పర్యావరణ ఉద్యమాలు సాధారణంగా గాలి - నీటి కాలుష్యం, అటవీ నిర్మూలన, వాతావరణ మార్పు, వన్యప్రాణుల సంరక్షణ లాంటి సమస్యలపై దృష్టిసారిస్తాయి. ఇవి క్షేత్రస్థాయి సామాజిక సమీకరణ నుంచి ప్రపంచవ్యాప్త ప్రచారాలు, నిరసనల వరకు అనేక విభిన్న రూపాల్లో జరుగుతాయి. సుస్థిరతను ప్రోత్సహించి, పర్యావరణం - సహజ వనరులను రక్షించడం లాంటివి ఈ ఉద్యమ లక్ష్యాలు. మన దేశంలో ఇప్పటి వరకు జరిగిన ముఖ్యమైన పర్యావరణ ఉద్యమాల గురించి తెలుసుకుందాం.
బిష్ణోయి ఉద్యమం
భారతదేశంలో తొలి పర్యావరణ ఉద్యమంగా ప్రసిద్ధి. 1730లో రాజస్థాన్‌లోని జోథ్‌పుర్ జిల్లాలో ఖేజార్లీ/ఖెజాడ్లి గ్రామానికి చెందిన ఉద్యమం. బిష్ణోయి జాతి ప్రజలను భారతదేశ మొట్టమొదటి పర్యావరణవేత్తలుగా పేర్కొంటారు. తాము పవిత్రంగా భావించే ఖేజ్రీ వృక్షాల నరికివేతను అడ్డుకోవడానికి ఈ ఉద్యమం ప్రారంభించారు.
చిప్కో ఉద్యమం
ఇది 1973, ఏప్రిల్‌లో ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో జరిగింది (అప్పట్లో ఇది ఉత్తర్ ప్రదేశ్‌లో భాగంగా ఉండేది). భారతదేశంలో అత్యంత ప్రసిద్ధ పర్యావరణ ఉద్యమాల్లో చిప్కో ఒకటి. చెట్లను నరకకుండా కాపాడేందుకు ప్రజలు వాటిని కౌగిలించుకోవడం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది. హిందీలో చిప్కో అంటే కౌగిలించుకోవడం అని అర్థం. సుందర్‌లాల్ బహుగుణ, గౌరీదేవి, చండీప్రసాద్ భట్ తదితరులు నాయకత్వం వహించారు.
సైలెంట్ వ్యాలీ రక్షణ ఉద్యమం
ఉష్ణమండల సతతహరిత అడవిని (tropical evergreen forest) రక్షించడానికి 1973లో కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో సైలెంట్ వ్యాలీ ఉద్యమం జరిగింది. సైలెంట్ వ్యాలీ ఒక ప్రత్యేక పర్యావరణ వ్యవస్థ. ఇది అనేక అంతరించిపోతోన్న వృక్ష, జంతుజాతులకు నిలయం. ఈ ప్రాంతం పశ్చిమ కనుమల్లో భాగం. ఇది ప్రపంచంలోని ఎనిమిది అత్యంత జీవవైవిధ్య కేంద్రాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది.
జంగిల్ బచావో ఆందోళన్
దీన్ని ఝార్ఖండ్ జంగిల్ బచావో ఆందోళన్ అని కూడా పిలుస్తారు. ఆదివాసీ వర్గాల సంప్రదాయ హక్కులతోపాటు అడవులను పరిరక్షించడంపై ఈ ఉద్యమం దృష్టి సారించింది. 1982 బిహార్‌లోని సింగ్భమ్ (ప్రస్తుతం ఝార్ఖండ్‌లో ఉంది)లో జరిగింది. సింగ్భమ్ గిరిజనులు ఇందులో పాల్గొన్నారు. ఈ ఉద్యమ తీవ్రతను గుర్తించిన భారత ప్రభుత్వం 2006లో అటవీ భూములపై గిరిజనుల హక్కులను గుర్తిస్తూ ‘అటవీ హక్కుల చట్టం’ రూపొందించింది.
తెహ్రీ డ్యామ్ వ్యతిరేక పోరాటం
ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ సమీపంలో ఉన్న భాగీరథి నదిపై 2400 మెగావాట్ల జలవిద్యుత్ ప్రాజెక్టు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ జరిగిన పర్యావరణ, సామాజిక ఉద్యమం ఇది. 1980 దశకంలో సుందర్‌లాల్ బహుగుణ నేతృత్వంలో ప్రారంభమైంది. లక్షలాది ప్రజల స్థానభ్రంశం, తెహ్రీ పట్టణం ముంపునకు గురికావడం, హిమాలయాల్లో తీవ్రమైన పర్యావరణ - భూకంప ప్రమాదాలు మొదలైన అంశాలు ఈ ఉద్యమానికి దారితీశాయి.
| ఆయా ఉద్యమాల నేపథ్యాలు, నాయకత్వం వహించిన వ్యక్తులు/ సంస్థలు, అప్పికో ఉద్యమం, నర్మదా బచావో ఆందోళన్, గంగా సంరక్షణ ఉద్యమంతోపాటు గతంలో యూపీఎస్సీ సివిల్స్, ఎస్‌ఎస్‌సీ, ఆర్‌ఆర్‌బీ గ్రూప్-డి, యూజీసీ నెట్ తదితర పోటీ పరీక్షల్లో అడిగిన 85కి పైగా ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్.. ఇంకా పోటీపరీక్షల్లో వచ్చే కీలక జీకే అంశాలు, మంత్లీ కరెంట్ అఫైర్స్ ఈబుక్స్, ప్రాక్టీస్ టెస్ట్స్ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్ నాలెడ్జ్ & కరెంట్ అఫైర్స్ కోర్సు’కి సబ్‌స్క్రైబ్ చేసుకోండి. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978 |
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
1. జోధ్‌పూర్ సమీపంలోని ఖేజార్లీ గ్రామంలో ఖేజ్రీ చెట్ల రక్షణ కోసం 363 మందితో సహా కింది ఎవరు ప్రాణత్యాగం చేశారు?
(డీఎస్‌ఎస్‌ఎస్‌బీ టీజీటీ, 2025)
1) కవితా దేవి బిష్ణోయ్ 2) సునీతా దేవి బిష్ణోయ్
3) అనితా దేవి బిష్ణోయ్ 4) అమృతా దేవి బిష్ణోయ్
సమాధానం: 4
2. చిప్కో ఉద్యమం ఎక్కడ ప్రారంభమైంది?
(యూకేపీఎస్సీ లోయర్ పీసీఎస్ ప్రిలిమ్స్, 2021)
1) తెహ్రీ 2) చమోలి 3) ఉత్తర కాశీ 4) అల్మోరా
సమాధానం: 2
3. బిష్ణోయ్ ఉద్యమం కింది దేనికి వ్యతిరేకంగా ప్రారంభమైంది?
(ఎస్‌ఎస్‌సీ సీజీఎల్, 2017)
1) చెట్లను నరకడం 2) లింగ వివక్ష
3) జంతువధ 4) పెరుగుతున్న కాలుష్యం
సమాధానం: 1
4. భారతదేశంలో అత్యంత పురాతన పర్యావరణ ఉద్యమం ఏది?
(ఎంహెచ్ ఎస్‌ఈటీ పేపర్ 2, సోషియాలజీ, 2021)
1) చిప్కో ఉద్యమం 2) బిష్ణోయ్ ఉద్యమం
3) జంగిల్ బచావో ఆందోళన్ 4) అప్పికో ఉద్యమం
సమాధానం: 2
5. The Silent Valley Movement was started in 1973 in the state of:
(SSC CPO, 2020)
1) Odisha 2) Kerala 3) Andhra Pradesh 4) Himachal Pradesh
Ans: 2
6. To which of the following communities living in western Rajasthan on the border of the Thar desert has conservation of forest and wildlife been a religious tenet ?
(RRB Group D, 2022)
1) Vaishya Community 2) Chhipa community
3) Bishnoi community 4) Bhil community
Ans: 3
7. Which of the following movement originated from an incident in a remote village called Reni in Garhwal, high-up in the Himalayas during the early 1970s?
(DSSSB TGT, 2021)
1) The Chipko Andolan 2) The Namami Gange Andolan
3) The Sai Raksha Andolan 4) Narmada Bachao Andolan
Ans: 1
Link copied to clipboard!
పంజాబ్ నేషనల్ బ్యాంకులో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులు
నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీలో టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాలు
ఇండియన్ ఆర్మీలో 125వ కోర్సు ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్
యూనియన్ బ్యాంక్‌లో మేనేజిరియర్ ఉద్యోగాలు
ఐఐటీ దిల్లీలో సీనియర్ ప్రాజెక్ట్ సైంటిస్ట్ ఉద్యోగాలు
బ్యాంక్ ఆఫ్ బరోడాలో అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ II ఉద్యోగాలు
వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌లో స్టాట్యూటరీ సూపర్వైజరీ స్టాఫ్ పోస్టులు
ఎన్ఐసీఎల్లో అసిస్టెంట్ ఉద్యోగాలు
సీఎంఈటీ-ఎంఏఎన్ఐటీ భోపాల్‌లో ఉద్యోగాలు
ఎన్ఐడీ ఆంధ్రప్రదేశ్‌లో టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాలు
ఆంగ్రూలో బీఎస్సీ (ఆనర్స్) కమ్యూనిటీ సైన్స్ అడ్మిషన్లు 2026-27
ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం- బీఎస్సీ అగ్రికల్చర్ ప్రవేశాలు
ఏఎన్జీఆర్ఏయూలో బీటెక్ అగ్రికల్చరల్ ఫుడ్ టెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాలు
బిట్స్ పిలానీ, ఐఐఎస్ఈఆర్ తిరుపతిలో పీహెచ్డీ ప్రవేశాలు
ఆల్ ఇండియా ఆయుష్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్
జేవియర్ ఆప్టిట్యూడ్ టెస్ట్-2027
డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో బీఎడ్ ప్రవేశాలు
జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతి ప్రవేశాలు
సీఎస్ఐఆర్ - ఐహెచ్‌బీటీలో ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగాలు
ఔనియాటి యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు
ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఉద్యోగాలు
ఈఎస్ఐసీలో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
సీఎంటీఐ బెంగళూరులో ప్రాజెక్టు అసోసియేట్ ఉద్యోగాలు
ఎన్‌ఏబీఎఫ్‌ఐడీలో బిజినెస్ అనలిస్ట్ పోస్టులు
డీఆర్డీఓ ఎస్ఏజీ దిల్లీలో జేఆర్ఎఫ్ పోస్టులు
ఈఎస్ఐసీలో సీనియర్ రెసిడెంట్ పోస్టులు
డీఆర్డీఓలో రిసెర్చ్ అసోసియేట్ పోస్టులు
డీఆర్డీవో- సీఎఫ్‌ఈఈఎస్‌లో జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టులు
రూర్కెలా స్టీల్ ప్లాంట్‌లో 1,110 అప్రెంటిస్ ఉడ్యోగాలు
విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రంలో అప్రెంటిస్ పోస్టులు
ఇందిరా గాంధీ అటామిక్ రిసెర్చ్ సెంటర్లో ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగాలు
నార్త్ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వేలో యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు
హెచ్పీసీఎల్లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులు
డీఆర్డీఓ - ఏసీఈఎంలో అప్రెంటిస్ పోస్టులు
ఐవోసీఎల్ రిఫైనరీస్‌లో ట్రేడ్, టెక్నీషియన్ అప్రెంటిస్ ఉద్యోగాలు
డీఆర్డీఓ-ఏసీఈఎంలో అప్రెంటిస్ పోస్టులు
ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్‌లో అప్రెంటిస్ పోస్టులు
జాతీయ జెండా ఆమోద దినోత్సవం
అంతర్జాతీయ చెస్ దినోత్సవం
నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవం
వాణిజ్య బ్యాంకులను జాతీయీకరణ చేసిన రోజు
అంతర్జాతీయ క్రిమినల్ జస్టిస్ దినోత్సవం
ఐసీఏఆర్ వ్యవస్థాపక దినోత్సవం
వరల్డ్ యూత్ స్కిల్స్ డే
నాబార్డ్ వ్యవస్థాపక దినోత్సవం
ప్రపంచ జనాభా దినోత్సవం
ప్రపంచ గ్రామీణాభివృద్ధి దినోత్సవం