ఆచార్య వినోబా భావే 

ఆచార్య వినోబా భావే 

ఆచార్య వినోబా భావే ప్రముఖ భారతీయ తత్వవేత్త, సంఘసంస్కర్త, స్వాతంత్య్ర సమరయోధుడు. అహింసావాదం, వ్యక్తి సత్యాగ్రహంలో పాల్గొనడం; భారతదేశంలో భూ సంస్కరణలు, సామాజిక న్యాయాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో చేపట్టిన భూదానోద్యమం లాంటి కార్యక్రమాల ద్వారా ఆయన విశేష గుర్తింపు పొందారు. మహాత్మా గాంధీ ప్రతిపాదించిన అహింసా సూత్రాలు వినోబా భావేను ఎంతగానో ప్రభావితం చేశాయి. జీవితాంతం ఆయన వాటిని అనుసరించారు. అలాగే సంఘసంస్కరణలో ఆధ్యాత్మిక విలువల ప్రాముఖ్యతను చాటారు. అందరూ ఆయన్ను ‘ఆచార్య’ అని గౌరవంగా పిలుస్తారు. సెప్టెంబరు 11న వినోబా భావే జయంతి సందర్భంగా ఆయన జీవితంలోని ముఖ్య విషయాలు తెలుసుకుందాం..!

  • వినోబా భావే 1895, సెప్టెంబరు 11న మహారాష్ట్రలోని కొంకణ్‌ ప్రాంతంలోని గగోడా గ్రామంలో జన్మించారు. అసలు పేరు వినాయక్‌ నరహరి భావే. ఆయన అహ్మదాబాద్‌లోని సబర్మతీ ఆశ్రమంలో 1916, జూన్‌ 7న తొలిసారిగా గాంధీజీని కలుసుకున్నారు. అప్పుడే గాంధీజీ ఆయనకు వినోబా అని పేరుపెట్టారు. దీంతో ఆయన పేరు వినోబా భావేగా స్థిరపడింది. వినోబా అంటే గొప్ప గౌరవాన్ని సూచించే ఒక సంప్రదాయ మరాఠీ బిరుదు.
  • వినోబా రాజకీయ, ఆధ్యాత్మిక కోణాల్లో గాంధీజీని తన గురువుగా భావించారు. ఆయన సూచన మేరకు వార్ధాలోని ఆశ్రమ బాధ్యతలు చేపట్టడానికి 1921, ఏప్రిల్‌ 8న అక్కడికి వెళ్లారు. అక్కడ ఉన్న సమయంలో భావే ‘మహారాష్ట్ర ధర్మ’ అనే మరాఠీ మాస పత్రికను ప్రచురించారు. ఉపనిషత్తులపై ఆయన రాసిన వ్యాసాలు అందులో వచ్చేవి.   గాంధీజీ చేపట్టిన ప్రతి రాజకీయ ఉద్యమంలోనూ వినోబా పాల్గొన్నారు.
  • 1925లో కేరళ (ప్రస్తుత కేరళం)లోని వైకోమ్‌ మహాదేవ ఆలయంలోకి హరిజనుల ప్రవేశాన్ని పర్యవేక్షించే బాధ్యతను గాంధీజీ వినోబాకు అప్పగించారు. నాటి అస్పృశ్యత వ్యతిరేక ఉద్యమానికి వినోబా నాయకత్వం వహించారు. ఆయన శాసనోల్లంఘన ఉద్యమం (1930-34)లో పాల్గొన్నారు. బ్రిటిష్‌ పాలనకు వ్యతిరేకంగా కుట్ర చేశారన్న ఆరోపణతో 1932లో వినోబాను మహారాష్ట్రలోని ధూలియా జైలుకు పంపారు. 
  • 1948, జనవరి 30న గాంధీజీ మరణించాక వినోబా ఆయన ఆలోచనలను, స్ఫూర్తిని, జీవన విధానాలను వ్యాప్తి చేయాలని భావించారు. దేశంలో సామాజిక అసమానతలను రూపుమాపే ఉద్దేశంతో 1951లో సర్వోదయ ఉద్యమాన్ని ప్రారంభించారు. అదే ఏడాది భూదానోద్యమానికి శ్రీకారం చుట్టారు. 1959లో మహారాష్ట్రలోని పవనార్‌లో బ్రహ్మ విద్యా మందిరాన్ని స్థాపించారు.
  • వినోబా భావే చేపట్టిన భూదానోద్యమం భారతదేశంలో భూ సంస్కరణలపై గణనీయమైన ప్రభావాన్ని చూపింది. అహింస, సామాజిక న్యాయానికి భావే పెద్దపీట వేశారు. తన చివరి దశలో జైనమతంలోని సమాధి మారణ (Samadhi Maran) పద్ధతిని స్వీకరించి కొన్ని రోజుల పాటు నిరాహార దీక్ష చేశాక 1982, నవంబరు 15న వినోబా మహారాష్ట్రలోని వాద్రాలో మరణించారు. 
భూదానోద్యమం ప్రారంభమైన తీరు, వినోబా భావే అందుకున్న అవార్డులు, ఇతర ముఖ్యాంశాలతోపాటు గతంలో ఎస్‌ఎస్‌సీ, యూజీసీ నెట్‌ తదితర పోటీ పరీక్షల్లో ఈ అంశంపై అడిగిన ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్‌ ‘ఈనాడు ఈప్రతిభ జనరల్‌ నాలెడ్జ్‌ & కరెంట్‌ అఫైర్స్‌ కోర్సుII’లో అందుబాటులో ఉంది. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. వినాయక్‌ నరహరి భావేను కింది ఏ పేరుతో పిలుస్తారు?

(కేరళ పీఎస్సీ : సివిల్‌ ఎక్సైజ్, 2019)

1) వివేకానంద                 2) వి.డి.సావర్కర్‌

3) వినోబా భావే                4) భగత్‌సింగ్‌

సమాధానం: 3

2. శాసనోల్లంఘన ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది?

(ఎంపీ పోలీస్‌ కానిస్టేబుల్, 2017)

1) 1942   2) 1914   3) 1928   4) 1930

సమాధానం: 4

3. గాంధీజీ చేపట్టిన వ్యక్తిగత సత్యాగ్రహానికి మొదటిగా ఎంచుకున్న వ్యక్తి ఎవరు?

(సీఐఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌ (ఫైర్‌మ్యాన్‌), 2023)

1) ఆచార్య వినోబా భావే          2) జవహర్‌లాల్‌ నెహ్రూ

3) జైప్రకాశ్‌ నారాయణ్‌            4) మహాత్మా గాంధీ

సమాధానం: 1

4. భూదానోద్యమం కింద ఆచార్య వినోబా భావే మొదటి భూ విరాళాన్ని కింది ఏ ప్రాంతంలో అందుకున్నారు?

(ఎన్‌డీఏ 2 (జీఏటీ), 2024)

1) రామ్‌గఢ్‌                2) గర్వా

3) హైదరాబాద్‌              4) పోచంపల్లి

సమాధానం: 4

5. Which of the following is set to soon launch a heritage cookie that was invented by Mahatma Gandhi, Jamnalal Bajaj and Acharya Vinoba Bhave in 1931?
(SSC MTS, 2024)
1) Mother Dairy        2) Amul        3) Kwality Ltd.
4) Cadbury            5) Parle Agro
Ans: 1
6. Which one of the following incidents prompted Vinobha Bhave to initiate the Bhoodan Movement in India?
(UGC NET, 2020)
1) Nalgonda Incident        2) Srikakulam Incident
3) Naxalbari Incident        4) Madhubani Incident 
7. Which of the following statement is correct about "Bhoodan Movement"?
i. The movement was launched by Vinoba Bhave.
ii. The movement focused to resolve the disputes of land among the people.
(Delhi Police Constable (Executive), 2023)
1) Only i        2) Only ii        3) Both i and ii        4) Neither i nor ii
Ans: 1
8. Bhoodan-Gram Dan Movement was initiated by. 
(CUET UG General Test, 2023)
1) Mahatma Gandhi         2) Vinoba Bhave 
3) Shri Ram Chandra Reddy      4) Sardar Patel 
Ans: 2 

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram