జాతీయ జంతువు - పులి

జాతీయ జంతువు - పులి

ప్రపంచంలో పులుల జనాభా అత్యధికంగా ఉన్న దేశాల్లో భారత్‌ ఒకటి. జంతురాజ్యంలో అత్యంత శక్తిమంతమైన మాంసాహార జీవులైన పులులు అటవీ ఆవరణ వ్యవస్థ సమతౌల్యాన్ని కాపాడటంలో ముఖ్య భూమిక పోషిస్తాయి. అడవుల్లో శాకాహార జంతువుల సంతతిని అదుపులో ఉంచుతూ, ఆహార గొలుసును సమన్వయం చేస్తాయి. ఫలితంగా జీవవైవిధ్యానికి మంచి జరుగుతోంది. అడవుల నాశనం, వేట, అక్రమ రవాణా కారణంగా పురాతన కాలంతో పోలిస్తే ప్రస్తుతం పులుల సంఖ్య బాగా క్షీణించింది. దీన్ని అధిగమించి, పులుల సంతతిని పెంచి, వాటిని రక్షించే ఉద్దేశంతో ప్రభుత్వం అనేక చర్యలు చేెపట్టింది. అందులో భాగంగానే 1972, నవంబరు 18న పులి (పాంథెరా టైగ్రిస్‌)ని మన దేశ జాతీయ జంతువుగా ప్రకటించారు. పోటీ పరీక్షల కోణంలో పులులకు సంబంధించిన ముఖ్య విషయాలు తెలుసుకుందాం..!

  • పిల్లి (ఫెలిడే) జాతికి చెందిన జంతువుల్లో అత్యంత పెద్దది, బలమైంది పులి. దీని శాస్త్రీయ నామం పాంథెరా టైగ్రిస్‌ (Panthera tigris). పులి ఉపజాతులు: రాయల్‌ బెంగాల్‌ టైగర్, ఇండో-చైనాస్‌ టైగర్, మలయన్‌ టైగర్, సైబీరియన్‌ టైగర్, సౌత్‌ చైనా టైగర్, సుమత్రా టైగర్‌. రాయల్‌ బెంగాల్‌ టైగర్‌ వాయవ్య ప్రాంతం మినహా భారతదేశమంతటా కనిపిస్తుంది. దీని పరిధి నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్‌లో కూడా విస్తరించింది.
  • ఇంటర్నేషనల్‌ యూనియన్‌ ఫర్‌ కన్సర్వేషన్‌ ఆఫ్‌ నేచర్‌ (ఐయూసీఎన్‌) 1986లో పెద్దపులిని అంతరించే స్థితిలో ఉన్న జాతిగా ప్రకటించింది. కన్సర్వేషన్‌ ఆన్‌ ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ ఇన్‌ ఎన్‌డేంజర్డ్‌ స్పీసిస్‌ ఆఫ్‌ వైల్డ్‌ ఫనా అండ్‌ ఫ్లోరా (సీఐటీఈఎస్‌) 1975 జులై 3న అనేక పులి ఉపజాతులను అపెండిక్స్‌ 1లో (అంతరించిపోయే ప్రమాదం ఉన్న జాతుల కోసం అత్యున్నత రక్షణ వర్గం) చేర్చింది.
  • ప్రపంచవ్యాప్తంగా కేవలం 13 దేశాలు మాత్రమే అడవి పులులకు నిలయంగా ఉన్నాయి. అవి: భారత్, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, మయన్మార్, థాయ్‌లాండ్, మలేసియా, ఇండోనేసియా, లావోస్, కంబోడియా, వియత్నాం, చైనా, రష్యా. గ్లోబల్‌ టైగర్‌ ఫోరం (జీటీఎఫ్‌) ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం పులుల సంఖ్య 5574. జీటీఎఫ్‌ ప్రధాన కార్యాలయం న్యూదిల్లీలో ఉంది.
  • 1972 వరకు భారతదేశ జాతీయ జంతువుగా సింహం ఉండేది. అధిక వేట కారణంగా ఆ సమయంలో దేశంలో పులుల సంఖ్య గణనీయంగా క్షీణించింది. ఎంతలా అంటే, దేశంలో 1900 నాటికి 40,000 ఉన్న పులుల సంఖ్య 1972కి 1800కి తగ్గింది. వీటిని సంరక్షించేందుకు నాటి ఇందిరా గాంధీ ప్రభుత్వం 1972, నవంబరు 18న పులిని (రాయల్‌ బెంగాల్‌ టైగర్‌) జాతీయ జంతువుగా ప్రకటించింది. 

పులుల గణన, ప్రాజెక్ట్‌ టైగర్‌ - పులుల సంరక్షణ, టైగర్‌ రిజర్వ్‌లు - ముఖ్యాంశాలు, పులి సంరక్షణ కేంద్రాలు - కోర్‌ జోన్, బఫర్‌ జోన్, టాప్‌-10 అతిపెద్ద టైగర్‌ రిజర్వ్‌ల జాబితాతోపాటు గతంలో ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమినరీ, ఎస్‌బీఐ పీవో మెయిన్స్, ఎస్‌ఎస్‌సీ, ఆర్‌ఆర్‌బీ తదితర పోటీపరీక్షల్లో ఈ అంశం గురించి అడిగిన 70కి పైగా ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్‌ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్‌ నాలెడ్జ్‌ & కరెంట్‌ అఫైర్స్‌ కాంబో కోర్సు’కి సబ్‌స్క్రైబ్‌ చేసుకోండి! వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. పులి శాస్త్రీయ నామం ఏమిటి?

(బిహార్‌ పోలీస్‌ కానిస్టేబుల్, 2025)

1) పాంథెరా టైగ్రిస్‌            2) పాంథెరా లియో

3) కానిస్‌ లూపస్‌                4) ఎసినోనిక్స్‌ జుబాటస్‌

సమాధానం: 1

2. భారతదేశంలో అతిపెద్ద టైగర్‌ రిజర్వ్‌ ఏది?

(ఎన్‌టీపీసీ టైర్‌ 1, 2016)

1) జిమ్‌ కార్బెట్‌ టైగర్‌ రిజర్వ్‌    

2) నాగార్జున సాగర్‌ - శ్రీశైలం టైగర్‌ రిజర్వ్‌

3) సాత్పురా టైగర్‌ రిజర్వ్‌

4) సుందర్‌బన్స్‌ టైగర్‌ రిజర్వ్‌

సమాధానం: 2

3. ప్రాజెక్ట్‌ టైగర్‌ను ఎప్పుడు ప్రారంభించారు?

(బిహార్‌ ఎస్‌టెట్‌ (సోషల్‌ సైన్స్‌), 2023)

1) 1972   2) 1973   3) 1974   4) 1975

సమాధానం: 2

4. సహజ ఆవాసాల్లో పులులు, సింహాలు రెండింటినీ కలిగి ఉన్న ప్రపంచంలోని ఏకైక దేశం?

(యూపీ పోలీస్‌ ఎస్‌ఐ, 2021)

1) భూటాన్‌    2) భారతదేశం        3) మయన్మార్‌  4) నేపాల్‌

సమాధానం: 2

5. In which of the following state the Amrabad Tiger Reserve is located?
(SSC CHSL Tier-1, 2025)
1) Kerala        2) Madhya Pradesh        3) Telangana        4) Tamil Nadu
Ans: 3
6. Which of the following government initiatives was launched in 1973 to conserve a key apex predator and its ecosystem in India?
(RRB NTPC (UG) CBT-I, 2025)
1) Project Rhino            2) Project Elephant
3) Project Tiger            4) Project Asiatic Lion
Ans: 3
7. Which Tiger Reserve is uniquely distinguished by its close proximity to UNESCO World Heritage rock shelters?
(SSC MTS, 2024)
1) Guru Ghasidas-Tamor Pingla Tiger Reserve
2) Dholpur-Karauli Tiger Reserve
3) Ratapani Tiger Reserve
4) Madhav Tiger Reserve
5) None of the above
Ans: 3
8. As per the All India Triger Estimation Report 2018, which state has the maximum tiger population?
(Telangana High Court Junior Assistant, 2019)
1) Tamil Nadu            2) Madhya Pradesh
3) Karnataka            4) Uttarakhand
Ans: 2

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram