స్వాతంత్య్రోద్యమ కాలంలోని ప్రముఖ వార్తాపత్రికలు

స్వాతంత్య్రోద్యమ కాలంలోని ప్రముఖ వార్తాపత్రికలు

స్వాతంత్య్రోద్యమ సమయంలో నాయకుల ఆలోచనలను దేశ ప్రజలకు చాటడంలో, పోరాటాల రూపకల్పనలో భారతీయ వార్తాపత్రికల పాత్ర కీలకం. ఆంగ్లేయుల అకృత్యాలు, అన్యాయాలు, అణచివేతలు కళ్లకు కట్టేలా కథనాలు ప్రచురించడంతోపాటు వలస పాలనను తీవ్రంగా వ్యతిరేకించాయి. బ్రిటిషర్ల విధానాలపైనే కాక, నాటి సమాజంలో పేరుకుపోయిన మూఢ విశ్వాసాలు, సామాజిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడి జనాల్ని చైతన్యపరిచాయి. భిన్న మతాలు, జాతులున్న భారతీయ సమాజంలో ఐక్యతను, జాతీయవాదాన్ని పెంపొందించడంలో తోడ్పడ్డాయి. పోటీపరీక్షల కోణంలో స్వరాజ్య సాధనలో ప్రముఖంగా నిలిచిన వార్తాపత్రికల గురించి ముఖ్యాంశాలు తెలుసుకుందాం..!

  • జర్మనీకి చెందిన జాన్‌ గుటెన్‌బర్గ్‌ క్రీ.శ.1440 సమయంలో ముద్రణా యంత్రాన్ని (ప్రింటింగ్‌ ప్రెస్‌) కనుక్కున్నారు. 1556లో పోర్చుగీసు వారు భారతదేశంలో మొట్టమొదటి ప్రింటింగ్‌ ప్రెస్‌ను ప్రవేశపెట్టారు. దీన్ని గోవాలోని సెయింట్‌ పాల్స్‌ కళాశాలలో ఏర్పాటు చేశారు. క్రైస్తవ మతపరమైన పత్రాలు - గ్రంథాలను ముద్రించడం దీని ముఖ్య ఉద్దేశం.
  • మనదేశంలో తొలి వార్తాపత్రిక బెంగాల్‌ గవర్నర్‌ జనరల్‌ వారెన్‌ హేస్టింగ్స్‌ పదవీకాలంలో ప్రచురితమైంది. ఐర్లాండ్‌కి చెందిన జేమ్స్‌ అగస్టస్‌ హిక్కీ 1780లో ‘ది బెంగాల్‌ గెజెట్‌’ పేరుతో దీన్ని ప్రారంభించారు. ఇది ఆసియాలోనే మొదటి వార్తా పత్రికగా పేరొందింది. ఇది ఆంగ్ల భాషలో వచ్చేది. దీన్నే ‘కలకత్తా జనరల్‌ అడ్వర్టైజర్‌’, ‘హిక్కీస్‌ గెజెట్‌’ అని కూడా పిలుస్తారు. అగస్టస్‌ హిక్కీని ఫాదర్‌ ఆఫ్‌ ఇండియన్‌ జర్నలిజంగా పిలుస్తారు.  
  • 1857 తర్వాత భారతీయ పత్రికలు దేశంలో జాతీయ భావాలను పెంపొందించడం, దేశభక్తిని ప్రబోధించడం, బ్రిటిషర్ల అరాచకాలను - దోపిడీ విధానాలను ఎండగట్టడంపై ఎక్కువగా దృష్టిసారించాయి. 1905లో నాటి బ్రిటిష్‌ ప్రభుత్వంలో వైస్రాయ్‌గా ఉన్న లార్డ్‌ కర్జన్‌ బెంగాల్‌ రాష్ట్రాన్ని రెండుగా విభజించాడు. దానికి వ్యతిరేకంగా ఉవ్వెత్తున ఎగసిన ప్రజా ఉద్యమానికి అనేక పత్రికలు మద్దతుగా నిలిచాయి.
  • బ్రిటిష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలాంటి వార్తలను వ్యాప్తి చేయకుండా ఉండేందుకు సెన్సార్‌షిప్‌ ఆఫ్‌ ప్రెస్‌ యాక్ట్, 1799ను ఆమోదించారు. దీని ప్రకారం, వార్తాపత్రికలు ప్రతి సంచికలో ప్రింటర్, ఎడిటర్, యజమాని పేర్లను తప్పనిసరిగా ప్రచురించాలి. ప్రచురణకు ఉద్దేశించిన అన్ని విషయాలను పరిశీలన కోసం ప్రభుత్వానికి సమర్పించాలని ఇది నిర్దేశించింది.
భారతీయ పత్రికలను అణచేందుకు బ్రిటిషర్లు ప్రవేశపెట్టిన చట్టాలు, బ్రిటిష్‌ కాలంలోని ముఖ్యమైన వార్తాపత్రికలు, ఇతర సమాచారంతోపాటు గతంలో ఏపీపీఎస్సీ గ్రూప్‌-1, టీఎస్‌ పోలీస్‌ కానిస్టేబుల్, ఏపీ పోలీస్‌ కానిస్టేబుల్‌ ప్రిలిమినరీతోపాటు ఎస్‌ఎస్‌సీ, ఆర్‌ఆర్‌బీ, యూజీసీ నెట్‌ తదితర పోటీపరీక్షల్లో అడిగిన 150కి పైగా ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్‌ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్‌ నాలెడ్జ్‌ & కరెంట్‌ అఫైర్స్‌ కాంబో కోర్సు’కి సబ్‌స్క్రైబ్‌ చేసుకోండి.  వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. ఆంగ్ల భాషలో ముద్రితమైన మొదటి వార్తాపత్రిక ఏది? (ఏఏఐ ఏటీసీ జూనియర్‌ ఎగ్జిక్యూటివ్, 2021)

1) ది టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా            2) ది బెంగాల్‌ గెజెట్‌

3) డెక్కన్‌ హెరాల్డ్‌                  4) పయనీర్‌

సమాధానం: 2

2. 1970లో ది బెంగాల్‌ గెజెట్‌ పేరుతో దేశంలో మొదటి వార్తాపత్రికను స్థాపించింది? (ఎస్‌ఎస్‌సీ స్టెనో, 2020)

1) రవీంద్రనాథ్‌ ఠాగూర్‌            2) చిత్తరంజన్‌ దాస్‌

3) జేమ్స్‌ అగస్టస్‌ హిక్కీ           4) జాన్‌వుడ్‌ బర్న్‌

సమాధానం: 3

3. కింది ఎవరు వందేమాతరం/ బందేమాతరం వార్తాపత్రికకు సంపాదకత్వం వహించారు? (ఎంపీ పోలీస్‌ కానిస్టేబుల్, 2023)

1) బిపిన్‌ చంద్రపాల్‌            2) బరీంద్ర కుమార్‌ ఘోష్‌

3) దేవేంద్రనాథ్‌ ఠాగూర్‌         4) అరబిందో ఘోష్‌

సమాధానం: 4

4. భారతదేశ మొదటి వార్తాపత్రికలో ఎన్ని పేజీలు ఉండేవి? (ఎంపీ పోలీస్‌ ఎస్‌ఐ, 2026)

1) 8    2) 6    3) 4   4) 2

సమాధానం: 4

5. Name of the founder of Amrith Bazar Pathrika (AP Police SI Prelims, 2016)

1) Sisir Kumar Ghosh            2) Raja Ram Mohan Roy

3) Harish Chandra Mukherjee        4) Surendranath Benerjee

Ans: 1

6. In which year was the Indian Press Act, a law that granted the government extensive powers to control the press in India, passed?
(SSC GD Constable, 2025)

1) 1911        2) 1913        3) 1912        4) 1910

Ans: 4

7. Which laws were taken as models for the Vernacular Press Act, 1878?
(APPSC Panchayat Secretary, 2016)

1) Irish Press Laws    2) English Press Laws

3) Indian Press Laws    4) American Press Laws

Ans: 1

8. The Vernacular Press Act of 1878, enacted by Lord __________, empowered the British government to seize the assets of Indian-language newspapers that published critical or 'seditious' reports, thereby suppressing their freedom. (SSC Stenographer, 2026)

1) Canning        2) Ripon        3) Lytton        4) Dufferin

Ans: 3

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram