అలెగ్జాండర్‌ స్టబ్‌తో మోదీ భేటీ

అలెగ్జాండర్‌ స్టబ్‌తో మోదీ భేటీ
  • భారత పర్యటనకు వచ్చిన ఫిన్లాండ్‌ అధ్యక్షుడు అలెగ్జాండర్‌ స్టబ్‌తో ప్రధాని నరేంద్ర మోదీ దిల్లీలో 2026, మార్చి 5న భేటీ అయ్యారు. ద్వైపాక్షిక అంశాలతో పాటు పశ్చిమాసియాలో ప్రస్తుత ఉద్రిక్తతలు, ఉక్రెయిన్‌ యుద్ధం తదితర అంశాలపై వారిద్దరూ చర్చించారు. ఐక్యరాజ్య సమితి భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్‌ చేస్తున్న ప్రయత్నాలకు ఫిన్లాండ్‌ సంపూర్ణ మద్దతిస్తుందని స్టబ్‌ ప్రకటించారు.
  • కృత్రిమ మేధ (ఏఐ), 6జీ టెలికాం, శుద్ధ ఇంధనం, క్వాంటమ్‌ కంప్యూటింగ్, రక్షణ, అంతరిక్షం, సెమీకండక్టర్లు, కీలక ఖనిజాల వంటి రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత పెంచుకోవాలని తాజా చర్చల్లో మోదీ, స్టబ్‌ నిర్ణయించారు. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram