భారతదేశంలో చరిత్రపూర్వయుగం

భారతదేశంలో చరిత్రపూర్వయుగం

మన దేశంలో చరిత్రపూర్వ యుగం అనేది లిపి ఆవిష్కరణకు ముందున్న కాలాన్ని సూచిస్తుంది. ఎలాంటి లిఖిత పూర్వక ఆధారాలు అందుబాటులో లేనందున ఆ కాలం నాటి విషయాలను ప్రధానంగా పురావస్తు తవ్వకాలు, రాతి పనిముట్లు, మట్టి పాత్రలు, జంతువుల ఎముకలు, మానవ సమాధులు, రాతి చిత్రాలు, నివాస స్థలాలు - మొక్కల అవశేషాలు లాంటి ఆధారాల ద్వారా తెలుసుకుంటారు. మానవుడి తొలి జీవిత విశేషాల అధ్యయనానికి, ఆ కాలాన్ని పునర్నిర్మించడానికి ఇది వీలు కల్పిస్తుంది. పోటీ పరీక్షల కోణంలో నాటి చరిత్రపూర్వ యుగం నాటి కాలాలు, పనిముట్ల గురించి తెలుసుకుందాం..!

  • భూమిపై అనేక మార్పుల తర్వాత డ్రయోపిథికస్‌ (కోతి లాంటిది), రామాపిథికస్‌ (మనిషి లాంటిది) అనే ప్రైమేట్స్‌ ఉనికిలోకి వచ్చాయి. వీటి ఆధారాలను ఇథియోపియా, టాంజానియాలో కనుక్కున్నారు. హోమినిడ్‌ లాంటి మొదటి మానవుడ్ని హోమో హబిలిస్‌ (చేతిని ఉపయోగించే మనిషి) అని పిలిచేవారు. వీరు రెండు మిలియన్‌ సంవత్సరాల క్రితం భూమిపై ఉన్నారని శాస్త్రవేత్తల అభిప్రాయం. వీరి ఆనవాళ్లు కెన్యాలోని కూబిఫోరా, టాంజానియాలోని ఓల్డువై జార్జ్‌ ప్రాంతాల్లో లభించాయి.
  • భారతదేశంలో క్రీ.పూ. 2,50,000 కాలంలో శివాలిక్‌ పర్వతాల వద్ద మనిషి ఉనికిలో ఉన్నట్లు ఆధారాలు లభించాయి. మహారాష్ట్రలోని బోరిలో 1.4 మిలియన్‌ సంవత్సరాల నాటి రాతి ఆయుధాలు, కళాఖండాలను కనుక్కున్నారు. పాకిస్థాన్‌లోని రివాత్‌లో 1.9 మిలియన్‌ సంవత్సరాల నాటి రాతి కళాఖండాల సమూహం లభ్యమైంది. వీటిని ‘పాలియోమాగ్నెటిక్‌ పద్ధతి’ ఆధారంగా కనుక్కున్నారు.
  • 1982లో జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియాకు చెందిన అరుణ్‌ సోనాకియా మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్‌లో ఉత్తర నర్మద ఒడ్డున హోమినిడ్‌ శిలాజాన్ని కనుక్కున్నారు. పురావస్తు శాస్త్రవేత్త విష్ణు ఎస్‌ వాకంకర్‌ మధ్యప్రదేశ్‌లోని భింబెట్కాలో చరిత్రపూర్వ యుగానికి చెందిన గుహ చిత్రలేఖనాలను కనుక్కున్నారు. మానవ పరిణామానికి సంబంధించి రాతపూర్వక ఆధారాలు లేదా రికార్డులు లేని కాలాన్ని పూర్వ చరిత్ర యుగం అంటారు.
  • డేనియల్‌ విల్సన్‌ అనే స్కాటిష్‌ చరిత్రకారుడు ప్రి-హిస్టారిక్‌ అనే పదాన్ని మొదటిసారి ఉపయోగించారు. ఆయన క్రీ.శ.1851లో The Archaeology and Pre Historic Annals of Scotland అనే గ్రంథాన్ని రాశారు. బ్రిటిష్‌ పురావస్తు శాస్త్రవేత్త రాబర్ట్‌ బ్రూస్‌ ఫుట్‌ 1863లో భారతదేశంలో మొదటిసారి పురావస్తు సర్వే ప్రారంభించాడు. అతడు అప్పటి మద్రాస్‌లోని పల్లవరంలో పాలియోలిథిక్‌కు చెందిన చేతి గొడ్డలిని కనుక్కున్నాడు.
భారతీయ రాతి యుగ వర్గీకరణ, పాలియోలిథిక్‌ యుగం - రకాలు, భారతదేశంలో ముఖ్యమైన పాలియోలిథిక్‌ ఏజ్‌ ప్రదేశాలు, మెసోలిథిక్‌ ఏజ్‌ (మధ్యరాతి యుగం),నియోలిథిక్‌ ఏజ్‌ (కొత్తరాతి యుగం)తోపాటు గతంలో యూపీఎస్సీ సివిల్స్, ఏపీ పోలీస్‌ ఎస్‌ఐ ప్రిలిమ్స్, యూజీసీ నెట్, ఎస్‌ఎస్‌సీ, ఆర్‌ఆర్‌బీ - ఎన్‌టీపీసీ, గ్రూప్‌-డి తదితర పోటీపరీక్షల్లో అడిగిన 90కి పైగా ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్‌ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్‌ నాలెడ్జ్‌ & కరెంట్‌ అఫైర్స్‌ కోర్సుII’కి సబ్‌స్క్రైబ్‌ చేసుకోండి. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. కటాల్‌ హ్యూయుక్‌ కిందివాటిలో ఏ కాలానికి చెందింది?

(ఎస్‌ఎస్‌సీ సీజీఎల్, 2022)

1) కొత్తరాతి యుగం             2) మధ్యరాతి యుగం

3) పాతరాతి యుగం             4) రాగిరాతి యుగం

సమాధానం: 1

2. మధ్యరాతి యుగం అనేది ఏ కాలం?

(ఏడబ్ల్యూఈఎస్‌ పీటీజీ, 2012)

1) నిప్పు కనుక్కున్న కాలం        

2) చక్రం కనుక్కున్న కాలం

3) వ్యవసాయం ప్రారంభమైన కాలం

4) మానవుడు సూక్ష్మ పనిముట్లను వాడటం ప్రారంభించిన కాలం

సమాధానం: 4

3. మానవ పరిణామక్రమంలోని ప్రారంభ దశలోని చరిత్రపూర్వ కాలాన్ని సాధారణంగా ఏమని పిలుస్తారు?

(ఎస్‌ఎస్‌సీ ఎంటీఎస్, 2023)

1) పాతరాతి యుగం            2) మధ్యరాతి యుగం

3) ఇనుప యుగం              4) కొత్తరాతి యుగం

సమాధానం: 1

4. భూమి వయసు ఎంత? (సుమారుగా)

(డీఎస్‌ఎస్‌ఎస్‌బీ జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్, 2022)

1) 4.5 వేల సంవత్సరాలు                2) 4.54 ట్రిలియన్‌ సంవత్సరాలు

3) 4.5 మిలియన్‌ సంవత్సరాలు            4) 4.54 బిలియన్‌ సంవత్సరాలు

సమాధానం: 4

5. During which of the following period Ostriches were found in India?
(SSC CGL, 2022)
1) Mesolithic        2) Chalcolithic        3) Neolithic            4) Palaeolithic
Ans: 4
6. The Palaeolithic period extends from 2 million years ago to about 12,000 years ago. This long stretch of time is divided into the Lower, Middle and Upper Palaeolithic. This long span of time covers ________ percent of human history. 
(SSC GD Constable, 2024) 
1) 89        2) 99        3) 59        4) 79
Ans: 2
7. During which period did humans start making composite tools using stone and wood?
(MP Police Constable, 2025)
1) Upper Paleolithic        2) Mesolithic        
3) Lower Paleolithic        4) Neolithic
Ans: 2
8. The three-age system for classification of pre-historic periods was introduced by: 
(SSC GD Constable, 2025)
1) John More        2) Robert Thomson 
3) Warren Hessler        4) Christian Jurgensen Thomsen 
Ans: 4

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram