గవర్నర్‌ జనరల్స్‌ - వైస్రాయ్‌లు (పార్ట్‌ - 4)

గవర్నర్‌ జనరల్స్‌ - వైస్రాయ్‌లు (పార్ట్‌ - 4)

1857 సిపాయి తిరుగుబాటు ఫలితంగా భారతదేశంలో ఈస్టిండియా కంపెనీ శకం ముగిసి, భారత్‌ బ్రిటిష్‌ ప్రభుత్వ ప్రత్యక్ష పాలన కిందకు వెళ్లింది. ఇక్కడి పరిస్థితులను పర్యవేక్షించడానికి ఒక ప్రతినిధిని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫలితంగా భారత ప్రభుత్వ చట్టం 1858 అమలైంది. 1858, నవంబరు 1న బ్రిటిష్‌ మహారాణి విక్టోరియా భారతదేశ పరిపాలన బాధ్యతలు స్వీకరిస్తూ ఒక ప్రకటన జారీ చేశారు. దీని ప్రకారం, భారతదేశ గవర్నర్‌ జనరల్‌ అనే పదవిని భారతదేశ వైస్రాయ్‌గా మార్చారు. వీరిని బ్రిటిష్‌ ప్రభుత్వమే నేరుగా నియమించేది. భారతదేశ మొదటి వైస్రాయ్‌ లార్డ్‌ కానింగ్‌. 1858 నుంచి వైస్రాయ్‌ల ద్వారానే బ్రిటిష్‌ - ఇండియాలో ఆంగ్లేయుల పాలన సాగింది. పార్ట్‌-3లో వైస్రాయ్‌లుగా పనిచేసిన లార్డ్‌ కానింగ్‌ (1858) నుంచి లార్డ్‌ డఫ్రిన్‌ (1888) వరకు ఉంది. మిగిలిన వారి గురించి ఇందులో తెలుసుకుందాం..!

లార్డ్‌ లాన్స్‌డౌన్‌ 

అసలు పేరు హెన్రీ చార్లెస్‌ కీత్‌ పెట్టీ - ఫిట్జ్‌మారిస్‌. క్వీన్‌ విక్టోరియా హయాంలో 1888, డిసెంబరు నుంచి 1894 అక్టోబరు వరకు భారతదేశానికి 9వ వైస్రాయ్‌గా పనిచేశారు. ఈయన హయాంలోనే భారతీయ ఫ్యాక్టరీ చట్టం 1891 అమలైంది. ఈ చట్టం పిల్లల కనీస వయసును 7 నుంచి 9 సంవత్సరాలకు పెంచడంతోపాటు రోజుకు 7 పని గంటలు ఉండాలని నిర్ణయించింది. అలాగే మహిళల పనిని రోజుకు 11 గంటలకు పరిమితం చేసింది. 

లార్డ్‌ ఎల్గిన్‌ 2 

అసలు పేరు విక్టర్‌ అలెగ్జాండర్‌ బ్రూస్‌. 1894, జనవరి నుంచి 1899 జనవరి వరకు భారతదేశ వైస్రాయ్‌గా పనిచేశారు. ఈయన 1862-63లో వైస్రాయ్‌గా ఉన్న లార్డ్‌ ఎల్గిన్‌ ఖి కుమారుడు. ఈయన పాలనలో దేశం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు,  వాయవ్య సరిహద్దు వెంట గిరిజనుల తిరుగుబాట్లు, విస్తృతమైన కరవులు, బ్యూబోనిక్‌ ప్లేగు లాంటివి ఎదుర్కొంది. ప్లేగు నియంత్రణ కోసం 1897, ఫిబ్రవరిలో ప్రభుత్వం అంటువ్యాధుల చట్టం (Epidemic Diseases Act of 1897) చేసింది.

లార్డ్‌ కర్జన్‌

1899 నుంచి 1905 వరకు భారతదేశ వైస్రాయ్‌గా ఉన్నారు. మౌలిక సదుపాయాలైన రైల్వేలు, నీటిపారుదల, పరిపాలనా సామర్థ్యాన్ని ఆధునికీకరించడానికి కృషి చేశారు.  కర్జన్‌ తీసుకున్న వివాదాస్పద నిర్ణయాల్లో 1905 నాటి బెంగాల్‌ విభజన ఒకటి. 1902లో విశ్వవిద్యాలయాల కమిషన్‌ (రాలీ కమిషన్‌)ను ఏర్పాటు చేశారు. దీని ఫలితంగా 1904 నాటి భారత విశ్వవిద్యాలయాల చట్టం వచ్చింది. ఇది యూనివర్సిటీలపై ప్రభుత్వ నియంత్రణను విస్తరించింది.

లార్డ్‌ రీడింగ్‌ 

అసలు పేరు రూఫస్‌ డానియల్‌ ఐజాక్స్‌. 1921 నుంచి 1926 వరకు భారతదేశ వైస్రాయ్‌గా ఉన్నారు. 1926లో ఆయన ఫస్ట్‌ మార్క్వెస్‌ ఆఫ్‌ రీడింగ్‌ అయ్యారు. డ్యూక్‌ ఆఫ్‌ వెల్లింగ్టన్‌ తర్వాత ఈ హోదాకు ఎదిగిన మొదటి సామాన్యుడు ఈయనే. అలాగే 1930 నుంచి 1932 వరకు జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశాల్లో కీలక పాత్ర పోషించారు. గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా యాక్ట్‌ 1935 ముసాయిదా కమిటీలో పనిచేశారు. ఈయన 1919 భారత ప్రభుత్వ చట్టాన్ని అమలు చేశారు. 

లార్డ్‌ మింటో 2, లార్డ్‌ హార్డింజ్‌ 2, లార్డ్‌ చెమ్స్‌ఫోర్డ్‌ పరిపాలనా విశేషాలు, ఇతర ముఖ్యాంశాలతోపాటు టీఎస్‌ పంచాయత్‌ సెక్రటరీ, తెలంగాణ పోలీస్‌ ఎస్‌ఐ మెయిన్స్, టీఎస్‌పీఎస్‌సీ స్టెనో, టైపిస్ట్‌ & జూనియర్‌ అసిస్టెంట్, ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్, ఏపీ పోలీస్‌ కానిస్టేబుల్‌ మెయిన్స్, యూపీఎస్సీ సివిల్స్, ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ, యూజీసీ నెట్, ఎస్‌ఎస్‌సీ తదితర పోటీపరీక్షల్లో ఈ టాపిక్‌పై అడిగిన ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్‌.. ఇంకా పోటీపరీక్షల్లో వచ్చే కీలక జీకే అంశాలు, మంత్లీ కరెంట్‌ అఫైర్స్‌ ఈబుక్స్, ప్రాక్టీస్‌ టెస్ట్స్‌ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్‌ నాలెడ్జ్‌ ఖీ కరెంట్‌ అఫైర్స్‌ కోర్సు’కి సబ్‌స్క్రైబ్‌ చేసుకోండి. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. డ్యూరాండ్‌ రేఖ అనేది భారత్‌కు, కింది ఏ దేశానికి సరిహద్దు?

(ఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్, 2019)

1) ఆఫ్గనిస్థాన్‌     2) చైనా            3) నేపాల్‌       4) బర్మా

సమాధానం: 1

2. బ్రిటిష్‌ పాలకులకు వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టడాన్ని నేరంగా పరిగణిస్తూ 1898లో కింది ఎవరు చట్టాన్ని ప్రవేశపెట్టారు?

(ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ (యూజీ), 2025)

1) లార్డ్‌ కర్జన్‌     2) లార్డ్‌ నార్త్‌బ్రూక్‌

3) లార్డ్‌ ఎల్గిన్‌     4) లార్డ్‌ మాయో

సమాధానం: 1

3. బ్రిటిష్‌ - ఇండియాలో కింది ఎవరు వైస్రాయ్‌గా ఉన్నప్పుడు డ్యూరాండ్‌ రేఖను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు?

(ఎంపీ పోలీస్‌ కానిస్టేబుల్, 2022)

1) లార్డ్‌ అమ్హెర్స్ట్‌      2) లార్డ్‌ లాన్స్‌డౌన్‌

3) లార్డ్‌ నార్త్‌బ్రూక్‌     4) లార్డ్‌ డఫ్రిన్‌

సమాధానం: 2

4. 1905లో బెంగాల్‌ విభజన సమయంలో ఉన్న వైస్రాయ్‌ ఎవరు?

(దిల్లీ పోలీస్‌ కానిస్టేబుల్, 2020)

1) లార్డ్‌ కానింగ్‌                 2) లార్డ్‌ కర్జన్‌

3) లార్డ్‌ వెల్లస్లీ              4) లార్డ్‌ కార్న్‌వాలీస్‌

సమాధానం: 2

5. Who among the following was the key leader of the Khongjom War (1891) against British annexation of Manipur?
(SSC CGL, 2025)
1) Tikendrajit Singh commanded the Manipuri army and was later executed.
2) Rani Gaidinliu led resistance against the British in Naga regions post-1930s.
3) U Kiang Nangbah led uprisings in Jaintia Hills against colonial intrusion.
4) Veer Surendra Sai resisted the British in Sambalpur for over four decades.
Ans: 1
6. By which British statute were Indian representatives, for the first time, allocated seats for election in Indian Legislative Councils?
(SSC MTS, 2021)
1) Goverment of India Act, 1833    2) Indian Councils Act, 1892
3) Goverment of India Act, 1915    4) Indian Councils Act, 1861
Ans: 2
7. The Age of Consent Act, 1891 raised the age for the consummation of marriage for women to 
(UGC NET, 2022)
1) 14 years        2) 15 years        3) 13 years        4) 12 years
Ans: 4
8. With reference to the Indian Councils Act, 1892, consider the following statements and choose the correct option:
i. It significantly increased the number of official members in the Central Legislative Council.
ii. It empowered the legislative councils to discuss the budget and address questions to the executive.
iii. It introduced the principle of direct election for non-official members of provincial legislative councils. 
(SSC Stenographer, 2025)
1) i only         2) ii only        3) i and iii only        4) ii and iii only
Ans: 2

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram