భారతదేశంలో ముఖ్యమైన గుహలు - రాతి శిల్పకళ (పార్ట్‌ - 1)

భారతదేశంలో ముఖ్యమైన గుహలు - రాతి శిల్పకళ (పార్ట్‌ - 1)

గుహల నిర్మాణాన్ని రాతి శిల్పకళ (Rock-cut architecture) అని కూడా అంటారు. ఎందుకంటే ఇది ఒక రకమైన శిలా కళ. దీనిలో సహజసిద్ధమైన రాయిని చెక్కి కట్టడాన్ని సృష్టిస్తారు. మన దేశంలో గుహల నిర్మాణం ప్రాచీన కాలంలోనే ప్రారంభమైంది. ఆది మానవుడు గుహల్లో నివసించినట్లు అనేక చారిత్రక ఆధారాలున్నాయి. అలాగే బౌద్ధ, జైన సన్యాసులు వీటిని పూజా స్థలాలుగా, నివాసాలుగా ఉపయోగించారు. అంతేకాకుండా ప్రాచీన భారతదేశంలోని గుహల వాస్తుశిల్పం మన సంస్కృతిలో గణనీయమైన భాగాన్ని ఆక్రమించింది. ఈ గుహలు భక్తి, ధ్యానం, కళాత్మక వ్యక్తీకరణకు సాధనాలుగా ఉపయోగపడ్డాయి. ఇవన్నీ భారతీయ శిల్పుల గొప్ప కళను, నైపుణ్యాన్ని ప్రదర్శిస్తాయి. ఈ గుహల వాస్తుశిల్పంలో క్లిష్టమైన చెక్కడాలు, శిల్పాలు, చిత్రలేఖనాలు ఉన్నాయి. ఇవి ఆనాటి మత, సామాజిక, కళాత్మక అంశాలపై అవగాహనను ప్రస్తుత తరాలకు అందిస్తాయి. మన దేశంలోని ముఖ్యమైన గుహలను తెలుసుకోవడంలో భాగంగా రాతిశిల్ప కళ అంటే ఏమిటి - దాని చారిత్రక పరిణామం - రకాల గురించి పార్ట్‌-1లో చర్చిద్దాం.

రాతి శిల్పకళ అంటే?

  • సహజంగా ఉన్న రాతిని తవ్వి నిర్మాణాలు, గుహలు, శిల్పాలను సృష్టించడాన్ని రాతి శిల్పకళ అంటారు. ఇటుకలు లేదా రాళ్లతో భవనాలు కట్టడానికి బదులు కళాకారులు కొండలోని లోపలి ప్రదేశాలు, స్తంభాలు, మండపాలు, శిల్పాలను నిర్మించడానికి అవసరమైన రాతి భాగాలు తొలగించేవారు. ఈ సాంకేతికతకు గొప్ప నైపుణ్యం, ప్రణాళిక అవసరం.

చారిత్రక పరిణామం

  • మన దేశంలో రాతి శిల్పకళ అనేక చారిత్రక దశల ద్వారా పరిణామం చెందింది. అది శతాబ్దాలుగా మతపరమైన పరిణామాలు, సాంకేతిక పురోగతి, కళాత్మక సృజనాత్మకతను ప్రతిబింబిస్తుంది.
  • చరిత్రపూర్వ సహజ గుహల వినియోగం (Prehistoric Natural Cave Usage): పాలియోలిథిక్‌ (క్రీ.పూ.5,00,000 నుంచి 10,000), మెసోలిథిక్‌ (క్రీ.పూ.10,000 నుంచి 8,000) కాలాల్లో ఆదిమానవులు గుహల్లో నివసించారు.
  • సహజ గుహల తొలి మతపరమైన వినియోగం (Early Religious Use of Natural Caves): క్రీ.పూ. 6వ శతాబ్దంలో గౌతమ బుద్ధుడి కాలంలో సన్యాసులు ధ్యానం, నివాసం కోసం సహజ గుహలను ఉపయోగించడం ప్రారంభించారు.
  • మౌర్యుల కాలంలో రాతి శిల్పకళ (Mauryan Period Rock-Cut Caves): భారతదేశంలో మొట్టమొదటి కృత్రిమ రాతి గుహలు క్రీ.పూ.3వ శతాబ్దంలో మౌర్య సామ్రాజ్య కాలంలో నిర్మితమయ్యాయి.
  • ఆధునిక గుహ నిర్మాణ శైలి అభివృద్ధి (Development of Advanced Cave Architecture): మౌర్యానంతర కాలంలో దేశవ్యాప్తంగా గుహల నిర్మాణం గణనీయంగా విస్తరించింది. వివిధ మతసమాజాలు స్తంభాలు, మండపాలు, అలంకరణ అంశాలతో కూడిన గుహలను చెక్కడం ప్రారంభించారు. ఈ నిర్మాణాలకు ప్రధానంగా వ్యాపారులు, పాలకులు, ఆయా మతాలను ఆచరించేవారు నిధులు సమకూర్చారు.

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. మల్లాపురం (మహాబలిపురం)లోని ప్రసిద్ధ రథ దేవాలయాలను (శిలలు తొలిచి నిర్మించిన దేవాలయాలు) ఎవరు నిర్మించారు?

1) చోళులు     2) చాళుక్యులు

3) పల్లవులు   4) పాండ్యులు

సమాధానం: 3

2. భారతీయ రాతి వాస్తుశిల్ప కళ చరిత్రకు సంబంధించి కింది వాక్యాల్లో సరైనవి?

ఎ) బాదామిలోని గుహలు భారతదేశంలో నేటికీ ఉన్న పురాతన రాతి వాస్తుశిల్ప కళ గుహలు.
బి) బరాబర్‌ రాతి వాస్తుశిల్ప గుహలను అజీవికుల కోసం చంద్రగుప్త మౌర్యుడు నిర్మించాడు.
సి) ఎల్లోరాలో వివిధ మతాలకు చెందిన వారి కోసం గుహలు నిర్మించారు.
(యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమ్స్, 2013)

1) ఎ మాత్రమే    2) బి, సి మాత్రమే

3)సి మాత్రమే    4) ఎ, బి, సి

సమాధానం: 3

3. ఎల్లోరాలో ప్రసిద్ధ రాతితో చెక్కిన శివాలయాన్ని ఎవరు నిర్మించారు?
(దిల్లీ పోలీస్‌ కానిస్టేబుల్‌ (ఎగ్జిక్యూటివ్‌), 2025)

1) దంతిదుర్గ   2) కృష్ణ 1

3) అమోఘవర్ష 4) గోవింద 3

సమాధానం: 2

4. ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిలా నిర్మాణమైన కైలాస ఆలయం కింది ఏ గుహల్లో ఉంది?
(ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ గ్రాడ్యుయేట్‌ లెవల్, 2025)

1) బాగ్‌ గుహలు      2) జునాగఢ్‌ గుహలు

3) ఎల్లోరా గుహలు 4) అజంతా గుహలు

సమాధానం: 3

5. One of the finest examples of the Indian rock-cut architecture, the Caves of Bagh, are located in the State of ____.
(ICAR Assistant 2022)
1) Telangana  2) Chhattisgarh 3) Haryana 4) Madhya Pradesh
Ans: 4
6. The earliest rock-cut architecture is from which dynasty?
(SSC CGL Tier 2018)
1) Mauryan 2) Gupta 3) Chola 4) Satvahana
Ans: 1

7. The rock-cut caves at Ellora (Maharashtra), constructed between the 6th and 10th centuries CE, include some caves that are related to __
(IB Security Assistant (Executive) Official Paper 2025)
1) Only Buddhist and Jain 2) Buddhist, Jain and Hindu
3) Only Jain 4) Only Buddhist
Ans: 2
8. The Oldest rock-cut architecture is found in:
(HP High Court Clerk 2022)
1) Rajasthan 2) Bihar 3) Himachal Pradesh 4) Maharashtra
Ans: 4

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram