అంతర్జాతీయ విపత్తు నిర్వహణ కార్యాచరణ - సంస్థలు

అంతర్జాతీయ విపత్తు నిర్వహణ కార్యాచరణ - సంస్థలు

(పార్ట్‌ - 1)

ప్రజలకు, సమాజానికి తీవ్ర నష్టం కలిగించే ఆకస్మిక సంఘటనలే విపత్తులు. వీటి వల్ల ప్రాణ, ఆస్తి నష్టాలతోపాటు పర్యావరణం సైతం తీవ్రంగా ప్రభావితమవుతుంది. విపత్తులు ప్రకృతిసిద్ధంగా లేదా మానవ చర్యల ఫలితంగా ఏర్పడతాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధితోపాటు విపత్తులూ పెరిగిపోతున్నాయి. వాతావరణ మార్పుల కారణంగా వీటి తీవ్రత, సంభవించే నష్టం మరింత అధికమవుతోంది. దీంతో విపత్తుల నిర్వహణకు సంబంధించి ప్రపంచదేశాలు అనేక కార్యక్రమాలు చేపట్టి, వివిధ సంస్థలను నెలకొల్పాయి. ఇవన్నీ విపత్తుల నివారణ, ఉపశమనం, సంసిద్ధత, ప్రతిస్పందన, పునరుద్ధరణ ద్వారా వాటి ప్రభావాన్ని తగ్గించేందుకు కృషి చేస్తున్నాయి. పోటీపరీక్షల కోణంలో ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్న కార్యక్రమాలు, ముఖ్యమైన విపత్తు నిర్వహణ సంస్థల గురించి తెలుసుకుందాం!

హ్యోగో కార్యాచరణ ప్రణాళిక (Hyogo Framework for Action) 2005-15

  • హ్యోగో కార్యాచరణ ప్రణాళిక అనేది విపత్తు ప్రమాద తగ్గింపు (disaster risk reduction - DRR) కోసం 2005-15 కాలానికి ఉద్దేశించిన ఒక ముఖ్యమైన అంతర్జాతీయ ఒప్పందం. దేశాలు, కమ్యూనిటీలను విపత్తులను ఎదుర్కొనే విధంగా సంసిద్ధం చేసే లక్ష్యంతో దీన్ని రూపొందించారు.
  • 2015 నాటికి విపత్తు నష్టాలను గణనీయంగా తగ్గించడం దీని ముఖ్య ఉద్దేశం. విపత్తు ప్రమాదాలను గుర్తించడం, అంచనా వేయడం, పర్యవేక్షించడం, ముందస్తు హెచ్చరికల వ్యవస్థలను మెరుగుపరచడం, దుర్బలత్వ అంచనాలు నిర్వహించడం ఈ కార్యాచరణలోని కీలకాంశాలు.  

విపత్తు ముప్పు కుదింపునకు సెండాయ్‌ చట్రం (Sendai Framework for Disaster Risk Reduction) 2015-30

  • ‘హ్యూగో ఫ్రేమ్‌వర్క్‌ ఫర్‌ యాక్షన్‌ 2005-15’ గడువు 2015తో ముగిసింది. దీనికి కొనసాగింపుగా 2015లో ఐక్యరాజ్యసమితి సభ్యదేశాలు విపత్తు ముప్పు కుదింపునకు సెండాయ్‌ చట్రం 2015-30ని ఆమోదించాయి.
  • సెండాయ్‌ ఫ్రేమ్‌వర్క్‌ నిర్దేశకత్వంలో భారత ప్రభుత్వం 2016, జూన్‌ 1న జాతీయ విపత్తు నిర్వహణ ప్రణాళికను విడుదల చేసింది. భారత్‌లో సెండాయ్‌ ఫ్రేమ్‌వర్క్‌ అమలు చేసిన మొదటి రాష్ట్రంగా అస్సాం నిలిచింది. ఇందుకు యునిసెఫ్, యూఎన్‌ఐఎస్‌డీఆర్‌ సహకారం అందించాయి.

యునైటెడ్‌ నేషన్స్‌ ఆఫీస్‌ ఫర్‌ డిజాస్టర్‌ రిస్క్‌ రిడక్షన్‌ (యూఎన్‌డీఆర్‌ఆర్‌)

  • ఇది ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రధాన విభాగం. ప్రపంచవ్యాప్తంగా విపత్తుల ప్రమాద తగ్గింపును సమన్వయం చేయడంపై ప్రధానంగా దృష్టి సారిస్తుంది.
  • దీని ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో ఉంది. దీనికి 80కి పైగా దేశాల్లో ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి. 

పసిఫిక్‌ సునామీ వార్నింగ్‌ 

  • దీన్ని అమెరికాకు చెందిన ‘నేషనల్‌ ఓషియానిక్‌ అండ్‌ అట్మాస్ఫియరిక్‌ అడ్మినిస్ట్రేషన్‌’ నిర్వహిస్తోంది. ఇది పసిఫిక్‌ మహా సముద్రం బేసిన్‌ ప్రాంతానికి హెచ్చరికలు జారీ చేస్తుంది. అమెరికా తీర ప్రాంతాలకు జాతీయ కేంద్రంగా సేవలు అందిస్తుంది.
  • 2004లో హిందూ మహాసముద్రంలో వచ్చిన సునామీ తర్వాత ఈ కేంద్రం సేవలను హిందూ మహాసముద్రం, కరేబియన్‌ చుట్టుపక్కల ప్రాంతాలకూ విస్తరించారు.

సార్క్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ 

  • ప్రాంతీయ సహకారం, శిక్షణ, పరిశోధన, డేటా భాగస్వామ్యం ద్వారా దక్షిణాసియాలో విపత్తు ప్రమాదాలను నిర్వహిస్తుంది.
  • విపత్తుల సమయంలో సకాలంలో సహాయం అందించడానికి ప్రాంతీయ యంత్రాంగాన్ని బలోపేతం చేయడానికి కృషి చేస్తుంది.
  • వాతావరణ సంబంధిత, భౌగోళిక విపత్తులకు దక్షిణాసియా ప్రాంత అధిక దుర్బలత్వం (high vulnerability)పై దృష్టి సారిస్తుంది. 

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ద్వారా విపత్తు నిర్వహణ ప్రణాళిక కింది ఏ సంవత్సరంలో ప్రారంభమైంది?(యూజీసీ నెట్, 2022)

1) 2005           2) 2011          3) 2016          4) 2020

సమాధానం: 3

2. భారత విపత్తు నిర్వహణ ప్రణాళిక కింది దేనిపై ఆధారపడి ఉంది?(యూజీసీ నెట్‌ 2022)

1) సెండాయ్‌ ఫ్రేమ్‌వర్క్‌    2) క్యోటో ప్రొటోకాల్‌

3) రియో సమ్మిట్‌        4) మాంట్రియల్‌ ప్రొటోకాల్‌

సమాధానం: 1

3. Which of the following statements are true?

i. Natural disasters cause maximum damage in developing countries.

ii. Bhopal gas tragedy was man-made.

iii. India is a disaster free country.

iv. Mangroves reduce the impact of cyclones.

Select the correct answer from the codes given below: (UPPSC Civil Service 2018)

1. i, ii and iii        2. ii, iii and iv

3. i, ii and iv        4. i, iii and iv

Answer: 3

4. Man Made disasters :

a) Earthquakes

b) Volcanic eruptions

c) Avalanches

d) Bhopal gas tragedy

(Telangana SET 2017)

1. Only a) is correct        2. Only a) and b) are correct

3. Only d) is correct        4. b) and c) are correct

Answer: 3

5. Arrange activities of disaster management cycle:

A. Emergency response activities

B. Response and recovery acitivities

C. Mitigation and preparedness

Choose the correct cycle:  

(TSPSC FBO (Forest Beat Officer) 2017)

1. C, B, A            2. A, C, B

3. A, B, C            4. B, C, A

Answer: 1

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram