ప్రాచీన కాలం నుంచి ఆధునిక యుగం వరకు భారతదేశ చరిత్రలో అనేక యుద్ధాలు జరిగాయి. మన ఉపఖండంలో రాజ్యాలు - సామ్రాజ్యాల ఆవిర్భావం, వలసవాద శక్తుల ఉత్థాన పతనాలను తీర్చిదిద్దడంలో ఇవి ముఖ్య భూమిక పోషించాయి. పార్ట్-1లో యుద్ధాల విభజన, ప్రాచీన భారతదేశ చరిత్రలో జరిగిన యుద్ధాల గురించిన సమాచారం ఉంది. ఈ భాగంలో మధ్యయుగ కాలంలో జరిగిన ప్రధాన యుద్ధాల గురించి తెలుసుకుందాం..!
మొదటి తరైన్ యుద్ధం (First Battle of Tarain)
మధ్యయుగ భారతదేశ చరిత్రలో ఒక కీలక మలుపుగా తరైన్ యుద్ధాన్ని పేర్కొంటారు. ఇది క్రీ.శ.1191లో మహమ్మద్ ఘోరీ నాయకత్వంలోని టర్కిష్ తెగ అయిన ఘారిడ్లకు (Ghurids); అజ్మీర్ పాలకుడు పృథ్వీరాజ్ చౌహాన్ నేతృత్వంలోని రాజపుత్రులకు మధ్య జరిగింది. ఈ యుద్ధం ప్రస్తుత హరియాణాలోని తారావోరి (తరైన్) ప్రాంతంలో జరిగింది. రాజపుత్రులంతా ఐక్యంగా పోరాడి ఘోరీ మహమ్మద్ సైన్యాన్ని ఓడించారు.
రెండో తరైన్ యుద్ధం (Second Battle of Tarain)
మహమ్మద్ ఘోరీ, పృథ్వీరాజ్ చౌహన్ మధ్య క్రీ.శ.1192లో హరియాణాలోని తారావోరి (తరైన్) ప్రాంతంలో ఈ యుద్ధం జరిగింది. ఇందులో ఘోరీ విజయం సాధించాడు. ఈ సంగ్రామం మధ్యయుగ భారతదేశ చరిత్రలో కీలక మార్పుకి నాంది పలికింది. ఉత్తర భారతంలో రాజపుత్రుల శక్తి క్షీణించి, ముస్లింల పాలనకు మార్గం సుగమమైంది. ఈ రెండు తరైన్ యుద్ధాలను ‘స్థానేశ్వర్ యుద్ధాలు’ అని కూడా పిలుస్తారు.
చందేవార్ యుద్ధం (Battle of Chandawar)
ఈ యుద్ధాన్ని ఉత్తర భారతదేశ చరిత్రలో కీలకఘట్టంగా పేర్కొంటారు. ఇది క్రీ.శ.1194లో మహమ్మద్ ఘోరీకి, కనౌజ్ పాలకుడైన జయచంద్రుడికి మధ్య జరిగింది. సారవంతమైన గంగా పరీవాహక ప్రాంతంలో ఘారిడ్ సామ్రాజ్య విస్తరణకు ఇది దోహదం చేసింది. ఈ యుద్ధం ఆగ్రా సమీపంలోని యమునా నది తీరాన ఫిరోజాబాద్ దగ్గర్లో ఉన్న చందేవార్ (ప్రస్తుత చందవాల్) వద్ద జరిగింది.
కిలి యుద్ధం (Battle of Kili)
ఈ యుద్ధం క్రీ.శ.1299లో కుత్లుగ్ ఖ్వాజా నాయకత్వంలోని చగతై ఖానేట్ (Chagatai Khanate) మంగోల్ దళాలకు అల్లాఉద్దీన్ ఖిల్జీ నేతృత్వంలోని ఢిల్తీ సుల్తానేట్కు మధ్య జరిగింది. మంగోలులు మధ్య ఆసియాలోని యురల్ పర్వతాల నుంచి గోబీ ఎడారి వరకు విస్తరించిన ప్రాంతంలో నివసించిన సంచార జాతి ప్రజలు. ఈ యుద్ధంలోఅల్లాఉద్దీన్ విజయం సాధించాడు.
ఢిల్లీ యుద్ధం (Battle of Delhi)
దీన్నే తైమూర్ దండయాత్రగా పేర్కొంటారు. మధ్యయుగ భారతదేశ చరిత్రలోనే అత్యంత వినాశకరమైన విదేశీదాడుల్లో ఇది ఒకటి. ఈ యుద్ధం క్రీ.శ.1398లో మధ్య ఆసియా పాలకుడు, తైమూరిడ్ సామ్రాజ్య స్థాపకుడైన అమీర్ తైమూర్‌కి, తుగ్లక్ వంశానికి చెందిన సుల్తాన్ నసీరుద్దీన్ మహమూద్ షా తుగ్లక్ నడుమ జరిగింది. ఈ సంగ్రామంలో గెలిచిన తైమూర్ ఢిల్లీని కొల్లగొట్టి, నగరాన్ని నాశనం చేశాడు.
| ఆయా యుద్ధాల కారణాలు, తీరుతెన్నులు, ఫలితాలతో సహా గతంలో ఈ అంశంపై ఏపీపీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమినరీ, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ, యూజీసీ నెట్, ఎస్ఎస్సీ - సీజీఎల్, సీహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ తదితర పోటీపరీక్షల్లో అడిగిన 100కి పైగా ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్ నాలెడ్జ్ & కరెంట్ అఫైర్స్ కోర్సుII’కి సబ్‌స్క్రైబ్ చేసుకోండి. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978 |
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
1. మొదటి తరైన్ యుద్ధంలో ఎవరు విజయం సాధించారు?
(హెచ్ఎస్ఎస్సీ జేఈ ఈఈ, 2019)
1) మహమ్మద్ ఘోరీ 2) గోవిత దై
3) పృథ్వీరాజ్ చౌహాన్ 4) జయచంద్ర
సమాధానం: 3
2. క్రీ.శ.1194లో మహమ్మద్ ఘోరీకి కింది ఎవరికి మధ్య చందేవార్ యుద్ధం జరిగింది?
(ఎస్ఎస్సీ జేఈ ఎలక్ట్రికల్ 2024)
1) జయచంద్రుడు 2) గోవింద చంద్ర
3) విజయచంద్ర 4) హరిశ్చంద్ర
సమాధానం: 1
3. మొదటి తరైన్ యుద్ధం ఎప్పుడు జరిగింది?
(డబ్ల్యూబీసీఎస్ ప్రిలిమ్స్, 2020)
1) క్రీ.శ.1175 2) క్రీ.శ.1191
3) క్రీ.శ.1192 4) క్రీ.శ.1206
సమాధానం: 2
4. చందేవార్ యుద్ధం మహమ్మద్ ఘోరీకి కింది ఏ రాజ వంశానికి చెందిన కనౌజ్ పాలకుడైన జయచంద్రుడికి మధ్య జరిగింది?
(ఎస్ఎస్సీ జీడీ, 2021)
1) గహద్వాల 2) బాక్ట్రియన్
3) గుప్త 4) చౌహాన్
సమాధానం: 1
5. Who defeated Prithviraj Chauhan in the second battle of Tarain in 1192 AD?
(SSC MTS, 2022)
1) Babur 2) Iltutmish
3) Muhammad Ghori 4) Alauddin Khalji
Ans: 3
6. Prithviraj Chauhan and Muhammad Ghori fought the battle of ______.
(SSC CGL Tier-I, 2021)
1) Tallikota 2) Chanderi 3) Tarain 4) Chausa
Ans: 3
7. Between who among the following did the Battle of Chandawar take place?
(SSC CHSL, Tier-I, 2023)
1) Jaychand and Mahmood Gaznavi
2) Jaychand and Muhammad Ghori
3) Prithviraj III and Mahmood Gaznavi
4) Prithviraj III and Muhammad Ghori
Ans: 2
8. With reference to Indian history, consider the following statements:
i. The first Mongol invasion of India happened during the reign of Jalal-ud-din Khalji.
ii. During the reign of Ala-ud-din Khalji, one Mongol assault marched up to Delhi and besieged the city.
iii. Muhammad-bin-Tughlaq temporarily lost portions of north-west of his kingdom to Mongols.
Which of the statements given above is/are correct?
(UPSC Civil Services Exam, 2022)
1) i and ii 2) ii only 3) i and iii 4) iii only
Ans: 2
Link copied to clipboard!
ఇస్రో- ఎస్డీఎస్సీలో టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు
ఎయిమ్స్ గోరఖ్‌పుర్‌లో ఫ్యాకల్టీ పోస్టులు
ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్‌లో ఇంజినీర్ పోస్టులు
యూనివర్సిటీ ఆఫ్ లఖ్‌నవూలో ఉద్యోగాలు
ఎన్పీఎల్లో ప్రాజెక్ట్ స్టాఫ్ ఉద్యోగాలు
భారతీయ రిజర్వ్ బ్యాంక్‌లో ఫార్మసిస్ట్ ఉద్యోగాలు
డీఎంహెచ్ఓ మహబూబాబాద్‌లో స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు
సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్లో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు
బీహెచ్ఈఎల్లో ఎలక్ట్రిషియన్ ఉద్యోగాలు
సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాలో జూనియర్ కోర్ట్ అటెండెంట్ పోస్టులు
నిఫ్ట్‌లో యూజీ, పీజీ, పీహెచ్డీ 2027 ప్రవేశాలు
ఎస్కేఎల్టీజీహెచ్యూలో ఎంఎస్సీ, పీహెచ్డీ హార్టికల్చర్ ప్రవేశాలు 2026-27
పీజేటీఏయూలో మాస్టర్స్ డిగ్రీ ప్రోగ్రామ్‌ల్లో ప్రవేశాలు
జాయింట్ సీఎస్ఐఆర్- యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ డిసెంబర్-2026
కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్)-2027
జేవియర్ ఆప్టిట్యూడ్ టెస్ట్-2027
కొచ్చి మెట్రో రైల్ లిమిటెడ్‌లో టెక్నికల్/నాన్‌టెక్నికల్ అప్రెంటిస్ ఉద్యోగాలు
ఐఆర్సీఓఎన్లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఉద్యోగాలు
యూకో బ్యాంక్‌లో అప్రెంటిస్ పోస్టులు
డీఆర్డీఓ - ఐటీఆర్ చండీగఢ్‌లో అప్రెంటిస్ పోస్టులు
నావల్ డాక్‌యార్డ్, ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్‌లో అప్రెంటిస్ పోస్టులు
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో అప్రెంటిస్ ఉద్యోగాలు
నార్త్ వెస్ట్రన్ రైల్వేలో యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు
ఆర్ఆర్సీ- సదరన్ రైల్వేలో స్పోర్ట్స్ కోటా పోస్టులు
అమల్లోకి భారత్-న్యూజిలాండ్ ఎఫ్‌టీఏ
భారత్ నుంచి అమెరికాకు పెట్టుబడులు
భారత జీడీపీ వృద్ధి 7.1- 7.3%
హైదరాబాద్-జర్మనీ సంస్థల ఒప్పందం
భారతీయ బ్యాంకులోకి అతిపెద్ద ఎఫ్‌డీఐ
2026-27లో భారత్ వృద్ధి 7%
ద్రవ్యోల్బణ రేటు 5.54%
తొలి త్రైమాసిక ఎఫ్‌డీఐల్లో జపాన్ టాప్
రెపో రేటు
ఎయిరిండియా, సింగపూర్ ఎయిర్‌లైన్స్ భాగస్వామ్యం
యునెస్కో నివేదిక
అయిదు కొత్త జాతి మొక్కలు
‘అవెండస్ వెల్త్ హురున్ ఇండియా యూ35 లిస్ట్ 2026’
యునిసెఫ్ నివేదిక
ప్రపంచ టాప్ 2 శాతం శాస్త్రవేత్తల జాబితా
బులెటిన్ ఆఫ్ ద అటామిక్ సైంటిస్ట్స్
యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండస్ట్రీస్
డబ్ల్యూహెచ్‌వో, యునిసెఫ్ సంయుక్త నివేదిక
ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకుల అధ్యయనం
ఈపీఐసీ నివేదిక