ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం

ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం

ఏ దేశ సమాజంలోనైనా వ్యక్తులు, అన్ని వర్గాల మధ్య సమానత్వం కనిపించదు. పేదరికం, కులం, తెగ, లింగం, ప్రాంతీయ భేదాలు లాంటి అనేక అంశాలు దీనికి ప్రధాన కారణాలుగా ఉన్నాయి. వీటన్నింటినీ అధిగమించి సాంఘిక ప్రగతి సాధించాలంటే సామాజిక న్యాయం అవసరం. సర్వజన సమానత్వం, మానవ హక్కుల రక్షణ, పేదరిక నిర్మూలన ద్వారానే సామాజిక న్యాయం సిద్ధిస్తుంది. సామాజిక, ఆర్థిక అంతరాలతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా పౌరులందరికీ సమాన అవకాశాలు, వనరులు అందాలనే లక్ష్యంతో ఏటా ఫిబ్రవరి 20న ‘ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం’గా (World Day of Social Justice) నిర్వహిస్తారు. సామాజిక న్యాయం పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడంతోపాటు సమానత్వాన్ని ప్రోత్సహించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.

సామాజిక న్యాయం అంటే?

ఎలాంటి అసమానతలకు తావు లేకుండా సమాజంలో వనరులు, అవకాశాలు, హక్కులు ప్రజలందరికీ న్యాయంగా, సమానంగా పంపిణీ కావడాన్ని సామాజిక న్యాయం అంటారు. దీన్ని ద్వారా సమ సమాజం ఏర్పడుతుంది. అన్ని రకాల అన్యాయాలను ఎదుర్కోవడంలో సాయం చేస్తుంది.

  • పేదలు, బలహీన వర్గాలు, మహిళల స్థితిగతులు దీని ద్వారా బలపడతాయి.

భారతదేశంలో సామాజిక న్యాయం

  • మన రాజ్యాంగంలోని సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర లాంటి పదాలు సామాజిక సమానత్వం, సామాజిక న్యాయం అనే భావనలను ప్రతిబింబిస్తాయి.
  • అన్ని వర్గాల్లో అసమానతలను రూపుమాపే ఉద్దేశంతో ప్రభుత్వం 1985-86లో సంక్షేమ మంత్రిత్వ శాఖ నుంచి స్త్రీ, శిశు మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది. నిమ్న వర్గాల ఉన్నతి, సాధికారతే ధ్యేయంగా సంక్షేమ మంత్రిత్వ శాఖ పేరును 1998 మే 25న సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖగా మార్చారు.
  • 1999లో గిరిజన అభివృద్ధి విభాగాన్ని వేరుచేసి గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ ఏర్పాటు చేశారు. 2006లో మైనారిటీ వ్యవహారాల విభాగం ప్రత్యేక మంత్రిత్వ శాఖగా మారింది. 

చారిత్రక నేపథ్యం

  • ఐక్యరాజ్య సమితి (ఐరాస) 1995 మార్చి 6-12 తేదీల్లో డెన్మార్క్‌లోని కోపెన్‌హగన్‌లో సామాజిక అభివృద్ధి సదస్సను నిర్వహించింది. వివిధ దేశాలకు చెందిన వందకు పైగా నాయకులు ఇందులో పాల్గొన్నారు. పేదరిక నిర్మూలన, సంపూర్ణ ఉపాధి, స్థిరమైన - న్యాయపరమైన - సురక్షితమైన సమాజాలను సృష్టించడానికి చర్యలు తీసుకోవాలని అందులో తీర్మానించారు. ఈ సదస్సు ఫలితంగా కోపెన్‌హగన్‌ ప్రకటన, కార్యాచరణ కార్యక్రమం రూపుదిద్దుకున్నాయి.
  • సమ సమాజాన్ని నిర్మించే లక్ష్యంతో ఏటా ఫిబ్రవరి 20న ‘ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం’గా జరపాలని ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ 2007లో అధికారికంగా ప్రకటించింది. 2009 నుంచి ఏటా దీన్ని నిర్వహించాలని తీర్మానించింది. 

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. ఫిబ్రవరి 20న కింది ఏ దినోత్సవాన్ని పాటిస్తారు?

(కేరళ పీఎస్సీ సివిల్‌ ఎక్సైజ్‌ ఆఫీసర్‌ ఉమెన్, 2019)

1) ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం

2) ప్రపంచ సామాజిక అన్యాయ దినోత్సవం

3) ప్రపంచ వారసత్వ దినోత్సవం

4) ప్రపంచ ఆరోగ్య దినోత్సవం

సమాధానం: 1

2. భారతదేశంలో గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?

(సీజీపీఎస్సీ ప్రిలిమ్స్, 2025)

1) 1991    2) 1995        3) 1999    4) 2001

సమాధానం: 3

3. Article 19 of the Indian Constitution provides for how many types of freedoms? (SSC CGL, 2022)
1) 13           2) 44            3) 30           4) 6
Ans: 4
4. Article 17 of the Constitution of India deals with the abolition of ________. (SSC CGL, 2020)
1) sati                2) slavery
3) untouchability        4) titles
Ans: 3

మరిన్ని కరెంట్ అఫైర్స్

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram