భారతదేశంలోని రాజ్యాంగబద్ధ సంస్థలు (పార్ట్‌ - 2)

భారతదేశంలోని రాజ్యాంగబద్ధ సంస్థలు (పార్ట్‌ - 2)

రాజ్యాంగం ద్వారా ఏర్పాటైన సంస్థలను రాజ్యాంగబద్ధ సంస్థలు అంటారు. వీటికి నిర్దిష్ట అధికారాలు, విధులు, నిర్మాణం ఉంటాయి. ఇవి ప్రజాస్వామ్య పాలనను నిర్ధారించి, చట్టబద్ధమైన పాలనను అందిస్తాయి. స్వతంత్రంగా పనిచేస్తాయి. వీటి నిర్మాణంలో మార్పులు చేయాలంటే రాజ్యాంగ సవరణలు అవసరం. పాలనలో సమాఖ్య సమతౌల్యం, పారదర్శకత, నిష్పక్షపాతాన్ని కాపాడటంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. పార్ట్‌ - 1లో రాజ్యాంగబద్ధ సంస్థ అంటే ఏమిటి, దేశంలోని ముఖ్యమైన రాజ్యాంగబద్ధ సంస్థల్లో కొన్నింటిని తెలుసుకున్నాం. ఈ భాగంలో మరికొన్ని చూద్దాం!

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ)

ఇది ఆల్‌ ఇండియా సర్వీసెస్, సెంట్రల్‌ సివిల్‌ సర్వీసెస్‌కు అభ్యర్థులను నియమించే బాధ్యత కలిగిన దేశ అత్యున్నత రాజ్యాంగ సంస్థ. 1919 నాటి మాంటేగ్‌ - చెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణల చట్టం ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం ఒక పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని పేర్కొంది. దీనిలో భాగంగా ‘లీ కమిషన్‌’ సిఫార్సుల మేరకు 1926, అక్టోబరు 1న కేంద్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. 

ఎలక్షన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (ఈసీఐ)

ఇది పార్లమెంట్, రాష్ట్ర శాసనసభలు, భారత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవులకు ఎన్నికలు నిర్వహించే బాధ్యత కలిగిన స్వయం ప్రతిపత్తి ఉన్న రాజ్యాంగబద్ధ సంస్థ. 1950, జనవరి 25న ఏర్పాటైంది. దేశవ్యాప్తంగా ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరిగేలా చూస్తుంది. దీని ప్రధాన కార్యాలయం న్యూదిల్లీలో ఉంది. ఈ భవనాన్ని ‘నిర్వాచన్‌ సదన్‌’ అంటారు.

నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ షెడ్యూల్డ్‌ కాస్ట్స్‌ (ఎన్‌సీఎస్సీ)

ఇది షెడ్యూల్డ్‌ కులాల (ఎస్సీ) హక్కులు, ప్రయోజనాలను పరిరక్షించడానికి స్థాపించిన రాజ్యాంగబద్ధమైన స్వయం ప్రతిపత్తి సంస్థ. దీన్ని 2004, ఫిబ్రవరి 19న ఏర్పాటు చేశారు. ఇందులో ఒక ఛైర్మన్, ఒక వైస్‌ ఛైర్మన్, ముగ్గురు ఇతర సభ్యులుంటారు. వీరి పదవీ కాలం మూడేళ్లు. వీరిలో ఒక మహిళా సభ్యురాలు తప్పనిసరి. ఎన్‌సీఎస్సీ ప్రధాన కార్యాలయం న్యూదిల్లీలో ఉంది.

నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ షెడ్యూల్డ్‌ ట్రైబ్స్‌ (ఎన్‌సీఎస్టీ)

రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 338(ఎ) ప్రకారం, 89వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా జాతీయ షెడ్యూల్డ్‌ తెగల కమిషన్‌ 2004 ఫిబ్రవరి, 19న ఏర్పాటైంది. ఇది రాజ్యాంగబద్ధ సంస్థ. ప్రధాన కార్యాలయం న్యూదిల్లీలో ఉంది. ఈ కమిషన్‌ ఛైర్మన్‌కి కేబినెట్‌ మంత్రి హోదా, వైస్‌ ఛైర్మన్‌కి రాష్ట్ర మంత్రి హోదా, సభ్యులకు డిప్యూటీ మంత్రి హోదా కల్పిస్తారు.  

నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ బ్యాక్‌వర్డ్‌ క్లాసెస్‌ (ఎన్‌సీబీసీ)

మినిస్ట్రీ ఆఫ్‌ సోషల్‌ జస్టిస్‌ అండ్‌ ఎంపవర్‌మెంట్‌ శాఖ పరిధిలో నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ బ్యాక్‌వర్డ్‌ క్లాసెస్‌ యాక్ట్, 1993 ద్వారా ఎన్‌సీబీసీని ఏర్పాటు చేశారు. 1993, ఆగస్టు 14 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. 2018లో చేసిన రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా దీనికి రాజ్యాంగబద్ధ హోదా కల్పించారు. ప్రస్తుతం ఈ కమిషన్‌ ఛైర్మన్‌ సాధ్వీ నిరంజన్‌ జ్యోతి (2026, సెప్టెంబరు 12 నాటికి).

ఇంకా స్పెషల్‌ ఆఫీసర్‌ ఫర్‌ లింగ్విస్టిక్‌ మైనారిటీస్‌ (సీఎల్‌ఎం), ఆయా సంస్థల ఇతర ముఖ్యాంశాలతోపాటు గతంలో ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్, తెలంగాణ పోలీస్‌ ఎస్‌ఐ ప్రిలిమ్స్, తెలంగాణ పీఎస్సీ ప్రిలిమ్స్, యూపీఎస్సీ సివిల్స్, ఎస్‌ఎస్‌సీ - సీజీఎల్, సీహెచ్‌ఎస్‌ఎల్, ఆర్‌ఆర్‌బీ - గ్రూప్‌-డి, ఎన్‌టీపీసీ, యూజీసీ నెట్‌ తదితర పోటీపరీక్షల్లో ఈ అంశంపై అడిగిన 110కి పైగా ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్‌ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్‌ నాలెడ్జ్‌ & కరెంట్‌ అఫైర్స్‌ కోర్సుII’కి సబ్‌స్క్రైబ్‌ చేసుకోండి. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. యూపీఎస్సీ పూర్తి రూపం ఏమిటి?

(ఎస్‌ఎస్‌సీ ఎంటీఎస్, 2023)

1) యునైటెడ్‌ పబ్లిక్‌ సెక్యూరిటీ కమిషన్‌

2) యునైటెడ్‌ పవర్‌ అండ్‌ సెక్యూరిటీ కమిషన్‌

3) యునైటెడ్‌ ప్రైవేట్‌ సర్వీస్‌ కమిషన్‌

4) యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌

సమాధానం: 4

2. భారత రాజ్యాంగంలోని ఏ భాగంలో యూపీఎస్సీ గురించి పేర్కొన్నారు?

(ఓపీఎస్సీ ఓఏఎస్‌ (ప్రిలిమ్స్‌), 2025)

1) 7వ భాగం                    2) 13వ భాగం

3) 14వ భాగం                    4) 9వ భాగం

సమాధానం: 3

3. భారత యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) ఏ ఆర్టికల్‌ కింద ఏర్పాటైంది?

(ఎంపీ పట్వారీ, 2017)

1) 315           2) 234           3) 421           4) 56

సమాధానం: 1

4. భారత ఎన్నికల సంఘం అనేది?

(బిహార్‌ టీఆర్‌ఈ 3.0 (సోషల్‌ సైన్స్‌), 2024)

1) ఒక తాత్కాలిక రాజ్యాంగ సంస్థ            2) రాజ్యాంగేతర సంస్థ

3) శాశ్వత రాజ్యాంగబద్ధ సంస్థ            4) పైవాటిలో ఒకటి కంటే ఎక్కువ

5) ఏదీకాదు

సమాధానం: 3

5. The establishment of Union Public Service Commission, State Public Service Commissions and Joint Public Service Commission falls under which of the following features of the Constitution of India?  
(SSC CHSL, Tier-I, 2024)
1) Fundamental Rights    2) Parliamentary Government 
3) Federalism         4) Directive Principles of State Policy
Ans: 3
6. The Union Public Service Commission (UPSC) is a constitutional body under which Article of the Indian Constitution, and what is its primary responsibility?
(RPF Constable, 2025)
1) Article 325; Responsible for appointing Chief Ministers in states
2) Article 356; Responsible for appointing Governors in states
3) Article 310; Responsible for conducting state elections
4) Article 315; Responsible for recruitment and examinations for All India Services
Ans: 4
7. Which of the following administrative institutions of India completed 100 years of service in 2025?
(RRB Group D, 2026)
1) Union Public Service Commission (UPSC)
2) Election Commission of India (ECI)
3) Central Vigilance Commission (CVC)
4) Central Bureau of Investigation (CBI)
Ans: 1
8. Which Part of the Indian Constitution provides for the Union Public Service Commission?
(SSC CHSL, 2022)
1) Part X        2) Part VIII        3) Part XIV        4) Part XVI
Ans: 3

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram