భారతదేశ క్షిపణులు (పార్ట్‌ - 2)

భారతదేశ క్షిపణులు (పార్ట్‌ - 2)

క్షిపణి అనేది స్వయం చోదక, గాలిలో ఎగిరే, సుదూర లక్ష్యాలను ఛేదించగల ఆయుధం. ఇది సాధారణంగా రాకెట్‌ మోటార్‌ లేదా జెట్‌ ఇంజిన్‌ సాయంతో స్వయంగా ముందుకు కదులుతుంది. ఆధునిక రక్షణ, యుద్ధవ్యూహాల్లో క్షిపణి సాంకేతికతకు అమిత ప్రాధాన్యం ఉంది. నిర్దిష్ట లక్ష్యాలను కచ్చితత్వంతో ఛేదించడం, శత్రు ఆయుధాలను ఎదుర్కోవడం వీటి ప్రత్యేకత. వీటిని గైడెడ్‌ మిస్సైల్స్‌ లేదా గైడెడ్‌ రాకెట్లు అని కూడా పిలుస్తారు. పార్ట్‌-1లో క్షిపణి అంటే ఏమిటి - అందులోని భాగాలు, లక్షణాలు, భారతదేశ క్షిపణి కార్యక్రమాల గురించి ఉంది. ఈ భాగంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం.

  • ప్రయాణించే వేగం ఆధారంగా క్షిపణులను సబ్‌సోనిక్, సూపర్‌సోనిక్, హైపర్‌సోనిక్‌గా వర్గీకరించారు. వీటిలో ప్రతి ఒక్కటి వేర్వేరు వ్యూహాత్మక ప్రయోజనాలకు ఉపయోగపడుతుంది. సబ్‌సోనిక్‌ అంటే ధ్వని వేగం కంటే తక్కువ వేగంతో ప్రయాణించేవి. సుమారు 0.8 మాక్‌ స్పీడ్‌తో వెళ్తాయి. మనదేశంలో దేశీయంగా అభివృద్ధి చేసిన సబ్‌సోనిక్‌ క్రూయిజ్‌ క్షిపణికి ఉదాహరణ ‘నిర్భయ్‌’. దీని పరిధి 800-1000 కి.మీ.
  • సూపర్‌సోనిక్‌ అంటే ధ్వని వేగం (మాక్‌ 1) కంటే ఎక్కువ వేగంతో లేదా మాక్‌ 5 కంటే తక్కువ స్పీడ్‌లో ప్రయాణించేవి. అంటే సెకనుకు సుమారు 1 కి.మీ. వేగం చొప్పున వెళ్తాయి. ఉదా: బ్రహ్మోస్‌ క్షిపణి. వీటిని భూ, సముద్ర ఉపరితలాలు; గాలిలో నుంచి ప్రయోగించవచ్చు. పరిధి 350 కి.మీ.  
  • హైపర్‌సోనిక్‌ క్షిపణుల వేగం ధ్వని వేగం కంటే కనీసం అయిదురెట్లు ఎక్కువ (మాక్‌ 5 కంటే అధికం). ఉదా: శౌర్య క్షిపణి. దీని వేగం 7.5 మాక్‌. ఉపరితలం నుంచి ప్రయోగించే, ఉపరితల లక్ష్యాలను ఛేదించే క్షిపణి. రెండు దశల్లో ఘనఇంధనం ఉంటుంది. 1000 కిలోల పేలోడ్‌ను మోసుకెళ్లగలదు. 750 - 1800 కి.మీ. దూరం వెళ్లగలదు.
  • ప్రయాణ మార్గం ఆధారంగా క్షిపణుల్లో బాలిస్టిక్, క్రూయిజ్‌ మిస్సైల్‌ అని రెండు రకాలు ఉన్నాయి. బాలిస్టిక్‌ క్షిపణులు: తొలిదశలోనే దీనిపై బలాన్ని ప్రయోగిస్తారు. దీంతో అది ప్రక్షేపక మార్గంలో, భూ గురుత్వాకర్షణ (గ్రావిటీ)కి అనుగుణంగా ప్రయాణించి లక్ష్య ప్రదేశాన్ని చేరుతుంది. తొలిదశలో నిర్ణీత ఎత్తువరకు ప్రయాణించిన రాకెట్‌ నుంచి వార్‌హెడ్‌ విడిపోయి కొంత దూరంలో పడిపోతుంది. క్షిపణి ప్రయాణించే గరిష్ఠ దూరం (వ్యాప్తి) ఆధారంగా వీటిని ఐసీబీఎం, ఐఆర్‌బీఎం, ఎంఆర్‌బీఎం, ఎస్‌ఆర్‌బీఎంలుగా విభజించారు.
  • క్రూయిజ్‌ మిస్సైల్స్‌ను విమానాలతో పోలుస్తారు. ఇవి నిర్ణీత లక్ష్యాన్ని, కచ్చితత్వంతో ఛేదించే వరకు, భూమికి సమాంతరంగా గాలిలో ప్రయాణిస్తాయి. క్షిపణి లక్ష్యాన్ని చేరేవరకూ అందులోని చోదక వ్యవస్థలు పనిచేస్తాయి. బాలిస్టిక్‌ మిస్సైల్స్‌లో ఈ వ్యవస్థ ఉండదు. ఆధునిక క్రూయిజ్‌ క్షిపణులు సూపర్‌సోనిక్‌ లేదా హైపర్‌సోనిక్‌ వేగంతో ప్రయాణించగలవు. స్వయంగా మార్గాన్ని నిర్దేశించుకోగలవు. 
ప్రయోగ విధానం ఆధారంగా, వ్యూహాత్మక ప్రాముఖ్యత ఆధారంగా క్షిపణుల్లో రకాలు, మన దేశంలో ముఖ్యమైన క్షిపణులు, వాటి ప్రత్యేకతలతో సహా గతంలో వివిధ పోటీపరీక్షల్లో ఈ టాపిక్‌పై అడిగిన 85కి పైగా ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్‌ కోసం ఈనాడు ఈప్రతిభ జనరల్‌ నాలెడ్జ్‌ & కరెంట్‌ అఫైర్స్‌ కాంబో కోర్సు’కి సబ్‌స్క్రైబ్‌ చేసుకోండి! వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978


గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. భారతదేశ మొదటి సుదూర శ్రేణి సబ్‌సోనిక్‌ క్రూయిజ్‌ క్షిపణి పేరు ఏమిటి?
(టీఎస్‌పీఎస్సీ స్టెనో, టైపిస్ట్, జూనియర్‌ అసిస్టెంట్, 2017)

1) అభయ్‌     2) నిర్భయ్‌            3) జాగ్వర్‌     4) శక్తిమాన్‌

సమాధానం: 2

2. అణు వార్‌హెడ్‌ను మోసుకెళ్లగల భారతదేశ మొదటి ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణి ఏది?
(డబ్ల్యూబీఎస్‌ఎస్‌సీ గ్రూప్‌ సి, 2017)

1) ఆకాశ్‌            2) పృథ్వీ-3            3) అగ్ని-5          4) బ్రహ్మోస్‌

సమాధానం: 3

3. 2017లో భారత నౌకాదళం విజయవంతంగా పరీక్షించిన సూపర్‌ సోనిక్‌ క్షిపణి?
(ఆర్‌ఆర్‌సీ గ్రూప్‌ డి, 2018)

1) అగ్ని      2) వజ్ర        3) బ్రహ్మోస్‌          4) జీశాట్‌-17

సమాధానం: 3

4. కిందివాటిలో క్రూయిజ్‌ క్షిపణి రకానికి చెందింది ఏది?
(ఏఏఐ ఏటీసీ జూనియర్‌ ఎగ్జిక్యూటివ్, 2023)

1) సాగరిక     2) శౌర్య        3) బ్రహ్మోస్‌    4) అమోఘ

సమాధానం: 3

5. The Defence Ministry’s planned order for 500 Invar anti-tank guided missiles—valued at Rs.2,000 - 3,000 crore - will be placed with which defence Public Sector Unit (PSU)?
(RRB NTPC (UG) CBT-I, 2025)

1) Bharat Dynamics Limited

2) Garden Reach Shipbuilders & Engineers Ltd.

3) Armoured Vehicles Nigam Ltd.

4) Bharat Electronics Limited

Ans: 1

6. Under India's hypersonic missile development programme, which institution completed a long-duration successful ground test of an actively cooled, full-scale scramjet combustor in May 2026?
(RRB Group D, 2026)

1) Defence Research and Development Organisation

2) Bharat Electronics Limited

3) Indian Space Research Organisation

4) Hindustan Aeronautics Limited

Ans: 1

7. What is the full form of LR-AShM being developed by DRDO in 2026?
(DSSSB MTS, 2026)

1) Long Range Anti-Ship Hypersonic Missile

2) Long Range Anti-Submarine Hypersonic Missile

3) Long Range Air-to-Surface Hypersonic Missile

4) Long Range Advanced Strike Hypersonic Missile

Ans: 1

8. In January 2026, DRDO successfully conducted a long-duration ground test of an Actively Cooled Scramjet Engine for the development of ___________.
(RRB Technician Grade III, 2026)

1) Unmanned combat aerial vehicles

2) Ballistic missile defence systems

3) Reusable launch vehicles

4) Hypersonic cruise missiles

Ans: 4 

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram