ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం

ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం

జీవావరణంలో మనుషులతోపాటు వన్యప్రాణులకు సమాన ప్రాధాన్యం ఉంది. వృక్ష, జంతు జాతులు సహజ పర్యావరణ వ్యవస్థలో భాగంగా ఉండి, ఆహార చక్రం సక్రమంగా కొనసాగడంలో ముఖ్య భూమిక పోషిస్తాయి. పర్యావరణ సమతౌల్యంలోనూ ఇవి కీలకంగా వ్యవహరిస్తాయి. అయితే అడవుల నిర్మూలన, సహజ ఆవరణ వ్యవస్థల విధ్వంసం లాంటి అనేక మానవ చర్యల కారణంగా ఎన్నో జాతులు ప్రస్తుతం అంతరించే స్థితికి చేరాయి. దీన్ని అరికట్టి వన్యప్రాణుల ప్రాముఖ్యం గురించి ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో ఏటా మార్చి 3న ‘ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం’గా (World Wildlife Day) నిర్వహిస్తారు. వన్యప్రాణుల ఆవశ్యకత గురించి ప్రజల్లో అవగాహన కల్పించడంతోపాటు అవి అంతరించడం వల్ల కలిగే నష్టం గురించి హెచ్చరించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం. 

వన్యప్రాణులు అంటే?

  • అడవుల్లో సహజసిద్ధ ప్రాంతాల్లో స్వేచ్ఛగా సంచరించే జీవజాతులను వన్యప్రాణులుగా పేర్కొంటారు. భూమిపై, నీటిలో, చెట్లపై, బొరియల్లో నివసించే జీవజాలం; క్షీరదాలు, వివిధ రకాల పక్షిజాతులు మొదలైన వాటిని వన్యప్రాణులుగానే పరిగణిస్తారు
  • అడవులు అనేక రకాల వృక్ష జాతులు, వన్యప్రాణులకు సహజ ఆవాసం. వన్యప్రాణులు ఆహారం, నివాసం కోసం అడవులను తమ రక్షిత ప్రదేశంగా భావిస్తాయి. 

వన్యప్రాణుల సంరక్షణకు ప్రభుత్వ

  • దేశంలో అంతరించిపోతున్న జంతుజాతులను తిరిగి అభివృద్ధి చేయడానికి ప్రభుత్వ అనేక చర్యలు చేపట్టింది. వాటిని పరిశీలిస్తే..

ప్రాజెక్ట్‌ టైగర్‌:

  • దీన్ని 1973లో జిమ్‌ కార్బెట్‌ నేషనల్‌ పార్క్‌లో ప్రారంభించారు. దీన్ని రూపకల్పన చేసింది కైలాష్‌ సాంఖలా. అంతరించిపోతున్న పులులను సంరక్షించి వాటి సంతతిని పెంపొందించడం, వాటి ఆవరణ వ్యవస్థను కాపాడటం ఈ ప్రాజెక్ట్‌ ఉద్దేశం.

ప్రాజెక్ట్‌ క్రొకడైల్‌: దీన్ని 1975లో ప్రారంభించారు. మొసళ్ల సంరక్షణ, వాటి సంఖ్యను పెంపొందించడం దీని ఉద్దేశం. ఈ ప్రాజెక్ట్‌ విజయవంతమైంది. దేశవ్యాప్తంగా 7వేల కంటే ఎక్కువ మొసళ్ల జనాభాను పెంచారు.

ప్రాజెక్ట్‌ రైనో/ రైనోసార్‌ ప్రాజెక్ట్‌: 1987లో అసోంలో ప్రాజెక్ట్‌ రైనో పథకాన్ని ప్రారంభించారు. వేగంగా అంతరిస్తోన్న ఒంటి కొమ్ము రైనోలను (ఖడ్గమృగాలు) కాపాడటం దీని ముఖ్య ఉద్దేశం.

ప్రాజెక్ట్‌ స్నో లెపర్డ్‌ (మంచు చిరుత): కేంద్ర ప్రభుత్వం 2009, జనవరి 20న ప్రాజెక్ట్‌ స్నో లెపర్డ్‌ను ప్రారంభించింది. అంతరించిపోతోన్న మంచు చిరుత, దాని ఆవాసాలను సంరక్షించడం దీని ఉద్దేశం.

ప్రాజెక్ట్‌ లయన్‌

  • 2020, ఆగస్టు 15న ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. గుజరాత్‌లోని (గిర్‌ నేషనల్‌ పార్క్, బర్దా వన్యప్రాణుల అభయారణ్యం) ఆసియాటిక్‌ సింహాల నివాస మెరుగుదల, దీర్ఘకాలిక పరిరక్షణ దీని ముఖ్య ఉద్దేశం.ఈ ప్రాజెక్ట్‌కు పదేళ్ల కాలానికి రూ.2927.71 కోట్ల నిధులు కేటాయించారు. 

ప్రాజెక్ట్‌ డాల్ఫిన్‌

  • ప్రధాని నరేంద్ర మోదీ 2020, ఆగస్టు 15న ప్రాజెక్ట్‌ డాల్ఫిన్‌ను ప్రకటించారు. భారత్‌లో నదీ, సముద్ర డాల్ఫిన్‌లను రక్షించడం దీని ముఖ్య ఉద్దేశం.
  • నమామి గంగే ప్రాజెక్ట్‌లో దీన్ని అనుసంధానం చేశారు. 

చారిత్రక నేపథ్యం

  • వాషింగ్టన్‌లో 1973, మార్చి 3న జరిగిన The Convention on International Trade in Endangered Species of Wild Fauna and Flora - CITES సమావేశంలో ప్రపంచ దేశాలన్నీ ఒక ఒప్పందం చేసుకున్నాయి. ఈ సమావేశాన్ని ‘వాషింగ్టన్‌ కన్వెన్షన్‌’ అని కూడా అంటారు. CITES జరిగిన రోజును పురస్కరించుకుని ఏటా మార్చి 3న ‘ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం’గా జరపాలని 2013, మార్చిలో ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ తీర్మానించింది. 2014 నుంచి ప్రతి సంవత్సరం దీన్ని నిర్వహిస్తున్నారు. 

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని కింది ఏ తేదీన నిర్వహిస్తారు?(డీఎస్‌ఎస్‌ఎస్‌బీ టీజీటీ నేచురల్‌ సైన్స్, 2018)

1) జనవరి 5           2) జూన్‌ 5

3) మార్చి 3           4) అక్టోబరు 15

సమాధానం: 3

2. వన్యప్రాణుల సంరక్షణ చట్టాన్ని ఎప్పుడు ఆమోదించారు?(యూపీ టీఈటీ, 2017)

1) 1960    2) 1962        3) 1972    4) 1976

సమాధానం: 3

3. ప్రాజెక్ట్‌ టైగర్‌ను కింది ఏ సంవత్సరంలో ప్రారంభించారు?(ఎంపీ పోలీస్‌ కానిస్టేబుల్, 2017)

1) 2004-05   2)1983-84

3) 2013-14   4) 1973-74

సమాధానం: 4

4. ప్రాజెక్ట్‌ స్నో లెపర్డ్‌ను కింది ఏ సంవత్సరంలో ప్రారంభించారు?(ఎస్‌ఎస్‌సీ జీడీ కానిస్టేబుల్, 2021)

1) 2014   2) 2012   3) 2009   4) 2006

సమాధానం: 3

5. On 3 March 2025, the world observed World Wildlife Day with which theme?(RRB NTPC Graduate Level, 2025 Shift 1)

1) Wildlife Conservation Finance: Investing in People and Planet

2) Partnerships for Wildlife Conservation

3) Recovering Key Species for Ecosystem Restoration

4) Forests and Livelihoods: Sustaining People and Planet

Answer: 1

6. The largest number of tiger reserves is located in?(Official Soldier Tradesman 10th STD Paper : [Muzzafarpur], 2020)

1) Karnataka       2) Madhya Pradesh

3) West Bengal    4) Andhra Pradesh

Answer: 2

మరిన్ని కరెంట్ అఫైర్స్

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram