భారతదేశంలో ముఖ్యమైన గుహలు (పార్ట్‌ - 3)

భారతదేశంలో ముఖ్యమైన గుహలు (పార్ట్‌ - 3)

ఇటుకలు లేదా రాళ్లతో భవన నిర్మాణానికి బదులు శిల్పులు సహజసిద్ధంగా ఏర్పడిన కొండలు, గుట్టల్లో అవసరమైన మేరకు రాతి భాగాలను తొలగించి, అంతర్గత ప్రదేశాలు, స్తంభాలు, మండపాలు, శిల్పాలను సృష్టించారు. గుహల నిర్మాణానికి ఉన్నతమైన పనితనం, ప్రణాళిక అవసరం. మన దేశంలో చాలా రాతి శిల్పకళలు, మఠాలు, ప్రార్థనా మందిరాలు, దేవాలయాలు లాంటివి మతపరమైన కార్యకలాపాలతో ముడిపడి ఉన్నాయి. పార్ట్‌-1, 2లో మన దేశంలోని కొన్ని ముఖ్యమైన గుహల సమాచారం తెలుసుకున్నాం. ప్రస్తుత ఆర్టికల్‌లో మిగిలినవాటి విశేషాలు తెలుసుకుందాం..!

ఎల్లోరా గుహలు

ఇవి మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ జిల్లాలో అజంతా గుహలకు 100 కి.మీ. దూరంలో ఉన్నాయి. ఈ గుహలు పశ్చిమ కనుమల్లోని సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో భాగంగా ఉన్నాయి. వీటిలో వైవిధ్యభరిత ఇతివృత్తాలు, నిర్మాణ శైలులు కనిపిస్తాయి. ఇక్కడి అన్ని కట్టడాలను రాష్ట్రకూటులు, యాదవ రాజ వంశాల కాలంలో నిర్మించారు. యునెస్కో 1893లో ఎల్లోరా గుహలను ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది.

ఎలిఫెంటా గుహలు

మహారాష్ట్రలోని ముంబయి నౌకాశ్రయంలో ఎలిఫెంటా ద్వీపం (ఘరాపురి)లో ఉన్నాయి. ఈ ద్వీపం గేట్‌వే ఆఫ్‌ ఇండియాకు ఈశాన్యంగా సుమారు 10కి.మీ. దూరంలో ఉంది.  ఇక్కడ క్రీ.పూ.2వ శతాబ్దానికి చెందిన బౌద్ధ స్తూప దిబ్బలతో (Buddhist stupa mounds) సహా పురావస్తు అవశేషాలు లభ్యమయ్యాయి. 1987లో యునెస్కో ఈ గుహలను ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది. 

బాదామి గుహాలయాలు

బాదామి (కర్ణాటక) చాళుక్యుల రాజధానిగా ఉండేది. వీరి కాలంలోనే క్రీ.శ.6వ శతాబ్దంలో ఇక్కడ గుహ దేవాలయాలు కట్టించారు. ఈ ఆలయాలు ద్రవిడ, నగర వాస్తు శైలుల సమ్మేళనంతో ఉండి, చాళుక్యుల సాంస్కృతిక, మతపరమైన పురోగతిని ప్రతిబింబిస్తాయి. ఇందులో మొత్తం 4 గుహాలయాలున్నాయి. వీటిలో 3 హిందూ మతానికి చెందినవి కాగా, ఒకటి జైన సంప్రదాయానికి సంబంధించింది.

ఎల్లోరా, ఎలిఫెంటా గుహల ప్రత్యేకతలు, ఖండగిరి, భాగ్‌ గుహల సమాచారంతోపాటు గతంలో ఏపీపీఎస్సీ గ్రూప్స్, ఏపీ హైకోర్ట్‌ స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌ 2, యూజీసీ నెట్, ఎస్‌ఎస్‌సీ, ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ తదితర పోటీపరీక్షల్లో అడిగిన 80కి పైగా ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్‌.. ఇంకా పోటీపరీక్షల్లో వచ్చే కీలక జీకే అంశాలు, మంత్లీ కరెంట్‌ అఫైర్స్‌ ఈబుక్స్, ప్రాక్టీస్‌ టెస్ట్స్‌ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్‌ నాలెడ్జ్‌ & కరెంట్‌ అఫైర్స్‌ కోర్సు’కి సబ్‌స్క్రైబ్‌ చేసుకోండి. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. ఎల్లోరా గుహలు మహారాష్ట్రలోని ఏ జిల్లాలో ఉన్నాయి?

(అలహాబాద్‌ హైకోర్టు ఆర్‌ఓ, 2021)

1) నాసిక్‌                2) నాగ్‌పుర్‌

3) ఔరంగాబాద్‌           4) అమరావతి

సమాధానం: 3

2. ఎలిఫెంటా గుహ సముదాయంలో మొత్తం ఎన్ని గుహలు ఉన్నాయి?

(ఎంఏహెచ్‌ఏ డీటీపీ (ప్లానింగ్‌ అసిస్టెంట్‌), 2023)

1) పది    2) అయిదు    3) ఆరు    4) ఏడు

సమాధానం: 4

3. ఎల్లోరా గుహలకు కింది ఏ సంవత్సరంలో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు లభించింది?

(డీఎస్‌ఎస్‌ఎస్‌బీ ఎంటీఎస్, 2026)

1) 1993       2) 1990       3) 1983       4) 1980

సమాధానం: 3

4. బాదామి గుహాలయాలను ఎవరు నిర్మించారు?

(దిల్లీ పోలీస్‌ కానిస్టేబుల్, 2020)

1) విక్రమాదిత్య            2) మంగళేశ

3) పులకేశి                4) కీర్తివర్మన్‌

సమాధానం: 2

5. Ellora Caves, a UNESCO World Heritage Site, are located in which of the following hills?
(SSC HSC Level Previous Paper 2022)
1) City hills        2) Kaimur Hills        3) Horsley Hills        4) Charanadri Hills
Ans: 4
6. Ellora Caves, a UNESCO World Heritage Site, feature monuments and artwork of which religions?
(SSC CGL Tier 2021)
1) Buddhism only                2) Hinduism and Jainism
3) Buddhism, Hinduism, and Jainism    4) Buddhism and Hinduism
Ans: 3
7. The rock-cut Kailasa temple at Ellora was carved out of how many rocks?
(SSC CGL 2025)
1) One single rock            2) Cement blocks
3) Three adjoining rocks        4) A cluster of stones
Ans: 1

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram