భారతదేశ చరిత్రలో ముఖ్యమైన యుద్ధాలు (పార్ట్‌ - 4)

భారతదేశ చరిత్రలో ముఖ్యమైన యుద్ధాలు (పార్ట్‌ - 4)

అధికార పోరాటాలు, విజయాలు, దేశగతిని మార్చిన చరిత్రాత్మక యుద్ధాల సమాహారమే భారతదేశ చరిత్ర. దేశ రాజకీయ, ఆర్థిక, సామాజిక స్వరూపాన్ని తీర్చిదిద్దడంలో ఇవి కీలకపాత్ర పోషించాయి. మన చరిత్రకు సంబంధించిన అధ్యయనంలో ఇవి ప్రముఖంగా ఉన్నాయి. గత మూడు భాగాల్లో యుద్ధాల విభజన, ప్రాచీన - మధ్యయుగ కాలంలో భారతదేశ చరిత్రలో జరిగిన యుద్ధాల సమాచారం ఉంది. ఈ భాగంలో ఆధునిక భారతదేశ చరిత్రలో చోటుచేసుకున్న ముఖ్య సంగ్రామాల గురించి తెలుసుకుందాం..!

  • క్రీ.శ.1700 తర్వాత జరిగిన అన్ని యుద్ధాలు ఆధునిక యుగం కిందికి వస్తాయి. ఈ కాలంలోని ముఖ్యమైన సంగ్రామాల్లో వలసవాద ఆక్రమణలు, వాటికి ఎదురైన ప్రతిఘటనలు ఉన్నాయి. వీటిలో బ్రిటిష్‌ వారి ఆధిపత్యం, వారి పాలన కీలకపాత్ర పోషించాయి. ఈ కాలంలో జరిగిన యుద్ధాలు భారత రాజకీయ స్వరూపాన్ని మార్చేశాయి. అదే సమయంలో వలస పాలన నుంచి స్వాతంత్య్రం పొందేందుకు భారతీయులు బ్రిటిష్‌వారికి వ్యతిరేకంగా జరిపిన పోరాటాలను తెలియజేస్తాయి. 

వసాయి యుద్ధం/ బస్సెన్‌ యుద్ధం (Battle of Vasai/ Battle of Bassein)

  • ఇది 1739 ఫిబ్రవరి 17 - మే 16 మధ్య మహారాష్ట్రలోని వసాయు కోట గురించి మరాఠా సామ్రాజ్యానికి, పోర్చుగీస్‌ సేనలకు మధ్య జరిగింది. అప్పటి మహారాష్ట్ర పీష్వా మొదటి బాజీరావు సోదరుడైన చిమాజీ అప్పా మరాఠా సేనలకు నాయకత్వం వహించాడు. ఈ యుద్ధంలో పోర్చుగీస్‌ వారు ఓడిపోవడంతో కుదిరిన ఒప్పందం ప్రకారం, పోర్చుగీస్‌ వారు మరాఠాల కింద పనిచేయడంతోపాటు వారి భూభాగాలు మహారాష్ట్రుల వశమయ్యాయి. 

కర్నాల్‌ యుద్ధం (Battle of Karnal)

  • ఈ యుద్ధాన్ని భారతదేశ చరిత్రలో ఒక ప్రధాన మలుపుగా పరిగణిస్తారు. ఇది 1739, ఫిబ్రవరి 24న మొగల్‌ చక్రవర్తి మహమ్మద్‌ షా రంగీలా, పర్షియన్‌ పాలకుడు నాదిర్‌ షా మధ్య జరిగింది. ఇందులో రంగీలా ఓడిపోయాడు. ఈ యుద్ధం క్షీణిస్తోన్న మొగలుల ప్రాబల్యాన్ని ప్రపంచానికి చాటింది. ఎందుకంటే అప్పటివరకు మొగల్‌ సామ్రాజ్యం శక్తిమంతమైందని అందరూ భావించారు.

కోలచెల్‌ యుద్ధం (Battle of Colachel)

  • దీన్నే కులచల్‌ యుద్ధం అని కూడా అంటారు. ఇది 1741, ఆగస్టులో ట్రావెన్‌కోర్‌ రాజ్యం, డచ్‌ ఈస్టిండియా కంపెనీ మధ్య జరిగింది. ఈ పోరులో ట్రావెన్‌కోర్‌ రాజు మార్తాండ వర్మ, డచ్‌వారి తరఫున అడ్మిరల్‌ యుస్టాచియస్‌ డి లానోయ్‌ పాల్గొనగా, మార్తాండ వర్మ విజయం సాధించాడు. తర్వాత డచ్‌ వారు మళ్లీ తమ బలాన్ని తిరిగి పొందలేకపోయారు. భారత్‌లో ఎక్కువకాలం మనలేమని గ్రహించి తమ దృష్టిని ఇండోనేసియావైపు మళ్లించారు. 

మొదటి కర్ణాటక యుద్ధం 

  • ఇది క్రీ.శ.1746 నుంచి క్రీ.శ.1748 వరకు ఆంగ్లేయులు, ఫ్రెంచ్‌ వారికి మధ్య జరిగింది. ఈ యుద్ధంలో జోసెఫ్‌ ఫ్రాంకోయిస్‌ డూప్లెక్స్‌ (ఫ్రెంచ్‌ గవర్నర్‌ జనరల్‌), మేజర్‌ స్ట్రింగర్‌ లారెన్స్‌ (బ్రిటిష్‌), అన్వరుద్దీన్‌ ఖాన్‌ (కర్ణాటక నవాబు) పాల్గొన్నారు. క్రీ.శ.1748లో బ్రిటిష్, ఫ్రెంచ్‌ అధికారుల మధ్య కుదిరిన ఎక్స్‌-లా-చాపెల్‌ (Aix-la-Chapelle) ఒప్పందంతో ఈ యుద్ధం ముగిసింది. 
రెండో కర్ణాటక యుద్ధం, ఆయా యుద్ధాలు జరిగిన తీరు, ఫలితాలతోపాటు గతంలో తెలంగాణ పోలీస్‌ కానిస్టేబుల్, ఎస్‌ఎస్‌సీ, ఆర్‌ఆర్‌బీ, యూపీఎస్సీ తదితర పోటీపరీక్షల్లో ఈ అంశంపై అడిగిన 85కి పైగా ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్‌ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్‌ నాలెడ్జ్‌ & కరెంట్‌ అఫైర్స్‌ కాంబో కోర్సు’కి సబ్‌స్క్రైబ్‌ చేసుకోండి! వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978


గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. వాస్కోడిగామా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుక్కుని క్రీ.శ.1498లో ఎక్కడికి చేరుకున్నాడు?
(డబ్ల్యూపీఎస్సీ క్లర్క్స్‌షిప్, 2024)

1) పులికాట్‌   2) కరైకల్‌        3) గోవా      4) కాలికట్‌

సమాధానం: 4

2. కర్నాల్‌ యుద్ధం ఎప్పుడు జరిగింది?
(సీబీఎస్‌ఈ జూనియర్‌ అసిస్టెంట్, 2020)

1) 1752   2) 1739   3) 1658   4) 1757

సమాధానం: 2

3. మరాఠాలు, వసాయ్‌ ప్రాంతాన్ని పాలించిన పోర్చుగీస్‌ వారికి మధ్య జరిగిన యుద్ధాన్ని ఏమని పిలుస్తారు?
(ఎన్‌హెచ్‌పీసీ జేఈ ఎలక్ట్రికల్, 2022)

1) బస్సెన్‌ యుద్ధం    2) ఖర్దా యుద్ధం

3) అటాక్‌ యుద్ధం     4) పాల్ఖేడ్‌ యుద్ధం

సమాధానం: 1

4. ట్రావెన్‌కోర్‌ రాజ్యానికి చెందిన మార్తాండ వర్మ కింది ఏ యుద్ధంలో డచ్‌ వారిని ఓడించాడు?
(సీడీఎస్, 2022)

1) వాండివాష్‌     2) రాక్షసి-తంగడి

3) పల్లలూరు      4) కోలచెల్‌

సమాధానం: 4

5. The Second Carnatic war was fought between _________.
(SSC CPO, 2024)

1) British East India Company and French East India Company

2) British East India Company and Nawab of the Carnatic, Chanda Sahib

3) French East India Company and Nawab of the Carnatic, Chanda Sahib

4) British East India Company and Nizam-ul-Mulk, Asaf Jah I

Ans: 2

6. Which battle in 1741 marked the defeat of the Dutch by an Indian ruler?
(RRB NTPC (Graduate) CBT-I, 2026)

1) Carnatic Wars                2) Battle of Colachel    

3) Battle of Buxar                4) Battle of Plassey

Ans: 2

7. Which power suffered a decisive defeat in the Malabar region during the Battle of Colachel in 1741?
(RRB NTPC Graduate Level CBT-I, 2025)

1) Austrian East India Company    2) English East India Company

3) Dutch East India Company         4) Spanish East India Company

Ans: 3

8. With reference to the Treaty of Aix-la-Chapelle, which of the following statements is/are correct?
I. The first Carnatic war ended.
II. Madras was returned to the British.
Select the correct answer from the code given below:
(UPPSC PCS Prelims, 2025)

1) Only I        2) Both I and II        3) Neither I nor II        4) Only II

Ans: 2

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram