మోక్షగుండం విశ్వేశ్వరయ్య

మోక్షగుండం విశ్వేశ్వరయ్య

ఈయన భారతదేశానికి చెందిన ప్రముఖ సివిల్‌ ఇంజినీర్, రాజనీతిజ్ఞుడు, పండితుడు. దేశవ్యాప్తంగా వివిధ జలాశయాల నిర్మాణం, రూపకల్పన చేశారు; అనేక విద్యా సంస్థలు, పరిశ్రమలు నెలకొల్పారు. నీటి ప్రవాహాలను మూసివేసే ఆటోమేటెడ్‌ తలుపులతో కూడిన బ్లాక్‌ సిస్టమ్‌ను అభివృద్ధి చేసిన ఘనత ఈయనదే. ‘ప్రణాళికా పితామహుడిగా’ పేరొందారు. భారత ఇంజినీరింగ్‌ పితామహుడిగా పేర్కొనే విశ్వేశ్వరయ్య జయంతి  సెప్టెంబరు 15. ఆ తేదీన మన దేశంలో ‘ఇంజినీర్స్‌ డే’గా జరుపుకుంటారు. 

  • విశ్వేశ్వరయ్య 1861, సెప్టెంబరు 15న మైసూర్‌ రాజ్యంలోని మద్దెనహళ్లి (ప్రస్తుతం కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్‌ జిల్లాలో ఉంది)లో జన్మించారు. ఈయన 1899లో భారత నీటిపారుదల కమిషన్‌లో చేరారు. దక్కన్‌ పీఠభూమిలో సంక్లిష్టమైన నీటిపారుదల వ్యవస్థను అభివృద్ధి చేశారు. అలాగే సింధు నది నుంచి సుక్కూర్‌ పట్టణానికి నీటి సరఫరా చేసే పద్ధతిని రూపొందించారు.
  • 1906-07లో నీటి సరఫరా, నీటిపారుదల వ్యవస్థపై అధ్యయనం చేయాల్సిందిగా బ్రిటిష్‌ ప్రభుత్వం ఆయన్ను బ్రిటిష్‌ కాలనీ ఆఫ్‌ ఆడెన్‌ (ప్రస్తుత యెమన్‌)కు పంపింది. అక్కడ శుష్క ప్రాంతాన్ని పరిశీలించి, సమీపంలోని నదీతల్పాల్లో (riverbeds) ఇంకుడు బావులను (percolation wells) ఉపయోగించి భూగర్భ నీటి సేకరణ, పంపింగ్‌ వ్యవస్థను విజయవంతంగా రూపొందించారు.
  • 1903లో పుణె సమీపంలోని ఖడక్‌వాస్లా డ్యాం వద్ద ఆటోమేటిక్‌ వాటర్‌ ఫ్లడ్‌ గేట్ల వ్యవస్థను రూపొందించారు. దీనికి ఆయన పేటెంట్‌ కూడా పొందారు. వరద సమయంలో నీటి ప్రవాహానికి తగ్గట్లు ఆనకట్టకు ఎలాంటి ప్రమాదం జరగకుండా నీటిని నిల్వ చేయడం వీటి ప్రత్యేకత. తర్వాతి కాలంలో ఈ వ్యవస్థను గ్వాలియర్‌లోని టిగ్రా ఆనకట్ట, మైసూర్‌లోని కృష్ణ రాజ సాగర డ్యాం వద్ద ఏర్పాటు చేశారు.
  • విశ్వేశ్వరయ్య 1918 వరకు మైసూరు సంస్థానం దివాన్‌గా పని చేశారు. ఆ సమయంలో  నెలకొల్పిన కొన్ని ముఖ్య సంస్థలు: మైసూర్‌ సోప్‌ ఫ్యాక్టరీ, పారాసిటాయిడ్‌ ల్యాబొరేటరీ, భద్రావతిలోని మైసూర్‌ ఐరన్‌ అండ్‌ స్టీల్‌ వర్క్స్, బెంగళూరు పాలిటెక్నిక్‌ (ప్రస్తుతం శ్రీ జయచామరాజేంద్ర పాలిటెక్నిక్‌), బెంగళూరు వ్యవసాయ విశ్వవిద్యాలయం, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ మైసూర్, బెంగళూరులో గవర్నమెంట్‌ ఇంజినీరింగ్‌ కాలేజ్‌ (ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్‌ విశ్వేశ్వరయ్య కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌).

జాతీయ ఇంజినీర్ల దినోత్సవం

  • మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని ఏటా మన దేశంలో సెప్టెంబరు 15న ‘జాతీయ ఇంజినీర్ల దినోత్సవం’గా (National Engineers Day) నిర్వహిస్తారు. సాంకేతిక పురోగతి, మౌలిక సదుపాయాల కల్పన - ఆవిష్కరణలో ఇంజినీర్లు కీలక పాత్ర పోషిస్తారు. సమాజ, దేశాభివృద్ధిలో వారి సేవలను గౌరవించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం. 1968 నుంచి ఏటా దీన్ని నిర్వహిస్తున్నారు. 
  • ఆర్థిక విషయాలపై విశ్వేశ్వరయ్య ముందుచూపు పారిశ్రామికీకరణకు ఒక మార్గసూచీని నిర్దేశించింది. తర్వాతి కాలంలో భారతదేశ పంచవర్ష ప్రణాళికల రూపల్పనకు మార్గదర్శకమైంది. ఆధునిక భారతదేశ నిర్మాతగా, దార్శనికుడిగా, ప్రణాళికాకర్తగా ఆయన చరిత్రకెక్కారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య 1962, ఏప్రిల్‌ 14న బెంగళూరులో మరణించారు. 
హైదరాబాద్, విశాఖపట్నాలకు విశ్వేశ్వరయ్య చేసిన మేలు, ఆర్థిక ప్రణాళిక పితామహుడిగా అందించిన సేవలు, అవార్డులు - గౌరవాలతోపాటు గతంలో ఎస్‌ఎస్‌సీ, ఆర్‌ఆర్‌బీ తదితర పోటీపరీక్షల్లో ఈ అంశంపై అడిగిన ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్‌ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్‌ నాలెడ్జ్‌ & కరెంట్‌ అఫైర్స్‌ కోర్సుII’కి సబ్‌స్క్రైబ్‌ చేసుకోండి. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు


1. 1955లో ఎం.విశ్వేశ్వరయ్యకు కింది ఏ ప్రతిష్ఠాత్మక పౌర పురస్కారం దక్కింది?

(దిల్లీ పోలీస్‌ కానిస్టేబుల్‌ (ఎగ్జిక్యూటివ్‌), 2026)

1) భారతరత్న                 2) పద్మ విభూషణ్‌

3) పద్మ భూషణ్‌              4) పద్మశ్రీ

సమాధానం: 1

2. కర్ణాటకలో ఉన్న కృష్ణరాజసాగర్‌ డ్యామ్‌ కింది ఏ నదిపై ఉంది?

(ఎంపీ పోలీస్‌ కానిస్టేబుల్, 2023)

1) కావేరి                     2) గోదావరి

3) కృష్ణా                     4) మహానది

సమాధానం: 1

3. మన దేశంలో జాతీయ ఇంజినీర్ల దినోత్సవాన్ని ఏటా ఏ తేదీన పాటిస్తారు?

(యూపీ పోలీస్‌ అసిస్టెంట్‌ ఆపరేటర్, 2024),

(ఎస్‌ఎస్‌సీ జీడీ, 2019), (ఎస్‌ఎస్‌సీ ఎంటీఎస్, 2023)

1) సెప్టెంబరు 15                    2) డిసెంబరు 10

3) ఏప్రిల్‌ 14                   4) అక్టోబరు 1

సమాధానం: 1

4. ప్లాన్డ్‌ ఎకానమీ ఫర్‌ ఇండియా అనే పుస్తక రచయిత?

(ఓపీఎస్సీ ఓఏఎస్, 2018)

1) సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌          2) ఎం.విశ్వేశ్వరయ్య 

3) జవహర్‌లాల్‌ నెహ్రూ               4) మహాత్మా గాంధీ

సమాధానం: 2

5. Who is regarded as the Father of Indian Planning?
(SSC GD Constable, 2026)
1) Dadabhai Naoroji        2) Jawaharlal Nehru
3) Mahalanobis            4) M. Visvesvaraya
Ans: 4
6. On which date was Engineers’ Day observed in India in 2025?
(RRB Technician Grade III, 2026)
1) 13 September        2) 16 September        
3) 14 September        4) 15 September
Ans: 4
7. Which of the following statements about Sir M. Visvesvaraya is correct?
(SSC CGL, 2025)
1) He was the first recipient of the Bharat Ratna.
2) He was known for his role in India's hydroelectric projects.
3) He designed the first Indian Rail budget model.
4) He was a noted industrialist from pre-Independence India.
Ans: 2
8. The Sir M Visvesvaraya Railway Terminal in which city is all set to become the country’s first largest air-conditioned rail concourse, which will give passengers an airport kind of experience?
(RRB Officer Scale-I Mains (English), 2021)
1) Pune        2) Chennai        3) Bengaluru        
4) Patna        5) Kochi
Ans: 3

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram