వన్యప్రాణులు ప్రకృతిలో కీలక భాగం. పర్యావరణ వ్యవస్థను సమతౌల్యం చేయడంలో, వివిధ సహజ ప్రక్రియలను స్థిరీకరించడంలో వీటి పాత్ర ఎనలేనిది. వీటి సంరక్షణ చాలా ముఖ్యం. ప్రధానంగా అంతరించిపోయే జంతుజాతులను గుర్తించి వాటిని పునఃస్థాపితం చేసే దిశగా చర్యలు చేపట్టాలి. సహజ వనరులను సుస్థిర పద్ధతిలో నిర్వహించడం, ఉపయోగించడమే వన్యప్రాణుల పరిరక్షణ ప్రాజెక్టుల లక్ష్యం. భవిష్యత్తు తరాలకు ఈ వనరులను అందించడం వీటి ప్రధాన ఉద్దేశం. అందుకే సహజ పర్యావరణ వ్యవస్థలను పరిరక్షించడం, పునరుద్ధరించడం, మెరుగుపరచడంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారిస్తున్నాయి. అడవి జంతువులు, వాటి ఆవాసాల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాయి. పోలీస్, గ్రూప్స్ పరీక్షల కోణంలో భారతదేశంలో వన్యప్రాణుల సంరక్షణ ప్రాజెక్టుల (Wildlife Conservation Projects in India) గురించి తెలుసుకుందాం!
వరల్డ్ కన్జర్వేషన్ స్ట్రాటజీ
ప్రాజెక్ట్ టైగర్
అంతరించిపోతున్న బెంగాల్ పులి జాతిని, దాని సహజ ఆవాసాలను రక్షించేందుకు భారత ప్రభుత్వం 1973, ఏప్రిల్ 1న దీన్ని ప్రారంభించింది. ఇది ఒక ప్రధాన వన్యప్రాణి సంరక్షణ కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ ఆధ్వర్యంలోని నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (ఎన్‌టీసీఏ) అమలు చేస్తుంది. మన దేశంలో పులుల గణనను మొదటిసారి 2006లో చేశారు.
ప్రాజెక్ట్ ఎలిఫెంట్
దీన్ని మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ 1992, ఫిబ్రవరిలో ప్రారంభించింది. దీన్నే ‘కౌండిన్య ప్రాజెక్ట్’ అని పిలుస్తారు. ఆర్థిక, సాంకేతిక సహాయం ద్వారా ఏనుగులను సంరక్షించడం దీని ముఖ్య ఉద్దేశం. ప్రపంచంలోని అడవి ఆసియా ఏనుగుల్లో 60 శాతానికి పైగా భారతదేశంలోనే ఉన్నాయి. 2017లో నిర్వహించిన ఏనుగుల జనాభా లెక్కల ప్రకారం వీటి సంఖ్య 29,964.
ప్రాజెక్ట్ లయన్
ప్రధాని నరేంద్ర మోదీ 2020, ఆగస్టు 15న ప్రకటించారు. గుజరాత్‌లోని (గిర్ నేషనల్ పార్క్, బర్దా వన్యప్రాణుల అభయారణ్యం) ఆసియాటిక్ సింహాల నివాస మెరుగుదల, దీర్ఘకాలిక పరిరక్షణ దీని ముఖ్య ఉద్దేశం. ఈ ప్రాజెక్ట్‌కి పదేళ్ల కాలానికి రూ.2927.71 కోట్లు కేటాయించారు. ఆసియా సింహం (పాంథెరా లియో పర్సికా) ప్రపంచంలోనే అత్యంత వేగంగా అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న పెద్ద పిల్లి జాతుల్లో ఒకటి.
ప్రాజెక్ట్ స్నో లెపర్డ్
దీన్ని మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ 2009, జనవరిలో ప్రారంభించింది. భాగస్వామ్య విధానాలు, చర్యల ద్వారా మంచు చిరుతల సంరక్షణను ప్రోత్సహిస్తూ, సంఖ్యను వృద్ధి చేసే కార్యక్రమాలు, ఆవాసాల రక్షణ చేపట్టడం దీని ముఖ్య ఉద్దేశం. ప్రపంచవ్యాప్తంగా 4 వేల నుంచి 6 వేల వరకు మంచు చిరుతలు ఉన్నట్లు అంచనా. వాటిలో సుమారు 500 భారతదేశంలో ఉన్నాయి.
|
భారతదేశంలో జీవవైవిధ్యం, ప్రాజెక్ట్ టైగర్, ప్రాజెక్ట్ ఎలిఫెంట్, ప్రాజెక్ట్ లయన్, ప్రాజెక్ట్ స్నో లెపర్డ్ మొదలైన అంశాలతోపాటు యూపీఎస్సీ సివిల్స్, ఏపీపీఎస్సీ గ్రూప్Ã-1, టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1, తెలంగాణ పోలీస్ ఎస్‌ఐ మెయిన్స్, ఏపీపీఎస్సీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ - ప్రిలిమ్స్, మెయిన్స్, టీజీపీఎస్సీ ఏఈఈ, ఎస్‌బీఐ అప్రెంటిస్, బ్యాంక్ ఆఫ్ ఇండియా పీవో, తదితర పోటీపరీక్షల్లో అడిగిన 160కి పైగా ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్ నాలెడ్జ్ & కరెంట్ అఫైర్స్ కోర్సుII’కి సబ్‌స్క్రైబ్ చేసుకోండి. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978 |
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
1. భారతదేశంలో ప్రాజెక్ట్ టైగర్ ఎప్పుడు ప్రారంభమైంది?
(ఎస్‌ఎస్‌సీ సీజీఎల్, 2019)
1) 1992 2) 1979 3) 1982 4) 1973
సమాధానం: 4
2. భారత ప్రభుత్వం వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని ఎప్పుడు అమలు చేసింది?
(హెచ్‌టెట్ పీఆర్‌టీ, 2020)
1) 1982 2) 1974 3) 1972 4) 1981
సమాధానం: 3
3. వన్యప్రాణి సంరక్షణ ప్రధాన లక్ష్యం ఏమిటి?
(ఓఎస్‌ఎస్‌ఎస్‌సీ ఎల్‌ఎస్‌ఐ, ఫారెస్ట్ అండ్ ఫారెస్ట్ గార్డ్, 2024)
1) సహజ ఆవాసాలను, జీవజాతులను రక్షించడం
2) జీవవైవిధ్యాన్ని తగ్గించడం
3) జీవజాతులు అంతరించిపోవడాన్ని ప్రోత్సహించడం
4) సహజ వనరులను విపరీతంగా వినియోగించుకోవడం
సమాధానం: 1
4. అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న జీవజాతులను ఏమని పిలుస్తారు?
(71వ బీపీఎస్సీ, 2025)
1) అరుదైనవి 2) ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉన్నవి
3) అంతరించిపోయే దశలో ఉన్నవి
4) అంతరించిపోయినవి
సమాధానం: 3
5. Tiger project is launched in ________.
(RSMSSB Lab Assistant Official Paper 2022)
1) Corbett National Park 2) Dudhwa National Park
3) Nanda Devi National Park 4) Rajaji National Park
Ans: 1
6. Project Tiger, a wildlife conservation project in India, was launched in 1973 to protect which species in its natural habitat?
(ECGC PO Memory Based Paper 2022)
1) The Bengal tiger 2) The Indian rhinoceros 3) The Asiatic lion
4) The leopard 5) None of the above
Ans: 1
7. Which of the following is an important strategy for the conservation of biodiversity?
(JKSSB SI Official Paper 2022)
1) Wildlife sanctuary 2) National parks
3) Botanical gardens 4) Biosphere reserves
Ans: 4
8. Which wildlife conservation strategy protects entire ecosystems rather than a single species?
(RRB NTPC (UG) CBT-I Official Paper 2026)
1) Seed banks 2) Captive breeding
3) In-situ conservation 4) Biodiversity hotspots
Ans: 3
Link copied to clipboard!
ఇస్రో- ఎస్డీఎస్సీలో టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు
ఎయిమ్స్ గోరఖ్‌పుర్‌లో ఫ్యాకల్టీ పోస్టులు
ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్‌లో ఇంజినీర్ పోస్టులు
యూనివర్సిటీ ఆఫ్ లఖ్‌నవూలో ఉద్యోగాలు
ఎన్పీఎల్లో ప్రాజెక్ట్ స్టాఫ్ ఉద్యోగాలు
భారతీయ రిజర్వ్ బ్యాంక్‌లో ఫార్మసిస్ట్ ఉద్యోగాలు
డీఎంహెచ్ఓ మహబూబాబాద్‌లో స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు
సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్లో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు
బీహెచ్ఈఎల్లో ఎలక్ట్రిషియన్ ఉద్యోగాలు
సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాలో జూనియర్ కోర్ట్ అటెండెంట్ పోస్టులు
నిఫ్ట్‌లో యూజీ, పీజీ, పీహెచ్డీ 2027 ప్రవేశాలు
ఎస్కేఎల్టీజీహెచ్యూలో ఎంఎస్సీ, పీహెచ్డీ హార్టికల్చర్ ప్రవేశాలు 2026-27
పీజేటీఏయూలో మాస్టర్స్ డిగ్రీ ప్రోగ్రామ్‌ల్లో ప్రవేశాలు
జాయింట్ సీఎస్ఐఆర్- యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ డిసెంబర్-2026
కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్)-2027
జేవియర్ ఆప్టిట్యూడ్ టెస్ట్-2027
కొచ్చి మెట్రో రైల్ లిమిటెడ్‌లో టెక్నికల్/నాన్‌టెక్నికల్ అప్రెంటిస్ ఉద్యోగాలు
ఐఆర్సీఓఎన్లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఉద్యోగాలు
యూకో బ్యాంక్‌లో అప్రెంటిస్ పోస్టులు
డీఆర్డీఓ - ఐటీఆర్ చండీగఢ్‌లో అప్రెంటిస్ పోస్టులు
నావల్ డాక్‌యార్డ్, ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్‌లో అప్రెంటిస్ పోస్టులు
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో అప్రెంటిస్ ఉద్యోగాలు
నార్త్ వెస్ట్రన్ రైల్వేలో యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు
ఆర్ఆర్సీ- సదరన్ రైల్వేలో స్పోర్ట్స్ కోటా పోస్టులు
అమల్లోకి భారత్-న్యూజిలాండ్ ఎఫ్‌టీఏ
భారత్ నుంచి అమెరికాకు పెట్టుబడులు
భారత జీడీపీ వృద్ధి 7.1- 7.3%
హైదరాబాద్-జర్మనీ సంస్థల ఒప్పందం
భారతీయ బ్యాంకులోకి అతిపెద్ద ఎఫ్‌డీఐ
2026-27లో భారత్ వృద్ధి 7%
ద్రవ్యోల్బణ రేటు 5.54%
తొలి త్రైమాసిక ఎఫ్‌డీఐల్లో జపాన్ టాప్
రెపో రేటు
ఎయిరిండియా, సింగపూర్ ఎయిర్‌లైన్స్ భాగస్వామ్యం
యునెస్కో నివేదిక
అయిదు కొత్త జాతి మొక్కలు
‘అవెండస్ వెల్త్ హురున్ ఇండియా యూ35 లిస్ట్ 2026’
యునిసెఫ్ నివేదిక
ప్రపంచ టాప్ 2 శాతం శాస్త్రవేత్తల జాబితా
బులెటిన్ ఆఫ్ ద అటామిక్ సైంటిస్ట్స్
యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండస్ట్రీస్
డబ్ల్యూహెచ్‌వో, యునిసెఫ్ సంయుక్త నివేదిక
ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకుల అధ్యయనం
ఈపీఐసీ నివేదిక