భారత లా కమిషన్‌

భారత లా కమిషన్‌

సమాజంలో మంచి ప్రవర్తనా నియమావళిని అమలు చేయడానికి, వివాదాల పరిష్కారానికి, వ్యక్తిగత హక్కులు - స్వేచ్ఛను రక్షించడానికి చట్టాలు అవసరం. స్వాతంత్య్రానికి పూర్వం బ్రిటిష్‌ వారు తమ ఆధిపత్యాన్ని చెలాయించేందుకు అనేక చట్టాలను అమలు చేశారు. వాటి ద్వారా ప్రజల హక్కులను పూర్తిగా హరించి, భయానక వాతావరణాన్ని సృష్టించారు. 1947 తర్వాత ఆ చట్టాలను సంస్కరించడంపై చర్చ జరిగింది. ఆ విధంగా ఏర్పడిందే భారత లా కమిషన్‌ (Law Commission of India). దేశంలో ప్రగతిశీల అభివృద్ధి, క్రోడీకరణ (Codification)లో ఇది ముఖ్య భూమిక పోషించింది. భారతదేశ చరిత్రలో నిరంతరం కొనసాగుతున్న ప్రక్రియ అయిన చట్ట సంస్కరణలను నిర్ధారించడమే భారత లా కమిషన్‌ లక్ష్యం. పోటీ పరీక్షల కోణంలో దీనికి సంబంధించిన ముఖ్య విషయాలు తెలుసుకుందాం..!

  • ప్రజలందరికీ సామాజిక న్యాయం అందించే లక్ష్యంతో ‘లా కమిషన్‌’ను ఏర్పాటు చేశారు. ఇది చట్టబద్ధమైన లేదా రాజ్యాంగబద్ధమైన సంస్థ కాదు. దీన్ని కేంద్ర చట్ట, న్యాయ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తుంది. దేశంలోని చట్టాల అద్భుతమైన ఆలోచనాత్మక, కీలకమైన సమీక్షను లా కమిషన్‌ అందిస్తుంది. దీన్ని 1955లో స్థాపించారు. ప్రతి మూడేళ్లకోసారి పునర్‌వ్యవస్థీకరిస్తారు. ఇది కేంద్ర న్యాయ శాఖకు సలహా మండలిగా పని చేస్తుంది.
  • ఆంగ్లేయుల పాలనా కాలంలో చార్టర్‌ చట్టం 1833 ప్రకారం 1834లో తొలిసారిగా లా కమిషన్‌ను ఏర్పాటు చేశారు. దీనికి లార్డ్‌ మెకాలే అధ్యక్షులుగా ఉన్నారు. ఈ కమిషన్‌ పీనల్‌ కోడ్, క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్, ఇతర అంశాల క్రోడీకరణ కోసం వాదించింది. దీని తర్వాత 1853, 1861, 1879లలో వివిధ లా కమిషన్‌లు ఏర్పాటయ్యాయి. వీటి సిఫార్సుల మేరకు మనదేశంలో 1859లో సివిల్‌ ప్రొసీజర్‌ కోడ్‌; 1860లో ఇండియన్‌ పీనల్‌ కోడ్‌; 1861లో క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లను రూపొందించారు.
  • స్వాతంత్య్రం తర్వాత మనదేశంలో మొదటి లా కమిషన్‌ను 1955లో మాజీ అటార్నీ జనరల్‌ ఎంసీ సెతల్వాడ్‌ అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ఇది మూడేళ్ల కాలానికి ఏర్పాటైంది. ఇప్పటికీ ఇదే పద్ధతి కొనసాగుతోంది. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ప్రభుత్వం ఈ కమిషన్‌ కాల వ్యవధిని పొడిగిస్తుంది. దేశంలో ఇప్పటి వరకు 23 లా కమిషన్‌లను ఏర్పాటు చేశారు. ఈ కమిషన్‌లో ఛైర్మన్‌ (సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి), నలుగురు సభ్యులు ఉంటారు.
  • ప్రస్తుత 23వ లా కమిషన్‌ ఛైర్మన్‌గా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ దినేశ్‌ మహేశ్వరి 2025, ఏప్రిల్‌ 15న నియమితులయ్యారు. 2024, సెప్టెంబరు 3న 23వ లా కమిషన్‌ మూడేళ్ల కాలపరిమితితో ఏర్పడింది. కమిషన్‌ పూర్తిస్థాయి సభ్యులుగా హితేశ్‌ జైన్‌ (న్యాయవాది), ప్రొఫెసర్‌ డి.పి.వర్మ (లా ప్రొఫెసర్‌- బీహెచ్‌యూ), డాక్టర్‌ అంజు రాఠీ రాణా (మెంబర్‌ సెక్రటరీ) ఉన్నారు. ఈ కమిషన్‌ పదవీ కాలం 2027 ఆగస్టు 31 వరకు కొనసాగనుంది. 

లా కమిషన్‌ విధులు, వివిధ లా కమిషన్‌లు - రిపోర్ట్‌లు, స్వాతంత్య్రానంతరం ఏర్పాటైన వివిధ లా కమిషన్‌లు, వాటి ఛైర్మన్‌లు తదితర సమాచారంతోపాటు ఈ అంశంపై గతంలో పలు పోటీపరీక్షల్లో అడిగిన ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్‌ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్‌ నాలెడ్జ్‌ & కరెంట్‌ అఫైర్స్‌ కాంబో కోర్సు’కి సబ్‌స్క్రైబ్‌ చేసుకోండి! వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. లా కమిషన్‌ ఆఫ్‌ ఇండియా అనేది?

(ఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్, 2019)

1) చట్టబద్ధ సంస్థ                        2) ప్రైవేట్‌ సంస్థ

3) చట్టబద్ధత లేని సలహా సంఘం            4) రాజ్యాంగబద్ధ సంస్థ

సమాధానం: 3

2. 2025, ఏప్రిల్‌లో 23వ లా కమిషన్‌ ఆఫ్‌ ఇండియా ఛైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?

(ఎస్‌ఎస్‌సీ జేఈ (సివిల్‌ ఇంజినీరింగ్‌), 2025)

1) జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా            2) జస్టిస్‌ హిమా కోహ్లి

3) జస్టిస్‌ దినేష్‌ మహేశ్వరి            4) జస్టిస్‌ జె.బాగ్చి

సమాధానం: 3

3. స్వతంత్ర భారతదేశంలో మొదటి లా కమిషన్‌ను ఎప్పుడు స్థాపించారు?

(ఎంపీ ఫారెస్ట్‌ గార్డ్‌/ జైల్‌ప్రహారీ కంబైన్డ్‌ ఎగ్జామ్, 2023)

1) 1954   2) 1955   3) 1956   4)1957

సమాధానం: 2

4. భారతీయ చట్టాలను క్రోడీకరించడానికి, ఏకీకృతం చేయడానికి భారతదేశంలో మొదటిసారి కింది ఏ చట్టం ప్రకారం లా కమిషన్‌ను ఏర్పాటు చేశారు?

(ఎస్‌ఎస్‌సీ సీజీఎల్, 2025)

1) భారత ప్రభుత్వ చట్టం, 1858            2) ఇండియన్‌ కౌన్సిల్‌ చట్టం, 1861

3) రెగ్యులేటింగ్‌ చట్టం, 1773                4) చార్టర్‌ చట్టం, 1833

సమాధానం: 4

5. Who headed the Law Commission appointed by Lord William Bentinck ?
(TSPSC AEE, 2015)
1) Lord Macaulay        2) W.W. Hunter        3) Charles Wood        4) Lord Minto
Ans: 1
6. The first Law Commission in India was headed by ______.
(RRB NTPC Graduate Level CBT-I,  2025)
1) Lord Cornwallis            2) Lord Hastings
3) Lord Macaulay                4) Sir Elijah Impey
Ans: 3
7. Which of the following statement/statements incorrect regarding the Law Commission of India is/are?
i. It is a non-constitutional quasi judicial body.
ii. One of its functions is to communicate its opinion to the President on subjects relating to legal administration.
iii. Its reports are not submitted to the Parliament.
iv. It has no suo motu decision power to undertake research by itself.
Select the answer using the codes given below:
(APPSC Group-1 (Prelims), 2024)
1) ii and iii        2) Only iii        3) All        4) i, ii and iv
Ans: 3
8. In its 279th report released in April 2023, the Law Commission of India has recommended the provision of which law to be retained?
(SSC MTS,  2024)
1) Labour Law                2) Revenue Law        
3) Contract Law                4) Sedition Law
Ans: 4
9. Who became the Chairperson of the 23rd Law Commission of India in April 2025?
(RRB Group D, 2025)
1) Professor DP Verma                2) Hitesh Jain
3) Justice Dinesh Maheshwari            4) Justice Ritu Raj Awasthi
Ans: 3
10. As per Indian Constitution the Election Commission of India is a _____________.
(RRB NTPC (UG) CBT-I,  2026)
1) Non-Constitutional body    2) Constitutional body
3) Statutory body            4) Quasi-judicial body only
Ans: 2

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram