భారత్‌లో అణు విద్యుత్‌ కేంద్రాలు

భారత్‌లో అణు విద్యుత్‌ కేంద్రాలు

ఇంధన వ్యవస్థలో అణుశక్తి ముఖ్య భాగం. ఇది స్థిరమైన ఆర్థిక, సామాజిక అభివృద్ధి సాధనలో కీలకమైంది. ఇది పునరుత్పాదక శక్తి వనరు. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ తమ రోజువారీ కార్యకలాపాలకు శక్తి (ఎనర్జీ)పైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. శక్తిని జీవనోపాధి, పురోగతికి జీవనాడిలా పేర్కొంటారు. ఉద్యోగాలు, ఆదాయాన్ని సృష్టించడం; భారీ స్థాయిలో వాణిజ్యాన్ని సులభతరం చేయడం ద్వారా అణు శక్తి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ముఖ్య భూమిక పోషిస్తోంది. పోటీపరీక్షల కోణంలో మన దేశంలో అణుశక్తి - అణు విద్యుత్‌ కేంద్రాల గురించి ముఖ్యాంశాలు తెలుసుకుందాం..!

  • ప్రపంచవ్యాప్తంగా తక్కువ కార్బన్‌ ఉద్గారాలతో విద్యుత్‌ను ఉత్పత్తి చేసే వనరుల్లో జల విద్యుత్‌ తర్వాత రెండో అతిపెద్ద వనరుగా అణు విద్యుత్‌ ఉంది. భారతదేశ శక్తి అవసరాలను తీర్చి, సంప్రదాయ ఇంధన వనరులకు ప్రత్యామ్నాయంగా పనిచేసి, రక్షణపరంగా భారత్‌ను శక్తిమంతం చేయడంలో అణుశక్తి ప్రధాన పాత్ర పోషిస్తోంది. దీని అభివృద్ధికి కృషిచేసిన వ్యక్తి హోమి జహంగీర్‌ భాభా. ఈయన్ను భారత అణుశక్తి రంగ పితామహుడిగా పేర్కొంటారు.
  • ప్రపంచవ్యాప్తంగా విద్యుత్‌ ఉత్పత్తిలో భారతదేశం మూడో స్థానంలో ఉంది. మన దేశానికి అణుశక్తి అయిదో అతిపెద్ద విద్యుత్‌ వనరు. 2026, జులై 31 నాటికి మన దేశంలో స్థాపిత అణు విద్యుత్‌ సామర్థ్యం 8.78 గిగావాట్లు (గి.వా.). 2047 నాటికి అణు విద్యుత్‌ సామర్థ్యాన్ని 100 గి.వా.లకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కేంద్రం 2033 నాటికి కనీసం అయిదు స్వదేశీ ఎస్‌ఎంఆర్‌లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్దేశించింది.

గమనిక: మన దేశంలో న్యూక్లియర్‌ ఎనర్జీకి సంబంధించిన మరింత సమాచారం జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ కరెంట్‌ అఫైర్స్‌ కాంబో కోర్సులో ‘భారత్‌లో అణుశక్తి’ పేరుతో ఈ-బుక్‌లో రూపంలో అందుబాటులో ఉంది. అందులో భారత్‌లో అణుశక్తి వనరులు, న్యూక్లియర్‌ ఎనర్జీ రంగం అభివృద్ధి తీరు, మూడంచెల అణువిద్యుత్‌ కార్యక్రమం, కల్పక్కం పీఎఫ్‌బీఆర్‌కు సంబంధించిన మరిన్ని విశేషాలతోపాటు మాదిరి ప్రశ్నలు ఉన్నాయి.

  • 2026, ఏప్రిల్‌ 6న తమిళనాడులోని కల్పక్కంలో పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో నెలకొల్పిన ప్రోటోటైప్‌ ఫాస్ట్‌ బ్రీడర్‌ రియాక్టర్‌ (పీఎఫ్‌బీఆర్‌) క్రిటికాలిటీని సాధించడం ద్వారా అణుశక్తి ఉత్పాదనలో మన దేశం చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. దీంతో భారత్‌ తన మూడు దశల అణుశక్తి కార్యక్రమంలో రెండో అంచెలోకి అధికారికంగా ప్రవేశించినట్లైంది.
  • శాంతియుత ప్రయోజనాల కోసం మాత్రమే అణుశక్తిని వినియోగించే దిశగా భారత్‌ ఇప్పటివరకు 18 దేశాలతో అణు ఒప్పందాలు కుదుర్చుకుంది. అవి: అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, కెనడా, చెక్‌ రిపబ్లిక్, యూరోపియన్‌ యూనియన్, ఫ్రాన్స్, జపాన్, కజకిస్థాన్, మంగోలియా, నమీబియా, రిపబ్లిక్‌ ఆఫ్‌ కొరియా, రష్యా, శ్రీలంక, బ్రిటన్, అమెరికా, వియత్నాం, ఘనా.

అణుశక్తి వల్ల ఉపయోగాలు, సవాళ్లు,  దేశంలోని అణువిద్యుత్‌ కేంద్రాలు, మన దేశ అణుశక్తి సామర్థ్యం తదితర కీలక సమాచారంతోపాటు గతంలో ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్, తెలంగాణ పోలీస్‌ ఎస్‌ఐ మెయిన్స్, ఎస్‌ఎస్‌సీ, ఆర్‌ఆర్‌బీ తదితర పోటీపరీక్షల్లో అడిగిన 100కి పైగా ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్‌ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్‌ నాలెడ్జ్‌ & కరెంట్‌ అఫైర్స్‌ కాంబో కోర్సు’కి సబ్‌స్క్రైబ్‌ చేసుకోండి! వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. రేడియోధార్మిక ఐసోటోప్‌ల వినియోగం ద్వారా పొందే శక్తిని ఏమంటారు?

(ఆర్‌ఆర్‌బీ జేఈ ఈసీఈ, 2025)

1) ఉష్ణ శక్తి              2) సౌర శక్తి

3) భూగర్భ శక్తి           4) అణు శక్తి

సమాధానం: 4

2. వికసిత్‌ భారత్‌ కోసం అణు శక్తి మిషన్‌ లక్ష్యం ప్రకారం, 2047 నాటికి ఎంత అణుశక్తి సామర్థ్యాన్ని సాధించాలని ప్రభుత్వం నిర్ణయించింది?

(ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ (యూజీ), 2025) 

1) 75 గి.వా.    2) 125 గి.వా.        3) 50 గి.వా.    4) 100 గి.వా.

సమాధానం: 4

3. భారతదేశ మొదటి అణువిద్యుత్‌ కేంద్రం ఏది?

(బిహార్‌ ఎస్‌టెట్‌ (సైన్స్‌), 2025)

1) నరోరా             2) కైగా        3) రావత్‌భట్‌          4) తారాపూర్‌

సమాధానం: 4

4. భారతదేశ అణుశక్తి కార్యక్రమం ఎన్ని దశలపై ఆధారపడి ఉంది?

(యూపీ పోలీస్‌ కానిస్టేబుల్, 2026)

1) ఒకటి        2) నాలుగు            3) అయిదు          4) మూడు

సమాధానం: 4

5. India's atomic energy program began with research reactors before commercial power generation. The first grid-connected station marked entry into nuclear electricity production for self-reliance. Which was the first commercial nuclear power station built in India in 1969?
(IBPS Clerk Mains, 2025)
1) Narora Atomic Power Station        2) Kakrapar Atomic Power Station
3) Tarapur Atomic Power Station        4) Kaiga Generating Station
5) Madras Atomic Power Station
Ans: 3
6. Consider the following statements regarding Fast Breeder Reactors:
i. Fast Breeder Reactors are designed to breed more fuel than they consume.
ii. In this reactor, Plutonium-239 undergoes fission to produce energy, while the- Uranium-238 present in the fuel transmutes to additional Plutonium-239.
iii. It is a part of stage 1 of India's Nuclear power programme.
Which of the statements given above is/are correct?
(APPSC Group 1 Prelims, 2023)
1) i only        2) i and ii only        3) ii and iii only        4) i, ii and iii
Ans: 2
7. Which one of the following Nuclear power station has the highest capacity in India at present ?
(Telangana Police SI Mains, 2018)
1) Kaiga        2) Kakrapara        3) Tarapur        4) Kudankulam
Ans: 4
8. Which of the following Boards will be established under the Sustainable Harnessing and Advancement of Nuclear Energy for Transforming India Act, 2025?
(RRB NTPC Graduate Level, CBT-II, 2026)
1) Atomic Energy Regulatory Board
2) Nuclear Power Development Board
3) Central Radiation Monitoring Board
4) National Nuclear Safety Board
Ans: 1

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram