ఒక దేశానికి చెందిన సంస్కృతి, శాస్త్రీయ, పర్యావరణ పరిజ్ఞానాన్ని పరిరక్షించడం, వ్యాఖ్యానించడం, వ్యాప్తి చేయడం లాంటివి నిర్వహించేవే సాంస్కృతిక సంస్థలు. ఇవి చరిత్ర, విజ్ఞానశాస్త్రం, పర్యావరణానికి సంబంధించిన అంశాలపై పౌరులకు సమాచారం అందించి, అవగాహన కల్పించే కార్యకలాపాలను నిర్వహిస్తాయి. అలాగే దేశానికి సంబంధించిన గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడంలో, ప్రోత్సహించడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. ఇవి అభ్యాసం, సృజనాత్మకత, సాంస్కృతిక మార్పిడికి ముఖ్య కేంద్రాలుగా పనిచేస్తాయి. ప్రపంచ చరిత్ర, విభిన్న సంస్కృతులపై లోతైన అవగాహనను పెంపొందిస్తాయి. పార్ట్-1లో మన దేశంలోని ముఖ్యమైన సాంస్కృతిక సంస్థల (Cultural Institutions in India) గురించి తెలుసుకున్నాం. ఈ భాగంలో మిగతావి చూద్దాం!
ఇందిరా గాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్
ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా నాటి ప్రధాని రాజీవ్ గాంధీ 1985, నవంబరు 19న దీన్ని ప్రారంభించారు. ఇది సాంస్కృతిక మంత్రిత్వ శాఖ అధీనంలో పనిచేసే స్వయంప్రతిపత్తి సంస్థ. దీని ప్రధాన కార్యాలయం న్యూదిల్లీలో ఉంది. బెంగళూరు, వారణాసి, గౌహతిలో ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి. ఐజీఎన్‌సీఏలో ఆరు క్రియాత్మక విభాగాలు ఉన్నాయి.
సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్సెస్ అండ్ ట్రైనింగ్
సాంస్కృతిక మంత్రిత్వ శాఖ 1979, మేలో సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్సెస్ అండ్ ట్రైనింగ్ (సీసీఆర్‌టీ)ని ఏర్పాటు చేసింది. దీని స్థాపనలో డాక్టర్ కపిల వాత్సాయన్, కమలాదేవి ఛటోపాధ్యాయ ముఖ్యభూమిక పోషించారు. దీని ప్రధాన కార్యాలయం న్యూదిల్లీలో ఉంది. ఉదయ్‌పూర్, హైదరాబాద్, గౌహతిలో ప్రాంతీయ కార్యాలయాలున్నాయి.
నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా
ఇది అపురూపమైన రికార్డులను సంరక్షిస్తుంది. దీన్ని 1891, మార్చి 11న కోల్‌కతాలో ‘ఇంపీరియల్ రికార్డ్ డిపార్ట్‌మెంట్ (ఐఆర్‌డీ)’ పేరుతో స్థాపించారు. 1911లో దీని కార్యాలయాన్ని దిల్లీకి తరలించారు. స్వాతంత్య్రానంతరం ఐఆర్‌డీ పేరును నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఏఐ)గా మార్చారు. దీనికి భోపాల్‌లో ప్రాంతీయ కార్యాలయం; భువనేశ్వర్, జైపూర్, పుదుచ్చేరిలో రికార్డ్స్ కేంద్రాలు ఉన్నాయి.
ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్
స్వతంత్ర భారతదేశ మొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ 1950, ఏప్రిల్ 9న ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ (ఐసీసీఆర్)ను నెలకొల్పారు. ఇది సాంస్కృతిక కేంద్రాల నెట్‌వర్క్ ద్వారా విదేశాల్లో భారతీయ సంస్కృతిని విస్తృతంగా ప్రచారం చేస్తోంది. 1970 వరకు ఐసీసీఆర్ కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉంది. తర్వాత దీన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ పాలనా పరిధిలోకి మార్చారు. ఐసీసీఆర్ ప్రధాన కార్యాలయం న్యూదిల్లీలో ఉంది.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రిసెర్చ్
కేంద్ర విద్యాశాఖ 1972, మార్చి 27న దీన్ని ఏర్పాటు చేసింది. నిష్పాక్షికమైన చారిత్రక పరిశోధనను ప్రోత్సహించడం, దిశానిర్దేశం చేయడం, నిష్పాక్షికమైన - శాస్త్రీయ చారిత్రక రచనను పెంపొందించడం ఐసీహెచ్‌ఆర్ ముఖ్య లక్ష్యాలు. ప్రధాన కార్యాలయం న్యూదిల్లీలో ఉంది. ఇది ఆరునెలలకోసారి ‘ఇండియన్ హిస్టారికల్ రివ్యూ’, ‘ఇతిహాస్’ (హిందీలో) అనే రెండు పత్రికలను ప్రచురిస్తుంది.
| నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ, ఆయా సంస్థల ఇతర విశేషాలతోపాటు గతంలో తెలంగాణ హైకోర్ట్ జూనియర్ అసిస్టెంట్, ఆర్‌ఆర్‌బీ క్లర్క్ మెయిన్స్, యూజీసీ నెట్, ఎస్‌ఎస్‌సీ తదితర పోటీపరీక్షల్లో ఈ అంశంపై అడిగిన 50కి పైగా ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్ ‘ఈనాడు ఈప్రతిభ జనరల్ నాలెడ్జ్ & కరెంట్ అఫైర్స్ కోర్సుII’లో అందుబాటులో ఉంది. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978 |
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
1. ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్‌ను ఎవరు స్థాపించారు?
(యూపీ టీజీటీ ఆర్ట్స్, 2021)
1) కపిల వాత్సాయన్ 2) డాక్టర్ కరణ్ సింగ్
3) మౌలానా అబుల్ కలాం ఆజాద్ 4) డాక్టర్ అబ్దుల్ కలాం
సమాధానం: 3
2. నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా ఏ సంవత్సరంలో ఏర్పాటైంది?
(ఎస్‌ఎస్‌సీ సీజీఎల్ టైర్ 1, 2022)
1) 1930 2) 1912 3) 1891 4) 1865
సమాధానం: 3
3. భారత ప్రభుత్వం సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్సెస్ అండ్ ట్రైనింగ్ (సీసీఆర్‌టీ)ని ఎప్పుడు ఏర్పాటు చేసింది?
(ఎస్‌ఎస్‌సీ గ్రాడ్యుయేట్ లెవల్, 2020)
1) 1999 2) 1969 3) 1979 4) 1989
సమాధానం: 3
4. ఇందిరా గాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
(ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ టైర్ 1, 2016)
1) న్యూదిల్లీ 2) కోల్‌కతా
3) లఖ్‌నవూ 4) ముంబయి
సమాధానం: 1
5. At which of the following places is the Nehru Memorial Museum and Library located?
(SSC CPO, 2020)
1) Kolkata 2) Prayagraj 3) Mumbai 4) New Delhi
Ans: 4
6. Indian Council of Historical Research, an autonomous organization, was set up by the Government of India in _______.
(SSC CHSL Exam Tier-I, 2023)
1) 1991 2) 1982 3) 1972 4) 1962
Ans: 3
7. Nadi Utsav 2024 was inaugurated at the ______.
(RRB ALP CBT-I, 2024)
1) National Museum
2) Lalit Kala Akademi
3) India Habitat Centre
4) Indira Gandhi National Centre for the Arts (IGNCA)
Ans: 4
8. Project PARI is an initiative launched by which of the following organisations / Ministries to celebrate and enhance the public art scene in India?
(RRB Technician Grade III, 2024)
1) Lalit Kala Akademi
2) Union Ministry of Culture
3) Centre for Cultural Resources and Training (CCRT)
4) Sahitya Akademi
Ans: 2
Link copied to clipboard!
ఐఐటీ దిల్లీలో ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులు
సిఎస్ఐఆర్- ఎన్జీఆర్ఐలో టెక్నీషియన్ ఉద్యోగాలు
ఎస్బీఐలో స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ ఉద్యోగాలు
పీఎం బ్యూరో ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు
బ్యాంక్ ఆఫ్ బరోడాలో పోస్టులు
ఎన్టీఏలో ఆపరేషన్స్ అసిస్టెంట్ ఉద్యోగాలు
ఎంఈసీఎల్‌లో నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులు
జీఎంసీ నల్గొండలో ప్రొఫెసర్ ఉద్యోగాలు
ఐబీపీఎస్- గ్రామీణ బ్యాంకుల్లో ఆఫీసర్, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు
సీఎస్ఐఆర్- ఐఎంఎంటీలో ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగాలు
డా. ఎన్.టి.ఆర్. ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయంలో పోస్ట్ బేసిక్ బి.ఎస్.సి.నర్సింగ్ ప్రవేశాలు
రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ (ఆర్ఐఎంసీ)లో 8వ తరగతి ప్రవేశాలు
జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్ (జామ్-2027)
ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (ఏపీ టెట్-ఇన్-సర్వీస్ టీచర్స్-2026)
ఐపీఈ, హైదరాబాద్‌లో స్పాట్ అడ్మిషన్లు
మనూలో పీజీ, పీహెచ్డీ, డిప్లొమా, సర్టిఫికేట్ ప్రోగ్రామ్
ఏపీ డా.బి.ఆర్.అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో యూజీ ప్రవేశాలు
గేట్ 2027 నోటిఫికేషన్
కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్)-2027
క్యాట్ 2026 - ఎంబీఏ/పీజీపీ, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాలు
ఈఎస్ఐసీ హైదరాబాద్‌లో ఫ్యాకల్టీ/ సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, మహబూబ్‌నగర్‌లో పోస్టులు
కుమరం భీమ్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసిఫాబాద్‌లో టీచింగ్ ఉద్యోగాలు
ఈఎస్ఐసీలో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
ఎయిమ్స్ గోరఖ్‌పుర్‌లో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
ఎన్బీఆర్ఐలో ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగాలు
ఎయిమ్స్ గోరఖ్‌పుర్‌లో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
ఈఎస్ఐసీలో సీనియర్ రెసిడెంట్ పోస్టులు
ఈఎస్ఐసీలో మెడికల్ ఉద్యోగాలు
డీఆర్డీఓలో జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టులు
ఐసీఏఆర్ - ఎన్ఆర్సీబీలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులు
ఆర్ఆర్సీ- సదరన్ రైల్వేలో అప్రెంటిస్ పోస్టులు
ఎంటీపీఎఫ్, అంబర్‌నాథ్‌లో ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు
హైదరాబాద్ ఎన్ఎఫ్సీలో అప్రెంటిస్ ఉద్యోగాలు
ఈస్ట్ కోస్ట్ రైల్వేలో అప్రెంటిస్ పోస్టులు
ఎంటీపీఎఫ్‌లో అప్రెంటిస్ పోస్టులు
పీజీసీఐఎల్‌లో అప్రెంటిస్ పోస్టులు
బీఈఎంఎల్లో అప్రెంటిస్ పోస్టులు
ఐఓసీఎల్‌లో అప్రెంటిస్ పోస్టులు
ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఉద్యోగాలు
భారత్‌లో మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ
అంతర్జాతీయ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్
హాకీ ప్రపంచకప్
మహిళల హాకీ ప్రపంచకప్
డైమండ్ లీగ్ జ్యూరిచ్
గ్రాండ్ చెస్ టూర్
ముచోవా జోడీకి మిక్స్డ్ టైటిల్
క్రీడాకారుల ప్రోత్సాహానికి రూ.7,386 కోట్ల కేటాయింపు
బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్స్
బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్స్
‘ఏటీఆర్’ అధ్యయనం
మైక్రోసాఫ్ట్ వర్క్ ట్రెండ్ ఇండెక్స్ 2026
బట్ట మేక పక్షులను రక్షించుకోవాలి
ఐసీఐఎంఓడీ పరిశోధన నివేదిక
మిషిగన్ విశ్వవిద్యాలయ అధ్యయనం
వ్రైజే విశ్వవిద్యాలయ అధ్యయనం
‘గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ అండ్ మీడియా అవుట్‌లుక్ 2026-30’
నీతి ఆయోగ్ నివేదిక
నీతి ఆయోగ్ నివేదిక
‘ఆర్య.ఏజీ’ నివేదిక
ఆర్టీసీ ఎండీగా కోన శశిధర్
తెలుగు భాషా పురస్కారాలు
‘సంజీవని’ ప్రాజెక్టు
లోకాయుక్తగా జస్టిస్ మల్లికార్జునరావు ప్రమాణం
పెరిగిన ఎస్సీ, ఎస్టీల జనాభా
పంచాయతీరాజ్ సంస్థల్లోనూ 34% రిజర్వేషన్
పురపాలక శాసనాల నాలుగో సవరణ బిల్లు
బీసీలకు 33.33% రిజర్వేషన్
లోకాయుక్తగా జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు
మానవ అవయవాల మార్పిడి చట్ట సవరణ బిల్లు