దేశంలో పన్ను సంస్కరణల కమిటీలు (పార్ట్‌ - 1)

దేశంలో పన్ను సంస్కరణల కమిటీలు (పార్ట్‌ - 1)

ఆర్థిక వ్యవస్థలో పన్నులు ముఖ్య భాగం. వ్యక్తులు, సంస్థలపై చట్టబద్ధంగా వీటిని విధిస్తారు. మన దేశంలో పన్ను విధానం ఒక వ్యవస్థీకృత చట్రం. దీని ద్వారా కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు ప్రజా వ్యయానికి నిధులు సమకూర్చడానికి, ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించడానికి పన్నులు వసూలు చేస్తాయి. దేశ ఆదాయ వ్యవస్థకు ఇవి వెన్నెముకగా నిలుస్తాయి. దశాబ్దాలుగా భారతదేశ పన్నుల వ్యవస్థలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. మెరుగైన పన్ను విధానాలను రూపొందించడంలో ప్రభుత్వానికి అనేక నిపుణుల కమిటీలు సాయపడ్డాయి. పోటీపరీక్షల నేపథ్యంలో ముఖ్యమైన పన్ను సంస్కరణల కమిటీల గురించి తెలుసుకుందాం..!

  • భారత రాజ్యాంగంలోని 12వ భాగానికి ‘ఆర్థిక, ఆస్తి, ఒప్పందాలు, వాజ్యాలు (Finance, Property, Contracts and Suits)’ అని పేరు పెట్టారు. ఇది ఆర్టికల్స్‌ 264 నుంచి 300ఎ వరకు ఉంటుంది. వీటిలో ఆర్టికల్‌ 265 చట్టం అధికారం లేకుండా ఏ పన్నూ విధించకూడదు లేదా వసూలు చేయకూడదని పేర్కొంది. ఆర్టికల్‌ 269 అనేది ‘కేంద్రం విధించి, వసూలు చేసి, రాష్ట్రాలకు కేటాయించే పన్నులు’ అని పేర్కొంది.
  • భారత ప్రభుత్వ చట్టం, 1935 ప్రకారం పాలనా విధులను మూడు జాబితాలుగా విభజించారు. అవి: కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా. భారత రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నుల వివరాలను పొందుపరిచారు. పన్ను వసూలును సులభతరం చేయడానికి, పారదర్శకతను మెరుగుపరచడానికి, పన్ను చెల్లింపుదారుల సౌకర్యాన్ని పెంచడానికి వివిధ పన్ను సంస్కరణలు ప్రవేశపెట్టారు.
  • భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చాక 1949-50లో మొదటిసారి పన్నుల విధానంలో సంస్కరణలు ప్రవేశపెట్టారు. అప్పటి ఆర్థిక మంత్రి జాన్‌ మతాయ్‌ ఈ సవరణలు తెచ్చారు. అప్పటివరకు రూ.10,000 లోపు ఆదాయంపై అణా (6 పైసలు) పన్ను ఉండేది. దాన్ని ముప్పావు అణా (4.5 పైసలు) తగ్గించారు. రూ.10,000 పైన ఆదాయం ఉన్నవారు కట్టాల్సిన రెండు అణాల (12 పైసలు) పన్నును 9 పైసలకు కుదించారు.

జాన్‌ మతాయ్‌ కమిటీ 

భారతదేశ సమగ్ర పన్ను విధానాన్ని పరిశీలించడానికి భారత ప్రభుత్వం 1953, ఏప్రిల్‌లో జాన్‌ మతాయ్‌ అధ్యక్షతన దీన్ని ఏర్పాటు చేసింది. మతాయ్‌ 1947-48లో రైల్వేశాఖ మంత్రిగా, 1948-50లో కేంద్ర ఆర్థికశాఖ మంత్రిగా వ్యవహరించారు. 1955లో ఇంపీరియల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా జాతీయీకరణ తర్వాత ఆయన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు మొదటి ఛైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ కమిషన్‌ 1954లో మూడు వాల్యూమ్‌లతో సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. 

నికోలస్‌ కాల్డార్‌ కమిటీ 

భారతీయ పన్ను విధానంపై సమగ్ర సర్వే, పరిశీలన కోసం భారత ప్రభుత్వం 1956లో బ్రిటిష్‌ ఆర్థికవేత్త నికోలస్‌ కాల్డార్‌ను నియమించింది. ఈయన లాభాలు, ఆదాయంపై పన్నుల విధింపునకు సంబంధించిన రాయల్‌ కమిషన్‌ (1950-55)లో సభ్యుడిగా ఉన్నారు. నూతన పన్ను విధానాలు ప్రవేశపెట్టడం ద్వారా ప్రత్యక్ష పన్ను పరిధిని విస్తరించాలని ఈ కమిటీ సూచించింది.   

మహవీర్‌ త్యాగి కమిటీ 

భారతదేశ ప్రత్యక్ష పన్ను చట్టాలను సరళీకరించడానికి, పన్ను ఎగవేతను అరికట్టడానికి ప్రభుత్వం 1958, జూన్‌లో మహవీర్‌ త్యాగి అధ్యక్షతన ఒక కమిటీని నియమించింది. దీన్ని ప్రత్యక్ష పన్నుల పరిపాలన విచారణ కమిటీ (Direct Taxes Administration Enquiry Committee) అని కూడా అంటారు. త్యాగి 1968లో ఏర్పాటైన భారతదేశ అయిదో ఆర్థిక సంఘానికి (ఫైనాన్స్‌ కమిషన్‌) అధ్యక్షుడిగా వ్యవహరించారు

భూతలింగం కమిటీ, కె.ఎన్‌.వాంఛూ కమిటీలు, వాటి సిఫార్సులతోపాటు గతంలో తెలంగాణ పోలీస్‌ ఎస్‌ఐ మెయిన్స్, ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ, ఆర్‌పీఎఫ్‌ - ఎస్‌ఐ, కానిస్టేబుల్, ఎస్‌ఎస్‌సీ - సీజీఎల్, ఎంటీఎస్, సీహెచ్‌ఎస్‌ఎల్, యూజీసీ నెట్‌ తదితర పోటీపరీక్షల్లో ఈ టాపిక్‌పై అడిగిన ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్‌ ‘ఈనాడు ఈప్రతిభ జనరల్‌ నాలెడ్జ్‌ & కరెంట్‌ అఫైర్స్‌ కోర్సుII’లో  అందుబాటులో ఉంది. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. భారతదేశంలో ఆదాయపు పన్ను చట్టాన్ని ఏ సంవత్సరంలో ఆమోదించారు?

(ఇండియన్‌ ఆర్మీ అగ్నివీర్‌ టెక్నికల్, 2023)

1) 1860   2) 1919   3) 1982    4) 1961

సమాధానం: 4

2. పాన్‌ కార్డ్‌ను కింది ఏ విభాగం జారీ చేస్తుంది?

(ఆర్‌ఆర్‌బీ స్టాఫ్‌ నర్స్, 2019)

1) ఆర్థిక వ్యవహారాలు            2) రెవెన్యూ

3) ఆదాయపు పన్ను             4) విదేశీ

సమాధానం: 3

3. 1953-54లో ఏర్పాటైన పన్నుల విచారణ కమిషన్‌కు అధ్యక్షులు ఎవరు?

(పంజాబ్‌ పోలీస్‌ కానిస్టేబుల్, 2023)

1) కె.ఎన్‌.సహాయ్‌      2) జాన్‌ మతాయ్‌

3) ఎ.పి.జాన్‌          4) పి.కె.పట్టల్‌

సమాధానం: 2

4. నికోలస్‌ కాల్డార్‌ కమిటీ కిందివాటిలో ఏ పన్నును సిఫార్సు చేసింది?

(ఎంపీఎస్సీ సబార్డినేట్‌ సర్వీసెస్‌ మెయిన్స్, 2022)

1) ఆదాయపు పన్ను                     2) ఎస్టేట్‌ డ్యూటీ

3) బహుమతి పన్ను                     4) సేవా పన్ను

సమాధానం: 3

5. Which of the following is an indirect tax levied in India?
(RRB NTPC Graduate Level CBT-I, 2025)
1) Equalisation Levy        2) Capital Gain Tax
3) Corporate Tax            4) Goods and Services Tax
Ans: 4
6. PAN stands for
(WBCS Mains, 2022)
1) Permanent Account Number        2) Personal Account Number
3) Public Account Number        4) Postal Account Number
Ans: 1
7. What is the primary legislation governing income tax in India?
(UP Police SI, 2026)
1) The Income Tax Act, 1961        2) The Goods and Services Tax Act, 2017
3) The Central Excise Act, 1944    4) The Companies Act, 2013
Ans: 1
8. Which of the following committees has focused on tax reforms in India?
(RRB NTPC (UG) CBT-I, 2026)
1) Malhotra Committee        2) Vijay L Kelkar Committee
3) Narasimham Committee    4) Rangarajan Committee
Ans: 2

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram