సమాచార హక్కు చట్టం

సమాచార హక్కు చట్టం

సమాచార హక్కు అనేది ప్రజాస్వామ్య పాలనకు ఒక మూలస్తంభం. ఇది పౌరులకు ప్రజా సమాచారాన్ని పొందేందుకు, అధికారులను జవాబుదారీగా ఉంచేందుకు అధికారం కల్పిస్తుంది. ఈ హక్కు అమలుకు ప్రభుత్వం తెచ్చిన చట్టమే సమాచార హక్కు (స.హ.) చట్టం. ప్రభుత్వ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించడంతోపాటు పాలనా వ్యవహారాల్లో గోప్యతను నివారించి, ప్రభుత్వ విధానాలు ప్రజలు తెలుసుకునేలా చేయడంలో ఇది దోహదం చేస్తుంది. దీని ప్రకారం పౌరులు కోరుకున్న సమాచారాన్ని ప్రభుత్వ అధికారుల నుంచి పొందొచ్చు. ఇది ప్రభుత్వ పాలనలో బాధ్యతాయుత విధానానికి అవకాశం కల్పిస్తుంది. దీన్ని ఉపయోగించుకుని ప్రజలు తమ సమస్యలను పరిష్కరించుకోవడమేకాక అవినీతిని సైతం అరికట్టొచ్చు. పారదర్శకతను పెంపొందించే విషయంలో ప్రపంచంలోనే అత్యుత్తమమైందని మన స.హ.చట్టం పేరుగాంచింది. సామాన్యుడి చేతిలో వజ్రాయుధంగా కీర్తి గడించిన ఈ చట్టం మన దేశంలో అక్టోబరు 12న అమల్లోకి వచ్చింది. ఈ సందర్భంగా పోటీపరీక్షల కోణంలో దీనికి సంబంధించిన ముఖ్య విషయాలు తెలుసుకుందాం..! 

  • సమాచార హక్కు చట్టం (Right to Information Act - RTI) అనేది 2005 నుంచి భారతదేశంలో అమలవుతోన్న ఒక చట్టం. పౌరులు ప్రభుత్వ చర్యలు, నిర్ణయాలు, ఖర్చుల గురించి సమాచారం కోరవచ్చు. కొన్ని సున్నితమైన సంస్థలు (రక్షణ, నిఘా) మినహా దేశంలోని అన్ని ప్రభుత్వ సంస్థలకు ఆర్‌టీఐ చట్టం వర్తిస్తుంది. పౌరులు సాధారణ దరఖాస్తు పంపడం ద్వారా ప్రశ్నలు అడగొచ్చు.  
  • ప్రభుత్వ పాలనకు సంబంధించిన విషయాలు ప్రజలకు తెలియకూడదనే ఉద్దేశంతో బ్రిటిష్‌ ప్రభుత్వం 1923లో ‘అధికార రహస్యాల చట్టాన్ని (అఫీషియల్‌ సీక్రెట్‌ యాక్ట్‌) తెచ్చింది. మన రాజ్యాంగంలోని వాక్‌స్వాతంత్య్రం, భావ ప్రకటన స్వేచ్ఛ హక్కును తెలిపే ఆర్టికల్‌ 19(1)(ఎ)లోనే సమాచార హక్కు కూడా ఉంది. 1975లో స్టేట్‌ ఆఫ్‌ ఉత్తర్‌ ప్రదేశ్‌ వర్సెస్‌ రాజ్‌ నారాయణ్‌ కేసులో సుప్రీంకోర్టు ఇదే విషయాన్ని పేర్కొంది.  
  • జాతీయ అత్యయిక పరిస్థితి (1975) తర్వాత 1977-80 కాలంలో పౌరహక్కుల నేతలు దేశవ్యాప్తంగా పారదర్శక ప్రభుత్వం (open government) కోసం పోరాడటంతోపాటు సమాచార హక్కుకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్‌ చేశారు. 1990 దశకంలో రాజస్థాన్‌లోని ‘మజ్దూర్‌ కిసాన్‌ శక్తి సంఘటన్‌ (ఎంకేఎస్‌ఎస్‌)’ లాంటి సంస్థలు క్షేత్ర స్థాయిలో ఉద్యమించాయి.
  • సమాచార హక్కు చట్టాన్ని ప్రవేశపెట్టి ఆమోదించిన మొదటి భారతీయ రాష్ట్రం తమిళనాడు. ఇది 1997, మే 4న రాష్ట్రస్థాయి ఆర్‌టీఐ చట్టాన్ని ఆమోదించింది. రెండో రాష్ట్రం గోవా. ఇది 1997, జులై 31న ఆర్‌టీఐ చట్టాన్ని రూపొందించింది. రామన్‌ మెగసెసె అవార్డు గ్రహీతలు సందీప్‌ పాండే, అరుణారాయ్‌ కృషి ఫలితంగా మనదేశంలో సమాచార హక్కు చట్టాన్ని రూపొందించారు.
  • అటల్‌ బిహారీ వాజ్‌పేయీ నాయకత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం 2002లో ‘సమాచార స్వాతంత్య్ర చట్టాన్ని’ రూపొందించింది. ఈ చట్టంలోని లోపాలను సవరించి డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం జాతీయ సమాచార హక్కు చట్టాన్ని 2005ను తీసుకొచ్చింది. భారత పార్లమెంట్‌ 2005, జూన్‌ 15న ఈ చట్టాన్ని ఆమోదించింది. 
సహచట్టంలోని ముఖ్యమైన నిబంధనలు, చట్టం పరిధిలోకి వచ్చే, రాని అంశాలు, ప్రపంచవ్యాప్తంగా ఈ హక్కు అమలుతీరు, సమాచార కమిషన్‌ - ప్రధాన కమిషనర్ల వివరాలతోపాటు గతంలో టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-4, టీఎస్‌పీఎస్సీ ఏఈఈ, ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ, గ్రూప్‌-డి, యూజీసీ నెట్, యూపీఎస్సీ, ఎస్‌ఎస్‌సీ తదితర పోటీపరీక్షల్లో ఈ అంశంపై అడిగిన 100కి పైగా  ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్‌ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్‌ నాలెడ్జ్‌ & కరెంట్‌ అఫైర్స్‌ కాంబో కోర్సు’కి సబ్‌స్క్రైబ్‌ చేసుకోండి. ఇప్పుడు దసరా పండుగ సందర్భంగా ప్రత్యేక ఆఫర్‌ మీ కోసం..! వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. సమాచార హక్కు చట్టం కింద సమాచారాన్ని పొందడానికి గల కాలపరిమితి?

(టీఎన్‌యూఎస్‌ఆర్‌బీ కానిస్టేబుల్, 2020)

1) 20 రోజులు                2) 25 రోజులు

3) 30 రోజులు                4) 35 రోజులు

సమాధానం: 3

2. ‘‘సమాచార హక్కు అనేది కేవలం ప్రశ్నలు అడగడం, సమాధానాలు పొందడం గురించి మాత్రమే కాదు’’ ఈ వాక్యం ఆర్‌టీఐ చట్టం 2005లోని ఏ సెక్షన్‌తో దగ్గరి సంబంధాన్ని కలిగి ఉంది?

(ఎంహెచ్‌ ఎస్‌ఈటీ కామర్స్, 2024)

1) సెక్షన్‌ 3                2) సెక్షన్‌ 2(హెచ్‌)

3) సెక్షన్‌ 2(ఎన్‌)           4) సెక్షన్‌ 2(జె)

సమాధానం: 4

3. సమాచార హక్కు చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది?

(ఏపీఎస్‌ఎస్‌బీ సీజీఎల్, 2024), (యూకేపీఎస్సీ ఆర్‌ఓ/ ఏఆర్‌ఓ, 2012),

(ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ (యూజీ), 2025), (ఎంపీ పట్వారీ, 2017)

1) 2001, సెప్టెంబరు 12            2) 2005, అక్టోబరు 12

3) 2000, డిసెంబరు 12            4) 2020, నవంబరు 12

సమాధానం: 2

4. భారతదేశంలో సమాచార హక్కు అనేది?

(బిహార్‌ టీఆర్‌ఈ 3.0 (సోషల్‌ సైన్స్‌), 2024)

1) ప్రాథమిక హక్కు                2) చట్టపరమైన హక్కు

3) సామాజిక హక్కు                4) పైవాటిలో ఒకటి కంటే ఎక్కువ

5) ఏదీకాదు

సమాధానం: 1

5. The RTI Act applies to which of the followings in India?
(RRB NTPC (UG) CBT-I, 2025)
1) Only Judiciary                    2) Only Central Government
3) All Public Authorities                4) Only State Government 
Ans: 3
6. Which of the following is the primary objective of the Right to Information (RTI) Act, 2005?
(RRB NTPC (UG) CBT-I, 2025)
1) To promote transparency and accountability in government functioning
2) To regulate foreign investment in India
3) To control corruption in the judiciary
4) To ensure reservations for backwards classes
Ans: 1 
7. Which of the following statements with reference to the RTI Act is/are correct?
i. The Chief Information Commissioner and other Information Commissioners are appointed by the President of India on the recommendation of a committee headed by the Chief Justice of India.
ii. While the Chief Information Commissioner is not eligible for reappointment after completion of the term of five years, other Information Commissioners are eligible for reappointment.
Select the answer using the codes given below :
(UPSC EPFO EO/AO, 2025)
1) i only        2) ii only        3) Both i and ii        4) Neither i nor ii
Ans: 2
8. Which of the following is the main objective of the Right to Information Act?
(RRB NTPC (UG) CBT-I, 2025)
1) To ensure secrecy in public administration
2) To provide private data to media houses
3) To promote transparency and accountability
4) To prevent public access to government records
Ans: 3

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram