భారత్‌లోని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు

భారత్‌లోని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు

ముందు తరాల నుంచి పొంది, ప్రస్తుతం అనుభవిస్తూ, తర్వాతి తరాలకు అందించేదే వారసత్వం. ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ. భూమి అనేక ప్రకృతి అందాలకు నెలవు. వివిధ రకాల కొండలు - కోనలు, వాగులు - వంకలు, చెట్లు - చేమలు, జంతువులు - పక్షులు, పురాతన స్థలాలు, చారిత్రక కట్టడాలు, అపురూప కళాఖండాలు మొదలైనవన్నీ వారసత్వ చిహ్నాలు. వీటన్నింటినీ పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిదీ. వారసత్వం అంటే కేవలం చరిత్ర కాదు. గత వైభవాన్ని జ్ఞప్తికి తెస్తూ, భవిష్యత్తుకు బాటలు వేసే స్మృతి పథం. అయితే ప్రస్తుత మానవ చర్యల ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక అరుదైన ప్రదేశాలు నాశనమవుతున్నాయి. దీన్ని అరికట్టి, చారిత్రక ప్రాధాన్యం ఉన్న ప్రాంతాలను సంరక్షించే లక్ష్యంతో యునైటెడ్‌ నేషన్స్‌ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్‌ అండ్‌ కల్చరల్‌ ఆర్గనైజేషన్‌ (యునెస్కో) భూమిపై ఉన్న వారసత్వ ప్రదేశాలకు గుర్తింపు ఇస్తూ, వాటి పరిరక్షణకు చర్యలు చేపడుతోంది.

ప్రపంచ వారసత్వ ప్రదేశాలు అంటే?

  • యునెస్కో ద్వారా గుర్తింపు పొందిన విశిష్ట సాంస్కృతిక, చారిత్రక లేదా సహజ ప్రాముఖ్యత కలిగిన ప్రదేశాలను ‘ప్రపంచ వారసత్వ ప్రదేశాలు’ అంటారు. వీటిని మానవవాళికి అత్యుత్తమ విలువైనవిగా పరిగణిస్తారు. తద్వారా భవిష్యత్తు తరాల కోసం వాటి పరిరక్షణకు భరోసా లభిస్తుంది. వీటి ఎంపిక ప్రక్రియ కఠినంగా ఉంటుంది. దీంతో అత్యంత విశిష్టమైన ప్రదేశాలు మాత్రమే ఈ జాబితాలో స్థానం పొందుతాయి.
  • రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అనేక దేశాల్లోని సాంస్కృతిక ప్రదేశాలు, ప్రకృతి తీవ్రంగా దెబ్బతిన్నాయి. నాటి ఆందోళనల నేపథ్యంలో ప్రపంచ వారసత్వ భావన ఆవిర్భవించింది. దీనికి అనుగుణంగా 1972, నవంబరు 19న పారిస్‌లో యునెస్కో జనరల్‌ కాన్ఫరెన్స్‌ జరిగింది. ఇందులో ప్రపంచవ్యాప్తంగా అరుదైన ప్రదేశాలను రక్షించడమే లక్ష్యంగా అనేక నిర్ణయాలు తీసుకున్నారు. దీన్నే 1972 ప్రపంచ వారసత్వ సదస్సు (World Heritage Convention 1972) అంటారు.  
  • 2026, అక్టోబరు నాటికి 173 దేశాల్లో మొత్తం 1273 యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు ఉన్నాయి. వీటిలో 991 సాంస్కృతిక ప్రదేశాలు, 240 సహజ ప్రాంతాలు, 42 మిశ్రమ ప్రదేశాలు. ఇటలీ 62 ప్రదేశాలతో జాబితాలో మొదటి స్థానంలో ఉండగా, చైనా (61), ఫ్రాన్స్‌ (56), జర్మనీ (54) తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
  • యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ 48వ సమావేశం దక్షిణ కొరియాలోని బుసాన్‌లో 2026, జులై 19 నుంచి 29 మధ్య జరిగింది. మొత్తం 25 కొత్త ప్రదేశాలను ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చారు. ఇదే సమావేశంలో ఉత్తర్‌ ప్రదేశ్‌లోని వారణాసి నగర సమీపానగల భారతీయ పురాతన బౌద్ధ క్షేత్రం సారనాథ్‌కు యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు లభించింది. భారత్‌లో ఈ జాబితాలో చేరిన 45వ ప్రదేశమిది. 
ఎంపిక విధానం, ఎంపిక ప్రమాణాలు, రకాలు, రక్షణ కల్పించే తీరు, మన దేశంలోని 45 వారసత్వ ప్రాంతాల వివరాలతోపాటు గతంలో ఏపీపీఎస్సీ, ఎస్‌ఎస్‌సీ, ఆర్‌ఆర్‌బీ, యూపీఎస్సీ తదితర పోటీపరీక్షల్లో ఈ టాపిక్‌ నుంచి అడిగిన 100కి పైగా ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్‌ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్‌ నాలెడ్జ్‌ & కరెంట్‌ అఫైర్స్‌ కాంబో కోర్సు’కి సబ్‌స్క్రైబ్‌ చేసుకోండి. ఇప్పుడు దసరా పండుగ సందర్భంగా ప్రత్యేక ఆఫర్‌ మీ కోసం..! వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978


గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. ప్రపంచ వారసత్వ ప్రదేశ హోదాను కింది ఏ సంస్థ ప్రదానం చేస్తుంది?
(హెచ్‌పీ టీజీటీ (ఆర్ట్స్‌) టెట్, 2017)

1) యునిసెఫ్‌     2) యూఎన్‌ఓ        3) యునెస్కో      4) యూఎన్‌డీపీ

సమాధానం: 3

2. 2024, జులైలో యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ 46వ సమావేశం ఎక్కడ జరిగింది?
(ఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్, 2025)

1) బీజింగ్, చైనా                2) న్యూదిల్లీ, భారతదేశం

3) పారిస్, ఫ్రాన్స్‌               4) రోమ్, ఇటలీ

సమాధానం: 2

3. కిందివాటిలో ఏది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం? (ఎంపీ ఫారెస్ట్‌ గార్డ్‌/ జైల్‌ ప్రహారీ కంబైన్డ్‌ ఎగ్జామ్, 2023)

1) ఛత్రపతి శివాజీ టెర్మినల్‌            2) హవా మహల్‌

3) జైసల్మేర్‌ కోట                4) రాణి రూపమతి మహల్‌

సమాధానం: 1

4. యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేరిన మొదటి భారతీయ నగరం ఏది? (ఎస్‌ఎస్‌సీ జీడీ, 2019)

1) భువనేశ్వర్‌                     2) ఇందౌర్‌

3) బెంగళూరు                     4) అహ్మదాబాద్‌

సమాధానం: 4

5. Which of the following is NOT a UNESCO World Heritage Site?
(APPSC Forest Section Officer Prelims, 2025)

1) Kaziranga National Park    

2) Keoladeo Ghana National Park

3) Silent Valley National Park    

4) Sundarbans National Park

Ans: 3
6. Which of the following sites was added to the UNESCO World Heritage list in 2023, representing the cultural heritage of Rabindranath Tagore?
(SSC CGL Tier 1, 2023)

1) Victoria Memorial                   2) Santiniketan

3) Dakshineswar Kali Temple            4) Belur Math

Ans: 2
7.  As of October 2024, India is the home to _______ UNESCO World Heritage Sites.
(RRB Technician Grade III,  2024)

1) 33        2) 63        3) 53        4) 43

Ans: 4

8. What is India's 42nd UNESCO World Heritage Site?
(IBPS PO Mains, Memory Based, 2023)

1) Sanchi Stupa                            2) Vishwanath Temple

3) Sacred Ensembles of Hoysalas               4) Victoria Memorial

5) Gateway of India

Ans: 3

9. Consider the following World Heritage Sites of India:
i. Khangchendzonga National Park

ii. Sundarbans National Park

iii. Jaipur City

Which of the above are classified as Natural World Heritage Sites?
(SSC GD Constable, 2026)

1) i Only        2) i and ii only        3) ii only        4) i, ii and iii

Ans: 2

10. Which of the following is a UNESCO World Heritage Site?
(SSC MTS, 2026)

1) Kamakhya Temple        2) Meenakshi Temple

3) Kashi Vishwanath Temple    4) Gangaikonda Cholapuram Temple

Ans: 4

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram