భారత్‌ను సందర్శించిన విదేశీ యాత్రికులు/ రాయబారులు (పార్ట్‌-1) 

భారత్‌ను సందర్శించిన విదేశీ యాత్రికులు/ రాయబారులు (పార్ట్‌-1) 

ప్రపంచ నలుమూలల నుంచి అనేకమంది గొప్ప విదేశీ రాయబారులు, యాత్రికులు ప్రాచీన భారతదేశాన్ని సందర్శించారు. వారు రాజాస్థానాలకు వచ్చి ఇక్కడి పరిస్థితులు, విషయాల గురించి అనేక గ్రంథాలు రాశారు. ముఖ్యంగా భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలపై అనేక పరిశోధనలు చేశారు. వీరి రచనల ద్వారానే మన విశిష్టత బయటి దేశాలకు తెలిసింది. ఈ యాత్రికులు దేశవ్యాప్తంగా సంచరించి, వారు గమనించిన అనేక విషయాలను సంగ్రహణం చేశారు. పోటీపరీక్షల కోణంలో విదేశీ రాయబారులు, యాత్రికులకు సంబంధించిన ముఖ్యాంశాలు, వారు ఏ కాలంలో వచ్చారు - రచనల గురించి తెలుసుకుందాం!

  • చైనాకు చెందిన బౌద్ధ పండితుడు హుయాన్‌త్సాంగ్‌ భారత్‌లో బౌద్ధ మత మూలాలు, ఆచారాలు అధ్యయనం చేయడానికి వస్తే, ఇక్కడి సంస్థానాలు, రాజ్యాలతో రాజకీయ, ఆర్థిక సంబంధాలను ఏర్పర్చుకోవాలనే ఉద్దేశంతో మెగస్తనీస్‌ వచ్చారు. భారతదేశానికి వచ్చిన విదేశీ యాత్రికులు/ రాయబారుల్ని మూడు విస్తృత కాలక్రమ వర్గాలుగా విభజించారు. అవి: ప్రాచీన కాలం, మధ్యయుగ కాలం, తొలి ఆధునిక/ వలస కాలం.  
  • ప్రాచీన కాలం: గ్రీకు, రోమన్‌ యాత్రికులు, చైనా బౌద్ధ యాత్రికులు ఈ కాలంలో సందర్శించారు.  
  • మధ్యయుగ కాలం: ఈ కాలంలో అరబ్, పర్షియన్‌ పండితులు, యూరోపియన్‌ యాత్రికులు వచ్చారు.  
  • తొలి ఆధునిక/ వలస కాలం: యూరోపియన్‌ వ్యాపారులు, పండితులు ఎక్కువగా సందర్శించారు.  

ప్రాచీన కాలంలో మన దేశానికి వచ్చిన విదేశీ యాత్రికులు

మెగస్తనీస్‌

  • ఈయన క్రీ.పూ.3వ శతాబ్దానికి చెందిన గ్రీకు రాయబారి, చరిత్రకారుడు, అన్వేషకుడు.
  • మౌర్య వంశ స్థాపకుడైన చంద్రగుప్త మౌర్యుడి పాలనా కాలంలో మన దేశాన్ని సందర్శించారు. గ్రీకు పాలకుడైన సెల్యూకస్‌ నికేటర్‌ మెగస్తనీస్‌ను తన రాయబారిగా మౌర్యుడి వద్దకు పంపాడు. సుమారు క్రీ.పూ.302 నుంచి క్రీ.పూ.298 వరకు మన దేశంలో ఉన్నట్లు చరిత్రకారులు పేర్కొన్నారు.

ఫా-హియాన్‌/ ఫాక్సియాన్‌

  • ఈయన చైనాకు చెందిన బౌద్ధ సన్యాసి. భారతదేశాన్ని సందర్శించిన తొలి చైనీస్‌ యాత్రికుల్లో ఒకరు. గుప్తవంశ పాలకుడైన రెండో చంద్రగుప్తుడి (విక్రమాదిత్యుడి) కాలంలో క్రీ.శ.399లో మన దేశానికి వచ్చి, క్రీ.శ.414 వరకు ఇక్కడే ఉన్నట్లు చెప్తారు. గౌతమ బుద్ధుడితో సంబంధం ఉన్న ముఖ్యమైన బౌద్ధ పుణ్యక్షేత్రాలను సందర్శించడం, వినయ పీఠకాన్ని సేకరించడం, పవిత్ర గ్రంథాల అనువాదం అనేవి ఈయన లక్ష్యాలు. 

హుయాన్‌త్సాంగ్‌/ జువాన్‌జంగ్‌  

  • ఈయన చైనాకు చెందిన బౌద్ధ సన్యాసి, పండితుడు, యాత్రికుడు. పుష్యభూతి వంశ పాలకుడైన హర్షవర్ధనుడి కాలంలో మన దేశాన్ని సందర్శించారు. సుమారు క్రీ.శ.630 నుంచి 645 వరకు ఇక్కడ ఉన్నారు. భారతదేశంలోని బౌద్ధ మత గ్రంథాలను సేకరించడానికి ఆయన ఇక్కడికి వచ్చారు. ఇక్కడి నుంచి సుమారు 657 భారతీయ పుస్తకాలను చైనాకు తీసుకెళ్లారు.

ఐ-త్సింగ్‌

  • ఈయన క్రీ.శ.7వ శతాబ్దానికి చెందిన చైనా యాత్రికుడు. దక్కన్‌ ప్రాంతంలో చాళుక్యులు, పల్లవుల పాలనా కాలంలో భారతదేశాన్ని సందర్శించారు. బౌద్ధ మతానికి మూల స్తంభంగా ఉన్న భారతదేశంలో బుద్ధుడి బోధనలు, తత్వశాస్త్రం, సన్యాస జీవితం గురించి అధ్యయనం చేయడానికి ఐ-త్సింగ్‌ భారతదేశానికి వచ్చారు. సుమారు క్రీ.శ.670 నుంచి 695 వరకు ఇక్కడ ఉన్నారు.
ఆయా విదేశీ యాత్రికుల రచనలు, ఇతర ముఖ్యాంశాలతోపాటు గతంలో తెలంగాణ పోలీస్‌ ఎస్‌ఐ మెయిన్స్, ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1 ప్రిలిమినరీ, ఎస్‌ఎస్‌సీ, రైల్వే తదితర పోటీపరీక్షల్లో ఈ టాపిక్‌ నుంచి అడిగిన 85కి పైగా ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్‌ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్‌ నాలెడ్జ్‌ & కరెంట్‌ అఫైర్స్‌ కాంబో కోర్సు’కి సబ్‌స్క్రైబ్‌ చేసుకోండి.  వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. మెగస్తనీస్‌ కింది ఏ రాజు ఆస్థానంలో రాయబారిగా పనిచేశాడు? (ఎస్‌ఎస్‌సీ ఎంటీఎస్, 2022)

1) చంద్రగుప్త మౌర్యుడు                2) బాబర్‌

3) షాజహాన్‌                     4) సికిందర్‌ లోడీ

సమాధానం: 1

2. కింది విదేశీ యాత్రికుల్లో ఎవరు భారతదేశాన్ని మొదట సందర్శించారు? (డీఎస్‌ఎస్‌ఎస్‌బీ జైల్‌ వార్డర్, 2025)

1) ఫాహియాన్‌                 2) అల్‌ మసూది

3) హుయాన్‌త్సాంగ్‌              4) ఇబన్‌ బటూటా 

సమాధానం: 1

3. జహంగీర్‌ పాలనా కాలంలో భారతదేశాన్ని సందర్శించిన విదేశీ యాత్రికుడు ఎవరు? (యూపీపీఎస్సీ సివిల్‌ ప్రిలిమ్స్, 2017)

1) ఫారద్‌ ఆంటోనీ మోన్సెరేట్‌            2) ఫ్రాన్సిస్‌ పెల్సార్ట్‌

3) నికోలో మానుచి                4) ఫ్రాంకోయిస్‌ బెర్నియర్‌

సమాధానం: 2

4. భారతదేశాన్ని సందర్శించిన యాత్రికుల్లో కింది ఎవరు పోర్చుగల్‌కు చెందినవారు? (దిల్లీ పోలీస్‌ కానిస్టేబుల్‌ (ఎగ్జిక్యూటివ్‌), 2023)

1) ఫ్రాంకోయిస్‌ బెర్నియర్‌             2) నికోలో కాంటి

3) ఇబన్‌ బటూటా                  4) డువార్టే బార్బోసా 

సమాధానం: 4

5. Arrange the following foreign travellers to India in chronological order, beginning with the earliest :

i. Peter Mundy                ii. Antonio Monserrate

iii. Afanasii Nikitich Nikitin        iv. Ibn Battuta

Select the answer using the code given below : 
(NDA-II (General Ability Test), 2025)

1) ii - i - iv - iii        2) ii - iii - iv - i        3) iv - iii - ii - i        4) iii - iv - i - ii

Ans: 3

6. Arrange the visit of the following European travellers to India in chronological order:

i. John Mildenhall            ii. William Finch

iii. Ralph Fitch            iv. Thomas Coryat

v. Jean Baptiste Tavernier

Choose the correct answer from the options given below:
(UGC NET Paper 2: History, 2025)

1) iii, i, ii, v, iv        2) iii, i, ii, iv, v

3) i, v, iii, iv, ii        4) i, v, ii, iv, iii

Ans: 2

7. Which fourteenth-century traveller described how Indian chieftains fortified themselves using bamboo groves and rugged terrains for defence?
(SSC CGL, 2025)

1) Al-Biruni            2) Ibn Battuta        3) Marco Polo        4) Megasthenes

Ans: 2

8. Consider the following foreign travellers and arrange them in ascending chronological order:

i. I-Tsing                        ii. Al-Biruni

iii. Huentsang (Hiuen Tsang)            iv. Fahyan (Fa-Hien)

Select the correct answer from the codes given below:
(UPPSC PCS Prelims, GS Paper-I, 2024)

1) iv, iii, i, ii        2) ii, i, iv, iii        3) i, ii, iii, iv        4) iii, iv, ii, i

Ans: 1

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram