భారతదేశ చరిత్రలో ముఖ్యమైన యుద్ధాలు (పార్ట్‌ - 1)

భారతదేశ చరిత్రలో ముఖ్యమైన యుద్ధాలు (పార్ట్‌ - 1)

భారతదేశ చరిత్ర గతిని మార్చడంలో, గొప్ప సామ్రాజ్యాల ఆవిర్భావం - పతనాలను నిర్ణయించడంలో, ఉపఖండం రాజకీయ స్వరూపాన్ని పునర్నిర్వచించడంలో యుద్ధాలు కీలకపాత్ర పోషించాయి. దేశ చారిత్రక, రాజకీయ, సాంస్కృతిక అస్తిత్వాన్ని రూపొందించడంలో ఇవి అత్యంత ప్రాధాన్యాన్ని కలిగి ఉన్నాయి. అధికారమే లక్ష్యంగా, రాజ్య విస్తరణే ధ్యేయంగా, ఆధిపత్యమే పరమావధిగా, మతవ్యాప్తే ప్రేరణగా సాగిన సంగ్రామాలతో దేశ స్వరూపమే మారిపోయింది. యుద్ధ సమయాల్లో తలెత్తిన అవసరాల కారణంగానే విజ్ఞానశాస్త్రం, సాంకేతికత, ఇంజినీరింగ్‌ రంగాల్లో గొప్ప పురోగతి సాధ్యమైంది. దేశ చరిత్రలో ముఖ్యమైన యుద్ధాల గురించి వివిధ పోటీపరీక్షల్లోనూ తరచూ ప్రశ్నలు అడుగుతుంటారు. అందుకే వీటి గురించి తెలుసుకుందాం!

భారతీయ చరిత్రలో ముఖ్యమైన యుద్ధాలు అంటే భారతదేశ భౌగోళిక స్వరూపం, సంస్కృతి, రాజకీయ పరిస్థితులపై శాశ్వత ప్రభావాన్ని చూపిన సంఘటనలు. చరిత్రకారులు వీటిని మూడు కాలాలుగా విభజించారు. అవి:

1. ప్రాచీన కాలం (Ancient period): క్రీ.శ.700 వరకు జరిగినవి.

2. మధ్యయుగం (Medieval period): క్రీ.శ.700 - క్రీ.శ.1700 వరకు జరిగినవి.

3. ఆధునిక కాలం (Modern period): క్రీ.శ.1700 తర్వాత జరిగినవి.

పది రాజుల యుద్ధం (Battle of the Ten Kings)

దీన్నే దశరాజ్ఞ యుద్ధం అని కూడా అంటారు. రుగ్వేదంలోని వివిధ సూక్తాల్లో దీని ప్రస్తావన ఉంది. దీన్ని భారత చరిత్రలో మొదటి సంగ్రామంగా పేర్కొంటారు. ఈ యుద్ధం క్రీ.పూ.14వ శతాబ్దంలో రావి నది (పరుష్ణి నది - సంస్కృత పేరు) ఒడ్డున, భరత తెగకు చెందిన త్రిత్సు వంశ రాజైన సుదాసుకు; పురు, యదు, తుర్వశ, అను, ద్రుహ్యు, అలీన, పక్త, భలన, శివ, విషానిన్‌ అనే పది తెగల కూటమికి మధ్య జరిగింది. 

హైడాస్పేస్‌ యుద్ధం (Battle of Hydaspes)

ఈ యుద్ధం అలెగ్జాండర్‌ ఆధ్వర్యంలోని మాసిడోనియన్‌ సామ్రాజ్యానికి, రాజు పోరస్‌ నాయకత్వంలోని పౌరవ సైన్యాలకు మధ్య జరిగింది. ఇందులో అలెగ్జాండర్‌ విజయం సాధించాడు. ఈ సంగ్రామం భారత ఉపఖండంపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఈ యుద్ధం క్రీ.పూ.326లో హైడాస్పేస్‌ నది (ప్రస్తుత పాకిస్థాన్‌లోని జీలం నది) ఒడ్డున జరిగింది. 

సెల్యూసిడ్‌ - మౌర్య యుద్ధం (Seleucid–Mauryan War)

క్రీ.పూ.323లో అలెగ్జాండర్‌ మరణానంతరం మాసిడోనియన్‌ సామ్రాజ్యాన్ని అతడి సేనాధిపతులు పంచుకున్నారు. వారిలో ఒకరైన సెల్యూకస్‌ 1 నికేటర్‌ (Seleucus I Nicator) సెల్యూసిడ్‌ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. క్రీ.పూ.305లో సెల్యూకస్‌ నికేటర్‌ నాయకత్వంలోని సెల్యూసిడ్‌ సైన్యం సింధునది తీరంలో చంద్రగుప్త మౌర్యుడి దళాలతో తలపడింది. 

కళింగ యుద్ధం

ఇది క్రీ.పూ.261లో మౌర్య చక్రవర్తి అశోకుడికి; కళింగ రాజ్య పాలకుడైన అనంత పద్మనాభుడికి మధ్య చోటుచేసుకుంది. ఇది ప్రస్తుత భువనేశ్వర్‌ సమీపంలోని దయా నది తీరంలో ఉన్న ధౌలి కొండల సమీపంలో జరిగింది. ఈ యుద్ధంలో సుమారు లక్ష మంది మరణించడం, వేలాదిమంది క్షతగాత్రులుగా మిగలడంతో పశ్చాత్తాపం చెందిన అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. 

పొల్లిలూరు యుద్ధం (Battle of Pollilur)

ఈ యుద్ధం క్రీ.శ.618-19లో ప్రస్తుత తమిళనాడులోని పుల్లలూరు/ పొల్లిలూరు ప్రాంతంలో చాళుక్య రాజు రెండో పులకేశికి పల్లవ రాజు మొదటి మహేంద్ర వర్మకు మధ్య జరిగింది. పుల్లలూరు యుద్ధం చాలా భీకరంగా సాగింది. కాసకుడి తామ్రపత్రాలు, పులకేశి ఆస్థాన కవి రవికీర్తి వేయించిన ఐహోల్‌ శాసనంలో ఈ సంగ్రామం గురించిన విషయాలు ఉన్నాయి.

ఆయా యుద్ధాలకు కారణాలు, విజేతలు, వాటి ప్రభావాలతో సహా ఈ అంశంపై గతంలో తెలంగాణ పోలీస్‌ ఎస్‌ఐ మెయిన్స్, తెలంగాణ పోలీస్‌ కానిస్టేబుల్‌ ప్రిలిమ్స్, ఏపీ పోలీస్‌ ఎస్‌ఐ ప్రిలిమ్స్, ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ, ఎస్‌ఎస్‌సీ - సీజీఎల్, ఎంటీఎస్‌ తదితర పోటీపరీక్షల్లో ఈ అంశంపై అడిగిన 75కి పైగా ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్‌ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్‌ నాలెడ్జ్‌ & కరెంట్‌ అఫైర్స్‌ కోర్సుII’కి సబ్‌స్క్రైబ్‌ చేసుకోండి. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. కిందివాటిలో ఏ వేదంలో ‘దశరాజ్ఞ యుద్ధం’ గురించిన ప్రస్తావన ఉంది?

(ఎస్‌ఎస్‌సీ సీజీఎల్, 2023)

1) యజుర్వేదం                2) సామవేదం 

3) రుగ్వేదం                   4) అధర్వణవేదం

సమాధానం: 3

2. సెల్యూసిడ్‌ - మౌర్య యుద్ధంలో సెల్యూకస్‌ ఏ మౌర్య పాలకుడితో పోరాడాడు?

(ఎస్‌ఎస్‌సీ సీజీఎల్, 2022)

1) దశరథుడు             2) అశోకుడు

3) సంప్రతి               4) చంద్రగుప్త మౌర్యుడు

సమాధానం: 4

3. రుగ్వేదంలో పేర్కొన్న పది రాజుల యుద్ధం ఏ నది తీరంలో జరిగింది?

(యూపీపీఎస్సీ ఏఈ, 2013)

1) వితస్త                    2) అసిక్ని

3) పరుష్ణి                    4) విపాశ

సమాధానం: 3

4. హైడాస్పేస్‌ యుద్ధం ఏ ఇద్దరు రాజుల మధ్య జరిగింది?

(ఎస్‌ఎస్‌సీ సీజీఎల్, 2022)

1) చంద్రగుప్తుడు, ధననందుడు        2) అశోకుడు, మహాపద్మనాభుడు

3) మిహిరకులుడు, యశోధర్మన్‌        4) అలెగ్జాండర్, పోరస్‌

సమాధానం: 4

5. Alexander and Porus fought on the banks of which of the following rivers?
(RRB NTPC CBT-I, 2021)
1) Parusni        2) Indus        3) Ganga        4) Jhelum
Ans: 4
6. The Battle of Hydaspes was held in
(RPF Constable, 2019) 
1) 234 BC         2) 326 BC        3) 423 BC        4) 167 BC
Ans: 2
7. The 'Battle of Ten Kings' depicted in the Rig Veda is a significant event that illustrates:
(SSC CGL Tier 1, 2022)
1) Inter-tribal unity
2) Regional trade conflicts
3) Political alliances and rivalries among Vedic tribes
4) Environmental changes
Ans: 3
8. Who among the following was defeated by Mauryan emperor Chandragupta Maurya?  
(SSC CGL, 2023)
1) Cassander        2) Seleucus Nicator        3) Antigones       4) Ptolemy
Ans: 2

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram