భారత్‌లో వన్యప్రాణుల సంరక్షణ ప్రాజెక్టులు (పార్ట్‌ - 2)

భారత్‌లో వన్యప్రాణుల సంరక్షణ ప్రాజెక్టులు (పార్ట్‌ - 2)

పర్యావరణ వ్యవస్థకు వన్యప్రాణులు ముఖ్యమైనవి. ఆహార గొలుసును, ప్రకృతి సమతౌల్యాన్ని కాపాడటంలో ఇవి కీలకం. వన్యప్రాణులను విచక్షణారహితంగా వేటాడటం, చంపడం నుంచి నివారించడమే వన్యప్రాణుల సంరక్షణ. ఇందు కోసం ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు చేపట్టింది. భూమిపై ఉన్న అడవి మొక్కలు, జంతు జాతులు, వాటి ఆవాసాలను రక్షించడానికి ఇది ఒక ప్రత్యేకమైన విధానం. భవిష్యత్తు తరాలు ప్రకృతిని ఆస్వాదించేలా చూడటం; మానవులు వన్యప్రాణులు, అరణ్యాల ప్రాముఖ్యతను గుర్తించేలా చేయడమే దీని ప్రధాన లక్ష్యం. పార్ట్‌ 1లో వన్యప్రాణుల సంరక్షణ అంటే ఏమిటి?వరల్డ్‌ కన్సర్వేషన్‌ స్ట్రాటజీ, భారతదేశంలో వన్యప్రాణుల సంరక్షణ సహా వివిధ కన్సర్వేషన్‌ ప్రాజెక్టుల గురించి ఉంది. ఈ భాగంలో మరిన్ని అంశాలు తెలుసుకుందాం..!

ప్రాజెక్ట్‌ చీతా

  • ఇది భారతదేశ ప్రధాన వన్యప్రాణి సంరక్షణ కార్యక్రమం. 1952లో దేశంలో అంతరించిపోయిన చీతాను తిరిగి ప్రవేశపెట్టడం దీని లక్ష్యం. ఈ ప్రాజెక్ట్‌ను ప్రధాని నరేంద్ర మోదీ 2022, సెప్టెంబరు 17న మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్‌ పార్క్‌లో మొదటి విడత ఆఫ్రికన్‌ చిరుత పులులను విడుదల చేయడం ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమం మినిస్ట్రీ ఆఫ్‌ ఎన్విరాన్మెంట్‌ అండ్‌ ఫారెస్ట్‌ ఆధ్వర్యంలో అమలవుతోంది.

ప్రాజెక్ట్‌ హంగుల్‌ (Project Hangul)

  • జమ్మూ-కశ్మీర్‌ ప్రభుత్వం వరల్డ్‌ వైల్డ్‌లైఫ్‌ ఫండ్‌ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌), ఇంçర్నేషనల్‌ యూనియన్‌ ఫర్‌ కన్సర్వేషన్‌ ఆఫ్‌ నేచర్‌ (ఐయూసీఎన్‌)లతో కలిసి 1970లో ‘ప్రాజెక్ట్‌ హంగుల్‌’ను ప్రారంభించింది. 2009లో దీని పేరును ‘సేవ్‌ కశ్మీర్‌ రెడ్‌ డీర్‌ హంగుల్‌’ అని మార్చారు. కశ్మీర్‌లో ఎర్ర జింకను హంగుల్‌ అని పిలుస్తారు. ఇవి ఎక్కువగా శ్రీనగర్‌లోని దాచిగామ్‌ నేషనల్‌ పార్క్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసిస్తాయి.

ప్రాజెక్ట్‌ క్రోకొడైల్‌

  • భారతదేశంలో అంతరించి పోయే స్థితిలో ఉన్న మూడు మొసలి జాతులను రక్షించే ఉద్దేశంతో భారత ప్రభుత్వం 1975, ఏప్రిల్‌ 1న మొసళ్ల సంరక్షణ పథకాన్ని (క్రోకొడైల్‌ కన్సర్వేషన్‌ ప్రాజెక్ట్‌) ప్రారంభించింది. దీనికి యునైటెడ్‌ నేషన్స్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం (యూఎన్‌డీపీ), ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌ఏఓ) సహకారం అందించాయి. ఫలితంగా ఒడిశాలోని భితర్‌కనికా నేషనల్‌ పార్క్‌లో ఈ ప్రాజెక్ట్‌ ప్రారంభమైంది. తర్వాత సత్కోసియా టైగర్‌ రిజర్వ్‌కు (ఒడిశా) దీన్ని విస్తరించారు. 

ప్రాజెక్ట్‌ గ్రేట్‌ ఇండియన్‌ బస్టర్డ్‌

  • దీన్ని రాజస్థాన్‌ ప్రభుత్వం అధికారికంగా 2013, జూన్‌ 5న జైసల్మేర్‌లోని డిజర్ట్‌ నేషనల్‌ పార్క్‌లో ప్రారంభించింది. ఈ పక్షి మన దేశంలోని రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, గుజరాత్‌ ఉత్తర భాగాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఇది రాజస్థాన్‌ అధికార పక్షి కూడా. ఇంటర్నేషనల్‌ యూనియన్‌ ఫర్‌ కన్సర్వేషన్‌ ఆఫ్‌ నేచర్‌ (ఐయూసీఎన్‌) ఈ పక్షిని అంతరించిపోయే ప్రమాదమున్న జాబితా (రెడ్‌ లిస్ట్‌)లో చేర్చింది. 

ప్రాజెక్ట్‌ డాల్ఫిన్‌

  • దేశంలో డాల్ఫిన్‌లు, వాటి సహజ ఆవాసాలను పరిరక్షించే లక్ష్యంతో 2020, ఆగస్టు 15న దీన్ని ప్రారంభించారు. ప్రభుత్వం అస్సాం, రాజస్థాన్, మధ్యప్రదేశ్, పంజాబ్, లక్షద్వీప్‌లో ప్రధాన డాల్ఫిన్‌ ఆవాసాలను గుర్తించింది. గంగా నది డాల్ఫిన్‌ (ప్లాటానిస్టా గంగెటికా) అనే మంచి నీటి డాల్ఫిన్‌ జాతిని రక్షించడంపైనా ఈ ప్రాజెక్ట్‌ ప్రధానంగా దృష్టి సారించింది. ఇది ముఖ్యంగా భారత్, బంగ్లాదేశ్, నేపాల్‌లోని గంగా-బ్రహ్మపుత్ర నదీ వ్యవస్థలో, వాటి ఉపనదుల్లో కనిపిస్తుంది. 
2024, 2023లో ఏపీపీస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్, ఇంకా 2025లో ఏపీపీఎస్సీ ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ ప్రిలిమ్స్‌తోపాటు తెలంగాణ పోలీస్‌ ఎస్‌ఐ మెయిన్స్, ఏపీ పోలీస్‌ ఎస్‌ఐ ప్రిలిమ్స్, 2026, 2025లో ఎస్‌ఎస్‌సీ - సీహెచ్‌ఎస్‌ఎల్, ఎంటీఎస్, ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ, గ్రూప్‌-డి తదితర పోటీపరీక్షల్లో ఈ టాపిక్‌ నుంచి అడిగిన 110కి పైగా ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్‌ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్‌ నాలెడ్జ్‌ & కరెంట్‌ అఫైర్స్‌ కాంబో కోర్సు’కి సబ్‌స్క్రైబ్‌ చేసుకోండి.  వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. భారతదేశంలో ఆసియా చిరుత పులి ఏ సంవత్సరంలో అంతరించిపోయినట్లు ప్రకటించారు? (ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ, 2021)

1) 1952   2) 1947   3) 1950   4) 1948

సమాధానం: 1

2. భూమిపై అత్యంత వేగంగా పరిగెత్తే క్షీరదం ఏది? (ఓఎస్‌ఎస్‌సీ సీజీఎల్, 2022)

1) కృష్ణ జింక             2) చిరుతపులి

3) కుందేలు               4) సింహం

సమాధానం: 2

3. భారతదేశంలో ప్రాజెక్ట్‌ క్రోకొడైల్‌ను ఏ సంవత్సరంలో ప్రారంభించారు? (హెచ్‌పీపీఏసీసీ జీఎస్, 2017)

1) 1973        2) 1975           3) 1972       4) 1980

సమాధానం: 2

4. గ్రేట్‌ ఇండియన్‌ బస్టర్డ్‌ కింది ఏ రాష్ట్ర పక్షిగా గుర్తింపు పొందింది? (డీడీఏ జేఈ (సివిల్‌), 2025)

1) మధ్యప్రదేశ్‌     2) మహారాష్ట్ర

3) రాజస్థాన్‌       4) గుజరాత్‌

సమాధానం: 3

5. In March 2026, the birth of cheetah cubs in India was reported from which national park?
(RRB Group D, 2026)

1) Ranthambore National Park            2) Kuno National Park

3) Kanha National Park                4) Jim Corbett National Park

Ans: 2

6. Which country has gifted India eight cheetahs for the next phase of Project Cheetah, as witnessed during a symbolic release at Mokolodi Nature Reserve in November 2025?
(RRB NTPC (UG) CBT-I, 2026)

1) Kenya        2) Namibia        3) Botswana        4) South Africa

Ans: 3
7. Apart from the eastern coast of India, the saltwater crocodile population is present within the Bhitarkanika Wildlife Sanctuary of _____.
(AP High Court Stenographer Grade II/ Jr Assistant/ Typist/ Field Assistant, 2025)

1) Gujarat        2) Rajasthan        3) Kerala        4) Odisha

Ans: 4
8. The Sudasari Great Indian Bustard Breeding centre is in which of the following state?
(SSC CHSL Tier-1, 2025)

1) Rajasthan            2) Tamil Nadu        3) Kerala        4) Karnataka

Ans: 1 

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram