ప్రపంచ పర్యాటక స్థితిస్థాపక దినోత్సవం

ప్రపంచ పర్యాటక స్థితిస్థాపక దినోత్సవం

దేశాభివృద్ధిలో పర్యాటక రంగం కీలక భూమిక పోషిస్తుంది. ప్రపంచ అవగాహనను పెంపొందించడంలో, ఉద్యోగ - ఉపాధి కల్పనలో, సమ్మిళిత వృద్ధిని సాధించడంలో ఇది చాలా ముఖ్యం. సేవా రంగంలో ప్రధాన విభాగమైన పర్యాటకం అనేది ఆయా దేశాల్లో ఉండే విభిన్న సంస్కృతులు, ప్రజలు, వారసత్వం, కళలు, వంటలు, ప్రదేశాలపై ఆధారపడి ఉంటుంది. వాతావరణ మార్పు, ఆర్థిక మాంద్యం, మహమ్మారి (pandemics) పరిస్థితులు టూరిజానికి పెద్ద సవాళ్లు. వీటన్నింటినీ అధిగమించి పర్యాటక రంగం బలం, అనుకూలతలను చాటే లక్ష్యంతో ఏటా ఫిబ్రవరి 17న ‘ప్రపంచ పర్యాటక స్థితిస్థాపక దినోత్సవం’గా (Global Tourism Resilience Day) నిర్వహిస్తారు. ఆర్థిక వృద్ధి, సాంస్కృతిక మార్పిడి, పర్యావరణ స్థిరత్వాన్ని పెంపొందించగల టూరిజం రంగంపై అందరికీ అవగాహన కల్పించడంతోపాటు భవిష్యత్తులో వచ్చే అంతరాయాలను ఎదుర్కొనేలా వ్యూహాలు రచించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.

పర్యాటకులు అంటే?

  • సాధారణంగా విశ్రాంతి, వినోదం కోసం ప్రయాణించే వ్యక్తులను పర్యాటకులు అంటారు. వారు సందర్శించే ప్రదేశాలను పర్యాటక గమ్యస్థానాలు (tourist destinations) అంటారు. 
  • ప్రపంచ పర్యాటక సంస్థ, విశ్రాంతి, వ్యాపారం కోసం లేదా సందర్శన ప్రదేశం నుంచి డబ్బు గ్రహించని ఏ ఇతర కార్యక్రమం కోసమైనా ప్రజలు తాము ఉన్న చోటు నుంచి మరో ప్రాంతానికి ప్రయాణం చేసి 24 గంటలకు మించి, ఒక సంవత్సరానికి మించని సమయం గడిపితే అలాంటి వారిని పర్యాటకులుగా నిర్వచించింది.
  • భారత ప్రభుత్వ నిర్వచనం ప్రకారం, విదేశీ పాస్‌పోర్టు కలిగి విశ్రాంతి, వినోదం, వైద్యం, మతసంబంధ కార్యక్రమం, క్రీడలు, వ్యాపారం, సభలు, సమావేశాలు మొదలైన వాటి కోసం భారతదేశాన్ని సందర్శించి ఒక రోజు కంటే ఎక్కువ, ఏడాది కంటే తక్కువ కాలం గడిపిన విదేశీయుడు మనకు విదేశీ పర్యాటకుడు అవుతాడు.
  • పర్యాటక రంగం ప్రధానంగా వాతావరణ మార్పు, భద్రత, ప్రకృతి వైపరీత్యాల వల్ల ప్రభావితమవుతుంది. పర్యాటక గమ్యస్థానం వాటన్నింటినీ తట్టుకుని కోలుకునే సామర్థ్యాన్ని వివరించడానికి ‘పర్యాటక స్థితిస్థాపకత’ అనే పదాన్ని ఉపయోగిస్తారు. ఇందుకోసం స్థానిక, రాష్ట్ర, దేశ, ప్రపంచ స్థాయుల్లో అనేక కార్యక్రమాలు అమలు చేయాలి.

గణాంకాలు

  • కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ 2026, జనవరి 29న రాజ్యసభలో వెల్లడించిన గణాంకాల ప్రకారం, 2024లో మనదేశానికి అంతర్జాతీయ పర్యాటకుల రాకపోకలు 2.057 కోట్లకు చేరాయి. అందులో విదేశీ పర్యాటకుల సంఖ్య 95.5 లక్షలు ఉండగా, ప్రవాస భారతీయులు 1.062 కోట్లు.  

దేశంలో స్థితిస్థాపక పర్యాటకం కోసం ప్రభుత్వం చేపట్టిన కొన్ని కార్యక్రమాలు

కేపబిలిటీ బిల్డింగ్‌ ఫర్‌ సర్వీస్‌ ప్రొవైడర్స్‌ (సీబీఎస్‌పీ):

  • దీన్ని 2018లో ప్రారంభించారు. అసంఘటిత/ వ్యవస్థీకృత రంగాల్లో వారికి హాస్పిటాలిటీ, పర్యాటక రంగంలో వివిధ స్వల్పకాలిక నైపుణ్య కోర్సులు అందించడం దీని ముఖ్య ఉద్దేశం.
  • ఈ పథకం ద్వారా నైపుణ్యం, పునఃనైపుణ్యం, నైపుణ్యం పెంచే కార్యక్రమాలు చేపడతారు.

ఇ-టూరిస్ట్‌ వీసా: 2014, నవంబరు 7న ప్రారంభమైంది. విదేశీ పర్యాటకాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో దీన్ని తీసుకొచ్చారు. మొదట్లో 43 దేశాల పౌరులకు అందుబాటులో ఉంచగా, 2026, ఫిబ్రవరి నాటికి 166 దేశాలవారికి అందుబాటులోకి వచ్చింది.  

రీజనల్‌ కనెక్టివిటీ స్కీం (ఆర్‌సీఎస్‌) - ఉడాన్‌ (ఉడే దేశ్‌ కా ఆమ్‌ నాగరిక్‌): 2016, అక్టోబరు 21న ప్రారంభమైంది. చిన్న, మధ్యస్థ పట్టణాలు, నగరాలకు విమాన సేవలు అందించడం ద్వారా పర్యాటకాన్ని ప్రోత్సహించడం దీన్ని ముఖ్య ఉద్దేశం.  

స్వదేశ్‌ దర్శన్‌ పథకం: దేశవ్యాప్తంగా థీమ్‌ ఆధారిత పర్యాటక సర్క్యూట్‌లను అభివృద్ధి చేసేందుకు పర్యాటక శాఖ 2015, జనవరిలో ఈ పథకాన్ని ప్రారంభించింది. పర్యాటక ప్రదేశాల్లో స్థిరమైన, బాధ్యతాయుతమైన మౌలిక వసతుల కల్పన దీని ముఖ్య ఉద్దేశం.

National Mission on Pilgrimage Rejuvenation and Spiritual, Heritage Augmentation Drive (PRASHAD): 2014-15లో ప్రారంభమైంది. పూర్తి మతపరమైన పర్యాటక అనుభవాన్ని మెరుగుపరిచేందుకు దేశమంతటా తీర్థయాత్రా స్థలాలను గుర్తించి అభివృద్ధి చేయడం దీని ముఖ్య ఉద్దేశం. 

చారిత్రక నేపథ్యం

ప్రపంచంలోని అనేక స్వల్ప, మధ్య ఆదాయ దేశాలకు పర్యాటక రంగమే ప్రధాన ఆదాయ వనరు. స్థిరమైన, సమగ్ర అభివృద్ధిని సాధించాలంటే స్థితిస్థాపక పర్యాటకం అవసరం. అప్పుడే దేశీయ వనరుల సమీకరణ, పర్యావరణ పరిరక్షణ, పేదరికం - ఆకలి నిర్మూలన, జీవవైవిధ్యం, సహజ వనరుల రక్షణ, స్థిర వినియోగం లాంటివి సాధ్యమవుతాయి. ఈ కారణంగానే ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ ఏటా ఫిబ్రవరి 17న ‘ప్రపంచ పర్యాటక స్థితిస్థాపక దినోత్సవం’గా జరుపుకోవాలని 2022, డిసెంబరు 22న ప్రకటించింది. 2023 నుంచి ప్రతి సంవత్సరం దీన్ని నిర్వహిస్తున్నారు. 

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. ప్రపంచ పర్యాటక స్థితిస్థాపక దినోత్సవాన్ని ఏటా ఏ తేదీన నిర్వహిస్తారు?

(ఎస్‌ఎస్‌సీ సీపీఓ, 2023)

1) ఫిబ్రవరి 15            2) ఫిబ్రవరి 16

3) ఫిబ్రవరి 17            4) ఫిబ్రవరి 18

సమాధానం: 3

2. హెచ్‌ఆర్‌ఐడీఏవై ఏ సంవత్సరంలో ప్రారంభమైంది?

(డీఎస్‌ఎస్‌ఎస్‌బీ జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్, 2022)

1) 2015    2) 2020            3) 2013    4) 2011

సమాధానం: 1

3. Swadesh Darshan Scheme launched by Government of India does not include development of which of the following tourist circuits?
(UPPSC Civil Service 2017)
1) Heritage circuit        
2) Sufi circuit
3) Ramayan circuit        
4) All of the above are part of the tourism circuit
Ans: 4
4. With reference to the Swadesh Darshan Scheme and its revamped version, consider the following statements:
I. The Swadesh Darshan Scheme was launched in 2015 with the objective of developing theme-based tourist circuits across India.
II. Swadesh Darshan 2.0 marks a shift from a circuit-based approach to a destination-centric approach with emphasis on sustainability and responsible tourism.
III. Under the Challenge Based Destination Development (CBDD) sub-scheme, projects have been sanctioned exclusively for Spiritual Tourism and Culture & Heritage themes.
IV. The development of Tribal Homestays under Swadesh Darshan 2.0 is linked with the Pradhan Mantri Janjatiya Unnat Gram Abhiyan (PM-JUGA).
V. Under the Special Assistance to States for Capital Investment (SASCI), States are provided long-term interest-free loans for developing iconic tourist centres.
Which of the statements given above are correct?
(UPPSC Civil Service 2021)
1) I, II, IV and V only            2) I, II and III only
3) I, II, III and IV only        4) II, IV and V only
Ans: 1

మరిన్ని కరెంట్ అఫైర్స్

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram