భారతదేశ చరిత్రలో ముఖ్యమైన యుద్ధాలు (పార్ట్‌ - 3)

భారతదేశ చరిత్రలో ముఖ్యమైన యుద్ధాలు (పార్ట్‌ - 3)

భారతదేశ చరిత్రను పరిశీలిస్తే అధికారం, విజయాలు, ప్రతిఘటనలకు సంబంధించిన పోరాట యుద్ధాలే ప్రముఖంగా కనిపిస్తాయి. ఈ సంఘర్షణలు గొప్ప సామ్రాజ్యాల ఆవిర్భావానికి, పతనానికి దారి తీశాయి. యుద్ధ వ్యూహాల్లో కొత్త పద్ధతులను పరిచయం చేశాయి. దేశ చరిత్ర గమనాన్ని మార్చడంలో దోహదం చేశాయి. ఇవి భారతదేశ రాజకీయ, సంస్కృతిక స్వరూపాన్ని తీర్చిదిద్దడంలో కీలకపాత్ర పోషించాయి. దేశ  చరిత్రకు సంబంధించిన అధ్యయనంలో ఇవి ముఖ్యం. పార్ట్‌-1, పార్ట్‌-2లో యుద్ధాల విభజన, ప్రాచీన - మధ్యయుగ కాలంలో భారతదేశ చరిత్రలో జరిగిన యుద్ధాల గురించి ఉంది. ఈ భాగంలో మధ్యయుగ కాలంలోని మరిన్ని ముఖ్యమైన సంగ్రామాల గురించి తెలుసుకుందాం..!

  • క్రీ.శ.700 నుంచి క్రీ.శ.1700 వరకు జరిగిన యుద్ధాలు మధ్యయుగ కాలం కోవలోకి వస్తాయి. ఆ సమయంలో రాజపుత్ర రాజ్యాలు, ఢిల్లీ సుల్తానులు, మొగల్‌ సామ్రాజ్యం స్థాపన, దండయాత్రలు జరిగాయి. 

మొదటి పానిపట్‌ యుద్ధం

  • ఇది 1526, ఏప్రిల్‌ 21న ప్రస్తుత హరియాణాలోని పానిపట్‌ సమీపంలో నాటి ఢిల్లీ సుల్తాన్‌ ఇబ్రహీం లోడీ, కాబూలిస్థాన్‌కు చెందిన తైమూరిడ్‌ (Timurid) పాలకుడు జహీరుద్దీన్‌ బాబర్‌ మధ్య జరిగింది. ఈ యుద్ధంలో ఇబ్రహీం మరణించాడు. ఫలితంగా లోడీ వంశం అంతమై భారత ఉపఖండంలో మొగల్‌ సామ్రాజ్య స్థాపన జరిగింది. ఇది భారతదేశ చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి నాందిగా నిలిచింది.

కణ్వ యుద్ధం 

  • ఇది 1527 మార్చి 16న రాజస్థాన్‌లోని ఫతేపూర్‌ సిక్రీ దగ్గర ఉన్న కణ్వ ప్రాంతంలో జరిగింది. మేవాడ్‌ పాలకుడు, సిసోడియా వంశస్తుడైన రాణా సంగ్రామ్‌ సింగ్‌ (రాణా సంగ), బాబర్‌ మధ్య ఈ యుద్ధం జరిగింది. ఇందులో బాబర్‌ జిహాద్‌ను ప్రకటించి విజయం సాధించాడు. మధ్యయుగ భారతదేశ చరిత్రలో ఇది ఒక కీలక యుద్ధంగా నిలిచింది. ఎందుకంటే ఉత్తర భారతదేశంలో మొగల్‌ అధికారాన్ని సుస్థిరం చేసింది. 

చందేరీ యుద్ధం

  • 1528, జనవరిలో మొగల్‌ చక్రవర్తి బాబర్, మాల్వా రాజపుత్ర రాజైన మేదినీ రాయ్‌ మధ్య జరిగింది. మాల్వా రాజధాని చందేరీ (ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో ఉంది) దీనికి వేదికగా నిలిచింది. బాబర్‌ విజయం రాజపుత్ర కూటమికి పెద్ద ఎదురు దెబ్బగా పరిణమించింది. మాల్వాతోపాటు బుందేల్‌ఖండ్‌ ప్రాంతాలకు మొగలుల ప్రభావం విస్తరించింది.

ఘాఘ్రా యుద్ధం

  • 1529 మే 6న బాబర్‌కు మహమూద్‌ లోడీ నాయకత్వంలోని ఆఫ్గన్‌ కూటమికి మధ్య ఇది జరిగింది. లోడీకి బెంగాల్‌ సుల్తాన్‌ సుస్రత్‌ షా మద్దతు ఇచ్చాడు. ప్రస్తుత బిహార్‌లోని ఘాఘ్రా నదీ తీరాన ఇది జరిగింది. భారతదేశంలో బాబర్‌ పాల్గొన్న చివరి ప్రధాన యుద్ధం ఇదే. ఇందులోనూ మొగలులు విజయం సాధించారు. ఉత్తర భారతదేశంపై బాబర్‌ స్థిరమైన పట్టు సాధించాడు.

రెండో పానిపట్‌ యుద్ధం

  • 1556, నవంబరు 5న అక్బర్, ఢిల్లీ రాజు హేమచంద్ర విక్రమాదిత్య (హేము) మధ్య ప్రస్తుత హరియాణాలోని పానిపట్‌ వద్ద ఈ యుద్ధం జరిగింది. అప్పుడు అక్బర్‌ వయసు 14 ఏళ్లు. దీంతో బైరామ్‌ఖాన్‌ నాయకత్వంలో యుద్ధం చేసిన మొగలులు విజయం సాధించి ఢిల్లీ - ఆగ్రాపై మళ్లీ పట్టు దక్కించుకున్నారు. ఈ యుద్ధం భారతదేశంలో అక్బర్‌ సుదీర్ఘ పాలనకు రాజకీయ పునాది వేసింది. 

హల్దీఘాటీ యుద్ధం

  • 1576, జూన్‌ 18న అంబర్‌ రాజా మాన్‌సింగ్‌ నాయకత్వంలోని మొగల్‌ సామ్రాజ్య సైన్యానికి, మహారాణా ప్రతాప్‌ నేతృత్వంలోని మేవాడ్‌ సేనకు మధ్య జరిగింది. ఈ సంగ్రామం ప్రస్తుత రాజస్థాన్‌లోని ఆరావళి కొండల్లోని చిన్న పర్వత మార్గమైన హల్దీఘాటీ కనుమ వద్ద జరిగింది. రాజపుత్ర రాజ్యాల్లో మొగల్‌ పాలనను విస్తరించాలనే అక్బర్‌ చక్రవర్తి విస్తృత విధానంలో ఇది ఒక భాగం.
ఆయా యుద్ధాలకు దారితీసిన కారణాలు, వాటి పూర్తి ఫలితాలతోపాటు 2026, 2025లో ఎస్‌ఎస్‌సీ, ఆర్‌ఆర్‌బీ పరీక్షలతోపాటు గతంలో పలు పోటీపరీక్షల్లో ఈ టాపిక్‌ నుంచి అడిగిన ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్‌ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్‌ నాలెడ్జ్‌ & కరెంట్‌ అఫైర్స్‌ కాంబో కోర్సు’కి సబ్‌స్క్రైబ్‌ చేసుకోండి. ఇప్పుడు దసరా పండుగ సందర్భంగా ప్రత్యేక ఆఫర్‌ మీ కోసం..! వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. 1528లో జరిగిన చందేరి యుద్ధంలో ఎవరు ఓడిపోయారు? (ఎస్‌ఎస్‌సీ సీజీఎల్‌ టైర్‌ 1, 2023)

1) షేర్‌షా సూరి                2) బాబర్‌

3) సికిందర్‌ లోడీ                4) మేదినీ రాయ్‌

సమాధానం: 4

2. మొదటి పానిపట్‌ యుద్ధం కింది దేని ఆరంభానికి నాంది పలికింది? (ఎస్‌ఎస్‌సీ ఎంటీఎస్, 2024)

1) భారతదేశంలో ఫ్రెంచ్‌ ఈస్టిండియా కంపెనీ స్థాపనకు

2) భారతదేశంలో మొగల్‌ పాలనకు

3) భారతదేశంలో బ్రిటిష్‌ ఈస్టిండియా కంపెనీ స్థాపనకు

4) భారతదేశంలో సుల్తానేట్ల పాలనకు

సమాధానం: 2

3. మొదటి పానిపట్‌ యుద్ధం ఎప్పుడు జరిగింది? (యూపీఎస్‌ఎస్‌ఎస్సీ జేఈ, 2021)

1) 1521        2) 1526        3) 1556         4) 1761

సమాధానం: 2

4. కణ్వ యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది?(ఎస్‌ఎస్‌సీ ఎంటీఎస్, 2022)

1) బాబర్, ఇబ్రహీం లోడీ                    2) బాబర్, రాణా సంగ్రామ్‌

3) షేర్‌షా సూరి, రాణా సంగ్రామ్‌              4) బాబర్, షేర్‌షా సూరి

సమాధానం: 2

5. Who defeated Ibrahim Lodi in the first Battle of Panipat?
(SSC CHSL, 2020)

1) Sher Shah    2) Mohammad Ghori        3) Babur        4) Akbar

Ans: 3

6. The Battle of Khanwa (1527) was fought between Babur and which of the following rulers?
(RRB NTPC (UG) CBT-I, 2026)

1) Rana Sanga           2) Ibrahim Lodi        

3) Sher Shah Suri        4) Bairam Khan

Ans: 1

7. Which of the following battles was fought between Babur and Rana Sanga in 1527?
(SSC CGL Tier-I, 2024)

1) Battle of Panipat        2) Battle of Khanwa

3) Second battle of Panipat    4) Battle of Chanderi

Ans: 2
   
8. Medini Rai of Chanderi, Hasan Khan of Mewat and Mahmud Lodi joined Rana Sanga with their forces to fight against which of the following Mughal rulers?
(SSC CGL Tier-I, 2024)

1) Babur        2) Akbar        3) Aurangzeb        4) Humayun

Ans: 1

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram