భారతదేశ క్షిపణులు (పార్ట్‌ - 1)

భారతదేశ క్షిపణులు (పార్ట్‌ - 1)

ఆధునిక రక్షణ, యుద్ధ వ్యూహాల్లో క్షిపణి సాంకేతికతకు ఎంతో ప్రాధాన్యం ఉంది. శత్రు భూభాగాల్లోకి సైన్యం ప్రవేశించకుండానే వారి స్థావరాలను ధ్వంసం చేసే అత్యాధునిక ఆయుధాలే క్షిపణులు. అదే విధంగా వైరి వర్గం నుంచి మన పైకి వచ్చే ఆయుధాలను అడ్డుకోవడంలోనూ ఇవి సాయపడతాయి. దేశ రక్షణకు ప్రాధాన్యమిస్తూ ఇటీవలి కాలంలో భారత్‌ అనేక సాంకేతిక విజయాలను నమోదు చేసింది. అధునాతన అస్త్రశస్త్రాలను తన అమ్ములపొదిలో ఉంచుకుంది. మన దేశం ఎప్పటికీ శాంతికే మొదటి ప్రాధాన్యం ఇస్తుంది. అయినప్పటికీ శత్రు రాజ్యాల నుంచి ఎదురయ్యే కవ్వింపు చర్యలు, దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టేందుకే భారత్‌ వీటిని తయారు చేస్తోంది. పోటీపరీక్షల కోణంలో ముఖ్యమైన భారతదేశ క్షిపణులు (Missiles of India), వాటి ఉపయోగాల గురించి తెలుసుకుందాం..!

  • 1958, జనవరి 1న డిఫెన్స్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (డీఆర్‌డీఓ) ఏర్పాటుతో మన దేశంలో రక్షణ రంగ అభివృద్ధికి మార్గం సుగమమైంది. భారత మాజీ రాష్ట్రపతి, శాస్త్రవేత్త ఏపీజే అబ్దుల్‌ కలాం ఆధ్వర్యంలో 1983, జులై 26న ఇంటిగ్రేటెడ్‌ గైడెడ్ మిస్సైల్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం (ఐజీఎండీపీ)ను ప్రభుత్వం ప్రారంభించింది. ఇది 2008, జనవరి 8 వరకు కొనసాగింది. 
  • భారత్‌ 1988లో మొదటిసారి ‘పృథ్వి’ అనే క్షిపణిని నిర్మించింది. దీని పరిధి 150 కిలోమీటర్లు. అబ్దుల్‌ కలాంను భారతదేశ క్షిపణి సాంకేతిక పితామహుడు (ఫాదర్‌ ఆఫ్‌ ఇండియన్‌ మిస్సైల్‌ టెక్నాలజీ) అంటారు. అగ్ని 4 క్షిపణి ప్రాజెక్ట్‌కు మొదటి మహిళా డైరెక్టర్‌గా వ్యవహరించిన టెస్సీథామస్‌ను మిస్సైల్‌ ఉమెన్‌ లేదా అగ్నిపుత్రిగా పిలుస్తారు. ఐజీఎండీపీలో భాగంగా తయారు చేసిన పృథ్వి క్షిపణి మొదటి దశలో ఘన ఇంధనం, రెండో దశలో ద్రవ ఇంధనం ఉంటాయి. 

బ్రహ్మోస్‌ ఏరోస్పేస్‌ జాయింట్‌ వెంచర్‌

భారత్, రష్యా మధ్య మాస్కోలో ఇంటర్‌ గవర్నమెంటల్‌ అగ్రిమెంట్‌ (ఐజీఏ)పై సంతకాలు జరిగాక 1998, ఫిబ్రవరి 12న ‘బ్రహ్మోస్‌ ఏరోస్పేస్‌ జాయింట్‌ వెంచర్‌’ ప్రారంభమైంది. డీఆర్‌డీఓ, రష్యాకు చెందిన మిలటరీ ఇండస్ట్రియల్‌ కార్పొరేషన్‌ - ఎన్‌పీఓ మషినోస్ట్రోయేనియా (NPO Mashinostroyeniya) కలయికతో బ్రహ్మోస్‌ ఏరోస్పేస్‌ అనే ఉమ్మడి సంస్థ ఏర్పడింది.

ఇండియన్‌ బాలిస్టిక్‌ మిస్సైల్‌ డిఫెన్స్‌ ప్రోగ్రాం

ఇతర దేశాల నుంచి వచ్చే బాలిస్టిక్‌ క్షిపణి ముప్పుల నుంచి బహుళ అంచెల రక్షణ కవచాన్ని అభివృద్ధి చేయడం దీని ముఖ్య ఉద్దేశం. కార్గిల్‌ యుద్ధం తర్వాత 1999లో ‘ఇండియన్‌ బాలిస్టిక్‌ మిస్సైల్‌ డిఫెన్స్‌ ప్రోగ్రాం’ను ప్రారంభించారు. ప్రస్తుతం (2026 సెప్టెంబరు నాటికి) దిల్లీ, ముంబయి నగరాల్లో బాలిస్టిక్‌ మిస్సైల్‌ డిఫెన్స్‌ సిస్టంను ఏర్పాటు చేశారు. 

బ్రహ్మోస్‌ రకాలు, పృథ్వి ఎయిర్‌ డిఫెన్స్‌ (పీఏడీ), అడ్వాన్స్‌డ్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ (ఏఏడీ) తదితర సమాచారంతోపాటు గతంలో టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్, టీఎస్‌పీఎస్సీ వీఆర్‌ఓ, ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్, తెలంగాణ పోలీస్‌ కానిస్టేబుల్‌ మెయిన్స్, ఆర్‌ఆర్‌బీ ఏఎల్‌పీ, ఏపీపీఎస్సీ పంచాయతీ సెక్రటరీ, టీఎస్‌పీఎస్సీ ఏఈ, ఎస్‌బీఐ క్లర్క్‌ మెయిన్స్‌ లాంటి పోటీపరీక్షల్లో ఈ అంశంపై అడిగిన 180కి పైగా ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్‌ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్‌ నాలెడ్జ్‌ & కరెంట్‌ అఫైర్స్‌ కోర్సుII’కి సబ్‌స్క్రైబ్‌ చేసుకోండి. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. కిందివాటిలో నౌక నుంచి ప్రయోగించే బాలిస్టిక్‌ క్షిపణి?

(ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ, 2021)

1) పృథ్వి    2) ధనుష్‌        3) అగ్ని          4) శౌర్య

సమాధానం: 2

2. కింది క్షిపణుల్లో దేన్ని ‘ఇండియన్‌ పేట్రియాట్‌’ అని పిలుస్తారు?

(డీఎస్‌ఎస్‌ఎస్‌బీ జేఈ ఈఈ, 2015)

1) నాగ్‌                 2) సాగరిక

3) త్రిశూల్‌              4) ఆకాశ్‌

సమాధానం: 4

3. తన వ్యూహాత్మక నిరోధక సామర్థ్యాన్ని (strategic deterrence posture) బలోపేతం చేయడానికి 2026లో భారతదేశం కింది ఏ క్షిపణిని ప్రయోగించింది?

(డీఎస్‌ఎస్‌ఎస్‌బీ ఎంటీఎస్, 2026)

1) ఆకాశ్‌     2) అగ్ని 3        3) బ్రహ్మోస్‌       4) పృథ్వి 2

సమాధానం: 2

4. సీకర్‌ టెక్నాలజీ కలిగి ఉన్న భారతదేశ క్షిపణి?

(యూపీ పోలీస్‌ కానిస్టేబుల్, 2018)

1) పృథ్వి        2) గరుడ        3) బ్రహ్మోస్‌          4) నారాయణ్‌

సమాధానం: 3

5. Which missile was successfully flight-trialed by DRDO and the Indian Navy from Integrated Test Range, Chandipur, Odisha, in 2025, demonstrating capability against ship targets when launched from a Sea King helicopter? 
(RRB NTPC (UG) CBT-I, 2025)
1) BrahMos Anti-Ship Missile    
2) Naval Anti-Ship Missile - Short Range
3) Prithvi Surface-to-Surface Missile
4) Agni Ballistic Missile
Ans: 2
6. Which missile was successfully launched by DRDO from a rail-based mobile launcher under full operational conditions on 24 September 2025?
(RRB Group D, 2026)
1) BrahMos            2) Prithvi-II            3) Agni-Prime        4) Agni-I
Ans: 3 
7. The first missile of the first firing unit of MRSAM for delivery to which of the following was flagged off in July 2021?
(SSC Steno,  2022)
1) Indian Air Force        2) CRPF        3) Indian Navy
4) BSF                5) CISF
Ans: 1
8. What is the name of the new generation ballistic missile with a range of 1,000-2,000 km that was successfully flight tested at APJ Abdul Kalam Island in April 2024? 
(RRB Technician Grade, 2024)
1) Agni Prime        2) Surya        3) Prahaar        4) Akash
Ans: 1

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram