భారతీయ గిరిజన తెగలు తమ ప్రత్యేక సాంస్కృతిక, సామాజిక లక్షణాలకు ప్రసిద్ధి చెందాయి. ప్రతి సమూహంలో తరతరాలుగా అనుసరిస్తున్న సొంత ఆచారాలు, సంప్రదాయాలు, నమ్మకాలు, పద్ధతులు ఉంటాయి. గిరిజనులకు ఏకైక, కచ్చితమైన వర్గీకరణ వ్యవస్థ అంటూ ఏమీ ఉండదు. వీరంతా ఉమ్మడి ఆచారాలు, భాష, జీవనోపాధిని పంచుకుంటారు. సాధారణంగా వీరు భౌగోళికంగా ఏకాంతంగా ఉండే ప్రాంతాల్లో నివసిస్తారు. పార్ట్ - 1లో గిరిజనులు అంటే ఎవరు?, రాజ్యాంగంలో పేర్కొన్న విషయాలు, దేశంలో వారి జనాభాతోపాటు ప్రధాన గిరిజన తెగల గురించి ఉంది. ఇప్పుడు ఇతర గిరిజన సమూహాల గురించి తెలుసుకుందాం..!
బైగా
బైగా తెగ ప్రస్తుతం పర్టిక్యులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ (పీవీటీజీ)గా గుర్తించిన 75 సమూహాల్లో ఒకటిగా ఉంది. వీరు భారతదేశంలో ఆవాస హక్కులు పొందిన మొదటి సమాజంగా గుర్తింపు పొందారు. వీరు ఎక్కువగా ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్నారు. వీరు ప్రధానంగా మాట్లాడే భాష బైగాని. పచ్చబొట్టు వేయించుకోవడం వీరి సంస్కృతిలో భాగం.
కోక్నా
ఈ సమూహం గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, దాద్రా నగర్ హవేలీలో ఎక్కువగా కనిపిస్తుంది. కోక్నా ప్రజలు మాస్క్‌ల తయారీ, వెదురు - చెక్క కళాకృతులు, ఇత్తడి - రాగి నమూనాల రూపకల్పనకు ప్రసిద్ధి. వీరు సాధారణ చెక్క పాత్రలపై అందమైన కళాకృతులు రూపొందిస్తారు. ఈ తెగ ఏటా మార్చి, ఏప్రిల్ నెలల్లో బోహడా (Bohada) పండుగను జరుపుకుంటారు.
మడియా
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఈ తెగ ఎక్కువగా కనిపిస్తారు. అలాగే ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశాలోనూ వీరు నివసిస్తున్నారు. వీరిలో బడా మడియా (దట్టమైన అడవులు, కొండల్లో నివసిస్తారు), చోటా మడియా (మైదాన ప్రాంతాల్లో ఉంటారు) అని రెండు ప్రధాన సమూహాలు ఉన్నాయి. వీరు గోండి భాషా కుటుంబానికి చెందిన మాడియా భాష మాట్లాడతారు.
కట్కారీ
ఈ తెగ ప్రజలు ఎక్కువగా మహారాష్ట్రలోని పుణె, రాయ్‌గఢ్, థేనే జిల్లాల్లో నివసిస్తారు. గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాల్లోనూ వీరిని చూడొచ్చు. వీరు ముఖ్యంగా అడవుల్లో నివసిస్తారు. ఖైర్ (అకేసియా కేటెచు) చెట్టు కాండం నుంచి కేటెచు (కథ) అని పిలిచే చిక్కటి రసాన్ని సేకరిస్తారు. అందుకే వీరిని కథోరీలు అని కూడా పిలుస్తారు. ఈ రసాన్ని పాన్ మసాలా, ఆయుర్వేద మందులు, సహజ రంగుల అద్దకంలో విస్తృతంగా ఉపయోగిస్తారు.
పహారీ కోర్వా
వీరు ప్రధానంగా ఛత్తీస్‌గఢ్‌లోని జస్‌పూర్, సర్గుజా, రాయ్‌గఢ్ జిల్లాలో ఉన్నారు. వీరు కోలారియన్ తెగకు చెందిన ఒక శాఖ. ముండారీ భాష మాట్లాడతారు. దట్టమైన అటవీప్రాంతంలో నివసించే వీరు పూర్వీకుల నుంచి వారసత్వంగా పొందిన జ్ఞానంతో అటవీ ఉత్పత్తులను ఉపయోగించి అనారోగ్యాలకు చికిత్స చేసుకుంటారు. వీరి గిరిజన పాటల్లో ధాంక్, డఫ్లీ, మందార్, మృంగం, నగారా, డ్రమ్, టింకీ లాంటి వాయిద్యాలు వినియోగిస్తారు.
|
ఇంకా వార్లీ, కోలి ధోర్, బిర్హోర్, కోర్కు, అభుజ్ మారియా, బైసన్ హార్న్ మరియా, కమర్ తెగల విశేషాలు, గతంలో యూపీఎస్సీ సివిల్స్, ఏపీ హైకోర్ట్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2, ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ గ్రాడ్యుయేట్ లెవల్, యూజీసీ నెట్, ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్, ఎస్‌ఎస్‌సీ తదితర పోటీపరీక్షల్లో అడిగిన 90కి పైగా ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్.. ఇంకా పోటీపరీక్షల్లో వచ్చే కీలక జీకే అంశాలు, మంత్లీ కరెంట్ అఫైర్స్ ఈబుక్స్, ప్రాక్టీస్ టెస్ట్స్ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్ నాలెడ్జ్ & కరెంట్ అఫైర్స్ కోర్సు’కి సబ్‌స్క్రైబ్ చేసుకోండి. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978 |
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
1. బిర్హోర్ తెగవారు అడవుల అంచున ఏమని పిలిచే చిన్న నివాసాల్లో నివసిస్తారు?
(ఎన్‌వీఎస్ ఎంటీఎస్, 2022)
1) వాడి 2) ఖుంట్ 3) ఠాకర్‌వాడి 4) తండా
సమాధానం: 4
2. బైగా తెగకు చెందిన బైగా జానపద సంగీతం కింది ఏ రాష్ట్రానికి చెందింది?
(ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్ టైర్ 1, 2024)
1) ఉత్తరాఖండ్ 2) మధ్యప్రదేశ్
3) అస్సాం 4) బిహార్
సమాధానం: 2
3. కిందివాటిలో ఏది బైగా తెగ ఉప-తెగ కాదు?
(ఎంపీపీఎస్సీ ఏఈ మెకానికల్, 2022)
1) బిజ్‌వార్ 2) నరోటియా
3) బడోయా 4) కత్‌మైనా
సమాధానం: 4
4. నృత్యం, నాటక కలయికతో కూడిన ప్రసిద్ధ బోహడా పండుగను ఏ తెగవారు జరుపుకుంటారు?
(ఎన్‌వీఎస్ జూనియర్ సెక్రటేరియట్, 2022)
1) భిల్ 2) ముండా 3) బైగా 4) కోక్నా
సమాధానం: 4
5. The peasant struggle of the Warli tribe in the year 1945 occurred in which of the following states of India?
(RRB NTPC Graduate Level CBT-I, 2025)
1) Gujarat 2) Mizoram 3) Maharashtra 4) Kerala
Ans: 3
6. The Katkari Tribes, sometimes seen in the news, is largely found in which of the following states?
(SSC JE (Mechanical Engineering), 2025)
1) Maharashtra 2) Telangana 3) Karnataka 4) Tamil Nadu
Ans: 1
7. Who among the following personalities has been conferred with the Padma Shri in 2022 for his contribution to Baiga dance and Music?
(SSC CHSL, 2022)
1) Girdhari Ram 2) Savaji Bhai Dholakia
3) Arjun Singh Dhurve 4) Chandra Prakash
Ans: 3
8. Barash is similar to the hindu festival Diwali, which is celebrated by which of following tribes?
(SSC GD Constable, 2024)
1) Varli and Kokna 2) Santhal 3) Munda 4) Gond and Bhil
Ans: 1
Link copied to clipboard!
ఐఓసీఎల్‌లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు
ఏపీసీఆర్డీఏలో డిప్యూటీ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులు
ఎన్పీసీసీలో ఉద్యోగాలు
చెన్నై పెట్రోలియం కార్పొరేషన్లో ఇంజినీరింగ్ అసిస్టెంట్ పోస్టులు
నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీలో ఫ్యాకల్టీ పోస్టులు
ఎన్సీఎస్సీఎంలో ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్టులు
ఆర్యూహెచ్ఎస్లో మెడికల్ ఆఫీసర్ పోస్టులు
రైల్వేలో జూనియర్ ఇంజినీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ పోస్టులు
ఎడ్సిల్ ఉద్యోగాలు
ఎయిమ్స్ మంగళగిరిలో ఫ్యాకల్టీ పోస్టులు
వ్యవసాయ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు
సీఐటీడీ హైదరాబాద్‌లో ఎంఈ ప్రవేశాలు
తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్- 2026
ఏపీ డా.బి.ఆర్.అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో యూజీ ప్రవేశాలు
గేట్ 2027 నోటిఫికేషన్
డాక్టర్ వై.ఎస్.ఆర్. ఉద్యాన విశ్వవిద్యాలయంలో బీఎస్సీ ప్రవేశాలు
కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్)-2027
క్యాట్ 2026 - ఎంబీఏ/పీజీపీ, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాలు
జేవియర్ ఆప్టిట్యూడ్ టెస్ట్-2027
కొంకణ్ రైల్వేలో జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు
డీపీఎస్ఆర్యూలో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులు
నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్‌లో ప్రాజెక్ట్ స్టాఫ్ ఉద్యోగాలు
ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌లో మేనేజర్ పోస్టులు
డీఆర్డీఓలో జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టులు
సీఎంటీఐ బెంగళూరులో ప్రాజెక్టు అసోసియేట్ ఉద్యోగాలు
మహాత్మా గాంధీ యూనివర్సిటీలో అప్రెంటిస్ పోస్టులు
ఐఆర్ఈఎల్లో అప్రెంటిస్ పోస్టులు
రైల్ కోచ్ ఫ్యాక్టరీలో అప్రెంటిస్ పోస్టులు
కొంకణ్ రైల్వేలో అప్రెంటిస్ ఉద్యోగాలు
ఐఓసీఎల్‌లో అప్రెంటిస్ పోస్టులు
ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఉద్యోగాలు
డీఆర్డీఓ - ఎస్ఎస్పీఎల్లో అప్రెంటిస్ పోస్టులు
ఇస్రో శాటిలైట్ సెంటర్లో అప్రెంటిస్ పోస్టులు
రూర్కెలా స్టీల్ ప్లాంట్‌లో 1,110 అప్రెంటిస్ ఉడ్యోగాలు
ఇందిరా గాంధీ అటామిక్ రిసెర్చ్ సెంటర్లో ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగాలు
అప్పీళ్లు, ఫిర్యాదులకు సీఐసీ కొత్త డిజిటల్ పోర్టల్
జాతీయ జెండా ఆవిష్కరణ
‘శాంతి’ చట్టం ముసాయిదా నిబంధనల విడుదల
వాణిజ్య ప్రకటనల నిడివి పరిమితి రద్దు
జనాభా లెక్కల తుది దశ
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
క్యాన్సర్‌ను నోటిఫైయబుల్ వ్యాధిగా ప్రకటించండి
పీఎమ్ ఇ-డ్రైవ్ పథకం
డిజిటల్ చెల్లింపుల నియంత్రణ సవరణ బిల్లు
‘‘గోబర్ ధన్’’
వెనెజువెలాలో ఓఎన్జీసీ పూర్తిస్థాయి కార్యకలాపాలు
రిలయన్స్ - రోల్స్ రాయిస్ భాగస్వామ్యం
కుటుంబాలపై తలసరి రుణ భారం
భారత్‌పై 100% టారిఫ్
రూ.లక్ష కోట్ల లారస్ ల్యాబ్స్
ఇంటి పొదుపు జీడీపీలో 21.7 శాతం
జీఎస్టీ వసూళ్లు రూ.2.11 లక్షల కోట్లు
రూ.1.78 లక్షల కోట్లకు రక్షణ ఉత్పత్తులు
మళ్లీ రికార్డు స్థాయికి యూపీఐ లావాదేవీలు
మాల్దీవుల్లో యూపీఐ సేవలు