నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ (ఎన్‌డీఎంఏ)

నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ (ఎన్‌డీఎంఏ)

ప్రపంచంలో ప్రకృతి విపత్తులు అధికంగా సంభవిస్తున్న దేశాల్లో భారత్‌ ఒకటి. భౌగోళిక స్వరూపం, వాతావరణ పరిస్థితులు, అధిక జనాభా, సామాజిక - ఆర్థిక బలహీనతలు లాంటివి ఇందుకు ప్రధాన కారణాలు. మన దేశ భూభాగ విస్తీర్ణం 329 మిలియన్‌ హెక్టార్లు. ఇందులోని 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలన్నీ ఏదో ఒక రూపంలో విపత్తులను ఎదుర్కొంటున్నాయి. కరవులు, తుపాన్లు, వరదలు, భూకంపాలు లాంటివి దేశంలో ఏదో ఒక ప్రాంతంలో చోటుచేసుకుంటున్నాయి. వీటి ప్రభావాన్ని తగ్గించేందుకు, జరిగిన నష్టాన్ని సరిచేసేందుకు వనరులను సమన్వయం చేసే నిరంతర ప్రక్రియే విపత్తు నిర్వహణ. అందులో భాగంగా ఏర్పాటు చేసిందే జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ - ఎన్‌డీఎంఏ). ఇది సెప్టెంబరు 27న అమల్లోకి వచ్చింది. పోటీపరీక్షల కోణంలో దీనికి సంబంధించిన ముఖ్యాంశాలను తెలుసుకుందాం..! 

  • సహజ లేదా మానవ సంబంధ విపత్తులు, విపత్కర సంఘటనల వల్ల సంభవించే నష్టాల నుంచి కీలక మౌలిక సదుపాయాలను కాపాడటాన్ని విపత్తు నిర్వహణ అంటారు. విపత్తుల ప్రభావాన్ని నివారించడానికి లేదా తగ్గించటానికి లేదా వాటి నుంచి కోలుకోవడానికి చేపట్టే చర్యలు ఇందులో భాగంగా ఉంటాయి. విపత్తు నిర్వహణలోని ముఖ్యాంశాలు: నివారణ, సంసిద్ధత, స్పందన, పునరుద్ధరణ
  • మన దేశంలో 1900, 1905, 1907లో వరుసగా కరవులు సంభవించాయి. 1937లో బిహార్‌-నేపాల్‌ సరిహద్దుల్లో భూకంపం వచ్చింది. దీంతో బ్రిటిష్‌ ప్రభుత్వం విపత్తు నిర్వహణ కోసం నిర్దిష్టమైన వ్యవస్థాగత నిర్మాణం ఉండాలని భావించి, 1937లో మొదటిసారి వైపరీత్యాల వల్ల నష్టపోయిన ప్రభావిత ప్రాంతాల ప్రజలను ఆదుకునే వ్యవస్థను ఏర్పాటు చేసింది. స్వాతంత్య్రానంతరం ఇదే వ్యవస్థను కొనసాగించారు.
  • ఐక్యరాజ్యసమితి 1990 దశాబ్దాన్ని ‘అంతర్జాతీయ విపత్తు తగ్గింపు దశాబ్దం’గా ప్రకటించింది. దీంతో మన దేశంలో కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో విపత్తు నిర్వహణ విభాగాన్ని ఏర్పాటు చేశారు. లాతూర్‌ భూకంపం (1993), మాప్లా లాండ్‌స్లైడ్‌ (1994), ఒడిశా సూపర్‌ సైక్లోన్‌ (1999), భుజ్‌ భూకంపం (2001) లాంటి వరుస దుర్ఘటనల సమయంలో ఈ విభాగమే బాధితులకు సాయం అందించింది.
  • విపత్తుల సమయంలో అభివృద్ధి చెందిన దేశాల్లో అనుసరిస్తోన్న కార్యక్రమాలు, ప్రణాళికలను దృష్టిలో ఉంచుకుని భారత ప్రభుత్వం 2005, డిసెంబరు 23న ‘జాతీయ విపత్తు నిర్వహణ చట్టం’ తీసుకొచ్చింది. దీన్ని 2005 నవంబరులో రాజ్యసభ, డిసెంబరులో లోక్‌సభ ఆమోదించాయి. ఈ చట్టంలో 11 అధ్యాయాలు, 79 సెక్షన్లు ఉన్నాయి. 2006, డిసెంబరు 23 నుంచి విపత్తు నిర్వహణ చట్టం పూర్తిస్థాయిలో అమలైంది.

జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్‌)

విపత్తు నిర్వహణ చట్టం, 2005లోని సెక్షన్‌ 44, 45 ద్వారా నేషనల్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ (ఎన్‌డీఆర్‌ఎఫ్‌) ఏర్పడింది. 2006, జనవరి 19న దేశానికి చెందిన ప్రాథమిక విపత్తు ప్రతిస్పందన దళంగా ఇది ఉనికిలోకి వచ్చింది. ప్రకృతి, మానవ కారక విపత్తుల సమయంలో ప్రత్యేక ప్రతిస్పందన వ్యవస్థగా ఇది వ్యవహరిస్తుంది. 

నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ (ఎన్‌డీఎంఏ) ఏర్పాటు, అధికారాలు, విధులు - బాధ్యతలు, మన దేశంలో విపత్తు నిర్వహణ చట్రం, జాతీయ కార్యనిర్వాహక కమిటీ, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ (ఎన్‌ఐడీఎం) తదితర సమాచారంతోపాటు గతంలో ఏపీపీఎస్సీ గ్రూప్‌-4, టీఎస్‌పీఎస్సీ ఎఫ్‌బీవో, టీజీపీఎస్సీ ఏఈఈ, యూపీఎస్సీ, ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ, గ్రూప్‌-డి, యూజీసీ నెట్, ఎస్‌ఎస్‌సీ లాంటి పోటీపరీక్షల్లో ఈ అంశంపై అడిగిన 60కి పైగా ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్‌ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్‌ నాలెడ్జ్‌ & కరెంట్‌ అఫైర్స్‌ కోర్సుII’కి సబ్‌స్క్రైబ్‌ చేసుకోండి. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. ఎన్‌డీఎంఏ అంటే?

(కేవీఎస్‌ పీఆర్‌టీ, 2013)

1) నేషనల్‌ డైరీ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌

2) నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ

3) నేషనల్‌ డిఫెన్స్‌ అండ్‌ మెరైన్‌ అకాడమీ

4) నేషనల్‌ డ్యామ్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ

సమాధానం: 2

2. విపత్తు నిర్వహణ చట్టం, 2005లోని ఏ సెక్షన్‌ కింద నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీని ఏర్పాటు చేశారు?

(యూపీఎస్‌ఎస్‌ఎస్‌సీ మెయిన్స్, 2026)

1) సెక్షన్‌ 10               2) సెక్షన్‌ 6           3) సెక్షన్‌ 3

4) సెక్షన్‌ 14               5) ఏదీకాదు

సమాధానం: 3

3. భారతదేశంలో విపత్తు నిర్వహణ చట్టాన్ని ఏ సంవత్సరంలో చేశారు?

(ఏపీపీఎస్సీ గ్రూప్‌ 4, 2012)

1) 2004       2) 2005       3) 2006       4) 2007

సమాధానం: 2

4. నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ (ఎన్‌డీఎంఏ)కి కింది ఎవరు ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు?

(యూపీపీఎస్సీ కంబైన్డ్‌ స్టేట్‌ ఎగ్జామ్, 2021)

1) ప్రధానమంత్రి                 2) కేంద్ర హోం మంత్రి

3) రక్షణ మంత్రి              4) ఎవరూ కాదు

సమాధానం: 1

5. What was the theme of the National Disaster Management Authority (NDMA)’s 21st Formation Day, observed on 26 September 2025?
(RRB Group D, 2026)
1) Technology for Risk Reduction – For a Safer Nation
2) Stopping Impact of Disaster Incidents in the Himalayan Region
3) Empowering Communities for Disaster Risk Reduction Through Awareness
4) Volunteerism in Disaster Management
Ans: 1
6. The term 'capacity' in disaster management is used to mean:
(ICAR Technician, 2022)
1) capacity to cause harm            
2) area subjected to harm from hazard
3) potential loss in terms of health        
4) availability of resources to the community
Ans: 4
7. In which year was the National Disaster Management Authority (NDMA) initially constituted under the Chairmanship of the Prime Minister of India by an executive order? 
(RRB NTPC (UG) CBT-I, 2025)
1) 2005        2) 2010        3) 2007        4) 2008
Ans: 1
8. Which natural disaster triggered storms, flash floods, and landslips in the northeastern states of India in 2024?
(RRB ALP CBT-I, 2024)
1) Cyclone Remal        2) Cyclone Yaas        3) Cyclone Amphan       4) Cyclone Fani
Ans: 1

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram