హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌ 

హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌ 
  • దేశవ్యాప్తంగా హెచ్‌పీవీ టీకా కార్యక్రమాన్ని 2026, ఫిబ్రవరి 28న రాజస్థాన్‌లోని అజ్‌మేర్‌లో ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌తో పాటు, నివారించదగిన మరికొన్ని రకాల క్యాన్సర్లను అరికట్టడమే లక్ష్యంగా కేంద్రం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ముఖ్యంగా హ్యూమన్‌ ప్యాపిలోమావైరస్‌(హెచ్‌పీవీ)ని ఇది అరికడుతుంది. ఇందులోభాగంగా 14 సంవత్సరాల బాలికలకు సింగిల్‌ డోస్‌ ‘గార్డాసిల్‌-4’ అనే టీకాను ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఈ వ్యాక్సిన్‌ హెచ్‌పీవీ టైప్‌ 16, 18తో పాటు టైప్‌ 6, 11 రకాల నుంచి రక్షణ కల్పించనున్నట్లు కేంద్రం తెలిపింది. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram