
మైక్రోసాఫ్ట్ వర్క్ ట్రెండ్ ఇండెక్స్ 2026
బట్ట మేక పక్షులను రక్షించుకోవాలి
ఐసీఐఎంఓడీ పరిశోధన నివేదిక
మిషిగన్ విశ్వవిద్యాలయ అధ్యయనం
‘అన్ ఇన్కార్పొరేటెడ్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్’
పురావస్తు రక్షిత స్థలాలుగా కొండారెడ్డి బురుజు, లింగాలకొండ
కొత్త జిల్లా పరిషత్తులు
ఆర్టీసీ ఎండీగా కోన శశిధర్
తెలుగు భాషా పురస్కారాలు
‘సంజీవని’ ప్రాజెక్టు
లోకాయుక్తగా జస్టిస్ మల్లికార్జునరావు ప్రమాణం
పెరిగిన ఎస్సీ, ఎస్టీల జనాభా
పంచాయతీరాజ్ సంస్థల్లోనూ 34% రిజర్వేషన్
పురపాలక శాసనాల నాలుగో సవరణ బిల్లు