ముఖ్యమైన సుప్రీంకోర్టు తీర్పులు (పార్ట్‌ - 5)

ముఖ్యమైన సుప్రీంకోర్టు తీర్పులు (పార్ట్‌ - 5)

మన దేశంలో రాజ్యాంగ వ్యాఖ్యానానికి సుప్రీంకోర్టు తీర్పులే వెన్నెముక. అవి రాజ్యాంగ నిబంధనలకు నిజమైన అర్థాన్ని వివరిస్తాయి. ప్రభుత్వ విభాగాల మధ్య వివాదాలు పరిష్కరిస్తాయి, పౌరుల హక్కులను పరిరక్షిస్తాయి. అవి కేవలం కేసుకు సంబంధించిన నిర్ణయాలు మాత్రమే కాదు భవిష్యత్తు శాసనాలకు, కార్యనిర్వాహక చర్యలకు దిశానిర్దేశం చేస్తాయి. రాజ్యాంగ మౌలిక స్వరూపం, న్యాయ సమీక్ష, సమాఖ్యవాదం, లౌకికవాదం, సమానత్వం, గౌరవం లాంటి భావనలు ప్రధానంగా ఈ చరిత్రాత్మక తీర్పుల ద్వారానే రూపుదిద్దుకుంటాయి. గత నాలుగు భాగాల్లో 1950 నుంచి 2017 వరకు సుప్రీంకోర్టు వెలువరించిన ముఖ్యమైన తీర్పుల సమాచారం ఉంది. పార్ట్‌-5లో మరిన్ని అంశాలు తెలుసుకుందాం!

యంగ్‌ లాయర్స్‌ అసోసియేషన్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కేరళ కేసు

  • ఇది శబరిమల ఆలయ కేసుగా ప్రసిద్ధి కేరళలోని శబరిమల ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్ల వయసున్న మహిళల ప్రవేశాన్ని నిషేధించే శతాబ్దాల నాటి ఆచారాన్ని 1991లో కేరళ హైకోర్టులో మొదటిసారి సవాలు చేశారు. ‘ఎస్‌.మహేంద్రన్‌ వర్సెస్‌ ట్రావెన్‌కోర్‌ సెక్రటరీ’గా దీనికి పేరు. స్త్రీ హక్కులు, సమానత్వం, అంటరానితనం లాంటి విషయాలను సుప్రీంకోర్టు తీర్పు సందర్భంగా ప్రస్తావించింది. 

నవతేజ్‌సింగ్‌ జోహర్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు  

  • ఇది ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ (ఐపీసీ) 1860లోని సెక్షన్‌ 377కు సంబంధించిన తీర్పు. ఇది పరస్పర అంగీకారంతో కూడిన స్వలింగ సంబంధాలను లక్ష్యంగా చేసుకుంది. ఐపీసీ సెక్షన్‌ 377 అనేది వలస పాలన కాలం నాటి చట్టం. ఇది ప్రకృతి నియమాలకు విరుద్ధమైన లైంగిక సంపర్కాన్ని (carnal intercourse against the order of nature) నేరంగా పరిగణిస్తుంది. దీనికి గరిష్ఠంగా జీవిత ఖైదు వరకు శిక్ష విధించే నిబంధన ఉంది. 

ఆర్టికల్‌ 370 రద్దు తీర్పు

  • ఆర్టికల్‌ 370 అనేది భారత రాజ్యాంగంలోని ప్రత్యేక నిబంధన. ఇది కశ్మీర్‌ సంస్థానానికి (జమ్మూ - కశ్మీర్‌) స్వయం ప్రతిపత్తి హోదా కల్పించింది. ఇందులోని ఆర్టికల్‌ 35ఏ ఆ ప్రాంత శాశ్వత నివాసితులకు ఆస్తి హక్కులు, ఉపాధితో సహా ప్రత్యేక అధికారాలు కల్పించింది. కేంద్రం దాన్ని రద్దు చేసి భారత్‌లోని ఇతర ప్రాంతాల మాదిరే సమాన హోదా కల్పించింది. దీనికి సుప్రీంకోర్టు కూడా మద్దతు తెలిపింది.

స్టేట్‌ ఆఫ్‌ తమిళనాడు వర్సెస్‌ గవర్నర్‌ ఆఫ్‌ తమిళనాడు 

  • రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులకు ఆమోదం తెలపడంలో గవర్నర్‌ జాప్యానికి సంబంధించిన కేసు ఇది. ఆర్టికల్‌ 163 గవర్నర్‌ సాధారణ అధికారాలను వివరిస్తుంది. దీని ప్రకారం, కొన్ని విచక్షణాధికారాలు మినహా మంత్రిమండలి సలహా మేరకు మాత్రమే గవర్నర్‌ వ్యవహరించాలి. ఈ కోర్టు తీర్పు శాసన ప్రక్రియలో ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాల ప్రాధాన్యతలను బలపరుస్తుంది. 

హరీశ్‌ రాణా వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు 

  • ఈ కేసు సందర్భంగా కారుణ్య మరణాన్ని ప్రసాదించేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. 2018లో సుప్రీంకోర్టు ‘గౌరవప్రదంగా మరణించడం’ అనేది ప్రాథమిక హక్కుగా గుర్తించింది. కారుణ్య మరణాన్ని చట్టబద్ధం చేసింది. హరీశ్‌ రాణా వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో దీన్ని మొదటిసారి అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. కారుణ్య మరణాలకు సంబంధించి సమగ్ర చట్టాన్ని తీసుకురావాలని కేంద్రానికి సూచించింది.
ఆయా కేసుల పూర్వాపరాలు, విశేషాలతోపాటు గతంలో ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్, ఆర్‌ఆర్‌బీ గ్రూప్‌-డి, ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ, ఎస్‌ఎస్‌సీ తదితర పోటీపరీక్షల్లో అడిగిన ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్‌.. ఇంకా పోటీపరీక్షల్లో వచ్చే కీలక జీకే అంశాలు, మంత్లీ కరెంట్‌ అఫైర్స్‌ ఈబుక్స్, ప్రాక్టీస్‌ టెస్ట్స్‌ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్‌ నాలెడ్జ్‌ & కరెంట్‌ అఫైర్స్‌ కోర్సు’కి సబ్‌స్క్రైబ్‌ చేసుకోండి. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. భారత ప్రభుత్వం కింది ఏ సంవత్సరంలో జమ్మూ-కశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక హోదా రద్దు చేసింది?
(ఎస్‌ఎస్‌సీ జీడీ కానిస్టేబుల్, 2023)

1) 2018    2) 2014    3) 2021    4) 2019

సమాధానం: 4

2. యంగ్‌ లాయర్స్‌ అసోసియేషన్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కేరళ కేసు (2018) కింది ఏ పేరుతో ప్రసిద్ధి?
(యూపీ పోలీస్‌ ఎస్‌ఐ, 2021)

1) ఎల్‌జీబీటీ కేసు                2) ఆధార్‌ కేసు

3) శబరిమల కేసు                4) జాతీయ గీతం కేసు

సమాధానం: 3

3. భారత ప్రభుత్వం కింది ఏ సంవత్సరంలో జమ్మూ-కశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక హోదా రద్దు చేసింది?
(ఎస్‌ఎస్‌సీ జీడీ కానిస్టేబుల్, 2023)

1) 2018    2) 2014    3) 2021    4) 2019

సమాధానం: 4

4. ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ (ఐపీసీ)లోని ఏ సెక్షన్‌ అసహజ నేరాల గురించి సూచిస్తుంది?

(యూపీ పోలీస్‌ ఎస్‌ఐ, 2021)

1) సెక్షన్‌ 377   2) సెక్షన్‌ 163    3) సెక్షన్‌ 173   4) సెక్షన్‌ 279

సమాధానం: 1

5. Justice Indu Malhotra penned a dissenting opinion in which of the following landmark judgements?
(SSC CGL Tier-I, 2023)

1) Basic structure doctrine        2) Preamble part of the Constitution

3) Entry of women to Sabarimala    4) Land reforms in India

Ans: 3

6. “Equality before law” and “equal protection of the laws” under fundamental rights are provided in which of the following provisions of the Constitution of India?
(RRB NTPC (UG) CBT-I, 2026)

1) Article 16            2) Article 14            3) Article 15            4) Article 13

Ans: 2

7. Six rights guaranteed by Article 19 can be suspended on the grounds of:
i. War
ii. External aggression
iii. Armed rebellion
iv. Internal disturbance
(SSC Stenographer, 2024)

1) iv only            2) ii and iii both        

3) i and ii both        4) ii, iii and iv only

Ans: 3

8. Article 19(1)(d) of the Indian Constitution guarantees the right to move freely throughout India. Under which of the following conditions can this right be reasonably restricted?
(DSSSB MTS, 2026)

1) To promote tourism and travel

2) In the interests of public order, security of the State, or sovereignty and integrity of India

3) To manage urban development

4) To encourage cultural diversity

Ans: 2

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram